20, నవంబర్ 2022, ఆదివారం

సమస్య - 4255

21-11-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దౌష్ట్యమే ధర్మపథము విధాతృ విధము”
(లేదా...)
“దౌష్ట్యమె ధర్మమార్గము విధాతృ వినోదము విష్ణుమాయయౌ”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)

15 కామెంట్‌లు:

  1. తేటగీతి
    జయ విజయులు హరి వరాన శాపముడుగ
    మూడుజన్మల వైరులై ముక్తిగనెడు
    విధిని పాటించు కథనాన వెన్నుని యెడ
    దౌష్ట్యమే ధర్మపథము విధాతృ విధము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      దౌష్ట్యమటంచు మౌనులట దారుణరీతిగ శాపమీయ వై
      శిష్యమునెంచి సేవకుల శీఘ్ర విముక్తికి మూడుజన్మలౌ
      త్కృష్ట్యమటంచు వైరులుగఁ దేలుమనంగ నజుండు వారికిన్
      దౌష్ట్యమె ధర్మమార్గము విధాతృ వినోదము విష్ణుమాయయౌ

      తొలగించండి
  2. తేటగీతి
    ముల్లుతో తీయవలె గాదెముల్లు నెపుడు
    కోరినటువంటి వరములు కూర్మినొసఁగి
    దుష్ట శక్తులఁదునుమాడ తుట్ట తుదకు
    దౌష్ట్యమే ధర్మపథము విధాతృ విధము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఉత్పలమాల
      దౌష్ట్యము మేలుగాదు గద దాంతిని శాంతిని గోరు వారిపై
      దౌష్ట్యముఁజేయ దౌష్ట్యమిఁక తప్పదు ముల్లును దీయ ముల్లనన్
      దౌష్ట్యము ధర్మమార్గము విధాతృ వినోదము విష్ణుమాయయౌ
      నైష్ఠ్యమిదే కదా! పరమ నైచ్యము నెవ్వరు మెచ్చరెచ్చటన్.

      తొలగించండి
  3. ఏతరి చెలరేగగ వాని నెదిరి నిలువ
    దౌష్ట్యమే ధర్మపథము ;విధాతృ విధము
    మంచి చెడుల రెండింటిని మనుజ గుణము
    నందు జొనుప, వాటిని వాడ నగుననువుగ

    రిప్లయితొలగించండి
  4. పొంద శాప విమోచనమునకనువగు
    దురిత కృత్యము లొ నరింప దుష్టు లౌచు
    దౌ ష్ట్యమె ధర్మ పథము వి ధాతృ విధము
    లగుచు జయ విజయు లు దా మమలు జేసె

    రిప్లయితొలగించండి

  5. ధర్మ రక్షణ దీక్షగా ధరణియందు
    నవత రించిన శ్రీహర నడవికంప
    నీర్ష్యజెందిన కపటి యా యింతి కైక
    దౌష్ట్యమే ధర్మపథము విధాతృ విధము.


    దౌష్ట్యము సంహరింపగను ధారుణిఁ దా నవతారమెత్తె వై
    శిష్ట్యత గల్గినట్టి హరి శ్రీరఘు రాముని కానకంపుచున్
    ధిష్ట్యము మార్చకైక తరతీపును తెల్పుచు కిన్కబూను స్త్రీ
    దౌష్ట్యమె ధర్మమార్గము విధాతృ వినోదము విష్ణుమాయయౌ.

    రిప్లయితొలగించండి
  6. పరులపీడించి హింసలపాలుసేయు
    దుష్టజనులను శిక్షింప తోడువచ్చు
    దౌష్ట్యమే, ధర్మపథము విధాతృ విధము
    దాని రక్షణకై యవతారమెత్తు

    రిప్లయితొలగించండి
  7. నిత్య మానవ సేవయే నెగడు మాధ
    వున కొసంగు పరమ సేవ యనఁగ ధాత్రి
    నాశ్రిత దయాగుణమ్ము నిజాత్మ విగత
    దౌష్ట్యమే ధర్మపథము విధాతృ విధము

    మౌష్ట్య మసాధు వర్తనము మానఁగ నొప్పును సంతతమ్ము నౌ
    త్కృష్ట్యము సుమ్ము భూత దయ దీన జనావన మెంచి చూడ వై
    శిష్ట్యము మానవావలికి శ్రీహరి మెప్పు వహింపఁ గూడ దీ
    దౌష్ట్యమె ధర్మమార్గము విధాతృ వినోదము విష్ణు మాయయౌ

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    మునుల శాప వాక్కుల మూలమున జనించె
    వైరులుగ హరిద్వేషులై, పోరు జేసె
    విష్ణు దౌవారికులు హత విధిని దల్చి
    దౌష్ట్యమే ధర్మ పథము విధాతృవిధము.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  9. సృష్ట్యభిమానమున్ విడచి ,శ్రేష్ఠము నీ మతమే యటంచు,వై
    శిష్ట్యము విష్ణుభక్తి యని చెప్పుచు నన్యమతాల దూరి త్వ
    ద్దృష్ట్యనుసారులై ప్రజలు దేవుని నమ్మగ గోరు నట్టి యీ
    దౌష్ట్యమె ధర్మమార్గము,విధాతృవినోదము,విష్ణుమాయ యౌ ?

    రిప్లయితొలగించండి
  10. ఉ.

    ధిష్ట్యము రాక్షసాకృతిని త్రిమ్మరె ధర్మము నాల్గుపాదముల్
    నిష్ట్యుడు గాని రావణుడు నేతగ సత్యయుగంబునందు, వై
    శిష్ట్య వరాల నొంద, సుర శిష్టులు నచ్చర మానభంగముల్
    *"దౌష్ట్యమె ధర్మమార్గము విధాతృ వినోదము విష్ణుమాయయౌ”*.

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:పాము కప్పల జంపక బతుకు లేదు
    పులికి గోవుల జంపక భుక్తి లేదు
    సృష్టి ధర్మ మ్మిదే యని చెప్పె దీవు
    దౌష్ట్యమే ధర్మపథము విధాత్రు విధము ?

    రిప్లయితొలగించండి