23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4199

24-9-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాయలను మించు హీనుఁడౌ రాజు లేఁడు”
(లేదా...)
“రాయల మించు హీనుఁడగు రాజు ధరాతలమందు లేఁడు పో”

17 కామెంట్‌లు:

  1. ఏమి యంటివి సోదర! యేమి మాట
    రాయలను మించు హీనుఁడౌ రాజు లేఁడు?
    రాయలను మించు రాజుని రాష్ట్ర మందె
    యెంత వెదకిన గానఁడు చింత యేల?

    రిప్లయితొలగించండి

  2. రాయలను మించు మాన్యుఁడౌ రాజు లేడ
    టంచు గల ఫలకమ్మున నల్పు డొకడు
    మాన్యు దుడిచి హీనుడనుచు మార్చ నయ్యె
    రాయలను మించు హీనుఁడౌ రాజు లేఁడు.

    రిప్లయితొలగించండి
  3. రాయల మించు హీనుఁడగు రాజు ధరాతలమందు లేఁడు పో
    మాయని మాటలా డకుఁడు మాన్యులు మీరలు లోకమంతకున్
    రాయలు సార్వ భౌముఁడు ధరాతల మంతకు గాదె చూడగా
    మాయలు సేయ జాలకుఁ డు మంచిగ నుండుడు జీవి తాంత మున్

    రిప్లయితొలగించండి
  4. తెలుగు భాషను పోషించి దివ్య మైన
    స్థాన మొసగిన వాడైన ధైర్య యుతుని
    పనికి మాలిన వాడెపో పలుకు నిట్లు "
    '"రాయలను మించు హీ ను డౌ రాజు లేడు ""

    రిప్లయితొలగించండి

  5. తీయనిదైన భాషయని తెల్గుకు పట్టము గట్టె గాదె యా
    రాయలు పెద్దనాది పలు ప్రాజ్ఞుల నెప్పుడు గారవించెనే
    రాయలు మాన్యుడంచెఱగి ద్రాపుడొకండు వచించె నిట్టులన్
    రాయల మించు హీనుఁడగు రాజు ధరాతలమందు లేఁడు పో.

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    అష్టదిగ్గజ కవులతో నలరె బళిర!
    యిలనెవఁడు కృష్ణదేవ*రాయలను మించు,
    హీనుడౌరాజు లేడు *మహీతలాన
    నాంధ్ర భారతిన్ సేవించి యమరులైరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      శ్రీయుతులష్టదిగ్గజములే సభనొప్పగ గొప్పగొప్పగా
      నూయలలూపె భారతిని యోహొ!యటంచును మెచ్చ, నెవ్వఁడా
      *రాయలమించు;హీనుఁడగు రాజు ధరాతలమందు లేడు పో,*
      తీయని తెల్గు భాషఁగడు తీరిచి దిద్దిరిముద్దుముద్దుగా.

      తొలగించండి
  7. తేటగీతి
    ఆ జలియనువాలాబాగు నందుఁ జేరి
    స్త్రీలు, పిల్లలు, పెద్దలు సెలగుదురని
    కాల్పులెంచిన తెల్లల కఠిన వైసు
    రాయలను మించు హీనుఁడౌ రాజు లేఁడు!

    ఉత్పలమాల
    సైయని విప్లవమ్మనఁగ జల్యనువాలను భారతీయులున్
    లేయగ, తెల్లవారు విపరీతపు పోకడ కట్టడింపగన్
    మూయుచు తల్పులన్ జనుల మొత్తము కాల్చిరి! నీచుడైన వై
    స్రాయల మించు హీనుఁడగు రాజు ధరాతలమందు లేఁడు పో!

    రిప్లయితొలగించండి
  8. కేళిక కళను పోషించ కృష్ణ దేవ
    రాయలను మించు ; హీనుఁడౌ రాజు లేఁడు
    కవి సినారె రచించిన కావ్య మందు
    రసికుడగు కర్పుర వసంత రాయమించి

    రిప్లయితొలగించండి
  9. పెద్దన రచనాస్పర్థకు సిద్ధపడిన
    రాయలనుమించు;హీనుఁడౌ రాజు లేఁడు
    రాముని సహోదరుడగు భరతుని కన్న
    చెప్పు లకురాజ్య భారము నప్పజెప్ప

    రిప్లయితొలగించండి
  10. రాయలు చండశాసను డరాచక శక్తుల యుక్కడంచగా,
    హేయములైన కార్యముల నేమరుపాటుననైన నొల్లడా
    రాయల యున్నతిన్ గని విరాగముతో రిపులందు రిట్టులన్
    రాయల మించు హీనుఁడగు రాజు ధరాతలమందు లేఁడు పో

    రిప్లయితొలగించండి
  11. రణమునందున చండ మార్తాండుఁడతడు
    సకల సద్గుణధాముఁడు సచ్చరిత్రుఁ
    డతని వైరులసూయతో నందురిట్లు
    రాయలను మించు హీనుఁడౌ రాజు లేఁడు

    రిప్లయితొలగించండి
  12. ఏమి దౌర్భాగ్య మియ్యది యెక్క డైనఁ
    నిట్టు లుండునె యక్కట యెంచి చూడ
    నెందు వీక్షించినను దేశ మందు బడుగు
    రాయలను మించు హీనుఁడౌ రాజు లేఁడు

    ఏ యుగ మందు నైన మఱి యే సమయమ్మున నైన నేమి నీ
    తోయపు వారి లోఁ గనిన దుష్ట గుణమ్ముల నీవు దక్కఁగాఁ
    గాయము నందు నింకను బ్రగల్భవచో నిపుణత్వ మందునున్
    రాయల మించు హీనుఁడగు రాజు ధరాతల మందు లేఁడు పో

    రిప్లయితొలగించండి
  13. కవివరులనుపండితులనుఘనము గాను
    అగ్రహారములనొసగి ఆదరించ
    రాయలనుమించు,హీనుడౌరాజులేడు
    మసలకున్నమాన్యులతోడ మంచిగాను

    రిప్లయితొలగించండి
  14. శత్రు మూకల నణిచియు శాంతి నిలుప
    కవుల నాదరణమ్మున గౌరవింప
    భువన విజయుడై వెల్గిన కవన రాజు
    " రాయలనుమించు హీనుడౌ రాజు లేడు "

    రిప్లయితొలగించండి
  15. ఉ.

    రాయలు కృష్ణదేవ ఘన రాజ్యము నోర్వక తళ్ళికోటలో
    గాయము రామరాయలకు ఖండన జేయగ యుద్ధభూమిలో
    *రాయల మించు హీనుఁడగు రాజు ధరాతలమందు లేఁడు పో*
    న్యాయము లేని ముస్లిములు నక్కుచు దోచిరి భాగధేయముల్.

    రిప్లయితొలగించండి
  16. "సాహితీసమరాంగణసార్వభౌమ"
    రాయలను; మించు హీనుఁడౌ రాజు లేఁడు....
    కృష్ణరాయల పదమును కింకరించి
    నాటి వైభవ మెన్నని రాట్టు కిలను!

    రాయలు+అను=రాయలను(రాయలేయనుము)

    రిప్లయితొలగించండి