25, సెప్టెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4201

26-9-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జ్యోత్స్నల్ దిశలావరింప సూర్యోదయమౌ”
(లేదా...)
“జ్యోత్స్నల్ దిక్కుల నావరించె సుదతీ సూర్యోదయం బయ్యెడిన్”

17 కామెంట్‌లు:

 1. కందం
  కృత్స్నంబెరుగుచు కెనడా
  మృత్స్నన్ గొలువందితమ్మ మేటిగఁ జదువన్
  జోత్స్నా! మాకిట, తమకున్
  జ్యోత్స్నల్ దిశలావరింప, సూర్యోదయమౌ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శార్దూలవిక్రీడితము
   కృత్సంబంతయు నేర్చి విద్యలను వ్యక్తిత్వాన వ్యాంకోవరన్
   మృత్సన్ బొందితె మేటిదైన కొలువున్ మేలౌ ప్రవాసంబుగన్
   జోత్స్నా! భారతమందు చీకటి విడన్, చూడంగ మీకిక్కడన్
   జ్యోత్స్నల్ దిక్కుల నావరించె, సుదతీ! సూర్యోదయం బయ్యెడిన్!

   తొలగించండి
  2. గురుదేవులకు ప్రణామములు.
   మొదటి పదము టైపాటు

   'కృత్స్నంబంతయు' గా చదువుకొన ప్రార్థన

   తొలగించండి
 2. జ్యోత్స్ననవెన్నెల నాఁబడు
  జ్యోత్స్నల్ దిశలావరింప సూర్యోదయమౌ ?
  జ్యోత్స్నల్ దెలుపును మనకిక
  జ్యోత్స్నల్ దిశలావరింప సోముని రాకన్

  రిప్లయితొలగించండి
 3. జ్యోత్స్నల్ గురిపించు జలువ
  జ్యోత్స్నల్ మురిపించు జనుల జొక్కపు బ్రేమన్
  జ్యోత్స్న లెగయునిశి నెటులన్
  జ్యోత్స్నల్ దిశలావరింప సూర్యోదయమౌ?

  రిప్లయితొలగించండి

 4. కృత్స్నము తామసమే కద
  జ్యోత్స్నా! యీ దిన మమాస యుమకై వేచన్
  జ్యోత్స్ని యటంచు దలచితివొ
  జ్యోత్స్నల్ దిశలావరింప? సూర్యోదయమౌ.

  రిప్లయితొలగించండి
 5. జ్యోత్స్న యన వెన్నెల వెలుగె
  జ్యోత్స్నపు శైత్యము రవి యిడు జ్యోతికి కలదే
  జ్యోత్స్న కుడువని పలుకులివి
  “జ్యోత్స్నల్ దిశలావరింప
  సూర్యోదయమౌ”

  రిప్లయితొలగించండి
 6. సత్స్నేహితులను జూడగ
  కృత్స్నమదుడు చేరుకొనెను కృష్ణాతటికిన్
  తత్స్నేహోద్దీపనమై
  జ్యోత్స్నల్ దిశలావరింప సూర్యోదయమౌ

  రిప్లయితొలగించండి
 7. కృత్స్నల్ దెల్లటి కాంతి తోడనుగనన్ గూష్మాండ భాండంబుగా
  జ్యోత్స్నల్ దిక్కుల నావరించె సుదతీ ! ,సూర్యోదయం బయ్యెడిన్
  జ్యోత్స్నల్ దిక్కుల మాయ మైమిగులగా నో రాత్రిఁ జూడంగ నౌ
  జ్యోత్స్నల్ జీకటి యయ్యె వింతగ నదిన్ జోద్యంబు గాదా రమా!

  రిప్లయితొలగించండి
 8. కందము
  జ్యోత్స్నా!తొమ్మిది నాళ్ళున్
  సత్స్నేహపు దీపమటుల శాంభవి,దుర్గా
  సత్స్నిగ్ధ వదన బింబ
  జ్యోత్స్నల్ దిశలావహింప సూర్యోదయమౌ.

  రిప్లయితొలగించండి
 9. సత్స్నేహము కేండ్రించును
  కృత్స్నంబుగ మనుజులందు కిల్బిషముల నా
  సత్స్నేహము దీపంబై
  జ్యోత్స్నల్ దిశలావరింప సూర్యోదయమౌ

  రిప్లయితొలగించండి
 10. జ్యోత్స్న ల జాబిలి యొసఁగును
  జ్యోత్సలు దిశ లావరింప : సూర్యోదయమౌ
  జ్యోత్సలు తొలగిన వేళను
  జ్యోత్స్న ల బదులు గ వేడి శోభి ల జేయన్

  రిప్లయితొలగించండి

 11. జ్యోత్స్నీరోజు కదా నభమ్ము నగనన్ శోభింప శీతాంశుడే
  జ్యోత్స్నా! చీకటి జీల్చుచున్ బుడమిపై నుద్భాసమున్ నింపెడిన్
  జ్యోత్స్నల్ దిక్కుల నావరించె సుదతీ, సూర్యోదయం బయ్యెడిన్
  జ్యోత్స్నల్ క్రుంగిన చాలు నేర్పడదె ప్రత్యూషమ్మదే యింపుగా.

  రిప్లయితొలగించండి
 12. శా.

  కృత్స్నమ్మున్ బ్రళయంబు తాండవముగన్ గీర్తింపనాటంకమే
  కృత్స్నమ్మున్ లయమై విరించి హరిలో గేళీకలాపంబుగా
  కృత్స్నమ్మున్ ప్రతిబింబ చంద్రకళలే క్రీగంట రేయెండగన్
  *"జ్యోత్స్నల్ దిక్కుల నావరించె సుదతీ సూర్యోదయం బయ్యెడిన్”*

  రిప్లయితొలగించండి
 13. జ్యౌత్స్నమునఁ గాన కుందుమె
  జ్యోత్స్నా లసి తాంబరమ్ము నుత్సాహమునం
  గృత్స్నమ్ము కాన కున్నన్
  జ్యోత్స్నల్ దిశలావరింప సూర్యోదయమౌ

  సత్స్నిగ్ధమ్ముగ వెల్గఁ జంద్రుఁ డట హర్షం బావహింపంగ నం
  చత్స్నానమ్ము సెలంగి చేయుమ శరచ్చంద్రాత పాంభోధినిం
  గృత్స్నం బభ్రము నిండె వెల్గుల నిరీక్షింపంగఁ గించిత్తిటన్
  జ్యోత్స్నల్ దిక్కుల నావరించె సుదతీ సూర్యోదయం బయ్యెడిన్

  రిప్లయితొలగించండి
 14. సత్స్నేహంబొనగూర్చు కిల్బిషములన్ సర్వంబు కేండ్రించగా,
  తత్స్నేహంబును దుర్విదగ్ధ ఫణితిన్తాత్సారమున్ సల్పకన్
  కృత్స్నంబైన వివేచనా పటిమనున్గీలించు నీ త్రోవలో
  జ్యోత్స్నల్ దిక్కుల నావరించె సుదతీ సూర్యోదయం బయ్యెడిన్

  (దుర్విదగ్ధ ఫణితిన్ = అహంకార సరణిలో )

  రిప్లయితొలగించండి
 15. జ్యోత్స్నిక గడిపెను హాయిగ
  జ్యోత్స్యము నందున తొగదొర జ్యోతుల వెలుగున్‌
  కృత్స్నము నిండగ వేచెను
  జ్యోత్స్నల్ దిశలావరింప సూర్యోదయమౌ”

  రిప్లయితొలగించండి