27-11-2022 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో”(లేదా...)“వస్త్రమ్ముల్ విడనాడు వానిఁ గనుచున్ భామామణుల్ మ్రొక్కరే”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)
కందంనిస్త్రాణమ్మై మది కుసుమాస్త్రుని పాలఁ బడియు, రణమందు విజయమైవస్త్రయుతుఁడౌ మగని ధన్వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో!శార్దూలవిక్రీడితమునిస్త్రాణమ్ముగ నుండుమానసమునన్ నిర్నిద్రలన్ వేచి సూనాస్త్రుండక్కట ముచ్చటల్ గొలుప, కయ్యంబందునన్ గెల్చియున్వస్త్రాధిక్యత నుల్లసిల్లు మగడే వాల్చూపులన్ నిండ ధన్వస్త్రమ్ముల్ విడనాడు వానిఁ గనుచున్ భామామణుల్ మ్రొక్కరే!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
నిస్త్రాణము జెందక శస్త్రాస్త్రమ్ముల వేయువాడు శాంతనవుండే యా స్త్రీ తుల్యుని గని ధ న్వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో. శాస్త్రజ్ఞాన దురంధరుండతనికిన్ సాటెవ్వడీ ధాత్రిలో నస్త్రమ్మున్ ధరియించు భీష్ముననిలో నాకట్టగా నెంచుచున్ నస్త్రింశమ్మును వీడి పేడినొకనిన్ నిల్పంగ నే గాంచి ధ న్వస్త్రమ్ముల్ విడనాడు వానిఁ గనుచున్ భామామణుల్ మ్రొక్కరే.
అస్త్రము తో రణ మందుననిస్ట్రా ణ ము జేయ రిపులు నీల్గ విజయు డైశ స్త్ర ము తో మరలియు ధన్వ స్త్ర చ్యుతు గాంచి సతులు ప్రణ మిల్లి రొకో
ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
కందముశాస్త్రీ!గౌరీశుని, దివ్యాస్త్రంబులు గల్గినట్టి హరుని,ఘన తపోనిస్త్రింశయుతున్,సుమధ న్వస్త్రచ్యుతుఁగాంచి సతులు ప్రణమిల్లరొకో!
అద్భుతమైన పూరణ. అభినందనలు.
శాస్త్రాలన్ని యెరింగి యంశకులె యక్షద్యూతమాడించుచున్నిస్త్రాణమ్ముగ మారఁ బాండవులు, దుర్నీతిన్ ప్రదర్శించి వంశస్త్రీ మానము భంగపర్చదలపన్, కంసారి దండింపగావస్త్రమ్ముల్ విడనాడు వానిఁ; గనుచున్ భామామణుల్ మ్రొక్కరే.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వస్త్రము గప్పిరి ప్రతిమకుశాస్త్రి తెలిపినటుల గ్రహణ సమయము నందున్,శాస్త్రముగ గ్రహణము విడగవస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో
వస్త్రాలనుదోచెను గోపస్త్రీలుజలకములాడ పరమాత్ముండే!ఆ స్త్రీలొనర్చు వినతులవస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిస్త్రింశమ్మునఁ దత్కుసుమాస్త్రుం గాల్చిన హరుని మహాదేవుని హర్యస్త్రు శివు నంబరాంబరు వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకోసస్త్రీబాల సజీన పూరుషులు నిశ్శంకన్ ఝషాంకాస్త్ర సద్యస్త్రస్తాత్మలు గోపికా మణులు మిథ్యా బాలు శ్రీకృష్ణునిన్ శాస్త్రామ్నాయవిశారదల్ ముని సతుల్ సక్కంగ సద్భక్తినిన్ వస్త్రమ్ముల్ విడ నాడువానిఁ గనుచున్ భామామణుల్ మ్రొక్కరే
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
కం:శాస్త్రానుసారులౌచు వివస్త్రు లగుట జైన ఋషుల పద్ధతి, కనగానే స్త్రీయు కోపగించదువస్త్రచ్యుతు గాంచి సతులు ప్రణ మిల్ల రొకో!
శా:అస్త్రమ్మయ్యె విదేశ వస్త్ర దహన మ్మా యజ్ఞమున్ దేశభక్తస్త్రీలున్ కడు దీక్ష జాతికి విముక్తత్వ మ్మొసంగన్ భళానిస్త్రాణన్ త్యజియించి రట్టి తరిలో నిశ్శంక నింగ్లాండు వౌవస్త్రమ్ముల్ విడనాడు వాని గనుచున్ భామామణుల్ మ్రొక్కరే
Second poem with slight modification శా:అస్త్రమ్మయ్యె విదేశ వస్త్ర దహన మ్మా యాజి లో దేశభక్తస్త్రీలున్ కడు దీక్ష జాతికి విముక్తత్వ మ్మొసంగన్ భళా !నిస్త్రాణన్ త్యజియించి రట్టి తరిలో నిశ్శంక నింగ్లాండు వౌవస్త్రమ్ముల్ విడనాడు వాని గనుచున్ భామామణుల్ మ్రొక్కరే
నిస్త్రాణంబుగ నుండిరి వస్త్రచ్యుతుఁ గాంచి సతులు, ప్రణమిల్లరొకో వస్త్రముఁ దొడగని జైనుని శాస్త్రముఁ బాటించె ననుచు సవినయ మొప్పన్
డా. బల్లూరి ఉమాదేవి శాస్త్రములన్నియు చదివిన నస్త్రీ సంపర్కుడైన నాశుక యోగిన్నస్త్రంబులు పట్టని యా*“వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో
వస్త్ర చ్యుతుఁడు సమాసము జాఱిన వస్త్రము కల వాఁ డను భావమునఁ జింత్య మని నా యభిప్రాయము. వస్త్ర చ్యుతము: విశేషణోత్తర పద కర్మధారయ సమాస మగును గాని బహువ్రీహి సమాసము కా నేర దని. చ్యుతము = స్రస్తము లేక జారినది. చ్యుతవస్త్రుఁడు అనవలెనేమో యని నా సందేహము. జాఱిన వస్త్రము కలవాఁడు. విగ్రహ వాక్యము. విగత వస్త్రుఁడు, వస్త్ర హీనుఁడు (వస్త్రము లేని వాఁడు)
కందం
రిప్లయితొలగించండినిస్త్రాణమ్మై మది కుసు
మాస్త్రుని పాలఁ బడియు, రణమందు విజయమై
వస్త్రయుతుఁడౌ మగని ధ
న్వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో!
శార్దూలవిక్రీడితము
నిస్త్రాణమ్ముగ నుండుమానసమునన్ నిర్నిద్రలన్ వేచి సూ
నాస్త్రుండక్కట ముచ్చటల్ గొలుప, కయ్యంబందునన్ గెల్చియున్
వస్త్రాధిక్యత నుల్లసిల్లు మగడే వాల్చూపులన్ నిండ ధ
న్వస్త్రమ్ముల్ విడనాడు వానిఁ గనుచున్ భామామణుల్ మ్రొక్కరే!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండి
రిప్లయితొలగించండినిస్త్రాణము జెందక శ
స్త్రాస్త్రమ్ముల వేయువాడు శాంతనవుండే
యా స్త్రీ తుల్యుని గని ధ
న్వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో.
శాస్త్రజ్ఞాన దురంధరుండతనికిన్ సాటెవ్వడీ ధాత్రిలో
నస్త్రమ్మున్ ధరియించు భీష్ముననిలో నాకట్టగా నెంచుచున్
నస్త్రింశమ్మును వీడి పేడినొకనిన్ నిల్పంగ నే గాంచి ధ
న్వస్త్రమ్ముల్ విడనాడు వానిఁ గనుచున్ భామామణుల్ మ్రొక్కరే.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅస్త్రము తో రణ మందున
రిప్లయితొలగించండినిస్ట్రా ణ ము జేయ రిపులు నీల్గ విజయు డై
శ స్త్ర ము తో మరలియు ధ
న్వ స్త్ర చ్యుతు గాంచి సతులు ప్రణ మిల్లి రొకో
ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
తొలగించండికందము
రిప్లయితొలగించండిశాస్త్రీ!గౌరీశుని, ది
వ్యాస్త్రంబులు గల్గినట్టి హరుని,ఘన తపో
నిస్త్రింశయుతున్,సుమధ
న్వస్త్రచ్యుతుఁగాంచి సతులు ప్రణమిల్లరొకో!
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిశాస్త్రాలన్ని యెరింగి యంశకులె యక్షద్యూతమాడించుచున్
రిప్లయితొలగించండినిస్త్రాణమ్ముగ మారఁ బాండవులు, దుర్నీతిన్ ప్రదర్శించి వం
శస్త్రీ మానము భంగపర్చదలపన్, కంసారి దండింపగా
వస్త్రమ్ముల్ విడనాడు వానిఁ; గనుచున్ భామామణుల్ మ్రొక్కరే.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివస్త్రము గప్పిరి ప్రతిమకు
రిప్లయితొలగించండిశాస్త్రి తెలిపినటుల గ్రహణ సమయము నందున్,
శాస్త్రముగ గ్రహణము విడగ
వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివస్త్రాలనుదోచెను గో
రిప్లయితొలగించండిపస్త్రీలుజలకములాడ పరమాత్ముండే!
ఆ స్త్రీలొనర్చు వినతుల
వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిస్త్రింశమ్మునఁ దత్కుసు
రిప్లయితొలగించండిమాస్త్రుం గాల్చిన హరుని మహాదేవుని హ
ర్యస్త్రు శివు నంబరాంబరు
వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో
సస్త్రీబాల సజీన పూరుషులు నిశ్శంకన్ ఝషాంకాస్త్ర స
ద్యస్త్రస్తాత్మలు గోపికా మణులు మిథ్యా బాలు శ్రీకృష్ణునిన్
శాస్త్రామ్నాయవిశారదల్ ముని సతుల్ సక్కంగ సద్భక్తినిన్
వస్త్రమ్ముల్ విడ నాడువానిఁ గనుచున్ భామామణుల్ మ్రొక్కరే
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండికం:శాస్త్రానుసారులౌచు వి
రిప్లయితొలగించండివస్త్రు లగుట జైన ఋషుల పద్ధతి, కనగా
నే స్త్రీయు కోపగించదు
వస్త్రచ్యుతు గాంచి సతులు ప్రణ మిల్ల రొకో!
శా:అస్త్రమ్మయ్యె విదేశ వస్త్ర దహన మ్మా యజ్ఞమున్ దేశభ
రిప్లయితొలగించండిక్తస్త్రీలున్ కడు దీక్ష జాతికి విముక్తత్వ మ్మొసంగన్ భళా
నిస్త్రాణన్ త్యజియించి రట్టి తరిలో నిశ్శంక నింగ్లాండు వౌ
వస్త్రమ్ముల్ విడనాడు వాని గనుచున్ భామామణుల్ మ్రొక్కరే
Second poem with slight modification
రిప్లయితొలగించండిశా:అస్త్రమ్మయ్యె విదేశ వస్త్ర దహన మ్మా యాజి లో దేశభ
క్తస్త్రీలున్ కడు దీక్ష జాతికి విముక్తత్వ మ్మొసంగన్ భళా !
నిస్త్రాణన్ త్యజియించి రట్టి తరిలో నిశ్శంక నింగ్లాండు వౌ
వస్త్రమ్ముల్ విడనాడు వాని గనుచున్ భామామణుల్ మ్రొక్కరే
నిస్త్రాణంబుగ నుండిరి
రిప్లయితొలగించండివస్త్రచ్యుతుఁ గాంచి సతులు, ప్రణమిల్లరొకో
వస్త్రముఁ దొడగని జైనుని
శాస్త్రముఁ బాటించె ననుచు సవినయ మొప్పన్
డా. బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిశాస్త్రములన్నియు చదివిన
నస్త్రీ సంపర్కుడైన నాశుక యోగిన్
నస్త్రంబులు పట్టని యా
*“వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో
వస్త్ర చ్యుతుఁడు సమాసము జాఱిన వస్త్రము కల వాఁ డను భావమునఁ జింత్య మని నా యభిప్రాయము.
రిప్లయితొలగించండివస్త్ర చ్యుతము: విశేషణోత్తర పద కర్మధారయ సమాస మగును గాని బహువ్రీహి సమాసము కా నేర దని.
చ్యుతము = స్రస్తము లేక జారినది.
చ్యుతవస్త్రుఁడు అనవలెనేమో యని నా సందేహము. జాఱిన వస్త్రము కలవాఁడు. విగ్రహ వాక్యము.
విగత వస్త్రుఁడు, వస్త్ర హీనుఁడు (వస్త్రము లేని వాఁడు)