6-9-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కప్పను గని పన్నగంబు వాఱె”(లేదా...)“కప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్”
ఆటవెలదిచేతఁ గాని వాడు శ్రీమంతుని సఖుండు, పిలువ ధనిఁ బిల పురి వేలము నకుసఖుని గాంచి యచట సంపన్నుఁ బొడనెంచికప్పను గని పన్నగంబు వాఱె! ఉత్పలమాలగొప్ప ధనాననొక్కడయి ఘోరదరిద్ర్యమునందునొక్కడైయెప్పుడు స్నేహశీలమున నెచ్చట నైనను గాంచనిద్దరిన్చప్పున సఖ్యునిన్ గనుచు సంపదవేలము వీడెనన్యుడున్కప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్!!
చేతగరుడరేఖ చేతిలోదండముపాదరక్షలసడి భయముగొలుపకలియదిరుగుచున్న కావలికాడు వెంకప్పను గని పన్నగంబు వాఱె
ఆటవెలది పట్టు కొనియె వేగ పాము*కప్పనుగని ,పన్నగంబు వాఱె *భయపడి నకులంబుఁజూచి;జింక రయమునఁబరుగిడె పులినిఁజూచి విపిన భూమి యందు.
ఉత్పలమాల గొప్ప తటాక సన్నిధిని కోరి ఫణీంద్రము మ్రింగె నక్కటా!*కప్పను,కాంచి పన్నగము కాతర భావము నంది పాఱెడిన్ *తుప్పల నుండి ముంగిసయు దూకగ మీదకు,చూచి బెబ్బులిన్ రొప్పుచు జింక పర్విడె విరోధము సాజము గాదె చూడగాన్.
తిప్పల బడ్చురాత్రి కడు ధైర్యముతో వరికుప్ప కావలిన్దప్పని యాపరీస్థితిని దాలిమితో నటకేగె రైతు తాజెప్పులు దాల్చి వేగమున జేరెడు కర్షకుడైన గోనె వెంకప్పను గాంచి పన్నగము కాతరభావమునంది పారెడిన్.
దోచుకొనగనెంచె దొంగయు తాళము“కప్పను గని, పన్నగంబు వాఱెగగన మందు తిరుగు గరుడుని గాంచుచుపరుగు తీయు టిపుడు వాడు కయ్యె
చిత్ర మేమిలేదు , చిన్న సర్పపు పిల్లక్రంత వెలికి వచ్చి , గంతు కొనుచువడి వడి తనవైపు కరుదెంచు బోదురుకప్పను గని పన్నగంబు వాఱె
కఱ్ఱ చేతబట్టి కిఱ్ఱుచెప్పులువేసి బవిరి గడ్డమున్న పంటకాపు పొలము కేగు చుండ పొడువుగా నున్న వెంకప్పను గని పన్నగంబు వాఱె. కప్పలు పట్టి యమ్మినను కాసులు మెండుగ రాలునంచు నాబొప్పడు చిన్ననాటి తన బోడికయాతడు నమ్మకమ్ముతో చెప్పెనటంచు కఱ్ఱనొక చేతను బట్టుకు వచ్చుచున్న వెంకప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్.
వేకువనె వెడలెను వెంకప్ప యొకనాడుకాపుగాయు కొరకు కందిచేనుమనుజులన్న సహజ మరణభయమున వెంకప్పను గని పన్నగంబు వాఱె
ఆకలి భరి యించ లేక వెదకు చుండెనోగిర ము న కొక్క యురగ మపుడుదూర మందు నున్న దొరకు నని తినగకప్పను గని పన్నగంబు వారె
కుప్పలు కొట్టు చున్న తరి కొంపను వీడి ధరించి దండమున్ చెప్పులు దాల్చి పాదముల చేరి పొలమ్మును గట్లు దాటుచున్ చప్పుడు చేయుచుండగను క్షౌణినిఁ దాకిన కిఱ్ఱు జోళ్ళు, వెం కప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్
గుప్పగ వానలే నదులు కుంటలు కాల్వలు పొంగిపొర్లగానొప్పుగ నీటిజంతువులు ప్రోగయినంతనెమోదమందె నోకప్పనుగాంచి పన్నగము; కాతరభావమునంది పారెడిన్ ముప్పును జూచి మండుకము మ్రొక్కుచు దైవమురక్షనీయగా
*మాఘ పురాణం, 6 వ అధ్యాయం, కథ ఆధారంగా*ఉ.తప్పులు చేయ, శాపమిడె తాపసి భర్తయె మాఘమాసమున్ *కప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్*కప్పయె చెట్టుతొర్ర విడి కాంతగ మారిన మంజులాఖ్యయేగొప్పగ బోధ గౌతముడు కొమ్మకు గృష్ణను స్నానమున్ వడిన్.
కాల మహిమ వలన కన్పట్టు వింతలునేరచరితు లేలు నేటి జగతికంటి నొక్క వింత కనులార యీనాడుకప్పను గని పన్నగంబు వారె.
ఆఁకలి దహియింప నచ్చ టచ్చట నడయాడు చుండి ప్రీతి నారగింపఁబెద్ద ప్రొద్దునకు లభించె భోజన మంచుఁగప్పను గని పన్నగంబు వాఱె అప్పరమాత్ము లీల లరయం గడు వింతలు కప్ప భోగికిం గప్పకుఁ కీటకమ్ములును గాంచఁగ ధాత్రిని భోజనమ్ములౌఁ జప్పుడు నాలకించి వడి చయ్యన గృధ్రము వ్రాల, వీడి యాకప్పను, గాంచి పన్నగము కాతర భావము నంది పాఱెడిన్
ఎప్పటివోలె క్షేత్రమునకేగెను వెంకప ముల్లుకర్రతోచెప్పులు కిర్రుకిర్రుమని చేయగ శబ్దము పంట చేనులోచప్పున సాగుచుండునెడ చయ్యన ప్రాణ భయంబు నొంది వెంకప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్
ఆటవెలది
రిప్లయితొలగించండిచేతఁ గాని వాడు శ్రీమంతుని సఖుండు,
పిలువ ధనిఁ బిల పురి వేలము నకు
సఖుని గాంచి యచట సంపన్నుఁ బొడనెంచి
కప్పను గని పన్నగంబు వాఱె!
ఉత్పలమాల
గొప్ప ధనాననొక్కడయి ఘోరదరిద్ర్యమునందునొక్కడై
యెప్పుడు స్నేహశీలమున నెచ్చట నైనను గాంచనిద్దరిన్
చప్పున సఖ్యునిన్ గనుచు సంపదవేలము వీడెనన్యుడున్
కప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్!!
చేతగరుడరేఖ చేతిలోదండము
రిప్లయితొలగించండిపాదరక్షలసడి భయముగొలుప
కలియదిరుగుచున్న కావలికాడు వెం
కప్పను గని పన్నగంబు వాఱె
ఆటవెలది
రిప్లయితొలగించండిపట్టు కొనియె వేగ పాము*కప్పనుగని ,
పన్నగంబు వాఱె *భయపడి నకు
లంబుఁజూచి;జింక రయమునఁబరుగిడె
పులినిఁజూచి విపిన భూమి యందు.
ఉత్పలమాల
తొలగించండిగొప్ప తటాక సన్నిధిని కోరి ఫణీంద్రము మ్రింగె నక్కటా!
*కప్పను,కాంచి పన్నగము కాతర భావము నంది పాఱెడిన్ *
తుప్పల నుండి ముంగిసయు దూకగ మీదకు,చూచి బెబ్బులిన్
రొప్పుచు జింక పర్విడె విరోధము సాజము గాదె చూడగాన్.
తిప్పల బడ్చురాత్రి కడు ధైర్యముతో వరి
రిప్లయితొలగించండికుప్ప కావలిన్
దప్పని యాపరీస్థితిని దాలిమితో నట
కేగె రైతు తా
జెప్పులు దాల్చి వేగమున జేరెడు కర్షకు
డైన గోనె వెం
కప్పను గాంచి పన్నగము కాతర
భావమునంది పారెడిన్.
దోచుకొనగనెంచె దొంగయు తాళము
రిప్లయితొలగించండి“కప్పను గని, పన్నగంబు వాఱె
గగన మందు తిరుగు గరుడుని గాంచుచు
పరుగు తీయు టిపుడు వాడు కయ్యె
చిత్ర మేమిలేదు , చిన్న సర్పపు పిల్ల
రిప్లయితొలగించండిక్రంత వెలికి వచ్చి , గంతు కొనుచు
వడి వడి తనవైపు కరుదెంచు బోదురు
కప్పను గని పన్నగంబు వాఱె
రిప్లయితొలగించండికఱ్ఱ చేతబట్టి కిఱ్ఱుచెప్పులువేసి
బవిరి గడ్డమున్న పంటకాపు
పొలము కేగు చుండ పొడువుగా నున్న వెం
కప్పను గని పన్నగంబు వాఱె.
కప్పలు పట్టి యమ్మినను కాసులు మెండుగ రాలునంచు నా
బొప్పడు చిన్ననాటి తన బోడికయాతడు నమ్మకమ్ముతో
చెప్పెనటంచు కఱ్ఱనొక చేతను బట్టుకు వచ్చుచున్న వెం
కప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్.
వేకువనె వెడలెను వెంకప్ప యొకనాడు
రిప్లయితొలగించండికాపుగాయు కొరకు కందిచేను
మనుజులన్న సహజ మరణభయమున వెం
కప్పను గని పన్నగంబు వాఱె
ఆకలి భరి యించ లేక వెదకు చుండె
రిప్లయితొలగించండినోగిర ము న కొక్క యురగ మపుడు
దూర మందు నున్న దొరకు నని తినగ
కప్పను గని పన్నగంబు వారె
కుప్పలు కొట్టు చున్న తరి కొంపను వీడి ధరించి దండమున్
రిప్లయితొలగించండిచెప్పులు దాల్చి పాదముల చేరి పొలమ్మును గట్లు దాటుచున్
చప్పుడు చేయుచుండగను క్షౌణినిఁ దాకిన కిఱ్ఱు జోళ్ళు, వెం
కప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్
గుప్పగ వానలే నదులు కుంటలు కాల్వలు పొంగిపొర్లగా
రిప్లయితొలగించండినొప్పుగ నీటిజంతువులు ప్రోగయినంతనె
మోదమందె నో
కప్పనుగాంచి పన్నగము; కాతరభావము
నంది పారెడిన్
ముప్పును జూచి మండుకము మ్రొక్కుచు దైవము
రక్షనీయగా
*మాఘ పురాణం, 6 వ అధ్యాయం, కథ ఆధారంగా*
రిప్లయితొలగించండిఉ.
తప్పులు చేయ, శాపమిడె తాపసి భర్తయె మాఘమాసమున్
*కప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్*
కప్పయె చెట్టుతొర్ర విడి కాంతగ మారిన మంజులాఖ్యయే
గొప్పగ బోధ గౌతముడు కొమ్మకు గృష్ణను స్నానమున్ వడిన్.
కాల మహిమ వలన కన్పట్టు వింతలు
రిప్లయితొలగించండినేరచరితు లేలు నేటి జగతి
కంటి నొక్క వింత కనులార యీనాడు
కప్పను గని పన్నగంబు వారె.
ఆఁకలి దహియింప నచ్చ టచ్చట నడ
రిప్లయితొలగించండియాడు చుండి ప్రీతి నారగింపఁ
బెద్ద ప్రొద్దునకు లభించె భోజన మంచుఁ
గప్పను గని పన్నగంబు వాఱె
అప్పరమాత్ము లీల లరయం గడు వింతలు కప్ప భోగికిం
గప్పకుఁ కీటకమ్ములును గాంచఁగ ధాత్రిని భోజనమ్ములౌఁ
జప్పుడు నాలకించి వడి చయ్యన గృధ్రము వ్రాల, వీడి యా
కప్పను, గాంచి పన్నగము కాతర భావము నంది పాఱెడిన్
ఎప్పటివోలె క్షేత్రమునకేగెను వెంకప ముల్లుకర్రతో
రిప్లయితొలగించండిచెప్పులు కిర్రుకిర్రుమని చేయగ శబ్దము పంట చేనులో
చప్పున సాగుచుండునెడ చయ్యన ప్రాణ భయంబు నొంది వెం
కప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్