23-9-2022 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రేపొనర్చు జనులనే పొగడెద”(లేదా...)“రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్”
ఆటవెలదికొందరిదను మాట కోటను దాటెడున్చేతలెరుగరయ్య చిత్రమేమొ?నేడనుకొనియు మరు నిమిషమ్ము గాకున్నరేపొనర్చు జనులనే పొగడెద!
ఉత్పలమాలఊపున మాటలాడుచుఁ బ్రయుక్తమునైనను గార్యమన్నదేయోపికఁ జేయనొప్పరుఁ బ్రయోజనకారిగనందరాడినన్యేపని నైన నేడనియు నింగితమెంచుచుఁ గాక వెంటనేరేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్!
చిత్తశుద్ధితోడ విత్తమాశించకరాజకీయమందు రాటుదేలినాణ్యమైనసేవ నాడు నేడు మరియురేపొనర్చు జనులనే పొగడెద
మొదలుపెట్టి పనులు పూర్తికాలేదంచు మదిని బాధ పడక మాను గానుచేయదలచినట్టిచెయ్దములువిడకరేపొనర్చుజనులనే బొగడెద
జాగు సేయ కుండ జరుగ వలసి నట్టిపనులను గమనించి పట్టు బట్టిశ్రద్ధ తోడ సలుప సమకట్టి వెంటనేరేపొనర్చ జనుల నే పొగ డెద
మరొక పూరణఆచరించవలసి నట్టి కార్యములను చేయలేక బాధ చెందు వారు పట్టు వదలకుండ వంతను విడనాడి రేపొనర్చు జనుల నేబొగడెద
చిత్త శుద్ధి తోడఁ జేయు కోరికఁగల్గి యెపుడు నైన గాని యిపుడు గాని జేయఁ బూను నెడల చివరకు మొదటగా రేపొనర్చు జనులనే పొగడెద.
ఖాయముగ నది తమ కర్తవ్య మనుకొనిపుడమి పైన తాము పుట్టి నట్టినేల కీర్తిపెంచ నేడు కాకుండినరేపొనర్చు జనులనే పొగడెద
మీన మేషమంచు మిడుకుచు పనులనువాయిదాలువేయు వానికంటె నేడు పూర్తి కాగ నిలువ యున్న పనుల రేపొనర్చు జనులనే పొగడెద. ఓపిక లేదునాకని ముహూర్తము మంచిది కాదటంచు తానాపని చేయలేనని నిరాశను చూపక శ్రద్ధతోడ తామాపటి కార్యమయ్యది సమాప్తము కాని సశేష కార్యమున్ రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్.
ఆటవెలదిచూపనెపుడు శ్రద్ధ*రేపొనర్చు జనుల;నే పొగడెద*వేగ నేడు జేయమంచి పనుల కంటె మించినదేలేదువాయిదాల నెపుడు వేయఁదగదు.
ఉత్పలమాల కాపురుషుల్ వచించెదరుగా పనిఁజేయగ బద్దకించుచున్ రేపని, వాయిదానిడ సరే!యని మెచ్చను,నేడు సేయుటేగా పనివారి లక్షణము కావున ముందుగ నేడొ వెంటనేరేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్.
ప్రాపును బొందగోరుచును రాముని పాదము లాశ్ర యించగా రేపులు మాపు లొక్కటిగ రేపఁగ నెయ్యము లొక్కటౌచు నే రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్ మాపని యంచుఁ మార్వలుకు మాటలు సెప్పఁజాలనే
సలుపవలయు నేడు తలచిన కార్యమువాయిదాలు వేసి వదలరాదునేడు కాని పనికినిస్పృహ చెందకరేపొనర్చు జనులనేపొగడెద
ఏపనినైన చేయునపుడెట్టి యవాంతరముల్ ఘటించినన్ఓపికబూని దీక్షగొని యొడ్డుకు జేర్చెడివాడె వంద్యుడౌమాపొనరించలేనియెడ మానక యోచనసల్పి యాపనిన్రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్
ఉ.ప్రాపుగ నన్నయాది కవి పండిత భారత పద్యముల్ వహిన్గాపుయు గాదు, కర్షకుడు గావ్యపు కర్తయు పోతనాఖ్యునిన్నైపుణి, కాశి, ఖండముగ నాథుని కావ్యము నాంధ్రజాతికిన్*“రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్”*
చూపుచు మానవత్వమును సొంపుగ సాయము చేయుచున్ సదాదాపున చేరుపేదలకు తద్దయు ప్రీతిని, చిత్తశుద్ధితోశ్రీపతి కోవెలందునను చేసెడి సేవల నేడుకానిచోరేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్
తెల్లముగఁ దలఁచి మది "సహసా విదధీత నక్రియా" మని వచనములు కలుగ వేగిరపడ కుండ నాఁగి విచారించి రే పొనర్చు జనులనే పొగడెదరేపటి నాదు జీతమును బ్రీతిగ నేఁడ యొసంగ శంకతో నాపక సంతసించి కడు నంచిత రీతిని మిక్కుటమ్ముగా రేపినఁ గొంత వట్టునను రేపటి కావలి నాటి కార్యమున్రే పొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నిన్న మన కొసగిన నిజమైన చేతననేటి దినము దాని నిగుడ జేసిబ్రతుకు దారిలోని పనులను యోచించిరే పొనర్చు జనుల నే పొగడెద!
వారిజ నాభుఁడ చ్చటను పాండవ పక్షపు రాయబారిగాఁ గోరి స యోధ్యఁ జేయగను గూరిమి తోడను రాజరాజ!మీ తోరణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్థహేతువౌ వారికి యీయుమా యిపుఁడె భాగము వారిది సంతసింపగా వారును మీరు సౌఖ్యముగఁ బాలనఁ జేయఁగ వీలు గల్గునే
ఆటవెలది
రిప్లయితొలగించండికొందరిదను మాట కోటను దాటెడున్
చేతలెరుగరయ్య చిత్రమేమొ?
నేడనుకొనియు మరు నిమిషమ్ము గాకున్న
రేపొనర్చు జనులనే పొగడెద!
ఉత్పలమాల
తొలగించండిఊపున మాటలాడుచుఁ బ్రయుక్తమునైనను గార్యమన్నదే
యోపికఁ జేయనొప్పరుఁ బ్రయోజనకారిగనందరాడినన్
యేపని నైన నేడనియు నింగితమెంచుచుఁ గాక వెంటనే
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్!
చిత్తశుద్ధితోడ విత్తమాశించక
రిప్లయితొలగించండిరాజకీయమందు రాటుదేలి
నాణ్యమైనసేవ నాడు నేడు మరియు
రేపొనర్చు జనులనే పొగడెద
మొదలుపెట్టి పనులు పూర్తికాలేదంచు
రిప్లయితొలగించండిమదిని బాధ పడక మాను గాను
చేయదలచినట్టిచెయ్దములువిడక
రేపొనర్చుజనులనే బొగడెద
జాగు సేయ కుండ జరుగ వలసి నట్టి
రిప్లయితొలగించండిపనులను గమనించి పట్టు బట్టి
శ్రద్ధ తోడ సలుప సమకట్టి వెంటనే
రేపొనర్చ జనుల నే పొగ డెద
మరొక పూరణ
రిప్లయితొలగించండిఆచరించవలసి నట్టి కార్యములను
చేయలేక బాధ చెందు వారు
పట్టు వదలకుండ వంతను విడనాడి
రేపొనర్చు జనుల నేబొగడెద
చిత్త శుద్ధి తోడఁ జేయు కోరికఁగల్గి
రిప్లయితొలగించండియెపుడు నైన గాని యిపుడు గాని
జేయఁ బూను నెడల చివరకు మొదటగా
రేపొనర్చు జనులనే పొగడెద.
ఖాయముగ నది తమ కర్తవ్య మనుకొని
రిప్లయితొలగించండిపుడమి పైన తాము పుట్టి నట్టి
నేల కీర్తిపెంచ నేడు కాకుండిన
రేపొనర్చు జనులనే పొగడెద
రిప్లయితొలగించండిమీన మేషమంచు మిడుకుచు పనులను
వాయిదాలువేయు వానికంటె
నేడు పూర్తి కాగ నిలువ యున్న పనుల
రేపొనర్చు జనులనే పొగడెద.
ఓపిక లేదునాకని ముహూర్తము మంచిది కాదటంచు తా
నాపని చేయలేనని నిరాశను చూపక శ్రద్ధతోడ తా
మాపటి కార్యమయ్యది సమాప్తము కాని సశేష కార్యమున్
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్.
ఆటవెలది
రిప్లయితొలగించండిచూపనెపుడు శ్రద్ధ*రేపొనర్చు జనుల;
నే పొగడెద*వేగ నేడు జేయ
మంచి పనుల కంటె మించినదేలేదు
వాయిదాల నెపుడు వేయఁదగదు.
ఉత్పలమాల
తొలగించండికాపురుషుల్ వచించెదరుగా పనిఁజేయగ బద్దకించుచున్
రేపని, వాయిదానిడ సరే!యని మెచ్చను,నేడు సేయుటే
గా పనివారి లక్షణము కావున ముందుగ నేడొ వెంటనే
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్.
ప్రాపును బొందగోరుచును రాముని పాదము లాశ్ర యించగా
రిప్లయితొలగించండిరేపులు మాపు లొక్కటిగ రేపఁగ నెయ్యము లొక్కటౌచు నే
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్
మాపని యంచుఁ మార్వలుకు మాటలు సెప్పఁజాలనే
సలుపవలయు నేడు తలచిన కార్యము
రిప్లయితొలగించండివాయిదాలు వేసి వదలరాదు
నేడు కాని పనికినిస్పృహ చెందక
రేపొనర్చు జనులనేపొగడెద
ఏపనినైన చేయునపుడెట్టి యవాంతరముల్ ఘటించినన్
రిప్లయితొలగించండిఓపికబూని దీక్షగొని యొడ్డుకు జేర్చెడివాడె వంద్యుడౌ
మాపొనరించలేనియెడ మానక యోచనసల్పి యాపనిన్
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్
ఉ.
రిప్లయితొలగించండిప్రాపుగ నన్నయాది కవి పండిత భారత పద్యముల్ వహిన్
గాపుయు గాదు, కర్షకుడు గావ్యపు కర్తయు పోతనాఖ్యునిన్
నైపుణి, కాశి, ఖండముగ నాథుని కావ్యము నాంధ్రజాతికిన్
*“రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్”*
చూపుచు మానవత్వమును సొంపుగ సాయము చేయుచున్ సదా
రిప్లయితొలగించండిదాపున చేరుపేదలకు తద్దయు ప్రీతిని, చిత్తశుద్ధితో
శ్రీపతి కోవెలందునను చేసెడి సేవల నేడుకానిచో
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్
తెల్లముగఁ దలఁచి మది "సహసా విదధీత
రిప్లయితొలగించండినక్రియా" మని వచనములు కలుగ
వేగిరపడ కుండ నాఁగి విచారించి
రే పొనర్చు జనులనే పొగడెద
రేపటి నాదు జీతమును బ్రీతిగ నేఁడ యొసంగ శంకతో
నాపక సంతసించి కడు నంచిత రీతిని మిక్కుటమ్ముగా
రేపినఁ గొంత వట్టునను రేపటి కావలి నాటి కార్యమున్
రే పొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినిన్న మన కొసగిన నిజమైన చేతన
నేటి దినము దాని నిగుడ జేసి
బ్రతుకు దారిలోని పనులను యోచించి
రే పొనర్చు జనుల నే పొగడెద!
వారిజ నాభుఁడ చ్చటను పాండవ పక్షపు రాయబారిగాఁ
రిప్లయితొలగించండిగోరి స యోధ్యఁ జేయగను గూరిమి తోడను రాజరాజ!మీ
తోరణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్థహేతువౌ
వారికి యీయుమా యిపుఁడె భాగము వారిది సంతసింపగా
వారును మీరు సౌఖ్యముగఁ బాలనఁ జేయఁగ వీలు గల్గునే