28, నవంబర్ 2022, సోమవారం

సమస్య - 4263

29-11-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గిరిజా కళ్యాణముఁ గని కేశవుఁ డేడ్చెన్”
(లేదా...)
“గిరిరాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా”

12 కామెంట్‌లు:

  1. కందము
    అరెరే!ప్రేమించెంగద
    గిరిజను కేశవుఁడు కాని గిరిధరు తోడన్
    జరుగగ వైభవముగ నా
    గిరిజా కల్యాణముఁగని కేశవుఁడేడ్చెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభము
      గిరిరాట్పుత్రిని సుందరాంగిఁగని లక్ష్మీనాథుఁడే నెమ్మదిన్
      వరియించన్ సరియే యనెన్ గిరిజ, తద్వాల్లభ్యమున్ మెచ్చకే
      వరునన్యుంగొని వచ్చి పెండ్లి,పితరుల్ బాగంచు జేయంగనే
      గిరిరాట్పుత్రి వివాహముంగనుచు లక్ష్మీనాథుఁడేడ్చెంగదా.

      తొలగించండి
  2. కందం
    వరశంకరుఁడూకొట్టగ
    సురులెల్లరు సంతసింప సోదరి మురిపె
    మ్మరయుచు సంతోషముతో
    గిరిజా కళ్యాణముఁ గని కేశవుఁ డేడ్చెన్

    మత్తేభవిక్రీడితము
    మరు సంకల్పము రూపు దాల్చి హరుడున్ మన్నించి గీర్వాణులన్
    వరుడై పంకజనేత్ర పార్వతిఁగొనన్ భాసిళ్లి వేంచేయఁగన్
    మురియన్ సోదరిమోమునన్ వెలయ సమ్మోదమ్ము సంతోషమై
    గిరిరాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా!

    రిప్లయితొలగించండి
  3. గిరిజను బెల్లాడదలచి
    మరులుగ కేశవుడు గోరె మమ కారము తోన్
    మరి యొకరి తోడ జరిగెడు
    గిరిజా కళ్యాణము గని కేశవు డే డ్చె న్

    రిప్లయితొలగించండి

  4. విరిబోణియె బ్రతిమాలగ
    నరిగె చలనచిత్రమకట, యదియే భువిలో
    తరుణుల కష్టము తెలిపెడి
    గిరిజా కళ్యాణము, గని కేశవు డేడ్చెన్.


    జరభుండౌ ఖలు తారకాసురునినిన్ సంహారమున్ జేసెడిన్
    హరసూనోద్భవ హేతువే యిదియటం చానందమున్ బొందెనా
    గిరిరాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ, డేడ్చెం గదా
    యరయన్ గూతురు నప్పగించుతరి విఖ్యాతుండెయౌ తండ్రియే.

    రిప్లయితొలగించండి
  5. సరసపు పాత్రల పెనకున
    విరచించిన చక్కనికథ విస్మయ రీతిన్
    తెరపై జూపిన చిత్రము
    గిరిజా కళ్యాణముఁ గని కేశవుఁ డేడ్చెన్

    రిప్లయితొలగించండి
  6. సురలందరు ముదమొందిరి
    గిరిజా కళ్యాణముఁ గని ; కేశవుఁ డేడ్చెన్,
    మురిపెముగ బెంచి , యిపుడా
    తరుణిని దిస్సమొలవాన్కి దయసే యంగన్

    రిప్లయితొలగించండి
  7. శరజుని సంభవమునకై
    గిరిరాట్పుత్రినిఁ గలిపిన గృత్సు నతనునిన్
    హరుడొనరించుటను దలఁచి
    గిరిజా కళ్యాణముఁ గని కేశవుఁ డేడ్చెన్

    రిప్లయితొలగించండి
  8. వరపుత్రుంగన తారకాసుర వధా వ్యాపారమున్సల్పగన్
    మరునిన్ మానసపుత్రు సాధనగనామంత్రించగా వేలుపుల్
    హరుడా మారుని బూది జేసెననితానత్యంతమౌ కల్కతో
    గిరిరాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా

    రిప్లయితొలగించండి
  9. హరునకు తగునే యా రీ
    తి రమణి కీయం బరీక్ష దేవేరిగఁ దా
    గిరి కన్యం గొన నంచును
    గిరిజా కళ్యాణముఁ గని కేశవుఁ డేడ్చెన్

    హరునిన్ భర్తగఁ గోరుచుం దపము నత్యంతార్తి సైరించి దు
    ర్భర విక్షోభము లెల్లఁ జేసి శివునిన్ ఫాలాక్షు మెప్పింపఁగాఁ
    దరుణీరత్నపు బాధలం దలఁచి స్వాంతం బందు శీతాద్రినిన్
    గిరి రాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా

    రిప్లయితొలగించండి
  10. సుర లర్థించిరి పెండిలాడ శివునిన్ శోభాంగిహైమావతిన్
    విరితోపుల్ నెగిడించె కాముడు మనోభిందత్సుమాస్త్రమ్ములన్
    దురభేద్యమ్మగు తన్మనమ్ము విరిగెన్,
    తోషమ్ము నుద్వేలమై
    గిరిరాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా!

    రిప్లయితొలగించండి

  11. మరొక పూరణ

    వరుడాశంకరుడంచుగౌరికినిమాబాధల్ తొలంగున్వడిన్
    మురిపెమ్మూనుచుసంతసించిరిగదాముక్కోటిదేవుళ్ళటన్
    "గిరిరాట్పుత్రి వివాహముం గనుచు, లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా”
    సిరియున్ వీడిగ నొంటిగాడగుచు తాచేరెన్గదా కానలన్

    రిప్లయితొలగించండి