16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4192

17-9-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మానవులకుఁ దల్లినుడి యమంగళకరమౌ”
(లేదా...)
“మానవజాతి కంతటి కమంగళమూలము మాతృభాషయే”

43 కామెంట్‌లు:

  1. కం:తేనియ కంటెను ,రుచి గల
    పానకమున కంటె పంచభక్ష్యమ్ములకం
    టెను తల్లి ప్రేమ నెరిగిన
    మానవులకు దల్లి నుడియ మంగళకరమౌ.
    (తల్లి నుడి యే మంగళకరము కానీ అన్యభాష కా దనే అర్థం లో.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదాన్ని లఘువుతో ప్రారంభించారు.

      తొలగించండి
  2. కందం
    కూనగ చన్గుడిచి జనని
    పానము సేయించినట్టి భాషా సుధయే
    హీనముగ సంకర మొనర
    మానవులకుఁ దల్లినుడి యమంగళకరమౌ!

    ఉత్పలమాల
    కూనగ స్తన్యమున్ గొని నిగూఢమనంగ సుధాసమమ్ముగన్
    బానమొనర్పగన్ జనని భాషను తీయగ మాటలాడకే
    హీనులనంగ సంకరము నింగితమించుక లేక చేసినన్
    మానవజాతి కంతటి కమంగళమూలము మాతృభాషయే!

    రిప్లయితొలగించండి
  3. జానుతెలుగునందభిరుచి
    నానాటికిమందటిల్ల నామూఢుండే
    దానవుడైవాక్రుచ్చెన్
    'మానవులకుఁ దల్లినుడి యమంగళకరమౌ'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జానుదెనుంగుబాషమనజాలదనంగ తలంచినాడొకో
      దానవలక్షణంబనగ దారుణ వైఖరి నొందియుండెనో
      తాను మదంబునన్ బలికె తాలిమిగూడినమానసంబుతో
      “మానవజాతి కంతటి కమంగళమూలము మాతృభాషయే”

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. కందం
    మానమును విడిచి ప్రక్కకు
    మానక ఆంగ్లము పలుకుచు , మనతెలుగును ఏ
    దో నాముషియని తలచిన
    మానవులకుఁ దల్లినుడి యమంగళకరమౌ”

    రిప్లయితొలగించండి
  5. ఉ:మానవజాతి కంతటి కమంగళరూపము మాతృభాషయే
    నానిచి నాంచి పల్కు నొక నాతి యటందును తల్లి భాషయే
    దీన మటంచు దల్చు నొక దీనత దక్కెను తెన్ గు నేల పై
    మా నవజాతి కంతటి కమంగళరూపము మాతృభాషయే
    (మొదటి పాదం-మానవజాతికి అమంగళరూపం ఏది?అంటే మాతృభాషనే నాంచి నాంచి పలికే ఎవరో ఒక స్త్రీ అంటున్నాను.చివరి పాదం-మా నవజాతికి అనగా క్రొత్త తరానికి మాతృభాషే అమంగళరూపం అయింది.)

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    వీనులకు విందుఁగూర్చుచు తేనెలొలుకు
    తీయనైనట్టి భాషయే తెలుగు భాష
    చెల్లును గద*మానవులకుఁదల్లినుడి;య
    మంగళకరమౌ* ననుట సమంజసంబె?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఛందోవిన్యాసం ప్రశంసనీయం. పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. ఈనాటి మీ పలుకులివి
    “మానవులకుఁ దల్లినుడి యమంగళకరమౌ”
    కాన మెపుడు నిట్లుజరుగ
    మానుట మంచిదిటువంటి మాటలు పలుకన్

    రిప్లయితొలగించండి
  8. ఙ్ఞానమును గలుఁగఁ జేయును
    మానవులకుఁదల్లినుడి,యమంగళకరమౌ
    గానుగ యెద్దును వోలెను
    వేనకువేలుం దిరుగుట భీముని చుట్టున్

    రిప్లయితొలగించండి
  9. వీనులకువిందుకూర్చును
    మానవులకు దల్లి నుడి,యమంగళకరమౌ
    చానల కైనను పురుషుల
    కైనను పరభాష పైన యావయు హెచ్చన్

    రిప్లయితొలగించండి
  10. గానమునకు దగినది యై
    వీనులకు ను విందు గూర్చు ప్రీతి గ వెలుగున్
    జ్ఞానము పెంచదగి న యే
    మానవులకు దల్లి నుడి యమంగళ కరమౌ?

    రిప్లయితొలగించండి

  11. ఏనుగు గొంగ మొరుగునే?
    శ్వానము గర్జింపబోదు పణమున కిలలో
    బానిసలు పరానుకరణ
    మానవులకుఁ దల్లినుడి యమంగళకరమౌ.


    జానెడు పొట్టకోసమని సంద్రము దాటి పరాయి దేశమున్
    సూనుడు వాసముండి యట సొత్తును భూరిగ పొందగోరెడిన్
    హీనగుణాత్ములౌ జనులకింపది యాంగ్లమటంచు పల్కెడిన్
    మానవజాతి కంతటి కమంగళమూలము మాతృభాషయే.

    రిప్లయితొలగించండి
  12. గానము సేసి నిత్యమును గమ్మని
    మంజుల మాతృ భాషలో
    పానముసేసితల్లి చను బాలను
    రొమ్మున గ్రుద్దినట్లుగన్
    మానసమెట్టులొప్పెనరె! మందుడ
    యిట్లన ప్రేమవీడియున్
    మానవజాతికంతటి కమంళ
    మొక్కటి మాతృ భాషయే

    రిప్లయితొలగించండి
  13. ఉత్పలమాల
    వీనుల విందుగాను సుకవీశ్వరులెల్లరు చెప్పినారుగా
    తేనెలు జిల్కుకావ్యములు తేట తెనుంగున నౌర!కాదుగా
    *మానవ జాతికంతటికమంగళ
    మూలము;మాతృభాషయే *
    నూనము జ్ఞానవృద్ధికి వినూతన భావ సమృద్ధికింగనన్.

    రిప్లయితొలగించండి
  14. మానవజాతి కంతటి కమంగళమూలము మాతృభాషయే
    మానవ! యేమి నీకబురు మానవ జాతిక మంగ ళంబు నౌ
    వీనుల విందుగా వినుము బ్రీతిని బుష్టిని మాతృ భాష యే
    మానవ జాతికి చ్చునిఁక మంగళ మెప్పుఁడు చింతఁ జేయుమా

    రిప్లయితొలగించండి
  15. పూని చదవంగ మేలగు
    మానవులకుఁ దల్లినుడి, యమంగళకరమౌ
    దీనత కాదా? పరనుడి
    పై నానావిధ రభసలు, ప్రాజ్ఞత కరవై.


    రిప్లయితొలగించండి
  16. తేనెల గుల్యము కంటెన్
    మానసమలరించు గాన మాధురి కంటెన్
    కానగ భూతలమందున
    మానవులకుఁ దల్లినుడియ మంగళకరమౌ

    రిప్లయితొలగించండి
  17. కానగ నిలలో దైవము
    మానవులకు దల్లి; నుడి యమంగళకరమౌ
    హీనపు భావంబున దా
    దీనుల నవమాన పరచ దిట్టుల తోడన్

    పేనుచు ప్రేమబంధమును పెన్నిధియౌను మనంబు
    విప్పగన్
    మేనుకు గాయమైనయెడ మిక్కిలి భాధను దైవమాయనన్
    దాననుకూలమైనదయి ధన్యతనిచ్చును మాతృభాషయే
    మానవజాతి కంతటి కమంగళమూలము మాతృభాషయే?!

    రిప్లయితొలగించండి
  18. తేనియలూరు తియ్యనగు తేటపదంబుల పోహళింపుతో
    మానిత మాతృభాష పదమంజరి మంగళదాయకం బగున్
    పూనికతో పరాయి పదముల్గొనిసంకర మొంద జేయుచో
    మానవజాతి కంతటి కమంగళమూలము మాతృభాషయే

    రిప్లయితొలగించండి
  19. ఉ.

    వీనుల విందు సంస్కృతమె వేడుక తద్భవ భాషలయ్యెనే
    దానమనెన్ హఠంబయిన దారుణ మాంగ్లము భారతీయులన్
    గూనలు నేర్వ పాఠములు క్రొత్తగు బాసలలో సుబోధలై
    *“మానవజాతి కంతటి కమంగళమూలము మాతృభాషయే”*

    రిప్లయితొలగించండి
  20. మరొక పూరణ

    మానుగనన్యభాషలకు మాన్యత నిచ్చుచు దీటుగానునీ
    *“మానవజాతి కంతటి కమంగళమూలము మాతృభాషయే”*
    జ్ఞానమునందచేయదని జ్ఞానమదించుకలేనిమూఢులు
    న్నీనవపోకడల్మదిని నింపుకు సాగెడువారితీరిదే

    రిప్లయితొలగించండి
  21. వీనులకు విందగును నేఁ
    డీ నందనుఁడు పిలువంగ నీ యాంగ్లమునం
    దానక్కట యమ్మా యన
    మానవులకుఁ దల్లినుడి యమంగళకరమౌ


    మానవుఁ డుచ్చరించుఁ దొలి, మాత వచించిన మాట లింపుగా
    మానస మందు నిల్చు నవి మాయవు కాల మతిక్రమించినన్
    మౌనముతోఁ ద్యజింప వలె మాటల నివ్విధ మేరు వల్కినన్
    మానవ జాతి కంతటి కమంగళ మూలము మాతృభాషయే

    రిప్లయితొలగించండి
  22. Rectified poem

    (1)కం:తేనియ యందున ,రుచి గల
    పానకమున ,నమృతతుల్య పాయసమున నె
    ద్దానిన బోల్చిన ధరణిన్
    మానవులకు దల్లి నుడియ మంగళకరమౌ.

    రిప్లయితొలగించండి

  23. ఈ నవ మానవ జీవన
    యానంబున బహుళ భాష లమరగ ౙతగన్
    బ్రాణంబగు నిది యెట్టుల
    మానవులకు దల్లినుడి యమంగళకరమౌ?!

    రిప్లయితొలగించండి