9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4186

10-9-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవలీలగ నెత్తెను శిశు వశ్వముఁ గనుమా”
(లేదా...)
“అవలీలన్ శిశు వెత్తెఁ జూడు మదె యా యశ్వంబు నుత్సాహియై”

35 కామెంట్‌లు:

 1. కందం
  పవలా తలితండ్రాడియుఁ
  జివరన చదరంగమాప చేరుచు వడిగా
  మివిలిన పావుల నుండియు
  నవలీలగ నెత్తెను శిశు వశ్వముఁ గనుమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మత్తేభవిక్రీడితము
   కవగూడన్ దలిదండ్రి నచ్చి చదరంగంబెంచి యాడంగ నా
   చివరన్ గాంచియు నెత్తి పెట్టు దరిలో జేరంగ వేగమ్ముగన్
   మివులన్ గొన్నియె పాచికల్ గరముతో నింపారఁగా బట్టుచున్
   నవలీలన్ శిశు వెత్తెఁ జూడు మదె యా యశ్వంబు నుత్సాహియై!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 2. భవనపు టరుగునఁగనబడు
  వైవిధ్య పుఁ గొయ్యబొమ్మ యశ్వము గాగం
  జివరిం సారిగ దానిని
  నవలీలగ నెత్తెను శిశు వశ్వముఁ గనుమా”

  రిప్లయితొలగించండి

 3. నవలామణియే కోరగ
  కవితా జదరంగమాడు కాలమున మనో
  జవసుడట జేరి యాడుచు
  నవలీలగ నెత్తెను శిశు వశ్వముఁ గనుమా.

  రిప్లయితొలగించండి
 4. డా బల్లూరి ఉమాదేవి

  నవరాత్రులపర్వమనగ
  జవముగ బొమ్మల కొలువునుసదనము లందున్
  సవరించుచుండ నాడుచు
  “నవలీలగ నెత్తెను శిశు వశ్వముఁ గనుమా”

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. కందము
   కవివర!తిరునాళ్ళందున
   గవి,సింహము,వాజి,మకరి,కరి బొమ్మలు వే
   డ్క విలిచి, తండ్రియు నిడగా
   నవలీలగ నెత్తెను శిశువశ్వముఁగనుమా.

   తొలగించండి
  2. మత్తేభము
   శివరాత్ర్యుత్సవవేళ దంపతులహో!చిన్నారులంగూడియున్
   శివలింగంబును గాంచి మ్రొక్కులిడి యాక్షేత్రంబులోఁదిర్గుచున్
   గవి,సింగంబు, వరాహ,వాజి ప్రతిమల్ కైకొన్గ డబ్బిచ్చియున్
   అవలీలన్ శిశువెత్తెఁజూడుమదె యా యశ్వంబు నుత్సాహియై.

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 6. అవనీనాథుని రక్షజేయుటకుగానామంత్రణన్ జేయుచున్
  జవనాశ్వంబుల బంటులన్ శకటముల్ సారంగముల్ మంత్రులన్
  తివిరిన్ మున్గగ బిందుతంత్రమున నాధీశాలురౌ దంపతుల్
  అవలీలన్ శిశు వెత్తెఁ జూడు మదె యా యశ్వంబు నుత్సాహియై

  రిప్లయితొలగించండి
 7. యువకులు జద రంగ మ్మును
  దవిలియు నాడుచును దాము తత్తరపరులై
  జవమున నెత్తుట మరువగ
  నవలీలగనెత్తెను శిశు వశ్వము గనుమా

  రిప్లయితొలగించండి
 8. నివసతిన జంతు బొమ్మల
  సవరించు సమయము నందు జారిన ప్రతిమన్
  లవమంతయు కష్టపడక
  నవలీలగ నెత్తెను శిశు వశ్వముఁగనుమా

  రిప్లయితొలగించండి
 9. బవరమువలె చదరంగము
  జవముగ పతిపత్నియాడ చాతుర్యముగా
  నవలోకించుచు నుండగ
  నవలీలగ నెత్తెను శిశు వశ్వముఁ గనుమా

  రిప్లయితొలగించండి

 10. కవియే భార్యను ప్రేమతోడ చదరంగంబాడగా రమ్మనన్
  ధవునిన్ గాదని చెప్పలేక సతియే తా జేరి వారిర్వురున్
  వివశత్వమ్మున నాడుచుండ నటకున్ విచ్చేసి పుత్రుండె తా
  నవలీలన్ శిశు వెత్తెఁ జూడు మదె యా యశ్వంబు నుత్సాహియై.

  రిప్లయితొలగించండి
 11. భవనము లోచదరంగము
  వివశతతోనాడుచుండ వేడుకతో డన్
  జవముగ నటకరుదెంచుచు
  నవలీలగ నెత్తెను శిశు వశ్వముఁ గనుమా

  రిప్లయితొలగించండి
 12. అవనిని చదరంగమ్మున
  నెవరినిలెక్కించని కడు నేరుపు కాడే
  చివరకు వేసిన యెత్తుకు
  నవలీలగ నెత్తెను శిశు వశ్వముఁ గనుమా

  రిప్లయితొలగించండి
 13. కవియే భార్యను బ్రేమతోడ చద రంగంబాడఁబిల్వంగగా
  ధవునిం గాదన లేకయా సతియ సద్యంబాడె ఁ జక్కంగఁ దా
  వివరం బంతయు నేర్పునన్, సుతుఁడుఁదావిచ్చేసి సంరంభుతోఁ
  నవలీలన్ శిశు వెత్తెఁ జూడు మదె యా యశ్వంబు నుత్సాహియై”

  రిప్లయితొలగించండి
 14. కందం
  నవకాయ పిండివంటలు
  చవిలూరగ జేసియుంచ చక్కెర తోడన్
  హవణికగ నున్న బొమ్మను
  నవలీలగ నెత్తెను శిశువశ్వము గనుమా!
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 15. వివరం బెఱుఁగుమ కాదే
  ని వశమె యెత్తఁగ నతనికి నిజ మైనవి కా
  వవి పంచదార బొమ్మలె
  యవలీలగ నెత్తెను శిశు వశ్వముఁ గనుమా

  ఛవి మద్భ్రాజిత కాంచనమ్ములును భాస్వద్రత్న భూషావళుల్
  భువినిన్ బాలుర కేల చాలును గదా ముఖ్యంబుగా బొమ్మలే
  యవి యుండన్ సత చిన్ని బొమ్మ లట నాత్మానంద ముప్పొంగఁగా
  నవలీలన్ శిశు వెత్తెఁ జూడు మదె యా యశ్వంబు నుత్సాహియై
  [అశ్వము= ఏడుసంఖ్య]

  రిప్లయితొలగించండి
 16. స్తవనీయంబగువస్తువిక్రయమునష్టైశ్వర్యమందించువా
  స్తవముచ్ఛైశ్రవమోయనంగవెలసెన్సౌందర్యచిత్రంబునే
  *యవలీలన్శిశువెత్తె‌జూడుమదె యా యశ్వంబు నుత్సాహియై*
  చవులూరించెడునందచందములుహర్షామోదముల్గావొకో

  రిప్లయితొలగించండి