కవిమిత్రులకు నమస్కృతులు.
కొద్ది రోజులుగా మాటిమాటికి జ్వరం వస్తూ పోతూ ఉండడం, శారీరకంగా బలహీనంగా ఉండడం జరుగుతూ ఉన్నది. మందులు వాడుతున్నాను.
దీనికి తోడుగా...
'అనంతచ్ఛందం' వారి 2200 ఛందాలతో వందమంది కవుల పదివేల పద్యాల సంకలనం పరిష్కారం, డిటిపి చేస్తున్నాను.
అంతేకాక ఆ మధ్య కాశికి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తక ప్రచురణ సంస్థ వారు "కాశికి వచ్చేవారిలో తెలుగువారే ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళు తెలుగులో కాశికి సంబంధిచిన పుస్తకం అడుగుతున్నారు. కనుక కాశీ ప్రాశస్త్యం, చరిత్ర, చూడవలసిన ప్రదేశాల వివరాలతో ఒక పుస్తకం వ్రాసి, డిటిపి చేసి పంపవలసిందిగా కోరినారు. ఆ పని కూడా కొనసాగుతున్నది.
అందువల్ల ఏమాత్రం సమయం చిక్కడం లేదు. బ్లాగులో, సమూహంలో మిత్రుల పద్యాలపై స్పందించలేకపోతున్నాను.
కనుక నన్ను మన్నించి కొద్ది రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి చేస్తున్నాను.
3, సెప్టెంబర్ 2022, శనివారం
మనవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ ఆరోగ్యం కుదుటబడితే అదే చాలు మాకు
రిప్లయితొలగించండిఆరోగ్యం పై శ్రద్ధ వహించండి గురువుగారూ! అది అన్నింటికన్నా ముఖ్యం. 🙏🏻
రిప్లయితొలగించండినమస్తే గురూజీ. మీ ఆరోగ్యంపై తగు శ్రద్ధ వహించం డి.
రిప్లయితొలగించండివర్తనములు మారినవిటు
రిప్లయితొలగించండికర్తలు మరి భార్యలెనట కలియుగ చివరన్
నర్తనమునకిది మొదలని
భర్తకు గళసూత్ర మలర భామిని గట్టెన్
రిప్లయితొలగించండిశంక రార్యులస్వాస్ధ్యముజక్కబడగ
వేడుకొందునుశంకరువినయముగను
స్వామిశంకర!దయనుమాశంకరయ్య
నొప్పులన్నియుబరిమార్చియొప్పుజేయు