20, సెప్టెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4196

21-9-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోకలితోడ గిరిధరుని రుక్మిణి మోదెన్”
(లేదా...)
“రోకలితోడ మాధవుని రుక్మిణి మోదెను సత్య మెచ్చఁగన్”

20 కామెంట్‌లు:

 1. కందం
  ఆకలి కోర్వఁగఁ జాలని
  కేకల మీనాన్న యరుపు కృంగగ దీయున్
  దూకుడు మాటల వింటే?
  "రోకలితోడ గిరిధరుని రుక్మిణి మోదెన్"

  ఉత్పలమాల
  ఆకలి కోర్వలేడనఁగ నాయన నాపగ జాలరెవ్వరున్
  గేకల కర్థమున్ గనము గృంగగ దీసెడు నాన్న వింటివా?
  దూకుడు మాటలున్ బొరల తూలుచు వాగిన కూతలందునన్
  “రోకలితోడ మాధవుని రుక్మిణి మోదెను సత్య మెచ్చఁగన్”

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. PM

   ఆకలి మంటల రేగుచు
   భీకరముగ నఱచె నిట్లు బెనకువ తోడం
   గాకను మోదుదు నిటులుగ
   రోకలి తోడ గిరిధరుని రుక్మిణి మోదెన్

   తొలగించండి
 3. కందము
  వాకిట దంచగ గోపిక
  రోకలి తోడ;గిరిధరుని రుక్మిణి మోదెన్
  రేకులు విచ్చిన పద్మము
  నే,కేలంబూని కేళి నేర్పులు మీఱన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   వాకిట గోపికాంగనలు పాటలు పాడుచు దంచుచుండగా
   రోకలి తోడ; మాధవుని రుక్మిణి మోదెను సత్యమెచ్చగన్
   శ్రీకర పుష్ప గుచ్ఛములు చేకొని మాటికి మాటికిన్ బళీ!
   తాకగ మేనికయ్యవి నితాంత నిపీడితుఁడయ్యె నక్కటా!

   తొలగించండి
 4. మేకలఁ గాసెడు వాడొక
  పోకిరి మద్యమ్ము గ్రోలి మూర్ఖుల తోడన్
  శ్రీకృష్ణుని గూర్చి పలికె
  రోకలితోడ గిరిధరుని రుక్మిణి మోదెన్.


  పోకిరి వారలైన పలు బోడికలన్ గొని మద్యశాలలో
  ధూకుడొకండు మాధ్వి గొని తూలుచు శ్యామసుందరున్
  గోకుల మెల్ల పూజ్యుడని గొల్చిన వానిని తూలె నిట్టులన్
  రోకలితోడ మాధవుని రుక్మిణి మోదెను సత్య మెచ్చఁగన్.

  రిప్లయితొలగించండి
 5. (గిరిధరుడు , రుక్మిణి బావా మరదళ్ళు)

  ఆకలి వేయగ రుక్మిణి
  నూకలను పరుగిడి తెమ్మనుచు గిరిధరునిన్
  నూకగ , త్వర రాలేదని
  రోకలితోడ గిరిధరుని రుక్మిణి మోదెన్

  రిప్లయితొలగించండి
 6. హా! కలికాల మహాత్మ్యము!
  వీఁకగ కల్లలు సతతము వితతము నొందన్
  లోకులు పలికితిరిట్టుల
  "రోకలితోడ గిరిధరుని రుక్మిణి మోదెన్"

  రిప్లయితొలగించండి
 7. ఆకారమొకటి వెన్నను
  చీకటిలోదొంగిలింప చేడియ గనియెన్
  తేకువ యలరగ తానే
  రోకలితోడ గిరిధరుని రుక్మిణి మోదెన్

  రిప్లయితొలగించండి
 8. గోకుల మందు గోపికలు గొల్వగఁ గృష్ణుని బ్రేమ తోడుతన్
  వ్యాకుల భావముంగలిగి వైకృత చేష్టలు సేయు చుండు నా
  పోకిరి వారు కొందరట పూర్తిగ మత్తున నుండి యిట్ల నెన్
  రోకలితోడ మాధవుని రుక్మిణి మోదెను సత్య మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 9. ఉ.

  ప్రాకిన హస్తినాపురిని వంచెను సాంబు విముక్తి గోరుచున్
  వాకము ద్వారకన్ దులసి పత్రము చేతను ప్రీతి పూజగన్
  దీకొని పారిజాతమును దెచ్చెను నందన వృక్షవాటికన్
  *“రోకలితోడ, మాధవుని రుక్మిణి మోదెను, సత్య మెచ్చఁగన్”*

  .. డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

  రిప్లయితొలగించండి
 10. పేకాట నాడ వద్దని
  శోకించుచు వేడుకొన్న సుంతయు వినడా
  పోకిరి మగనిని యలుకన్
  రోకలి తోడ గిరి ధరుని రుక్మిణి మోదెన్

  రిప్లయితొలగించండి
 11. లోకులు కాకులై వదరు రోజులు వచ్చినవీ యుగంబునన్
  గాక మరేమి మత్తులయి కల్లలఁ బల్కుదురిట్లు, కిన్కతో
  రోకలితోడ మాధవుని రుక్మిణి మోదెను సత్య మెచ్చఁగన్
  కేకలువైచె సీరి యని, గేలితనంబున బల్కుటొప్పునే

  రిప్లయితొలగించండి
 12. ఆకలితీర్చి పెన్మిటికి హర్షముతోడ శయమ్ము చేరి తాన్
  దీకొని నెయ్యపున్ గినుక తేలగ, నేచెలికత్తె చూచి నా
  రో! కలితోడ మాధవుని రుక్మిణి మోదెను సత్య మెచ్చఁగన్
  చేకుఱ సఖ్యతంచు నల చెప్పె వయస్యల గాంచి ప్రీతితో
  కలి: మొగ్గ

  రిప్లయితొలగించండి
 13. రుక్మిణి సత్య అని పేరు గల గోపికలు కృష్ణుని కొట్టినట్టుగా ఊహించి

  గోకులమందుతిర్గుచును కూడుచు నాడుచు గోప బాలలన్
  కేకలువైచుచుండగని కృష్ణుని. కొట్టగ చేయి నెత్తగన్
  తాకుచు సత్య రుక్మిణులు తాండవ మాడు విధమ్ముగావడిన్
  రోకలి తోడ మాధవునిరుక్మిణిమోదెనుసత్యమెచ్చగన్

  రిప్లయితొలగించండి
 14. ఆకులు పచ్చడి చేతురు
  వేకువవేళతలచినవివేకమొదవు,నా
  కూకటి ప్రేమగతడుముచు
  రోకలితోడ,గిరిధరుని,రుక్మిణిమోదెన్

  రిప్లయితొలగించండి
 15. కందం
  ఏకాగ్రత తో దంచిరి
  వేకువ జామున పడతులు వేడుక యని, పూ
  రేకులతో వలపులతో
  రోకలితోడ, గిరిధరుని రుక్మిణి మోదెన్.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.
  క్రమాలంకార పూరణ.

  రిప్లయితొలగించండి
 16. ఆకాంత యెంచ నొక గిరి
  యా కాంతుఁడు సతిని నెత్తి యవనిం గూల్పన్
  వే కినిసి సతీ మణి కై
  రోకలి తోడ గిరిధరుని రుక్మిణి మోదెన్

  నా కను లారఁ జూచినది నమ్ముఁడు చెప్పుచు నుంటి నంచుఁ దా
  వీఁక వచించె జాంబవతి ప్రేమపుఁ గిన్క సెలంగఁ గామమే
  తాఁక శిరమ్ము స్వీయ కర దండము రోకలి కాఁగ మెత్తగా
  రోకలి తోడ మా ధవుని రుక్మిణి మోదెను సత్య మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కందము

   ఆకలియని మన్నుతినగ
   నీకీ బుద్ధేల యనుచు నిందల తోడన్
   నాకన్నాతప్పుయనుచు
   *రోకలితోడ గిరిధరుని రుక్మిణి మోదెన్*

   ( ఇక్కడ గిరిధరుడు మరియు రుక్మిణి తల్లి కొడుకులు )

   ************************
   ఉ . మా
   గోకులమందుమన్నుతిన కృష్ణుని దేనికి కట్టివేసిరో ?
   చేకొని వ్రేలుపై గిరిని చేసెను మేలును గోకులమ్ముకున్ ?
   వేకువజాముకన్నయనుప్రేమగ తట్టెను పూలరెమ్మతో ?
   *రోకలితోడ, మాధవుని,రుక్మిణి మోదెను సత్య మెచ్చగన్*

   తొలగించండి