2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4180

3-9-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భర్తకు గళసూత్ర మలర భామిని గట్టెన్”
(లేదా...)
“భర్తకుఁ గంఠసూత్రమును భామిని గట్టె మనంబు రంజిలన్”

16 కామెంట్‌లు:

  1. కందం
    ఆర్తిని కూతురి పెళ్లికి
    కర్తగ మదినిల్పి పూజ గౌరికిఁ దగ ని
    ర్వర్తింప, బాధ్యతలనిడి
    భర్తకు, గళసూత్ర మలర భామిని గట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      ఆర్తిగ పుత్రికామణికి నంబరమంటెడు సంబరంబునన్
      గర్తగ పెళ్లిఁ జేయుచును గౌరికిఁ బూజను నిర్వహింపఁగన్
      బూర్తిగ నంకితమ్మగుచుఁ, బూనిచి తక్కిన తంతులన్నిటిన్
      భర్తకుఁ, గంఠసూత్రమును భామిని గట్టె మనంబు రంజిలన్

      తొలగించండి
  2. ఆర్తి నొసగె కడు భక్తిగ
    భర్తకు ; గళసూత్ర మలర భామిని గట్టెన్
    నర్తనకై మంజీరము ,
    వర్తనమంతయు సుఖముగ వర్ధిలె జూడన్

    రిప్లయితొలగించండి
  3. ధూర్తుడు సింహబలుని దు
    ర్వర్తనమణచగ వలలుని పాంచాలి వలెన్
    నర్తన శాలకు బనుపగ
    భర్తకు గళసూత్ర మలర భామిని గట్టెన్

    రిప్లయితొలగించండి
  4. నర్తనమారంభించెడి
    భర్తకు గళసూత్ర మలర భామిని గట్టెన్
    కీర్తన తానందుకొనుచు
    పూర్తిగ ప్రేక్షక సమూహ మోదనమొప్పన్

    రిప్లయితొలగించండి
  5. ఉ.

    భర్తయె కంఠసూత్రమును భార్యకు గట్టుట నార్యపద్ధతిన్
    మూర్తులు దంపతుల్ సమము మొల్లము హేమము పెత్తనంబులున్
    గుర్తు హరిద్ర ఖండమనె గోపన యిల్లట మెల్ల గోరుచున్
    *“భర్తకుఁ గంఠసూత్రమును భామిని గట్టె మనంబు రంజిలన్”*

    రిప్లయితొలగించండి
  6. ధూర్తుడు కీచకుండు కడు దుర్మతియై తన పొందు కోరుదు
    ర్వర్తనకోపలేక తన భర్తలతోనొక యుక్తిపన్ని తా
    నర్తనశాలకున్ బనుప నాతిగ ద్రౌపది భీమసేనునిన్
    భర్తకుఁ గంఠసూత్రమును భామిని గట్టె మనంబు రంజిలన్

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి
    కట్టు కొమ్మంచు క్రొంగ్రొత్త పుట్టములను
    కూర్మి నొసగెను తన* భర్తకు;గళ సూత్ర
    మలర భామిని కట్టెన్ *విమలపు వలువ
    నగలు ధరియించె మేనెల్ల ధగధగమన.

    రిప్లయితొలగించండి
  8. ఉత్పలమాల
    వర్తిలుచుండ దంపతులు,భర్తకు నంతట షష్టివర్షముల్
    పూర్తియు కాగ నుత్సవపు ముచ్చటలందు నొసంగె గట్టగా
    *భర్తకుఁగంఠసూత్రమును భామిని;కట్టె మనంబు రంజిలన్*
    భర్తయు, మెచ్చె మిత్రతతి బంధుగణంబులు నెల్లవారలున్ .

    రిప్లయితొలగించండి
  9. భర్తయు పోరుకు వెరచియు
    హర్తగ వెను దిరిగి రాగ నావేశము తో
    నర్తిలినవ మానింపగ
    భర్తకు గళ సూత్రమలర భామిని గట్టెన్

    రిప్లయితొలగించండి
  10. నర్తనమాడగా దగిన నాణ్యతగల్గిన వస్త్రధారణన్
    వర్తుల రూపమౌ సిగను వాసిగదాల్చుచు పూలమాలలన్
    కర్తగ నిర్వహించగను కార్యము దక్షత కాంచనంబుదౌ
    భర్తకు, కంఠసూత్రమును భామినిగట్టె, మనంబు లంజిలన్

    రిప్లయితొలగించండి
  11. కందం
    నర్తన నైజము గల్గిన
    గర్త యొకతె నటన జూపి గంతులు వేయన్
    వర్తుల భంగి దిరిగి తన
    భర్తకు గళసూత్రమలర భామిని గట్టెన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  12. అర్తపు మదమున రెచ్చిన
    వర్తక కన్యా తిలకము వడలును మరువన్
    కర్తయు, కర్మయు, నేనని,
    భర్తకు గళ సూత్రమలర భామిని గట్టెన్.

    రిప్లయితొలగించండి
  13. ఆర్తినిఁ బెరిగినఁ గని స
    ద్వర్తన సూత్రమ్ము నంతఁ దా మౌనమునన్
    వర్తిల్ల మంగళమ్ములు
    భర్తకు గళసూత్ర మలర భామిని గట్టెన్

    వర్తన మందు నుత్తముఁడు పన్నుగ నల్లుఁడు కాఁగఁ బ్రీతిఁ ద
    న్మూర్తికిఁ గాన్కయంచు సుమనోహర హార మిడం గుమార్తెకున్
    నర్తన మాడుచున్ ముదమునన్ లలితాంగి చెలంగి యంతటన్
    భర్తకుఁ గంఠసూత్రమును భామిని గట్టె మనంబు రంజిలన్

    రిప్లయితొలగించండి
  14. నర్తకుఁడాతఁడా దినము నాయిక పాత్ర ధరింపబూని స్త్రీ
    మూర్తుల వేష భాషలును భూషణ రీతుల నెంచుచుండ సం
    పూర్తినొసంగు సాధ్వులకు ముఖ్య విభూషణమంచు జప్పునన్
    భర్తకుఁ గంఠసూత్రమును భామిని గట్టె మనంబు రంజిలన్

    రిప్లయితొలగించండి