4-11-2022 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యె”(లేదా...)“తిరిపెము నెత్తువాఁడు మన దేవుఁడుగా నెటులయ్యెఁ జిత్రమే”
తేటగీతిమనము సేసిన పాపాల గొనగ వచ్చిపుణ్యఫలముల మనకిచ్చు మూర్తియనగ,సర్వదేవతా రూపంపు సాయి గురుడుతిరిపె మెత్తెడివాఁడెట్లు? దేవుఁడయ్యె!చంపకమాలనిరతము బోధనల్ సలిపి నిర్మలచిత్తుడు సాయినాధుఁడే,వరముని భిక్షగా మనల పాపములందుచు పుణ్యమీయ యేమరచక కృష్ణ, రామ, శివ, మారుతి రూపునఁ గోరినట్లుగన్తిరిపెము నెత్తువాఁడు, మన దేవుఁడుగా నెటులయ్యెఁ జిత్రమే!
శ్రీ కృష్ణ రాయబారమునుద్దేశించి సుయోధనుడి పల్కులు:చెరిసగ రాజ్యభాగమని చెప్పక జెప్పునొకప్పుడంతలోమరియెక మారు బల్కు నిక మాకది జాలను నైదు పల్లెలేపరిమితి లేని గౌరవము బల్వురొసంగ సభాంతరాళమున్తిరిపెము నెత్తువాఁడు మన దేవుఁడుగా నెటులయ్యెఁ జిత్రమే.
తిరి పె మె త్తె డు వాడెట్లు దేవు డయ్యెయనుచుమూర్ఖుడు గళ మెత్తి యఱచు చుండపరి హ సింపగ రాదంచు పలికి రపుడువాని వారిo చి భక్తులు వంత తోడ
ఆటవెలదికపట వటువు శివుఁడు గౌరిని గాంచియు"భస్మధారి క్రూర ఫణిధరుండు గిత్త రౌతు *తిరిపెమెత్తెడు వాఁడెట్లుదేవుఁడయ్యె*నీకుఁదెలుపు"మనెను.
చంపకమాల తిరిపెము నెత్తువాఁడు మన దేవుఁడుగా నెటులయ్యెఁ,జిత్రమే!మరి వచియింతుగా, విషమమాంతము మ్రింగియు బ్రోచె లోకముల్వరుసగ ఢక్క నాదముల వర్ణములన్ సృజియించె నౌర!యంబరమున నుండి దూకు ఘన వాహిని గంగనుఁదాల్చె నౌదలన్.
తిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యె ననుట సరికాదు చింతించ యక్షరుండునాది దేవుఁడు,భిక్షువు నాతఁడార్య! భిక్షు ధర్మముఁ బాటించి తిరిపె మెత్తె
ఉరగా భరణుని దూరుచుహరిభక్తుడొకండు పలికె నవివేకముతో మరుభూమిన తిరుగాడెడుతిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యె.? గురువొక నాడు ఛాత్రునకు కూరిమి తోడను చెప్పె నిట్టులన్ హరకుడు పాపముల్ గొనుచు నక్షరమిచ్చెడు భర్గుడయ్యెనే తిరుపము నెత్తువాఁడు మన దేవుఁడుగా, నెటులయ్యెఁ జిత్రమే మెరకులు దొంగ సాములచు మిక్తిల గైరవమందుటన్నదే.
తిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యెననుచు నడుగుచుంటివి గద! యార్తి నొందువాని కొరకు కొంచెము సాయపడ దగుననియెల్ల వారినడుగ మరి యేమన దగు ?
మాయారూపి యైన మహేశ్వరుడు పార్వతితో:తరిమిడి బ్రోవరాడతఁడు దాపసు లెంతగ బ్రాకులాడినన్గరితవు జింకతాల్పరి నఖండముగా నెఱ నమ్మి తీవు, మత్కరమును బట్ట వీడనిఁక కామిని, యుగ్రుడు నస్థిమాలియైతిరిపెము నెత్తువాఁడు మన దేవుడుగా నెటులయ్యెఁ జిత్రమే!
హరుని వసనము మసనము నిరత మతడుగళము నందున నురగమ్ము గలిగి యుండుబూడిద నెపుడు మేనిపై పులుముకొనుచుతిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యె
తిరిపెము నెత్తువాఁడు మన దేవుఁడుగా నెటులయ్యెఁ జిత్రమే యరయుమ యాది దేవుఁడుగ నా యతి పుంగవు నెల్లవేళలన్ దురితము లన్నియుందొలగ దోహదఁ బర్చును గంటి చూపుతోఁ హరుఁడనుబేరుతోడనిల నందరిడెందము లుల్లసిల్లగన్
తిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యెననుచు జిజ్ఞాసతోప్రశ్న నడగవచ్చుశివపురాణము చదివిన జెప్పవచ్చుదేవదేవుని లీలలున్ దివ్య మహిమ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తిరుగుచు రుద్రభూమికడ దీరుగదాల్చుచు బూది మేనిపైకరియజినమ్ము వస్త్రముగ కాళము కంఠ విభూషణమ్ముగానిరతముదాల్చు నిర్ధనుఁడు నిత్యుడనంతుఁడు నిర్వికారుడౌతిరిపెము నెత్తువాఁడు మన దేవుఁడుగా నెటులయ్యెఁ జిత్రమే
తేటగీతికపట వటువు నపర్ణను గని వచించెబూది పూసుకొనెడి వాడు భూత గణములన్ని టిసఖుడు, ముక్కంటి లయమొనర్చితిరిపె మెత్తెడి వాడెట్లు దేవు డయ్యె.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
క్షీరసాగర మందున శ్రీజనించకంఠమందుదాచినశుభంకరుడు భవుని*“తిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యె”*ననుచు నజ్ఞుడై పల్కుట యగునె పాడి.మరొక పూరణకరివరదాదులున్వడిగకావుమటంచునువేడినంతనేగిరిసుతమోముగాంచుచునుకేలనుశూలముదాల్చసాగెనాసురవరులార్తిబాపగనుశూలియు గ్రోలెను నాడు చిత్తమున్తిరిపెమునెత్తువాడుమనదేవుడుగా !నెటులయ్యచిత్రమే
అడిగెడిది బిచ్చ కాదు మేలైన భక్తి గాని యిచ్చు నట్టిది కనకమ్ము కాదుదివ్య మహిమను వీక్షించి తెలిసి కొనుమ తిరిపె మెత్తెడి వాఁడెట్లు దేవుఁ డయ్యెహరి హర మాయ లేరికి సమంచిత రీతిని నర్థ మౌనులే కరి వర చర్మ మూనుటయుఁ గాటిని నిత్యము సంచరించుటల్ హరి మెడ నూఁగులాడుటయు నక్షిని వహ్ని సెలంగుటల్ గనం దిరిపెము నెత్తు వాఁడు మన దేవుఁడుగా నెటు లయ్యెఁ జిత్రమే
తేటగీతి
రిప్లయితొలగించండిమనము సేసిన పాపాల గొనగ వచ్చి
పుణ్యఫలముల మనకిచ్చు మూర్తియనగ,
సర్వదేవతా రూపంపు సాయి గురుడు
తిరిపె మెత్తెడివాఁడెట్లు? దేవుఁడయ్యె!
చంపకమాల
నిరతము బోధనల్ సలిపి నిర్మలచిత్తుడు సాయినాధుఁడే,
వరముని భిక్షగా మనల పాపములందుచు పుణ్యమీయ యే
మరచక కృష్ణ, రామ, శివ, మారుతి రూపునఁ గోరినట్లుగన్
తిరిపెము నెత్తువాఁడు, మన దేవుఁడుగా నెటులయ్యెఁ జిత్రమే!
శ్రీ కృష్ణ రాయబారమునుద్దేశించి సుయోధనుడి పల్కులు:
రిప్లయితొలగించండిచెరిసగ రాజ్యభాగమని చెప్పక జెప్పునొకప్పుడంతలో
మరియెక మారు బల్కు నిక మాకది జాలను నైదు పల్లెలే
పరిమితి లేని గౌరవము బల్వురొసంగ సభాంతరాళమున్
తిరిపెము నెత్తువాఁడు మన దేవుఁడుగా నెటులయ్యెఁ జిత్రమే.
తిరి పె మె త్తె డు వాడెట్లు దేవు డయ్యె
రిప్లయితొలగించండియనుచుమూర్ఖుడు గళ మెత్తి యఱచు చుండ
పరి హ సింపగ రాదంచు పలికి రపుడు
వాని వారిo చి భక్తులు వంత తోడ
ఆటవెలది
రిప్లయితొలగించండికపట వటువు శివుఁడు గౌరిని గాంచియు
"భస్మధారి క్రూర ఫణిధరుండు
గిత్త రౌతు *తిరిపెమెత్తెడు వాఁడెట్లు
దేవుఁడయ్యె*నీకుఁదెలుపు"మనెను.
చంపకమాల
తొలగించండితిరిపెము నెత్తువాఁడు మన దేవుఁడుగా నెటులయ్యెఁ,జిత్రమే!
మరి వచియింతుగా, విషమమాంతము మ్రింగియు బ్రోచె లోకముల్
వరుసగ ఢక్క నాదముల వర్ణములన్ సృజియించె నౌర!యం
బరమున నుండి దూకు ఘన వాహిని గంగనుఁదాల్చె నౌదలన్.
తిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యె
రిప్లయితొలగించండిననుట సరికాదు చింతించ యక్షరుండు
నాది దేవుఁడు,భిక్షువు నాతఁడార్య!
భిక్షు ధర్మముఁ బాటించి తిరిపె మెత్తె
రిప్లయితొలగించండిఉరగా భరణుని దూరుచు
హరిభక్తుడొకండు పలికె నవివేకముతో
మరుభూమిన తిరుగాడెడు
తిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యె.?
గురువొక నాడు ఛాత్రునకు కూరిమి తోడను చెప్పె నిట్టులన్
హరకుడు పాపముల్ గొనుచు నక్షరమిచ్చెడు భర్గుడయ్యెనే
తిరుపము నెత్తువాఁడు మన దేవుఁడుగా, నెటులయ్యెఁ జిత్రమే
మెరకులు దొంగ సాములచు మిక్తిల గైరవమందుటన్నదే.
తిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యె
రిప్లయితొలగించండిననుచు నడుగుచుంటివి గద!
యార్తి నొందు
వాని కొరకు కొంచెము సాయపడ
దగునని
యెల్ల వారినడుగ మరి యేమన దగు ?
మాయారూపి యైన మహేశ్వరుడు పార్వతితో:
రిప్లయితొలగించండితరిమిడి బ్రోవరాడతఁడు దాపసు లెంతగ బ్రాకులాడినన్
గరితవు జింకతాల్పరి నఖండముగా నెఱ నమ్మి తీవు, మ
త్కరమును బట్ట వీడనిఁక కామిని, యుగ్రుడు నస్థిమాలియై
తిరిపెము నెత్తువాఁడు మన దేవుడుగా నెటులయ్యెఁ జిత్రమే!
హరుని వసనము మసనము నిరత మతడు
రిప్లయితొలగించండిగళము నందున నురగమ్ము గలిగి యుండు
బూడిద నెపుడు మేనిపై పులుముకొనుచు
తిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యె
తిరిపెము నెత్తువాఁడు మన దేవుఁడుగా నెటులయ్యెఁ జిత్రమే
రిప్లయితొలగించండియరయుమ యాది దేవుఁడుగ నా యతి పుంగవు నెల్లవేళలన్
దురితము లన్నియుందొలగ దోహదఁ బర్చును గంటి చూపుతోఁ
హరుఁడనుబేరుతోడనిల నందరిడెందము లుల్లసిల్లగన్
తిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యె
రిప్లయితొలగించండిననుచు జిజ్ఞాసతోప్రశ్న నడగవచ్చు
శివపురాణము చదివిన జెప్పవచ్చు
దేవదేవుని లీలలున్ దివ్య మహిమ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితిరుగుచు రుద్రభూమికడ దీరుగదాల్చుచు బూది మేనిపై
రిప్లయితొలగించండికరియజినమ్ము వస్త్రముగ కాళము కంఠ విభూషణమ్ముగా
నిరతముదాల్చు నిర్ధనుఁడు నిత్యుడనంతుఁడు నిర్వికారుడౌ
తిరిపెము నెత్తువాఁడు మన దేవుఁడుగా నెటులయ్యెఁ జిత్రమే
తేటగీతి
రిప్లయితొలగించండికపట వటువు నపర్ణను గని వచించె
బూది పూసుకొనెడి వాడు భూత గణము
లన్ని టిసఖుడు, ముక్కంటి లయమొనర్చి
తిరిపె మెత్తెడి వాడెట్లు దేవు డయ్యె.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
క్షీరసాగర మందున శ్రీజనించ
రిప్లయితొలగించండికంఠమందుదాచినశుభంకరుడు భవుని
*“తిరిపె మెత్తెడివాఁడెట్లు దేవుఁడయ్యె”*
ననుచు నజ్ఞుడై పల్కుట యగునె పాడి.
మరొక పూరణ
కరివరదాదులున్వడిగకావుమటంచునువేడినంతనే
గిరిసుతమోముగాంచుచునుకేలనుశూలముదాల్చసాగెనా
సురవరులార్తిబాపగనుశూలియు గ్రోలెను నాడు చిత్తమున్
తిరిపెమునెత్తువాడుమనదేవుడుగా !నెటులయ్యచిత్రమే
అడిగెడిది బిచ్చ కాదు మేలైన భక్తి
రిప్లయితొలగించండిగాని యిచ్చు నట్టిది కనకమ్ము కాదు
దివ్య మహిమను వీక్షించి తెలిసి కొనుమ
తిరిపె మెత్తెడి వాఁడెట్లు దేవుఁ డయ్యె
హరి హర మాయ లేరికి సమంచిత రీతిని నర్థ మౌనులే
కరి వర చర్మ మూనుటయుఁ గాటిని నిత్యము సంచరించుటల్
హరి మెడ నూఁగులాడుటయు నక్షిని వహ్ని సెలంగుటల్ గనం
దిరిపెము నెత్తు వాఁడు మన దేవుఁడుగా నెటు లయ్యెఁ జిత్రమే