20-9-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వెలయాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్”(లేదా...)“వెలయాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్”
లలనల నవమానింపకు మిలవేల్పులు వారుగాదె యిల్లాలిగ నిన్ కొలిచెడి యామె మనసు కోవెల, యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంనిలయమునఁ బతికి షట్కర్మలఁ దోడుగ సంతుఁ బడసి ప్రమిదయనంగన్వెలయఁగ మహినిల్లే కోవెల! యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్మత్తేభవిక్రీడితమునిలయమ్మందున దీపమై వెలిగి సంధింపంగ షట్కర్మలన్వలపుల్ గాంచుచు భర్తకున్ మధురభావంబౌచు నిల్లాలిగన్వెలయన్ సంతుకు మాతృదేవతగఁ దా పెంపార నిల్లన్న కోవెల, యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపగన్!
కలుషము గలిగెడు బలుకుల నలవోకఁగ మాటలాడ న్యాయమె యిచటన్ లలనల మనసులు గనఁ గో వెల,యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్
కందముకళకళలాడుచు ,నింటన్ గలగల నడయాడుచుండి కలివిడి తోడన్తళతళమను నవ్వుల దివ్వెల,యాలే దిక్కు వంశవృద్ధికిఁగనఁగన్.
మత్తేభము కలుముల్ వోవగ, గౌరవంబుఁజెడ,చుల్కంగా జనుల్ నవ్వ నావెలయాల్మూలము;వంశవృద్ధికిరవౌ ప్రేమన్ ప్రసాదింపగన్ బళిరా!కష్టసుఖాలతోడగుచు నాప్యాయంబుతో నెప్పుడున్ జెలిమింజూపెడి భార్యయే తగును సుశ్రీలింట దైవారగన్.
చులకన గచూడ బోకుముతలయెత్తకపనులుచేయుతరుణిని యెపుడున్నిలునాకముచేసెడు కో*"వెలయాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్”*
వలపునుపంచుచునుండినవెలకోరకపనులుచేయు విసుగొందకతానిలునొనరించును తాకో*"వెల,యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్”*
కలిలో, గురువుకు, శిష్యుకు,బలహీనుకు,భలుడుకు, గుణవంతులకు, సదా ఖలుడుకు, శ్రీహరిమదికో వెలయాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్
వలపులు జూపెడు సతియైకలలకు సాకా ర మిచ్చు కాంతా మణియైమెలగెడు నామెయె యొక కోవెల ' యాలే దిక్కు వంశ వృద్ధికి గనగన్
వెలయాలివలకు చిక్కినవిలపించక తప్పదుగద, విజ్ఞతతోడన్మెలగిన బ్రతుకగునా వెలవెల, యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్
తలలో నాలుకయై చరించు కదరా తన్వంగులీ ధాత్రిలో చెలియై భర్తయె సర్వమంచు నతనిన్ సేవించు సచ్ఛీలురౌలలితాంగుల్ గన వేల్పులే భువిని, యిల్లాలున్న ధామమ్మె కో వెల, యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్.
వెలగలదే వస్తువునకు,నిలలో వెలగట్టవచ్చు నేపనికైనన్,కులసతి సేవలకెయ్యదివెల? యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్
వలపును తీర్చి శిశునిడదువెలయాలే ; దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్నలుగురి కాహ్వానమొసగిజ్వలనము సాక్షిగ పరిణయ మాడిన సతియే
వలపుల్ రేపుచు వంశనా శనము నాపాదించు కార్యంబు కున్ వెలయాల్మూలము, వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్ వలపే ముఖ్యము చింతజే యగను నావాసంబు శుభ్రంబు నై వెలయన్ వంశముఁ దప్పకుం డగను దావృద్ధిన్ సదాపొందుగా
చెలువంమొప్పగయిక్కలోన మనుచున్ చిప్పిల్లు బ్రేమమ్ముతోవిలువన్ బెంచుచు సంఘమందునను, నిర్వేదమ్ము పోనాడి సేవలతో మించుచు నత్తమామలను సంభావించి దీపించు కోవెల, యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్
కందంకిలకిల నవ్వుచు గృహమునగిలిగిలి పెట్టి పతిదేవు గిరికొని సేవన్చెలువము మీర సలుపు దివ్వెల, యాలే దిక్కు వంశవృద్ధికి గనగన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
కం:లలనను బెండ్లాడుట కైవెలయా !లే ! దిక్కు వంశవృద్ధికి గనగన్లలనలె తనువును,మనమునువలపుల నొసగంగ నింత స్వార్థ మ్మేలా!(లలనను బెండ్లాడుట కై వెల=కట్నం.)
కలకంఠిని బాధించుచుచులకన జేయకుము మగడ! శూరుడననుచున్కులకీర్తియె బోవును వెలవెల,యాలే దిక్కు వంశవృద్ధికి గనగన్!తలపుల్ దోషములేనివై మగని గోత్రమ్మున్తలందాల్చుచున్సలుపన్ సేవల నత్తమామల సదాచారంబుబాటించుచున్చెలిమిన్ బంచుచు నాడుబిడ్డలకు దాసింగారియై భర్తకున్దలలో నాల్కగ నెల్లవారికిని బంధాలన్ ప్రవర్ధించు కోవెల, యాల్మూలము వంశవృద్ధికిరవౌ ప్రేమన్ బ్రసాదింపగన్
మ.పిలువన్ శక్రుడు దేవవేశ్యలను కౌపీనమ్ము వర్జించుటన్సలిగన్ మేనక జేరగా మెదలె విశ్వామిత్ర శృంగారమేనలి శాకుంతలమై భువిన్ భరత జన్మమ్మున్ మహారాజుగా*వెలయాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్.*
వెలయాండ్రే యచ్చరలు మునుల కయినన్ సత్యము లగును జుమీ యీ మాటలు నిశ్చయముగ ధరలో వెలయాలే దిక్కు వంశ వృద్ధికిఁ గనఁగన్కలలో నైనను ద్వేష మూనదు మదిం గల్యాణమే కోరుఁగా లలనా రత్నముఁ గాచుటే పతికిఁ గర్తవ్యంబు త్యాగంబుతోఁ జలుపంగన్ నిజ దార సేవలకు దుస్సాద్యమ్ము లెక్కింపఁగా వెల యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమం బ్రసాదింపఁగన్
ఇలలో నీసరిబోలు వారెవరు నిన్నేరీతి కీర్తింతునోనెలతా! నీగృహమేలు రాజ్ఞివగుచున్ నిత్యంబు నీ వారికిన్తలలో నాలుకగా మెలంగుచు, నమందానంద మందించు కోవెల! యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్
కందముపలువత్సరముల నుండియుకలుగును పిల్లలనిచూడ కలయే మిగిలెన్తలపునకువచ్చె తనకిల*వెలయాలే దిక్కు వంశవృద్ధికి గనగన్*మత్తేభమువిలువైనట్టిదిజీవితంబనుచతా పెండ్లాడెముద్దుగుమ్మ నాచెలివంచున్నొకసుందరాంగనను సుశ్రీశోభితమ్మొప్పగాతొలిసంసారముజేయబూనగను దాత్రోసెన్‌కాననేర్పగా*వెలయాల్మూలమువంశవృద్ధికిరవౌ ప్రేమన్ బ్రసాదింపగన్*
రిప్లయితొలగించండిలలనల నవమానింపకు
మిలవేల్పులు వారుగాదె యిల్లాలిగ నిన్
కొలిచెడి యామె మనసు కో
వెల, యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండినిలయమునఁ బతికి షట్క
ర్మలఁ దోడుగ సంతుఁ బడసి ప్రమిదయనంగన్
వెలయఁగ మహినిల్లే కో
వెల! యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్
మత్తేభవిక్రీడితము
నిలయమ్మందున దీపమై వెలిగి సంధింపంగ షట్కర్మలన్
వలపుల్ గాంచుచు భర్తకున్ మధురభావంబౌచు నిల్లాలిగన్
వెలయన్ సంతుకు మాతృదేవతగఁ దా పెంపార నిల్లన్న కో
వెల, యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపగన్!
కలుషము గలిగెడు బలుకుల
రిప్లయితొలగించండినలవోకఁగ మాటలాడ న్యాయమె యిచటన్
లలనల మనసులు గనఁ గో
వెల,యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందము
తొలగించండికళకళలాడుచు ,నింటన్
గలగల నడయాడుచుండి కలివిడి తోడన్
తళతళమను నవ్వుల ది
వ్వెల,యాలే దిక్కు వంశవృద్ధికిఁగనఁగన్.
మత్తేభము
తొలగించండికలుముల్ వోవగ, గౌరవంబుఁజెడ,చుల్కంగా జనుల్ నవ్వ నా
వెలయాల్మూలము;వంశవృద్ధికిరవౌ ప్రేమన్ ప్రసాదింపగన్
బళిరా!కష్టసుఖాలతోడగుచు నాప్యాయంబుతో నెప్పుడున్
జెలిమింజూపెడి భార్యయే తగును సుశ్రీలింట దైవారగన్.
చులకన గచూడ బోకుము
రిప్లయితొలగించండితలయెత్తకపనులుచేయుతరుణిని యెపుడున్
నిలునాకముచేసెడు కో
*"వెలయాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్”*
వలపునుపంచుచునుండిన
రిప్లయితొలగించండివెలకోరకపనులుచేయు విసుగొందకతా
నిలునొనరించును తాకో
*"వెల,యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్”*
కలిలో, గురువుకు, శిష్యుకు,
రిప్లయితొలగించండిబలహీనుకు,భలుడుకు, గుణవంతులకు, సదా
ఖలుడుకు, శ్రీహరిమదికో
వెలయాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్
వలపులు జూపెడు సతియై
రిప్లయితొలగించండికలలకు సాకా ర మిచ్చు కాంతా మణియై
మెలగెడు నామెయె యొక కో
వెల ' యాలే దిక్కు వంశ వృద్ధికి గనగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివెలయాలివలకు చిక్కిన
తొలగించండివిలపించక తప్పదుగద, విజ్ఞతతోడన్
మెలగిన బ్రతుకగునా వెల
వెల, యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్
రిప్లయితొలగించండితలలో నాలుకయై చరించు కదరా తన్వంగులీ ధాత్రిలో
చెలియై భర్తయె సర్వమంచు నతనిన్ సేవించు సచ్ఛీలురౌ
లలితాంగుల్ గన వేల్పులే భువిని, యిల్లాలున్న ధామమ్మె కో
వెల, యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్.
వెలగలదే వస్తువునకు,
రిప్లయితొలగించండినిలలో వెలగట్టవచ్చు నేపనికైనన్,
కులసతి సేవలకెయ్యది
వెల? యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్
వలపును తీర్చి శిశునిడదు
రిప్లయితొలగించండివెలయాలే ; దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్
నలుగురి కాహ్వానమొసగి
జ్వలనము సాక్షిగ పరిణయ మాడిన సతియే
వలపుల్ రేపుచు వంశనా శనము నాపాదించు కార్యంబు కున్
రిప్లయితొలగించండివెలయాల్మూలము, వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్
వలపే ముఖ్యము చింతజే యగను నావాసంబు శుభ్రంబు నై
వెలయన్ వంశముఁ దప్పకుం డగను దావృద్ధిన్ సదాపొందుగా
చెలువంమొప్పగయిక్కలోన మనుచున్ చిప్పిల్లు బ్రేమమ్ముతో
రిప్లయితొలగించండివిలువన్ బెంచుచు సంఘమందునను, నిర్వేదమ్ము పోనాడి సే
వలతో మించుచు నత్తమామలను సంభావించి దీపించు కో
వెల, యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్
కందం
రిప్లయితొలగించండికిలకిల నవ్వుచు గృహమున
గిలిగిలి పెట్టి పతిదేవు గిరికొని సేవన్
చెలువము మీర సలుపు ది
వ్వెల, యాలే దిక్కు వంశవృద్ధికి గనగన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
కం:లలనను బెండ్లాడుట కై
రిప్లయితొలగించండివెలయా !లే ! దిక్కు వంశవృద్ధికి గనగన్
లలనలె తనువును,మనమును
వలపుల నొసగంగ నింత స్వార్థ మ్మేలా!
(లలనను బెండ్లాడుట కై వెల=కట్నం.)
కలకంఠిని బాధించుచు
రిప్లయితొలగించండిచులకన జేయకుము మగడ! శూరుడననుచున్
కులకీర్తియె బోవును వెల
వెల,యాలే దిక్కు వంశవృద్ధికి గనగన్!
తలపుల్ దోషములేనివై మగని గోత్రమ్మున్
తలందాల్చుచున్
సలుపన్ సేవల నత్తమామల సదాచారంబు
బాటించుచున్
చెలిమిన్ బంచుచు నాడుబిడ్డలకు దాసింగారియై భర్తకున్
దలలో నాల్కగ నెల్లవారికిని బంధాలన్
ప్రవర్ధించు కో
వెల, యాల్మూలము వంశవృద్ధికిరవౌ ప్రేమన్ బ్రసాదింపగన్
మ.
రిప్లయితొలగించండిపిలువన్ శక్రుడు దేవవేశ్యలను కౌపీనమ్ము వర్జించుటన్
సలిగన్ మేనక జేరగా మెదలె విశ్వామిత్ర శృంగారమే
నలి శాకుంతలమై భువిన్ భరత జన్మమ్మున్ మహారాజుగా
*వెలయాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్.*
వెలయాండ్రే యచ్చరలు ము
రిప్లయితొలగించండినుల కయినన్ సత్యము లగును జుమీ యీ మా
టలు నిశ్చయముగ ధరలో
వెలయాలే దిక్కు వంశ వృద్ధికిఁ గనఁగన్
కలలో నైనను ద్వేష మూనదు మదిం గల్యాణమే కోరుఁగా
లలనా రత్నముఁ గాచుటే పతికిఁ గర్తవ్యంబు త్యాగంబుతోఁ
జలుపంగన్ నిజ దార సేవలకు దుస్సాద్యమ్ము లెక్కింపఁగా
వెల యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమం బ్రసాదింపఁగన్
ఇలలో నీసరిబోలు వారెవరు నిన్నేరీతి కీర్తింతునో
రిప్లయితొలగించండినెలతా! నీగృహమేలు రాజ్ఞివగుచున్ నిత్యంబు నీ వారికిన్
తలలో నాలుకగా మెలంగుచు, నమందానంద మందించు కో
వెల! యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందము
రిప్లయితొలగించండిపలువత్సరముల నుండియు
కలుగును పిల్లలనిచూడ కలయే మిగిలెన్
తలపునకువచ్చె తనకిల
*వెలయాలే దిక్కు వంశవృద్ధికి గనగన్*
మత్తేభము
విలువైనట్టిదిజీవితంబనుచతా పెండ్లాడెముద్దుగుమ్మ నా
చెలివంచున్నొకసుందరాంగనను సుశ్రీశోభితమ్మొప్పగా
తొలిసంసారముజేయబూనగను దాత్రోసెన్‌కాననేర్పగా
*వెలయాల్మూలమువంశవృద్ధికిరవౌ ప్రేమన్ బ్రసాదింపగన్*