24, సెప్టెంబర్ 2022, శనివారం

సమస్య - 4200

25-9-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తోరణమ్ము సర్వానర్థ కారణమ్ము”
(లేదా...)
“తోరణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్థహేతువౌ”

28 కామెంట్‌లు:


 1. ఆలకింపుడు నామాట లలఘులార
  సంగరమది వలదనుచు శాంతి గోరి
  వచ్చితినిటకు, వినుమిది పాండు సుతుల
  తో రణమ్ము సర్వానర్థ కారణమ్ము.

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. బలము లెక్కువ గానుండు పరుల సేన
   తో,రణమ్ము సర్వానర్థ కారణమ్ము
   సమరమును జేయ,వలయును సముల తోడ
   నదియ, రాణించు నంతట నాప్తు లార!

   తొలగించండి
 3. రిప్లయిలు
  1. కౌరవ సభలో శ్రీకృష్ణపరమాత్మ :

   తేటగీతి
   అలఁగుటెరుఁగని ధర్మజుడలిగెనేని
   సాగరమ్ములొక్కటిగనై యాగమించు
   తాళఁ జాలరు కర్ణులు, ధర్మపరుల
   తో రణమ్ము సర్వానర్థ కారణమ్ము!

   ఉత్పలమాల
   కోరి సయోధ్య సంధికని కూరిమిఁ బాండవులంపిరయ్య వా
   చారుటెరుంగ నేరక విచారము సెందితె ధర్మజుండనిన్
   శూరులు కర్ణులెందరును సోలరె? పాండు కుమారులెంచ మీ
   తో రణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్థహేతువౌ!

   తొలగించండి
 4. కూరిమితోడ కారమును కూరిన కాకరకాయ కూరనే
  వారము వారమున్ విడక ప్రాణసమంబని
  జేయగానహో
  నోరును దెర్వకే తినక నొల్లనటంచును బల్క
  పత్ని! నీ
  తో రణమే కదా! సకల దుఃఖములిచ్చు ననర్ధహేతువౌ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంత్రులొచ్చెడి వేళను మార్గములను
   ప్రజల బోనీక నిల్పుచు భద్రతంచు
   భటులు వరుసగ బెట్టెడు బారికేడ్ల
   తోరణమ్ము సర్వానర్ధ కారణమ్ము

   తొలగించండి
 5. పొగరు తోపుతిన్ బట్టెను పోరు బాట!
  ఈసడించక తప్పని దోసమిదియె
  మరణ సంవరణముగదా పొరుగువారి
  తో రణమ్ము సర్వానర్థ కారణమ్ము!

  రిప్లయితొలగించండి
 6. ఎదుటి వారల శక్తుల నెరుగ కుండ
  కన్ను మిన్నును గానక కావరమున
  దీరు పగ యను గొనుచు న తి బల శాలి
  తో రణమ్ము సర్వా నర్థ కారణమ్ము

  రిప్లయితొలగించండి
 7. తేటగీతి
  సమయ సందర్భములెఱింగి జరుప వలయు
  సామదానభేదంబులు భూమిజాని
  ప్రజల రక్షణ ముఖ్యంబు వైరి బలము
  *తో,రణమ్ముసర్వానర్థ కారణమ్ము.*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   కారణమేమి లేకయె యకారణ వైరముఁబూను వానిపై
   సైరణ సేయగా వలయు,సామము,దానము,భేద తంత్రముల్
   తో,రణమాపగా వలయు తొందర గూడదు భూరి శాత్రవుల్
   *తో,రణమేకదా సకల దుఃఖములిచ్చు ననర్ధ హేతువౌ. *

   తొలగించండి

 8. శౌరిని జేరి ధర్మజుడు శాంతిని గూర్చుమటంచు పల్కుచున్
  వారలు సోదరుండ్రని యపక్రిప లెన్నియొ చేయనేమి మే
  మోరిమితో సహించితిమి, యుర్విని ధర్మము తప్పనట్టి మా
  తో రణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్థహేతువౌ.

  రిప్లయితొలగించండి
 9. భారముగాదు జీవనము
  భాగ్యముగా నిటదక్కెనే! మనః
  ప్రేరణ నొందు మార్గములు
  పెక్కులుగా లభియించు మిత్రతన్
  బోరును ద్రుంచుచు న్మనుజ
  మోద మొసంగుము సాటివారి కెం
  తో! రణమే కదా సకల
  దుఃఖము లిచ్చు ననర్థ హేతువౌ!

  రిప్లయితొలగించండి
 10. పెరసు విక్రయమును జేయు విపణి యొక్క
  మొగమునకు కట్టు మేకల పుఱ్ఱె లున్న
  తోరణమ్ము సర్వానర్థ కారణమ్ము,
  దానినెరిగి మార్పు సలుప దగినదగును

  రిప్లయితొలగించండి
 11. కౌరవ పాండవుల్ కలిసికట్టుగనున్న సుఖింతురెల్లరున్
  పోరు యనర్థకారకము పొందొనగూర్చును శాంతి సౌఖ్యముల్
  వైరముమాని పాండవుల పాలగు భూమిని వారికిమ్ము మా
  తో రణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్థహేతువౌ

  రిప్లయితొలగించండి
 12. పాండుసుతుల పాలగు భూమి వారికిమ్ము
  యియ్యకొనవేని యైదూండ్ల నిమ్ము రాజ!
  సంధికొనగూడకున్నచో సరియె! వారి
  తో రణమ్ము సర్వానర్థ కారణమ్ము

  రిప్లయితొలగించండి
 13. తే.గీ:సాంఘికస్పృహ గల్గు వ్యాసమ్ము బట్ట
  నడ్డు పడెను సమస్యల వ్యసన మొకటి
  ఏ ప్రయోజన ముండని ఈ సమస్య
  తో రణమ్ము సర్వానర్థ కారణమ్ము
  (సాంఘికప్రయోజనం ఉండే వ్యాసాలు రాసే రచయిత తనకి సమస్యాపూరణ అనేది వ్యసనం లాగా పట్టుకొని వ్యాసరచన ఆగి పోయిం దని చింతిస్తున్నాడు.)

  రిప్లయితొలగించండి
 14. ఉ:చీరిచి భారతమ్ము నొక చీలిన ముక్కను దేశమంచు మీ
  కోరిక దీర్చుకొంటి ,రది కూడయు చీలెను కాని యింక కా
  శ్మీరపు రంధివీడరుగ !మీ ప్రజ కూటికి లేక యున్న మా
  తో రణమే కదా సకల దుఃఖము లిచ్చు ననర్థహేతు వౌ !

  రిప్లయితొలగించండి
 15. అకట పిల్లి యెదురయిన నాఁగ కున్న
  నడుగిడఁగ గృహమునఁ గాళ్లు కడుగ కుండఁ
  గడఁగి పూజ సేయు నపుడు కట్ట కున్నఁ
  దోరణమ్ము సర్వానర్థ కారణమ్ము

  పోరున నైపుణమ్ము పరిపూర్ణము సాహసవంతులే భటుల్
  వారక యిత్తు రెల్లరును బ్రాణము లైనను దేశ రక్షకై
  వైరము నూని దుర్జయపు భారత దేశము తోడఁ జేయఁ దో
  డ్తో రణమే కదా సకల దుఃఖము లిచ్చు ననర్థ హేతువౌ

  రిప్లయితొలగించండి
 16. తోరపు ద్రవ్యలోటుఁ గొని దుస్థితి నొందె విరోధి దేశ మీ
  భారత భూమి దిక్కగు నుపాశ్రయమియ్యగ పేదవారికిన్
  క్రూరపు చిత్తమున్ గలిగి కోరి ప్రమాదము నొందు చుండి రెం
  తో, రణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్థహేతువౌ

  రిప్లయితొలగించండి
 17. సంధికొప్పుకొనుటసర్వసమ్మతమ్ము
  వారి పాలువారికిడుట వాసియౌను
  కూడదనిపట్టుబట్టిన కుంతి సుతుల
  తోరణమ్ముసర్వానర్థకారణమ్ము

  రిప్లయితొలగించండి
 18. మరొక పూరణ
  వినుమురారాజ నామాట వీనులార
  వారి లడిగిన భాగము వారి కిడుము
  మొండితనముతోవాదించ పాండు సుతుల
  తోరణమ్ముసర్వానర్థకారణమ్ము

  రిప్లయితొలగించండి
 19. *రాయబారం ఘట్టంలో, శ్రీకృష్ణుడు చేసిన హెచ్చరికగా.......*

  ఉ.

  ప్రేరణ భీమ దార్ఢ్యముగ భీతిని గొల్పెను శైశవమ్మునన్
  క్రూర పురోచనుండు దరికొల్పుట, కౌరవనీతి లక్కయిల్
  నేరుపు జూదమున్ శకుని నిహ్వవమోర్చిరి ధర్మ గర్జనం
  *తో, రణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్థహేతువౌ.*

  రిప్లయితొలగించండి
 20. భారత దేశమిప్పుడతి భాగ్యము యుద్ధపు
  సర్వసంపదల్
  శూరులు యుద్ధకోవిదులు సొప్పడ నిండుగ
  నిండియుండెడిన్
  నేరక యెవ్వరేనియును నెయ్యమ మానియు కయ్యమెంచ మా
  తో రణమే కదా సకల దు:ఖము నిచ్చు ననర్థ హేతువౌ

  రిప్లయితొలగించండి
 21. మరొక పూరణ
  వసుధిజనపహరించుచు పాడు బుద్ది
  తోడ కొనితెచ్చుకొంటివి తొందరలను
  రావణాసురా వినుము శ్రీ రామచంద్రు
  తోరణమ్ము సర్వానర్థకారణమ్ము


  రిప్లయితొలగించండి
 22. ఓటు నోటుతో కొనుచును జేటు గూర్చి
  పబ్బముగడుప గెలుపొంద పాట్లను బడి
  మంత్రులై రాజ్యమేలెడా మాత్యులనెడు
  "తోరణమ్ము సర్వానర్థ కారణమ్ము "

  రిప్లయితొలగించండి
 23. కూరిమి మేను నేననుచు గూర్చుచు భోగము లెన్నొ దానికై
  యారగు శత్రులన్ గలసి హద్దులెరుంగక నింద్రియార్ధులై
  పేరుకుపోవగా మదిని పెక్కగు జన్మల గూర్చు వాసనా
  తోరణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్ధహేతువౌ!

  రిప్లయితొలగించండి
 24. భారతదేశ గౌరవపుబాధ్యత గల్గిన వారలైజనుల్‌
  శారద మాతదీవెనల శ్రద్ధగ శాస్త్రము లన్నినేర్చియున్
  భారతి సేవజేయవలె, బద్ధక భీరుల మూర్ఖగుంపనే
  "తోరణమే కదా సకల దు:ఖము లిచ్చు ననర్ధ హేతువౌ"

  రిప్లయితొలగించండి