3, సెప్టెంబర్ 2022, శనివారం

సమస్య - 4181

4-9-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్”
(లేదా...)
“నగధరుఁ డంగజుం దునిమి నాతినిఁ బ్రోచె సురల్ నుతింపఁగన్”

19 కామెంట్‌లు:

 1. కందం
  ఇగురు విలుకాడు సెలఁగుచు
  నగజను బెండ్లాడ శివుడు నాటగ శరమున్
  తిగకంటి మంటలను ప
  న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంపకమాల
   అగమనులార్తివేడఁ దగ నాది శివుండల వీడి మౌనమున్
   నగజను పెండ్లియాడునని నాటగ పుష్ప శరంబుఁ బూనికన్
   దగదను రీతి కోపమున త్ర్యక్షము విప్పుచు మంటఁజిమ్మి ప
   న్నగధరుఁ డంగజుం దునిమి నాతినిఁ బ్రోచె సురల్ నుతింపఁగన్

   తొలగించండి
 2. కందము
  అగజాధీనుఁడు తానై
  తగురీతినిఁజేయలేక తపమున్ రుషతో
  తిగకంటి మంటలను,ప
  న్నగధారి యనంగుఁద్రుంచి నాతినిఁబ్రోచెన్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంపకమాల
   తగుదువు నీవె యీశునకు దగ్గఱఁజేర్చ నగేంద్ర కన్యకన్
   జగములు బ్రోచు సూనుఁడగు షణ్ముఖుఁడే జనియించు నంచనన్
   తెగ సుమబాణముల్ విడువ తీక్ష్ణపు దృక్కుల తోడఁగాంచి ప
   న్నగధరుఁడంగజుందునిమి నాతిని బ్రోచె సురల్ నుతింపగన్.

   తొలగించండి

 3. అగజాత కోరిక నెఱగి
  సెగకంటి తపమ్ము చెఱచ చిందర తోడన్
  పొగకన్ను తెరచి యా ప
  న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్.

  రిప్లయితొలగించండి
 4. నగరాజతనయ యెడలన్
  తిగకంటికి మరులుపుట్ట తేకువ తోడన్
  వెగడొందు వానిగని ప
  న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్

  రిప్లయితొలగించండి
 5. జగముల శివమొనగూడును
  నగజను పెండ్లాడ శివుడు; ననవిల్తుఁడు భా
  తిగ పూశరము విడువ ప
  న్నగధారి యనంగుఁ ద్రుంచినాతినిఁ బ్రోచెన్

  రిప్లయితొలగించండి

 6. జగములనేలు శంకరుని స్వామిగ పొంద దలంచి నట్టియా
  నగసుత కోర్కెదీర్చగ ననంగుడు గోపతి యానతివ్వ నా
  శుగమును వేసినంతటనె సూక్ష్ముడు చంద్రకళాధరుండు ప
  న్నగధరుఁ డంగజుం దునిమి నాతినిఁ బ్రోచె సురల్ నుతింపఁగన్

  రిప్లయితొలగించండి
 7. తొగకంటి భవానిపయిన
  భగుని కనుకలి మరలించ భావజు డేగెన్ ,
  బెగడక విరిశిఖి విడ ప
  న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్

  రిప్లయితొలగించండి
 8. నగజవహించె దీక్ష తననాథునిగా పరమేశ్వరున్గొనన్
  జగముల గూర్చమంగళము చక్కెరవిల్తుని కోరగా సురల్
  పగతునివోలె పూశరము ఫాలవిలోచను పైన వేయ ప
  న్నగధరుఁ డంగజుం దునిమి నాతినిఁ బ్రోచె సురల్ నుతింపఁగన్

  రిప్లయితొలగించండి
 9. నగ జాతను శివుని గలిపి
  జగతికి శుభములనుగూర్ప సరియగు వేళన్
  దగు రీతియౌ క్రియ గా ప
  న్నగ ధారి యనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్

  రిప్లయితొలగించండి
 10. అగముఁ దపస్సునందు ననిలాంబకుడుండ కరమ్ము దీక్షతో
  నగరిపు పన్పునన్ కుసుమ నారసముల్ విడ మన్మథుండు ప
  న్నగధరుఁ డంగజుం దునిమి నాతినిఁ బ్రోచె సురల్ నుతింపఁగన్
  తగునని యద్రి పుత్రికయె దారగ నంచు తలంచి యిచ్ఛతో

  రిప్లయితొలగించండి
 11. అగజా తపమున నలరియు
  తగునే తనవంటివాడు తగులం బడుటల్
  తగదని యనదా జగమని
  నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్.

  రిప్లయితొలగించండి
 12. నగమునచేయతపమ్మును
  నగజయుయొనరించసేవ నలయక నచ్చో
  ఖగమును వేయకనలిప
  న్నగధారియనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్

  రిప్లయితొలగించండి
 13. మరొక పూరణ
  మగువలమదినేదోచెను
  నగధారి,యనుంగు ద్రుంచి నాతిని బ్రోచెన్
  జగదీశుడు మరుడేయగ
  ఖగమును,గ్రుచ్చి మనమునఘ కనలుచువడిగా.


  రిప్లయితొలగించండి
 14. చం.

  వగచిరి వేల్పులాడికగ బాధలు పెట్టిన తారకాసురున్
  తెగువన మన్మథున్ గొలిపి తెన్నుగ బెండ్లికి పార్వతీశులన్
  సుగమము గాని నేమకము జోగి సతీ విరహంబు చేత ప
  *న్నగధరుఁ డంగజుం దునిమి నాతినిఁ బ్రోచె సురల్ నుతింపఁగన్*

  రిప్లయితొలగించండి
 15. జగ దారాధుం డగు ప
  న్నగ భూషణుఁ డాగ్రహమ్మునఁ దెఱచి కంటిన్
  నగ మద్రువన్ మేరు మహా
  నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్

  అగజను దాపసిం గరుణ నారసి పెండిలి యాడి శంకరుం
  డు గరిమ నెన్ని గర్వమును డుల్లఁగఁ జేసి ఖరంపు చూపుతోఁ
  బగతుఁడె యెంచ శంభునకు భావిని జన్మ నొసంగ నుండ నా
  నగధరుఁ డంగజుం దునిమి నాతినిఁ బ్రోచె సురల్ నుతింపఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నగమునఁ దపముం జేయగఁ
   నగజ యె దాఁబూజసేయ హరునకుఁ బ్రేమన్
   దెగువన బాణము విసరగ
   నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్

   తొలగించండి