శ్రీ కంది శంకరయ్య గా రిచ్చిన సమస్య:"రతిభావమ్మున నోల లాడితె కవీ రమ్యావధానమ్మునన్". నా పూరణ మ:చతురత్వమ్మును జూడగోరియె సమస్యన్ నీకు నిట్లిచ్చితిన్ "రతి భావాంబుధి నోలలాడితె కవీ రమ్యావధానంబునన్!" రతిభావమ్మున నోల లాడితె కవీ రమ్యావధానమ్మునం? దతుకున్ బెట్టుచు పూరణన్ సలిపెదో అన్యార్థమున్ దెచ్చుచున్ (ఓ అవధానీ!రతిభావమ్మున ----మొదలైన సమస్యని నీ చతురత్వాన్ని చూడ గోరి యిచ్చాను.దానితో నువ్వు రతిభావం తో ఓల లాడుతున్నావా? ఏదైనా అక్షరం అతికించి అన్యార్థం లో కి తెస్తావా అని సమస్య ఇచ్చిన పృచ్ఛకుడు మళ్లీ ఒక వేళాకోళం పద్యం చెప్పాడు.సమస్యని పద్యం లో రెండు సార్లు చొప్పించటం ఈ పూరణ లో ఒక ప్రత్యేకత.)
అతులిత రచనా బలిమిని
రిప్లయితొలగించండిసతతము నుసమస్యచాక చక్యముఁ దోడం
బ్రతిపద పూరణఁ జేయ,ని
రతిభావాబ్ధిని మునిఁగితె ప్రాజ్ఞ వధానీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిమతిలేని ప్రాశ్నికు డొకడు
రతిభావాబ్ధిని మునిగితె, ప్రాజ్ఞవధానీ
సతతము సంభోగాస
క్తత మనమున తా రమించి, కాపురుషుడయెన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసతతంబంధుర మౌవిధంబుగను నాశాంతంబు రమ్యంబుగాఁ
రిప్లయితొలగించండిబ్రతిపాదంబును జక్కనౌ మఱియు నింపారంగఁ బూరించగా
రతిభావాంబుధి నోలలాడితె కవీ రమ్యావధానంబునన్
నతులం జేతును జేతులెత్తి, గొను మానాహస్త దోయిన్ వెసన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సతతం' అనడం వ్యావహారికం.
చతురత గల్గిన వాడా!
రిప్లయితొలగించండియతులిత వేగాన పద్య మల్లుచు సభలో
ప్రతిభను జూపింప గ భా
రతి భావాబ్ది ని మునిగితె ప్రాజ్ఞ వ ధానీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసతమతపరచెడు ప్రశ్నల
రిప్లయితొలగించండికృతకృత్యుండైనవాడు పృచ్ఛకుడైనన్
మితిమీరిన సంభ్రమ తత
రతి భావాబ్ధిని మునిఁగితె ప్రాజ్ఞ వధానీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగత యేడున కవులకిడిన
రిప్లయితొలగించండిపతకము గూర్చి యడుగగ జవాబు నిడుటకై
జతనము జేయక నేల వి
రతి ! భావాబ్ధిని మునిఁగితె ప్రాజ్ఞ వధానీ
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. బాగున్నది. అభినందనలు.
తొలగించండిసతతము ప్రశ్నల నడుగగ
రిప్లయితొలగించండిమతితోబదులిడుచువారి మనములయందున్
కుతుకము నింపుచు మది భా
రతిభావాబ్ధిని మునిగితె ప్రాజ్ఞవధానీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశృతదేవి కరుణ పొందగ
రిప్లయితొలగించండిక్రతువుగ నాతల్లి చరణ కమలములను తా
సతతము పూజించుచు భా
రతిభావాబ్ధిని మునిఁగితె ప్రాజ్ఞ వధానీ.
సతతమ్మా ధవళాంగినే కొలిచెడిన్ సద్భక్తుడై పేర్మితో
మతిలోశారదరూపమున్ నిలిపి సమ్మానించుచున్ పద్యముల్
ధృతితో సుస్వరగాత్రమందు పలికే ధీరుండతండౌచు భా
రతిభావాంబుధి నోలలాడితె కవీ రమ్యావధానంబునన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికందము
రిప్లయితొలగించండినుత పృచ్ఛక వర్గముతో
చతురోక్తులు పల్కుచుండి,సరసములాడన్
అతి గంభీరాకృతి భా
*రతి భావాబ్ధిని మునిగితె ప్రాజ్ఞ వధానీ!*
మత్తేభము
తొలగించండిస్థిత క్లిష్టంపు సమస్య,దత్తపది,ప్రశ్నించంగ నప్రస్తుతం
బతి ఘోరంపు నిషిద్ధ వర్ణములిటన్ ఆవర్తముల్, మీనముల్
వెతలంగూర్చు తరంగ,నక్రములునై వెంటాడగా నౌర!భా
రతి భావాంబుధి నోలలాడితె కవీ!రమ్యావధానంబునన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిమితిలేని ధిషణతో నతు
రిప్లయితొలగించండిలితమగు చతురతను జూపి లేబ్రాయమునన్
నుతియింప నెల్లరును భా
రతిభావాబ్ధిని మునిఁగితె ప్రాజ్ఞ వధానీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమతిలో నిల్పుచు పూర్వపండితులసమ్మానించి, యిచ్చన్ సర
రిప్లయితొలగించండిస్వతినాసక్తిగ గొల్చుచున్ పఠనమున్ సాగించి కావ్యమ్ములం
దతులమ్మైన పరిశ్రమన్ రుచిర పద్యమ్ముల్ ధృతిన్ వ్రాసి భా
రతి భావాంబుధి నోలలాడితె కవీ రమ్యావధానంబునన్
కందం
రిప్లయితొలగించండిప్రతిపదమునఁ గవనమొలుక
జతిగ నలంకార గతి రసాన్వితమగుచున్
నుతులందు పద్యముల భా
రతిభావాబ్ధిని మునిఁగితె ప్రాజ్ఞ వధానీ!
మత్తేభవిక్రీడితము
ప్రతిభాపూరిత వాక్కులన్ మెరయుచున్ రంజిల్లగా వేదియే
యతి జృంభింపగ మించుచున్ జెలఁగితే నప్రస్తుతంబోడగన్
నుతులన్ ముంచఁగఁ బ్రేక్షకుల్ దనరి వేనోళ్లన్, గటాక్షింప భా
రతి, భావాంబుధి నోలలాడితె కవీ! రమ్యావధానంబునన్
మతిమంతుఁడ వీవు మహా
రిప్లయితొలగించండిచతురుండవు కవి వరుఁడవు సంయమి వోలెన్
వితత కథాంచిత రచనా
రతి భావాబ్ధిని మునిఁగితె ప్రాజ్ఞ వధానీ
అతుల జ్ఞాన సముద్ర పూర్ణ శశి కాలాతీత మెన్నంగ నా
తత రీతిం జెలఁగంగఁ బల్క వకటా ధాత్రీ ధరాభమ్ము సం
తత గంభీర పదార్థ భేద కలన ధ్యానమ్మునన్ మున్గి యా
రతి భావాంబుధి నోల లాడితె కవీ రమ్యావధానంబునన్
ధృతి జూపుచు పదకవితా
రిప్లయితొలగించండిద్యుతి బెంచుచు సత్కవీశులోహో యనగాన్
మతిమంతుఁడవైతివి భా
రతిభావాబ్ధిని మునిఁగితె ప్రాజ్ఞ వధానీ
అతులంబైన నవార్థ భావ చతురవ్యాపారమేపారగా
శతముల్ మించెడు పద్యరత్నములు విశ్వశ్రేయమాశించి సం
తత కల్యాణకరంబులై జెలఁగె, విద్యాపూర్ణ! చేకొమ్ము హా
రతి, భావాంబుధి నోలలాడితె కవీ రమ్యావధానంబునన్
మ.
రిప్లయితొలగించండికృతులన్ వ్రాసిన త్యాగరాజు ఘనుడే కీర్తించె శ్రీ రామునిన్
నతులౌ భావము తాళ్ళపాక పదముల్ నాదాలు సంకీర్తనల్
జతయౌ వేంకట పండితుల్ సులభమౌ సాహిత్య గానాలె, భా
*రతి ! భావాంబుధి నోలలాడితె కవీ రమ్యావధానంబునన్*.
శ్రీ కంది శంకరయ్య గా రిచ్చిన సమస్య:"రతిభావమ్మున నోల లాడితె కవీ రమ్యావధానమ్మునన్".
రిప్లయితొలగించండినా పూరణ
మ:చతురత్వమ్మును జూడగోరియె సమస్యన్ నీకు నిట్లిచ్చితిన్
"రతి భావాంబుధి నోలలాడితె కవీ రమ్యావధానంబునన్!"
రతిభావమ్మున నోల లాడితె కవీ రమ్యావధానమ్మునం?
దతుకున్ బెట్టుచు పూరణన్ సలిపెదో అన్యార్థమున్ దెచ్చుచున్
(ఓ అవధానీ!రతిభావమ్మున ----మొదలైన సమస్యని నీ చతురత్వాన్ని చూడ గోరి యిచ్చాను.దానితో నువ్వు రతిభావం తో ఓల లాడుతున్నావా? ఏదైనా అక్షరం అతికించి అన్యార్థం లో కి తెస్తావా అని సమస్య ఇచ్చిన పృచ్ఛకుడు మళ్లీ ఒక వేళాకోళం పద్యం చెప్పాడు.సమస్యని పద్యం లో రెండు సార్లు చొప్పించటం ఈ పూరణ లో ఒక ప్రత్యేకత.)
చతురత నెంతయు జూపగ
రిప్లయితొలగించండినతులిత ప్రతిభను దెలుపగ నందము గానే
సతతము పూరణ జేయగ
రతి భావాబ్ధిని మునిగితె ప్రాజ్ఞ వధానీ!!
యతనమ్ముల్ సలుపంగ దెలుపగన్ నాద్యంతమ్ము నారాధ్యునే
నతులన్ సల్పగ శ్రీశునే పిలుచుచున్ నారాయణున్ బ్రేమతో
ప్రతిభన్ వర్ణన సేసి పాడగను నాభవ్యాంశు వేదాత్మునే
రతి భావాంబుధి నోలలాడితె కవీ! రమ్యావధానంబునన్!!
సమసమాంతరరేఖలసరళినిచట
రిప్లయితొలగించండినత్తకోడళ్ళునిల్వగా నడచువాడు
వేఱువేరైన భావాలవేరు జేసి
రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
గిల్పంబొక్కటిఁదెమ్మనెన్గదర సాగిన్చన్గ 'మాయాబజార్'
స్వల్పంబేగద మీదుఁగోర్కెయని నూపందిప్పి రేనొద్దొద్దనన్
అల్పంబియ్యిది నవ్యమౌ జగతి నూహాతీత మైగోఱగన్
రైల్పట్టాలఁ బరుండ మేల్గలుగు నార్యప్రోక్త సత్యంబిదే
కొరుప్రోలు రాధాకృష్ణ రావు