4, నవంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4240

5-11-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దాన మిడకుండుటే మేటి ధర్మమగును”
(లేదా...)
“దానము సేయకుండుటయె ధర్మము శర్మముఁ బుణ్యకర్మమౌ”

31 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వరమునిడెనను శివునకె శిరము పైన
    బూదిపొలదిండి కరముంచపూనుకొనగ
    హరియె కాచె, ననర్హునకటులన వర
    దాన మిడకుండుటే మేటి ధర్మమగును

    ఉత్పలమాల
    ఏని శిరమ్మునన్ గరమునేనిడి నంతనె వాడు భస్మమౌ
    పూనికఁ గోరియున్ వరము పొందియు నా హరు శీర్షమే గనన్
    హీనుని గూల్చె మోహినియె, నెంచఁగ పాత్రత లేనివానికిన్
    దానము సేయకుండుటయె ధర్మము శర్మముఁ బుణ్యకర్మమౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవుల సూచిత సవరణతో ..

      తేటగీతి
      వరము గోరు నిడినట్టి భర్గు శిరము
      పైన పొలదిండి కరముంచఁ బూనుకొనఁగ
      హరియె కాచె, ననర్హునకటులన వర
      దాన మిడకుండుటే మేటి ధర్మమగును

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. తేటగీతి
    భూతలంబందునన్ మహాదాతలుగను
    కర్ణ,శిబి,దధీచులు మును ఖ్యాతిఁగనిరి
    పాత్రునకునిడ బుణ్యంబపాత్రునకును
    దానమిడకుండుటే మేటి ధర్మమగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      దానము సేయువారలకుఁదద్దయు కీర్తి లభించుఁబుణ్యమున్
      దానము సేయగా వలయు దాతయుఁబాత్రతెఱింగి యప్పుడా
      దానము సార్థకంబగుగదా మరి,పాత్రత లేని వారికిన్
      దానము సేయకుండుటయె,శర్మము ధర్మముఁబుణ్యకర్మమౌ.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. డా బల్లూరి ఉమాదేవి

    తగిన వారి కొసంగిన దాన మెపుడు
    పుణ్యమునుకూర్చునందురుబుధులుసతము
    సద్గుణమ్ములులేనట్టిజనములకిల
    *“దాన మిడకుండుటే మేటి ధర్మమగును”*

    రిప్లయితొలగించండి
  4. మోస మొన రించు వారలై భువిని దాము
    దేహి యనుచునర్థింప గ దెలిసి కొనుచు
    దాన మిడ కుండు టే మేటి ధర్మ మగును
    పెద్ద వారల బోధల విను ట యగును

    రిప్లయితొలగించండి
  5. తానె బలియయ్యె గద 'బలి' దానమొసగి
    దానమిడిహరిశ్చంద్రుడు దారుణముగ
    బాధలననుభవించె నిర్భాగ్యుడయ్యె
    దాన మిడకుండుటే మేటి ధర్మమగును

    రిప్లయితొలగించండి

  6. అక్షతత్వము కొరకంచు నాస్తులమ్మి
    పానమున్ గ్రోలగా లేదు పైక మనుచు
    దీనుడై యడిగిననేమి దేబె కిలను
    దాన మిడకుండుటే మేటి ధర్మమగును.


    నేననుకుంటి నీ యెదుట నిల్చిన విప్రుడు మాయదారియౌ
    దానవ వైరి కేశవుడు దానము గోరుచు వచ్చెనిప్పుడున్
    నానుడులాలకింపుమదె న్యాయమటంచు పల్కుచుంటినీ
    దానము సేయకుండుటయె ధర్మము శర్మముఁ బుణ్యకర్మమౌ

    రిప్లయితొలగించండి
  7. దుర్విధులకు నగదునిడి తోడ్ప డుటయె
    ధర్మమని సేకరించిన ధనము తోడ
    వృద్ధినొందు వాడడుగగ వెంబడిపబడి
    దాన మిడకుండుటే మేటి ధర్మమగును

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి:
    వ్యసనములఁజిక్కి వాటికి బానిసగుచు
    తాత తండ్రుల యార్జనఁ దగులబెట్టి
    దేహియని వచ్చి నిలచిన దేబె కెపుఁడు
    దాన మిడకుండుటే మేటి ధర్మమగును

    రిప్లయితొలగించండి
  9. అక్షయంబగునార్జననధికశ్రమన
    దానమిచ్చినఁజాలునుధర్మమగును,
    అన్యమార్గపుసంపదనల్లుకొనగ
    దాన మిడకుండుటే మేటి ధర్మమగును
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  10. దానగుణంబుతో నొరుల దైన్యము బాప దయా ప్రపూర్ణులై
    దీన జనావనంబునొక దీక్షగ బూనుట నెమ్మియౌను నా
    దానమపాత్రమైన యెడ తద్దయు నిష్పలమౌను నట్టిదౌ
    దానము సేయకుండుటయె ధర్మము శర్మముఁ బుణ్యకర్మమౌ

    రిప్లయితొలగించండి
  11. స్నానము చేసి వాహిని దినాగమమందున చిత్తశుద్ధితో
    ధ్యానముతోడ కార్తికమునందు స్తుతించి మురారి, బక్కకున్
    కానుకలియ్య మేలగును, కావరులై చరియించు వారికిన్
    దానము సేయకుండుటయె ధర్మము శర్మముఁ బుణ్యకర్మమౌ

    రిప్లయితొలగించండి
  12. మేను లున్నఁ జేయఁగ వచ్చు దానములను
    మేను నశియింప శక్యమే దాన మీయ
    మానవునకు ధరఁ దనకు మాలి నట్టి
    దాన మిడకుండుటే మేటి ధర్మమగును

    కానఁగ ధర్మ సూక్ష్మములు కంజున కైనను నేర శక్యమే
    మేనునఁ గోసి యిచ్చె శిబి మేటి కపోతము నీక డేగకున్
    మానవు లీయ దాన మిల మాన్యమ యైనను బ్రాణ హానియౌ
    దానము సేయ కుండుటయె ధర్మము శర్మముఁ బుణ్య కర్మమౌ

    రిప్లయితొలగించండి

  13. పాత్రులకొసగ తద్దాన ఫలముహెచ్చు
    తానుయశమునుపొందగ దానమిడుట
    యొప్పుకాదటంచునెరిగి యుల్లమందు
    దానమిడకుండుటేనేటి ధర్మమగును


    మానినినింటతిట్టుచును మత్తుపదార్థముగొంచు మత్తుతో
    దీనుడనంచుపల్కుచునుదేహియటంచునువేడుచెప్పుడున్
    మానమువీడిమార్గమున మందును త్రాగుచు నేగువానికిన్
    దానము చేయకుండుటయె ధర్మము శర్మము పుణ్యకర్మయౌ

    రిప్లయితొలగించండి
  14. దానము సేయగా వలయు ధర్మపు కార్యము
    చేయువారికిన్
    దానము సేయగా వలయు ధాత్రిని దీన
    యభాగ్య జీవికిన్
    దానవ వృత్తితో బ్రజల దందడి సేసెడు
    మాయగాల్లకున్
    దానము చేయకుండుటయె ధర్మము శర్మము
    పుణ్య కార్యమౌ

    రిప్లయితొలగించండి