Revised poem శా:ఏమా కాలపు దేశభక్తి ? మది లో నే శంకయున్ లేక యున్ బ్రేమన్ దమ్ముని,నన్ను వీడి భరతోర్వీస్వేచ్ఛయే కాంక్ష యై మామా యిద్దరు భార్య లుండిరి మహాత్మా గాంధికిన్ జిత్రమే సేమమ్ముల్ కనుగొంచు మా గృహములన్ జీవింప మే మొంటిగన్ (ఆనాటి దేశభక్తి గూర్చి ఏమి చెప్పేది మామా!నా యొక్క,నా తమ్ముని యొక్క భార్య ఇద్దరూ ఇంటిని మాకు వదిలేసి గాంధీ గారి క్షేమం చూస్తూ ఏదో ఒక సాయం చేస్తూ ఉండే వారు.)
అల్లుడు పరదేశస్తుడగు మామతో...
రిప్లయితొలగించండితేటగీతి
దేశ స్వాతంత్య్రమొక్కటె ధ్యేయమైన
సతిగ వెన్నంటు గస్తూరి సవతులనఁగ
వేడ్క సత్యమహింసలు ప్రేమఁగనెడు
జాయ లిద్దరు గాంధికి జాతిపితకు
శార్దూలవిక్రీడితము
సామాన్యుండన రామభక్తిపరుఁడై సారించి యాంగ్లేయులన్
నీమంబుల్ విడకుండ పంపుకతనన్ నిర్నిద్ర స్వాతంత్య్ర స
త్కామున్ సత్యమహింస ప్రేమఁగన నా గస్తూరియే గాక సూ!
మామా! యిద్దరు భార్యలుండిరి మహాత్మాగాంధికిన్ జిత్రమే!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదేశ మాతకు స్వాతంత్ర్య దీప్తి కొరకు
తొలగించండిజాతిని నడిపించిన మహా నేత గాంధి
సత్యము నహింస యనునవి సతులుకాగ
జాయ లిద్దరు గాంధికి జాతిపితకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసత్యమునతడు ప్రేమించి సమరమందు
రక్తపాతము వలదంచు శక్తిశాలి
సుగణ ధనునకహింస కస్తూరి బాయి
జాయ లిద్దరు గాంధికి జాతిపితకు.
సామాన్యుండతడంచు నెంచకుమిలన్ కస్తూరిబాయొక్కతిన్
కామక్రోదములన్ జయించి నొక సత్కార్యమ్ము నే సాధింప న
భ్యామర్థమ్మును సేసె సత్యమునె తానర్ధాంగిగా మేల్పడన్
మామా యిద్దరు భార్యలుండిరి మహాత్మాగాంధికిన్ జిత్రమే.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివృత్తంలో సవరణలకు వాట్సప్ సమూహం చూడండి.
తేటగీతి
రిప్లయితొలగించండిదేశ స్వాతంత్య్రమునకునై దీక్షఁబూని
పోరు సల్పియు గెలిచిన వీరుఁడతడు
ఔర!స్వాతంత్య్రలక్ష్మి ,కస్తూరి బాయి
జాయలిద్దఱు గాంధికి జాతిపితకు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దేశ స్వాతంత్ర్య' మన్నపుడు 'శ' గురువై గణభంగం. "దేశమునకు స్వేచ్ఛను గోరి దీక్ష బూని" అనండి.
శ్రీని వాసుకు నెంచగ చిత్రముగను
రిప్లయితొలగించండిజాయ లిద్దరు : గాంధికి జాతి పిత కు
దేశ దేశాలలో గొప్ప దివ్యు డనుచు
పేరు ప్రఖ్యా తి కీర్తులు విస్తరి ల్లె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజననియగును నాడిక తనజాతికి గద
రిప్లయితొలగించండిజాతిపితయన దేశమె సతియనదగు
భరతదేశము , కస్తూరిబాయి కలసి
జాయ లిద్దరు గాంధికి జాతిపితకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశార్దూలము
రిప్లయితొలగించండిశ్రీమంతంబగు ధైర్యలక్ష్మి తనకుంజేఁదోడు వాఁదోడవన్
బ్రేమందోడుగ నిల్వ కస్తురియు ప్రేరేపించగా శాత్రవుల్
ధీమాగా నెదిరించి గెల్చె బళిరా!ధీరుండు వీరుండునై
మామా!యిద్దఱు భార్యలుండిరి మహాత్మా గాంధికిన్ జిత్రమే!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'అవన్' అన్న రూపం సాధువు కాదు. అక్కడ "వాదోడుగా" అన్నా అన్వయం కుదురుతుంది.
ధన్యవాదములు,నమస్సులు
తొలగించండిడా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండితిరుమలేశునకు కలరు తీరు గాను
జాయ లిద్దరు,గాంధికి జాతిపితకు
కలవసంఖ్యాక సద్గుణ గణము లరసి
నెంచ శక్యమౌనె భువిని నేరికైన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసత్యమునహింసవీడక సతతమతడు
రిప్లయితొలగించండిభరతమాతదాశ్యముబాపె బాపు నాడు
భార్యకస్తూరిబాయి సపత్ను లట్లు
జాయ లిద్దరు గాంధికి జాతిపితకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దాస్యము' టైపాటు.
ఇంపొసంగు సేవా భావ మెంచి సతము
రిప్లయితొలగించండితాత నడిపింపఁ జక్కఁగఁ దలఁచి యెదలఁ
దోయజాక్షు లుందు రెలమిఁ దోడు గాను
జాయ లిద్దరు గాంధికి జాతి పితకు
[తోడుగాను + చాయ లిద్దరు = తోడుగాను జాయ లిద్దరు; చాయ = నీడ]
కా మాటోపములేదు సుంతయును నిక్కంబెంచ సత్యార్థియౌ
ధీమంతుండు మహాత్ముఁడే వలదు సందేహమ్ము కస్తూరి నా
సామాన్యాంగనయున్ ద్వితీయ సతిగా సత్యాగ్రహం బుండఁగా
మామా! యిద్దరు భార్య లుండిరి మహాత్మా! గాంధికిం జిత్రమే
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిబానిసత్వము బాపంగ పాటుపడుచు
రిప్లయితొలగించండిదేశ ప్రజల కెల్ల రికిని దిశను చూపి
సాగు మహనీయున కహింస సత్యములను
జాయ లిద్దరు గాంధీకి జాతిపితకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
ఒక్క రక్తపు బొట్టైన నొలకకుండ
దేశమునకు స్వాతంత్ర్యమున్ దెచ్చి పెట్టె
నిందు తోడ్పడె సత్యమహింస లనెడు
జాయలిద్దరు గాంధికి జాతిపితకు.
ధీమాచూపెనహింస సత్య వ్రతముల్ దీటైన యస్త్రంబులై
రిప్లయితొలగించండినీమంబుంగొని భారతావనికి వన్నెంగూర్చు స్వాతంత్ర్య సం
గ్రామంబందున గెల్వగాఁనరులపై గానంగనీ రీతిగన్
మామా యిద్దరు భార్యలుండిరి మహాత్మా గాంధికిన్ జిత్రమే
తే.గీ:గాంధి యను పేర మిత్రు డొక్కండు కలడు
రిప్లయితొలగించండిజాయ లిద్దరు గాంధికి, జాతి పితకు
భార్య కస్తూరి బాయియే పత్ని కాదె!
గాంధి పేరున్న వా డెల్ల గాంధి యగునె!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిRevised poem
రిప్లయితొలగించండిశా:ఏమా కాలపు దేశభక్తి ? మది లో నే శంకయున్ లేక యున్
బ్రేమన్ దమ్ముని,నన్ను వీడి భరతోర్వీస్వేచ్ఛయే కాంక్ష యై
మామా యిద్దరు భార్య లుండిరి మహాత్మా గాంధికిన్ జిత్రమే
సేమమ్ముల్ కనుగొంచు మా గృహములన్ జీవింప మే మొంటిగన్
(ఆనాటి దేశభక్తి గూర్చి ఏమి చెప్పేది మామా!నా యొక్క,నా తమ్ముని యొక్క భార్య ఇద్దరూ ఇంటిని మాకు వదిలేసి గాంధీ గారి క్షేమం చూస్తూ ఏదో ఒక సాయం చేస్తూ ఉండే వారు.)