8-9-2022 (గురువారం)కవిమిత్రులారా,'మైకు - డిజే - సాంగు - లేకు' ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూగణేశ నిమజ్జనను వర్ణిస్తూస్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
తేటగీతిభక్తి"మై కు"డుముల నిడి ప్రతిదినమ్ముదివ్య భా"సాంగు "గణపతిదేవదేవువేఁ"డి ,జే"జే యటంచును వేడ్కఁజేయు మజ్జనంబు"లే కు"రిపించు మంగళములు.
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
వరము లిచ్చెడి జేజెయే హరసుతుడనిమూఢులును గ్రంథ సాంగులు మోక్ష పథముకొరకు జనులెల్ల రేకమై కువలయమునగొలిచి, వారలే కుశమున కలుపుచుంద్రు.
చక్కని పూరణ. అభినందనలు.
భక్తి మై కుబ్జ రూపుని వాహన ముననునిచి పాడి జే యటను చు జనాళిదివ్య భా సాంగుని కి మ్రొ క్కి దేవ దేవనీవె దిక్కు లే కు రి పించ నెరులు సతము
మంచి పూరణ. అభినందనలు.
కొందరేక’మై కు’దురుగ గొక్కు రవుతుమూర్తి నలజ’డి జే’యక మోసుకొనుచుపోవ ,గ్రంథ’సాంగు’లు దారి పొడవు ప్రజకుకొద్ది కొద్దిగ గుడుము’లే కు’డుపు చుండె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అఖిలమై కులాచారమై నిఖిలజనులుకూడి జేజేలు పలుకుచు నాడి పాడిగణపతి నిమజ్జనముసల్పు కల్పమిదియెగ్రంథ సాంగులే కురియించు కాసులెన్నొ
🙏
రక్తి మైకుడు ములనిడి ప్రతి దినమ్ము దివ్య భాసాంగుఁ డైనట్టి నవ్యజ్యోతి నేట యేటను వేడి జే యిడుచు చుండి గుంట ముంచగను సిరు లే కురియఁజేయు
మీ పూరణ బాగున్నది. అభినందనలు'నవ్య జ్యోతి' అన్నపుడు 'వ్య' గురువై గణభంగం. "... నేట నేటను/నేటికేటికి" అనండి.
AMరక్తి మైకుడు ములనిడి ప్రతి దినమ్ముదివ్య భాసాంగుఁ డైనట్టి నవ్య మూర్తినేటికేటికి వేడి జే యిడుచు చుండిగుంట ముంచగను సిరు లే కురియఁజేయు
మనుజు లేక *మై కు* తుకమునను గణేశు,దివ్యమౌ ప *సాంగు* నిఁ బ్రీతిఁ ద్రిప్పి వీధు లందు కూ *డి జే* జే ధ్వనమంద జేసివెలితి *లేకుం* డ మజ్జన సలుపుచుంద్రు
భక్తి*మై కు*డుములొసఁగి శక్తికొలదికూ*డిజే*సితిమర్చనల్ గుజ్జురూపచిత్ప్రభా*సాంగు*డగునిన్ను చివరికిపుడువీడ*లేకు*న్న తప్పదు విడువనీట.
అతి భారమై కుఱుచ మూరితి వడి జేగంట లడర లీల గణేశుం డతిశయిత సాంగుళీయము లతుల భజనలే కుదరఁగ నప్పుల మునిఁగెన్
తే.గీ.దివ్యమై కుశలమునిచ్చు దేవ ! పూజచేసి సవ్వడి జేజేలు చెప్ప, రక్షవినతి గ్రంథసాంగు లిలను వీడుకొలుపుశకములే కుమ్మరిలఁజేయు శంభుపుత్ర !
తిర"మై కు"రిపించ విరులు వరముల భక్తులకిడుచును వ"డి జే"రితివే సర"సాంగు"డవైతమితో నురుకగ ఝరు"లే కు" లికెను నొప్పుగ నచటన్.
అరయగా నెల్ల జనులేకమై కుదురుగ గణపతి కిచ్చెడి జేజేలు గగన మంద గ్రంథసాంగులు సుజనులు కలసి సాగి మచ్చ లేకుండ చేసిరి మజ్జనమును!
కందంఆనందమై కుడుములందానెడి జేజేల వెంట నఖువాహనుడైమానిత భాసాంగుడొదిగెనాన నిమజ్జన జలముల ననలే కురియన్
తేటగీతి
రిప్లయితొలగించండిభక్తి"మై కు"డుముల నిడి ప్రతిదినమ్ము
దివ్య భా"సాంగు "గణపతిదేవదేవు
వేఁ"డి ,జే"జే యటంచును వేడ్కఁజేయు
మజ్జనంబు"లే కు"రిపించు మంగళములు.
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివరము లిచ్చెడి జేజెయే హరసుతుడని
మూఢులును గ్రంథ సాంగులు మోక్ష పథము
కొరకు జనులెల్ల రేకమై కువలయమున
గొలిచి, వారలే కుశమున కలుపుచుంద్రు.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిభక్తి మై కుబ్జ రూపుని వాహన మున
రిప్లయితొలగించండినునిచి పాడి జే యటను చు జనాళి
దివ్య భా సాంగుని కి మ్రొ క్కి దేవ దేవ
నీవె దిక్కు లే కు రి పించ నెరులు సతము
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండికొందరేక’మై కు’దురుగ గొక్కు రవుతు
రిప్లయితొలగించండిమూర్తి నలజ’డి జే’యక మోసుకొనుచు
పోవ ,గ్రంథ’సాంగు’లు దారి పొడవు ప్రజకు
కొద్ది కొద్దిగ గుడుము’లే కు’డుపు చుండె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅఖిలమై కులాచారమై నిఖిలజనులు
రిప్లయితొలగించండికూడి జేజేలు పలుకుచు నాడి పాడి
గణపతి నిమజ్జనముసల్పు కల్పమిదియె
గ్రంథ సాంగులే కురియించు కాసులెన్నొ
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిరక్తి మైకుడు ములనిడి ప్రతి దినమ్ము
రిప్లయితొలగించండిదివ్య భాసాంగుఁ డైనట్టి నవ్యజ్యోతి
నేట యేటను వేడి జే యిడుచు చుండి
గుంట ముంచగను సిరు లే కురియఁజేయు
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండి'నవ్య జ్యోతి' అన్నపుడు 'వ్య' గురువై గణభంగం. "... నేట నేటను/నేటికేటికి" అనండి.
AM
తొలగించండిరక్తి మైకుడు ములనిడి ప్రతి దినమ్ము
దివ్య భాసాంగుఁ డైనట్టి నవ్య మూర్తి
నేటికేటికి వేడి జే యిడుచు చుండి
గుంట ముంచగను సిరు లే కురియఁజేయు
మనుజు లేక *మై కు* తుకమునను గణేశు,
రిప్లయితొలగించండిదివ్యమౌ ప *సాంగు* నిఁ బ్రీతిఁ ద్రిప్పి వీధు
లందు కూ *డి జే* జే ధ్వనమంద జేసి
వెలితి *లేకుం* డ మజ్జన సలుపుచుంద్రు
భక్తి*మై కు*డుములొసఁగి శక్తికొలది
రిప్లయితొలగించండికూ*డిజే*సితిమర్చనల్ గుజ్జురూప
చిత్ప్రభా*సాంగు*డగునిన్ను చివరికిపుడు
వీడ*లేకు*న్న తప్పదు విడువనీట.
అతి భారమై కుఱుచ మూ
రిప్లయితొలగించండిరితి వడి జేగంట లడర లీల గణేశుం
డతిశయిత సాంగుళీయము
లతుల భజనలే కుదరఁగ నప్పుల మునిఁగెన్
తే.గీ.
రిప్లయితొలగించండిదివ్యమై కుశలమునిచ్చు దేవ ! పూజ
చేసి సవ్వడి జేజేలు చెప్ప, రక్ష
వినతి గ్రంథసాంగు లిలను వీడుకొలుపు
శకములే కుమ్మరిలఁజేయు శంభుపుత్ర !
తిర"మై కు"రిపించ విరులు
రిప్లయితొలగించండివరముల భక్తులకిడుచును వ"డి జే"రితివే
సర"సాంగు"డవైతమితో
నురుకగ ఝరు"లే కు" లికెను నొప్పుగ నచటన్.
అరయగా నెల్ల జనులేకమై కుదురుగ
రిప్లయితొలగించండిగణపతి కిచ్చెడి జేజేలు గగన మంద
గ్రంథసాంగులు సుజనులు కలసి సాగి
మచ్చ లేకుండ చేసిరి మజ్జనమును!
కందం
రిప్లయితొలగించండిఆనందమై కుడుములం
దానెడి జేజేల వెంట నఖువాహనుడై
మానిత భాసాంగుడొదిగె
నాన నిమజ్జన జలముల ననలే కురియన్