15, సెప్టెంబర్ 2022, గురువారం

నిషిద్ధాక్షరి - 52

16-9-2022 (శుక్రవారం)
రాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుని హెచ్చరించడాన్ని
స్వేచ్ఛాఛందంలో వ్రాయండి.
నిషిద్ధాక్షరాలు...
మొదటి పాదంలో కవర్గాక్షరాలు
రెండవ పాదంలో చవర్గాక్షరాలు
మూడవ పాదంలో తవర్గాక్షరాలు
నాల్గవ పాదంలో పవర్గాక్షరాలు.

29 కామెంట్‌లు:

  1. వినుము రారాజ! ధర్మజు విన్న పమ్ము
    నైదు గ్రామాల నీయుమ యైదుగురకు
    చాలు మాకవి యీయ,మా పాలు
    హాయి తోడను నుండవీ లగువ సుధను

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    వ్యర్థమైన రణము వద్దు సుయోధన!
    ధర్మ మార్గమీవు తప్పకయ్య!
    పాండురాకొమరుల పరిమార్చ జాలవు
    తీయు నీ యుసురును వాయుసుతుఁడు.

    రిప్లయితొలగించండి
  3. ధర్మ పథమునెంచి దాయలభూమిని
    వారి కీయగాను భద్రమగును
    కలహమాపు బావ! కులపు క్షేమమరసి
    కలసియున్న సిరులు నిలుచు నయ్య

    రిప్లయితొలగించండి


  4. పరమ వీరులు వారలు పాండుసుతుల
    పవరమందునడగద్రొక్కు వాడెవండు?
    రణముచే కుల క్షయమంటి రాజ రాజ
    శఠుల నుడులింక విడనాడి శాంతి గోరు

    రిప్లయితొలగించండి
  5. ధర్మరాజు పంప మురారి తరలి వెడలె
    హస్తినకు నిరువురి మధ్య నంటు సలుప ,
    చేసిన పలుకు నచ్చక చెరగొనంగ
    నెసలు జరుగ బోవుననుచు హెచ్చరించె

    రిప్లయితొలగించండి
  6. తమ్ముని తనయు లర్ధరా జ్యమ్ము నిమ్మ
    నగ తిరస్కారమెవ్విధి న్యాయమగును
    మూర్ఖవైఖరి వీడుమా! పోరుకట్టు
    గోర కౌరవుల్ నశియింత్రు కౌరవేంద్ర

    రిప్లయితొలగించండి
  7. శాంతి వాంఛి o చి పాండవుల్ సంధి జేయ
    నన్ను బంపిరి మన్ననన్ న్యాయ మైన
    వారి కోర్కెకు కురు రాజ వల్లె యనిన
    ధాత్రి కంతకు గల్గును ధర్మ రక్ష

    రిప్లయితొలగించండి
  8. కందం
    రారాజ వినుము మాటలు
    వీరులు పాండవులు, నాదు విన్నపము వినన్
    గోరెద రాజ్యమొసంగక
    కోరెద వేల మరణమును కురురాజ సభన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  9. కందం
    వారలు ప్రస్తావింపన్
    మీరలు కాదనఁగ సంధి మృగ్యమ్మైనన్
    బోరొకటే మార్గమ్మై
    కౌరవ! వారికెదురేగ కర్ణులకగునే?

    రిప్లయితొలగించండి
  10. ఉ.

    తోడను పాండవుల్ రణము దుర్భరమైన హితోపదేశమా ?
    కూడలి కట్టిపెట్టగను కోరిన యూళ్లను నివ్వరో రహిన్
    జూడ పరాక్రమంబులను శూలి వరమ్ముల బ్రాపు ఫల్గుణున్
    వీడుచు జాడ్యలక్షణను వేడుచు సన్ధిని జేయవో దొరా!

    రిప్లయితొలగించండి
  11. ధర్మ తత్పరుఁడు సత్యవ్రతుఁ డరుషుండు డెందమునను ధర్మ నందనుండు
    భీముఁ డుద్దండుఁడు భీమ గదా రణ మందు నెన్నఁగ వాయు నందనుండు
    గాండీవి కిల సాటిఁ గాంచంగ శక్యంబె భవ్యంపు విలుకాఁడు సవ్యసాచి
    నకులుని సహదేవు నరవరులను దాఁకు వారలు వుట్టిరె వసుధ లోన

    బల్లిదుల తోడ వైరము పాడి కాదు
    సమరమున వారి గెలువ నశక్య మెన్న
    వారి పాలు దుర్యోధన వారి కిమ్ము
    భయము లేక నీ వారిని బ్రతుక నిమ్ము

    రిప్లయితొలగించండి
  12. రాయబారినై వచ్చితి రాజరాజ
    కుంతి సుతుల పక్షమ్మున కూర్మి తోడ
    వారి రాజ్యభాగము లెల్ల వారి కిడుము
    కాదనిన హాని యొనగూడు కౌరవేంద్ర

    మరొక పూరణ

    వచ్చినాను నేను పాండవ దూతనై
    వారి భాగ మింక వారికిడుము
    పాలు పంచ మేలు వారికి మీకిల
    ధరణి యందు కలుగు త్వరితగతిన

    రిప్లయితొలగించండి
  13. యుద్ధమనివార్యమైనది సిద్ధపడుము
    ఫల్గుణుని ధనుష్టంకార ప్రాభవమ్ము,
    భీము భుజబల విక్రమంబెంచి చూడ
    కురుకులక్షయ కారకా కౌరవేంద్ర

    రిప్లయితొలగించండి
  14. నూరు‌ మందియోధులున్నను వారు పార్దు

    సుతుని సాటి రాలేరుగా , హితుడు కర్ణు

    డొక్కడే చాలను కొనిన, డొక్క‌చీల్చు

    నతనిని‌ విడువ‌ కుండగ నర్జునుండు

    రిప్లయితొలగించండి
  15. వినుము ధృతరాష్ట్రమహరాజ విన్నవింతు
    పాండవుల్సగ భాగమ్ము పాలు నడ్గు
    మంచు, పల్కిరిటులగాక మాకు పంచ
    నగరతతియైన చాలనినారువారు

    రిప్లయితొలగించండి
  16. వైరమెంతయు ప్రాణంబు బరిహరించు
    శాంతి సౌఖ్యంబులెల్ల నిస్సారమగును
    రణము పాప శోకముల కారణము చూడ
    సంధి జేకొని వర్ధిలు సారహృదయ

    రిప్లయితొలగించండి
  17. చ: బలయుత పాండురాట్ సుతుల పైయని నీతరమౌనె యెంచ? నీ
    కలలవి వీగిపోవు కని కవ్వడి వీరవిహార మంద సే
    నలు పరువెట్టగా భయమునన్ నలు దిక్కుల, భీమసేను రం
    కెలు విని గుండెయాగగను గిట్టుదు రాకలి, నీసహోదరుల్

    రిప్లయితొలగించండి


  18. పాడియె? యేలా? యుద్ధము
    నేడీ సభలోన నాదు నిర్దేశ మిదే....
    పోడిమి గనుటయ? రాజా!
    వీడక కుట్రలు....ఘన యశ విస్తృతి గాంచన్!

    రిప్లయితొలగించండి