6, సెప్టెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4184

7-9-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముక్తికిఁ గారణము విషయముల రక్తి గదా”
(లేదా...)
“ముక్తినిఁ బొందఁగన్ విషయమోహమె కారణమౌను సంయమీ”

21 కామెంట్‌లు:

  1. ముక్తికిఁ గాదిది హేతువు
    ముక్తికిఁ గారణము విషయముల రక్తి గదా
    రక్తినిఁ గలుగుచు నిరతము
    శక్తిని బూజించు నెడల శమముందొరకున్

    రిప్లయితొలగించండి
  2. భక్తియె యిలలో సుజనుల
    ముక్తికి కారణము; విషయముల రక్తి గదా
    యుక్తిగ వలలో దింపుచు
    శక్తిని తగ్గించి వేయు సత్వరమదియే

    రిప్లయితొలగించండి
  3. ముక్తినిఁ బొందఁగన్ విషయమోహమె కారణమౌను సంయమీ
    శక్తిని భక్తిపూ ర్వకము,సల్పఁగఁ బూజను హర్ష మొంది,దా
    రక్తినిఁ జేరదీ సితన రమ్యపు హస్తము మస్త కంబు నన్
    ముక్తిని బొందు గాకనుచు మోదము తోడను బెట్టుఁ బ్రీతితోన్
    ముక్తిని బొంద మార్గమిది మోహన రూపుఁడ! నీవె ఱుంగుమా

    రిప్లయితొలగించండి
  4. భక్తిగ దేవుని గొలుచుటె
    ముక్తికిఁ గారణము ; విషయముల రక్తి గదా
    వక్తల భాషణవిన నా
    సక్తి కలుగ గారణమగు సభికుల కెపుడున్

    రిప్లయితొలగించండి

  5. భక్తుల చెరితల నెఱుగగ
    శక్తికి మించి శ్రమియించి సద్గ్రంథము లా
    సక్తిగ చదివిన చాలదె
    ముక్తికిఁ గారణము, విషయముల రక్తి గదా.

    రిప్లయితొలగించండి
  6. భక్తియె మూలంబందురు
    ముక్తికి కారణము : విషయముల రక్తి గదా
    శక్తి కొలది చేయు పనులు
    వ్యక్తి పతనమునకు చేటు వసుధను గదరా!

    రిప్లయితొలగించండి
  7. కందము
    భక్తి దయా ధర్మంబులె
    *ముక్తికిఁగారణము;విషయములరక్తి గదా*
    వ్యక్తికి నాశన హేతువు
    శక్తియు క్షీణించి యతఁడు చచ్చున్ పుట్టున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      భక్తిని దానధర్మములు పావన కర్మలు సేయ వీలగున్
      *ముక్తినిఁబొందగన్ ;విషయ మోహము కారణమౌను సంయమీ!*
      వ్యక్తికి నింద వచ్చుటకు నక్కట!చిక్కుల యందుఁజిక్కియున్
      శక్తిఁదొలంగి పోవుటకు సంపద లెల్లను క్షీణమౌటకున్ .

      తొలగించండి
  8. కందం
    సక్తత నెరిగిన విశ్వద
    వ్యక్తిత్వము హూనమైన వరయోగిగ స
    ద్యుక్తిని మార్చెనె, వేమన
    ముక్తికిఁ గారణము విషయముల రక్తి గదా

    ఉత్పలమాల
    సక్తత మోహమై చెలఁగ సానిగ విశ్వద మీరకుండఁగన్
    వ్యక్తిగ గారమున్ నిలిపి పద్య శతమ్మున యోగిగా మనన్
    యుక్తిని జాటగన్, మిగుల నున్నతి వేమన గాంచెఁ! జూడగన్
    ముక్తినిఁ బొందఁగన్ విషయమోహమె కారణమౌను సంయమీ!

    రిప్లయితొలగించండి
  9. భక్తియె మర్త్యుల కీభువి
    ముక్తికిఁ గారణము, విషయముల రక్తి గదా
    ముక్తికి యవరోధ మనా
    సక్తమునైహికములందు సలిపిన మేలౌ.

    రిప్లయితొలగించండి
  10. భక్తిగనాత్మయందు భగవానుని నిల్పి నితాంత దీక్షతో
    శక్తికొలంది ధ్యానమున సక్తముగావలె జీవజాలముల్
    ముక్తినిఁ బొందఁగన్, విషయమోహమె కారణమౌను సంయమీ
    ముక్తిపథంబునందు మును ముందుకు సాగ నిరోధమేర్పడన్

    రిప్లయితొలగించండి

  11. భక్తియె లేని వేమనకు, బాహ్యసుఖంబుల పైన భూరి యా
    సక్తిని జూపినన్ నిగమ శర్మకు నిర్వృతి దక్కె కాంచినన్
    భక్తియదేల యంచు కడు బాలిశుడొక్కడు పల్కె నిట్టులన్
    ముక్తినిఁ బొందఁగన్ విషయమోహమె కారణమౌను సంయమీ.

    రిప్లయితొలగించండి
  12. భక్తావేశముపొంగుట
    శక్తికిమించిన జిగీష సద్వర్తనమున్
    ముక్తికొరకెదురుజూచుట
    ముక్తికిఁ గారణము విషయముల రక్తి గదా

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వ్యక్తులు వేమన నింకను
    రక్తకుడా నిగమశర్మ రాణించి తుదన్
    భక్తిని మున్గియు పొందిన
    ముక్తికి గారణము విషయముల రక్తి గదా?

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వ్యక్తులు వేమనన్ మఱియు పాంశులుడై తిరుగాడినట్టి యా
    సక్తుడు మందుడా నిగమశర్మయు నంత్యము నందు దేవునిన్
    భక్తిగదల్చి నబ్రముగ భవ్యమునై విలసిల్లుచుండు నా
    ముక్తిని బొందగన్ విషయమోహమె కారణమౌను సంయమీ?

    రిప్లయితొలగించండి
  15. శక్తి కొలంది నెంచి వ్యవసాయము చేయుచు తృప్తితోడ నా
    సక్తిని జూపి శ్రీమతికి చక్కని జీవిత మిచ్చుచు నిచ్ఛతోడుతన్
    భక్తి ఘటిల్ల మానసము పంకజ నాభుని కోరికొల్చుచున్
    ముక్తినిఁ బొందఁగన్, విషయమోహమె కారణమౌను సంయమీ

    రిప్లయితొలగించండి
  16. భక్తియె హరి చరణంబుల
    ముక్తికి గారణము, విషయముల రక్తి గదా
    శక్తిని హరించు, చేటగు,
    సక్తత విడువంగ మేలు, సత్సంగముతోన్.

    రిప్లయితొలగించండి
  17. యుక్త మగు విషయములను వి
    రక్తిని నుపమింప నిప్పు రవ్వల తోడన్
    భక్తి జనకమ్ముగఁ దనర
    ముక్తికిఁ గారణము విషయముల రక్తి గదా

    ముక్తులు గిక్తు లేల యని బుద్ధిని మిక్కిలి యైన విత్త సం
    సక్తత మీఱ సంతతము సంపద లింపుగఁ గూడఁ బెట్టఁగా
    శక్తిని వాడ భోగముల జన్మ పరంపర లెల్లఁ, గోరమిన్
    ముక్తినిఁ, బొందఁగన్ విషయ మోహమె కారణ మౌను సంయమీ

    రిప్లయితొలగించండి
  18. భక్తిని వీడకుండ భగవంతునిపై, మరి
    షడ్గుణాదులా
    సక్తిగ వీడినన్ దొరకు సజ్జన మార్గము
    తప్పకుండ నీ
    ముక్తిని బొందగన్, విషయ మోహమె కారణమౌను సంయమీ
    శక్తిని కూడగట్టుకొని శాశ్వత దూరము
    వాటికుండుమా!

    రిప్లయితొలగించండి
  19. భక్తియె యిలలో సుజనుల
    ముక్తికి కారణము; విషయముల రక్తి గదా
    యుక్తిగ వలలో దింపుచు
    శక్తిని తగ్గించి వేయు సత్వరమదియే.

    రిప్లయితొలగించండి