13, నవంబర్ 2022, ఆదివారం

సమస్య - 4249

14-11-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తల కల్పద్రుమముగ నిడుఁ దా భాగ్యములన్”
(లేదా...)
“తల కల్పద్రుమమయ్యె నార్తులకు సద్భాగ్యంబులం గూర్చుచున్”

32 కామెంట్‌లు:

  1. కందం
    ఇలలో ధర్మము గావఁగ
    వెలసెను శ్రీరామమూర్తి విష్ణువె యనఁగన్
    విలపించెడు వారికి క్ష్మా
    తల కల్పద్రుమముగ నిడుఁ దా భాగ్యములన్

    మత్తేభవిక్రీడితము
    ఇలలో ధర్మము గావగన్ వెలసెఁ దా నింపైన రూపమ్మునం
    దిలవేల్పై రఘురామమూర్తి హరియే యేతెంచ నిద్ధాత్రిపై
    కలతల్ దీర్చెడు పాలనమ్మునొదగన్ కారుణ్యమేపార క్ష్మా
    తల కల్పద్రుమమయ్యె నార్తులకు సద్భాగ్యంబులం గూర్చుచున్

    రిప్లయితొలగించండి
  2. పలువిధములనుపయోగము
    తలపోసిననాటవలెను తాళద్రుమమే
    పొలుపున మధురసము మహీ
    తల కల్పద్రుమముగ నిడుఁ దా భాగ్యములన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    నిలువుగ పెరుగున్ ,బొండం
    బులు,ఫలపత్రాదులొసఁగు భూరిగ, నె
    చ్చెలి!కొబ్బరి మ్రాకే, భూ
    తల కల్పద్రుమముగ నిడుఁదా భాగ్యములన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభము
      జలముల్ వోసియు బెంచిరంచు మును,విశ్వాసంబుతో పత్రముల్
      ఫలముల్ శీర్షమునన్ ధరించుచును పెన్ భారంబుగా నెంచకే
      చెలగుంగొబ్బరి తాఁ బరోపకృతియే శ్రేయంబుగానెంచి భూ
      తల కల్పద్రుమమయ్యె నార్తులకు సద్భాగ్యంబులంగూర్చుచున్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  4. కులసంఘములని పెట్టిరి
    కులతత్వము రెచ్చగొట్ట కుటిలత్వముతో
    నిల నవియే చూడగ నే
    తల కల్పద్రుమముగ నిడుఁ దా భాగ్యములన్.

    రిప్లయితొలగించండి
  5. తలచిన రీతిగ జనులకు
    పలు విధముల సాయ పడుచు వసుధ జనించెన్
    చెలువపు కొబ్బరి గను భూ
    తల కల్ప ద్రుమముగ నిడు దా భాగ్యములన్

    రిప్లయితొలగించండి
  6. పలువిధ పరమార్థములకు
    నిలలో కొబ్బరి తరువిడు నెంతయు హితమున్
    తలపగ నీద్రుమమెగ భూ
    తల కల్పద్రుమముగ నిడుఁ దా భాగ్యములన్

    రిప్లయితొలగించండి
  7. మ.

    కలదీ భూమిని తాటిచెట్టు మనుజుల్ కాంచంగ లాభంబిడున్
    గలుపున్ గల్లును తాళపత్రములు లేఖల్ గ్రంథముల్ మార్గమై
    బలమౌ కాండము గీములన్ వెలయు సంభారంబు బెల్లంబు భూ
    *“తల కల్పద్రుమమయ్యె నార్తులకు సద్భాగ్యంబులం గూర్చుచున్”*

    రిప్లయితొలగించండి

  8. హలమే సాగక జీవకోటి కెటులాహారంబు సిద్ధించునో
    హలలేకున్ననటంచు కర్షణముకై యాధార మందింపగన్
    జలమున్ నిల్పుచు నానకట్టలను సంస్థాపించిరే, కాంచ భూ
    తల కల్పద్రుమమయ్యె నార్తులకు సద్భాగ్యంబులం గూర్చుచున్.

    రిప్లయితొలగించండి
  9. కలయందె నేత తన చే
    తల, కల్పద్రుమముగ నిడుఁ దా భాగ్యములన్
    దెలియన గు నది యందరు,
    విలువలు మరుగయ్యె నేడు విషయము నందున్

    రిప్లయితొలగించండి
  10. తలవన్ గశ్యపు ధర్మభాగినికి నుత్పాదించి వామాకృతిన్,
    దలచెన్ స్వర్గము నివ్వనింద్రునకు నై ధ్వాంక్షుండుగా మారుచున్
    దలపైకాలిడి చక్రవర్తి బలినే దండించుచున్, తద్ రసా
    తల కల్పద్రుమమయ్యె నార్తులకు సద్భాగ్యంబులం గూర్చుచున్.

    ధ్వాంక్షుడు-భిక్షువు

    రిప్లయితొలగించండి
  11. తులలేనిసిరులిడుచుభూ
    తలకల్పద్రుమముగనిడదాభాగ్యములన్
    లలనామణులెల్ల కొలువ
    తులసీమాతను నిరతము తోషముతోడన్

    రిప్లయితొలగించండి
  12. ఇలలో పేదల పాలిపెన్నిధిగతానెన్నెన్నియో రీతులన్
    చలువన్గూర్చెడు చప్పరంబుగను కంజారమ్మునన్ వాసమై
    కలిలో తాలమనేక రూపములుగాకల్యాణముం గూర్చు భూ
    తలకల్పద్రుమమయ్యె నార్తులకు సద్భాగ్యంబులం గూర్చుచున్

    రిప్లయితొలగించండి
  13. ఇలలో వెలసెను వెన్నుఁడు
    కలికాలమ్మునఁ దిరుమలఁ గరుణాత్ముండై
    యల వేంకటేశ్వరుఁడు భూ
    తల కల్పద్రుమముగ నిడుఁ దా భాగ్యములన్

    విలపింపం బని లేదు డెందమున సంప్రీతిన్ సభక్తిన్ జనుల్
    గొలువం దీరును బాధ లెల్లరకు సంకోచింప కాత్మీయ భ
    క్త లలామాళికి శ్రీ సతీ మణియె నిక్కంబెంచ నీలాభ్ర కుం
    తల కల్పద్రుమ మయ్యె నార్తులకు సద్భాగ్యంబులం గూర్చుచున్

    రిప్లయితొలగించండి
  14. ఇలలోఁ గొబ్బరి శిఖి భూ
    తల కల్పద్రుమముగ నిడుఁ దా భాగ్యములన్
    నెలనెల కొబ్బరి కతమున
    బలువిధముల లబ్ధిఁవలన భాగ్యముఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  15. కలికాలంబున బాగుగాఁ బెరుగు వేకాండంబులందుండి భూ
    తల కల్పద్రుమమయ్యె నార్తులకు సద్భాగ్యంబులం గూర్చుచున్
    వలయాకారపు కాయతోఁదనరి దాఫాలాక్షు నాకారమున్
    గలదై కొబ్బరి పేరునుంగలిగె నా కైలాస వాసుం బలెన్

    రిప్లయితొలగించండి
  16. పలు శుభకార్యములందున
    తొలుతగ పూజల నుజేయ తోకనుగలదై
    కలియుగమున కొబ్బరి భూ
    తల కల్పద్రుమముగ నిడుఁ దా భాగ్యములన్”

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.

    అల తిరుమల వెంకన్నయె
    కొలిచిన భక్తులకు నెల్ల కోర్కెలు తీర్చన్
    వెలసెను సప్తగిరుల, భూ
    తల కల్పద్రుమముగ నిడు దా భాగ్యములన్.

    రిప్లయితొలగించండి
  18. ఇలలోవైదిక జ్ఞానమున్ నిలపగా ఇంపైన మార్గమ్ములో
    కలిగెన్ చక్కని పేరు దేశమునకున్ కావించి సద్బోధలన్
    విలువన్ బెంచగ పండితాళి గరిమన్ విశ్వమ్ములో, నేడు క్ష్మా
    తల కల్పద్రుమమయ్యె నార్తులకు సద్భాగ్యంబులం గూర్చుచున్

    రిప్లయితొలగించండి