19, నవంబర్ 2022, శనివారం

సమస్య - 4254

20-11-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూర్ణిమను రవిగ్రహణమ్ము పూర్ణమయ్యె”
(లేదా...)
“పూర్ణిమనాఁడు వట్టినది పూర్ణరవిగ్రహణంబు చోద్యమై”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)

24 కామెంట్‌లు:

 1. తేటగీతి
  ఒప్పె హిందూమతమ్మది యుద్ధరింప
  నంధకారమ్ము బాపెడు నర్కుడనఁగ
  శంకరులకాయువల్పమై సద్గతినిడు
  పూర్ణిమను రవిగ్రహణమ్ము పూర్ణమయ్యె

  ఉత్పలమాల
  జీర్ణ దశన్ జరించుచు నిశీధిని గాంచు మతంపు వృద్ధికై
  నిర్ణయమెంచి శంకరులు నేర్పున సూర్యుని తేజమంది సౌ
  వర్ణమునద్ది యౌవనపు భాగ్యమునందు గతించె సద్యశః
  పూర్ణిమనాఁడు వట్టినది పూర్ణరవిగ్రహణంబు చోద్యమై

  రిప్లయితొలగించండి
 2. తేటగీతి
  పూర్ణ చంద్రుని గ్రహణమ్ము పూర్తియయ్యె
  పూర్ణిమను;రవిగ్రహణమ్ము పూర్ణమయ్యె
  నమవసతిథి పగటివేళ నద్భుతముగ
  గ్రహణ వేళల మ్రొక్కిరి రవికి శశికి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   నిర్ణయమైన రీతిగను నీరజవైరిని రాహువక్కటా!
   పూర్ణిమ నాఁడు వట్టినది; పూర్ణ రవిగ్రహణంబు చోద్యమై
   వర్ణవిహీనతన్ పగటి భాగముఁదోచెను మ్రింగ కేతువే
   యర్ణవమందుఁబుట్టిన మహాత్ములకైనను తప్పవాపదల్.

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 3. ఉ.

  పూర్ణిమ యంచు బేరిడిరి పుత్తడి వర్ణశరీరధారిణీ
  జీర్ణము గాదు ప్రేమ, రవి చేతను హీనకులంబు వాడటన్
  జూర్ణముచేయు వాదనల జోక్యము తోడను గెల్వగన్ బసన్
  *“పూర్ణిమ,...నాఁడు వట్టినది పూర్ణరవిగ్రహణంబు చోద్యమై”*

  రిప్లయితొలగించండి
 4. చంద్ర గ్రహణమ్ము దేశాన సంభవించె
  పూర్ణిమను :రవి గ్రహణమ్ము పూర్ణ మయ్యె
  నాశ్వయుజ యమా వాస్య లో యవని యందు
  గాంచి రందరు వానిని కన్నులార

  రిప్లయితొలగించండి
 5. తాను వలచిన పూర్ణిమ తనను మెచ్చ
  శుక్ర వారము నాడొక శుభముహూర్త
  మెంచి పరిణయ మాడిగ్రహించెను రవి
  పూర్ణిమను రవిగ్రహణమ్ము పూర్ణమయ్యె

  రిప్లయితొలగించండి

 6. అమవస దినమందున నింట యాడ పిల్ల
  పుట్టినను మేలటంచును బుధులు చెప్ప
  నాశ పడినట్లుగ కనెనా యాని కొమరి
  పూర్ణిమను, రవిగ్రహణమ్ము పూర్ణమయ్యె
  నాడమసయయ్యె మురిపెమ్ము నాకుగలిగె.  పూర్ణిమనాడు నందనుడు పుట్టిన మేలని చెప్పిరంచు గో

  కర్ణముఁ దాల్చినట్టి కఱకంఠుని వేడితి మెంతగానొ మా

  నిర్ణయమింకరిత్తయయె నెత్తురుగందుజనించె నామెయే

  పూర్ణిమ, నాఁడు వట్టినది పూర్ణరవిగ్రహణంబు చోద్యమై

  రిప్లయితొలగించండి
 7. చంద్రగ్రహణ మేర్పడుచుండు శంక లేక
  పూర్ణిమను ;రవిగ్రహణమ్ము పూర్ణమయ్యె
  నమవశ దినమునందున , నదియె జరుగు
  చుండె చాల కాలమునుండి చోద్య మెగద

  రిప్లయితొలగించండి
 8. చంద్ర గ్రహణమ్ము వచ్చును సంధ్య వేళ
  పూర్ణిమను, రవిగ్రహణమ్ము పూర్ణమయ్యె
  నమవసము నందు బ్రతియేట నావ రించి
  కటిక చీకటి, పగటిని కాళ రాత్రి
  యనఁగఁజేయును బూర్తిగ నార్యులార!

  రిప్లయితొలగించండి
 9. బ్రహ్మశ్రీ పద్మాకర్ గారి పూరణ తెలియఁజేయ గోర్తాను

  రిప్లయితొలగించండి
 10. పూర్ణిమనాఁడు వట్టినది పూర్ణరవిగ్రహణంబు చోద్యమై
  పూర్ణిమ! వింటి వే యిదియ పూర్వము నందున వింతఁ జేయగా
  పూర్ణిమ నాడు వట్టెనట పూర్ణము గాగ్రహ ణంబుచోద్యమే
  నిర్ణయ మట్లుఁజే సెహరి నీమము భంగమ యాయెఁజూడగా

  రిప్లయితొలగించండి
 11. పట్టెను గ్రహణమానెలవంకకు గన
  *“పూర్ణిమను రవిగ్రహణమ్ము పూర్ణమయ్యె”*
  అమవస దినమందున రాహు వాహవింప
  నాచరింతురుహోమాదులవని జనులు
  మరొక పూరణ
  పండు వెన్నెల కాయును భగము నందు
  పూర్ణిమను,రవి గ్రహణమ్ము పూర్ణమయ్యె
  స్నాన సంధ్యాదులనుచేయు సమయ మయ్యె
  నేమొ గాంచెద పంచాంగ మిమ్ము వడిగ

  రిప్లయితొలగించండి
 12. అర్ణవముబ్బతిల్లుగను నాకసమందున చంద్రుగాంచుచున్
  *“పూర్ణిమనాఁడు, వట్టినది పూర్ణరవిగ్రహణంబు చోద్యమై”*
  వర్ణనచేయనేరికినిభావమునందునశక్యమంచుసౌ
  వర్ణపు కాంతులీనురవి బాయగ కాంతిని పల్కె నొక్కడున్

  రిప్లయితొలగించండి
 13. వర్ణ మొక్కటి కాకున్నఁ బచ్చ నగు సు
  వర్ణ వర్ణ తనుచ్ఛాయ వఱలు వనిత
  పూర్ణిమకు రవి నచ్చఁగ ముచ్చటగను
  బూర్ణిమను రవిగ్రహణమ్ము పూర్ణ మయ్యె

  తూర్ణము సాగుచుండఁ గడు దూరపు దేశము కల్గె నాకు వి
  స్తీర్ణ నిరోధ మేఁగుటకుఁ దీవ్ర తరమ్ముగ విత్తభంగమై
  యర్ణవ తీర మందుఁ బరిహాసము కాదు నిజమ్ము కంటి నో
  పూర్ణిమ! నాఁడు వట్టినది పూర్ణ రవి గ్రహణంబు చోద్యమై

  రిప్లయితొలగించండి

 14. పిన్నక నాగేశ్వరరావు.

  శశికి పట్టు గ్రహణముఁ గాంచంగ వచ్చు
  పూర్ణిమను; రవి గ్రహణము పూర్ణమయ్యె
  పగటి సమయమందున నమావాస్య రోజు
  కారు చీకట్లు నల్దెసల్ గ్రమ్ముకొనగ.

  రిప్లయితొలగించండి