15, నవంబర్ 2022, మంగళవారం

సమస్య - 4250

16-11-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బరువు పెంచుకొనిన భాగ్యమబ్బు”
(లేదా...)
“బరువును బెంచుకొమ్ము కడు భాగ్యము లబ్బును నిశ్చయంబుగన్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

34 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    శక్తి కలుగు మేర సంపాదనమునొంద
    శ్రాంతమన్నది విడి సాగుమయ్య
    వెతలఁ బడక యుండ వృద్ధాప్యమున, ముల్లె
    బరువు పెంచుకొనిన భాగ్యమబ్బు

    చంపకమాల
    నిరతము శక్తిమేరకును నేర్పరివౌచు శ్రమించి సంపదల్
    మురిపెము మీరనొందుమయ! పూనుచుఁ గర్మల ముందుచూపుతో
    జర యనునొక్కటున్నదన సద్గతి జీవిక సాగ ముల్లియన్
    బరువును బెంచుకొమ్ము కడు భాగ్యము లబ్బును నిశ్చయంబుగన్

    రిప్లయితొలగించండి
  2. పరుల హితము కోరు పనులను చేయుచు
    బీదసాదలందు ప్రేమ చూపి
    సాయపడుచు నుండి సతతమా సుకృతపు
    బరువు పెంచుకొనిన భాగ్య మబ్బు

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    మనిషి జీవితాన మంచి వెలుగులను
    నింప వలయు నన్న నిండు మనసు
    నాయక గుణ శీల నైతిక సంపద
    బరువు పెంచు కున్న భాగ్య మబ్బు
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  4. ఆటవెలది
    వ్యాధులెక్కువగును "బరువు పెంచుకొనిన,
    భాగ్యమబ్బు"బుద్ధి బాగ పెరుగ
    దేహబలము కన్న ధీబలమేగొప్ప
    వట్టి మాట కాదు విట్టు బాబు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      గురుతర కాయభారమున గూర్చుని లేచుట కష్టమేయగున్
      అరయగఁదగ్గగా వలయునయ్య!క్రమంబుగ భూరి దేహపుం
      *బరువును; బెంచుకొమ్ము గడు భాగ్యములబ్బును నిశ్చయంబుగన్ *
      చురుకగు బుద్ధిచాతురిని, చూచి జనుల్ బళిరా!సెబాసనన్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి


  5. పనికి మాలినట్టి పంటలు వేయకు
    సరియగు ధరలేక శ్రమయె మిగులు
    మన్నెమందు నికను మాధవద్రమముల
    బరువు పెంచుకొనిన భాగ్యమబ్బు.


    బరువు= అధికము
    మాధవద్రమము= మామిడిచెట్టు

    రిప్లయితొలగించండి
  6. ఎంచుకొన్నరంగమేదైన నచ్చటన్
    ప్రతిభఁ జూపవలయు రమ్యరీతి
    కెరలియాడునట్టి కీర్తి ప్రతిష్ఠల
    బరువు పెంచుకొనిన భాగ్యమబ్బు

    రిప్లయితొలగించండి
  7. నడువలేని గతియె నరుల కబ్బును గద
    బరువు పెంచుకొనిన ; భాగ్యమబ్బు
    మందుల దినుచునె సమయము గ డుపుకొన,
    మితముగ దినుచుండ మేలుగలుగు

    రిప్లయితొలగించండి
  8. మంచి యెరువు వేసి మాగాణి నేలలో
    బాగ దుక్కి దున్న పండు పంట
    కెట్టి తెగులు లేక నేపగు దాన్యంపు
    బ రువు పెంచు కొనిన భాగ్య మబ్బు

    రిప్లయితొలగించండి


  9. కరువుల తోడ నీదయిన కష్టము సర్వము వ్యర్థమై సదా
    మరకువ చెందనేల యని మాతుల పుత్రుడమాయకుండనెన్
    దరుణిని గాంచి యేల పరితాపము మన్నెము నందు శారదాం
    బ, రువును బెంచుకొమ్ము కడు భాగ్యము లబ్బును నిశ్చయంబుగన్.


    రువు= ఆముదపు చెట్టు.

    రిప్లయితొలగించండి
  10. ఎరిగిన వాస్తుశాస్త్రులని రెల్లలు జూపుచు మానవాళితో,
    సిరి నెలవౌను తథ్యముగ జేయ్య కొసంగుము ప్రాగుదీచినిన్,
    సరమును నింపు తొట్టిబహు చక్కగ నైరుతి దిక్కు నుంచుచున్
    బరువును బెంచుకొమ్ము కడు భాగ్యము లబ్బును నిశ్చయంబుగన్.

    రిప్లయితొలగించండి
  11. ఒడలుబరువు పెంచి యిడుముడి బడనేల
    కాయకష్టపడిన గలుగు శుభము
    మేనిబరువుకన్న మేలైన స్వాస్థ్యంపు
    బరువు పెంచుకొనిన భాగ్యమబ్బు

    రిప్లయితొలగించండి
  12. పరువమునందు కాలమును వ్యర్థము చేయక కార్యదీక్షతో
    నెరపుము నీదు బాధ్యతను నీభవితవ్యపు బాటవేయుచున్
    సిరియొనగూడు నీదరికి చింతలుచేరవు భాసమానపుం
    బరువును బెంచుకొమ్ము కడు భాగ్యము లబ్బును నిశ్చయంబుగన్

    రిప్లయితొలగించండి
  13. మరొక పూరణ

    చింత లందు మునిగి చీకాకు పడకుండ
    మంచి తలపు దీన్ని మదిని నింపి
    మనవలాటగనుచు మమతానురాగాల
    బరువు పెంచు కొనిన భాగ్య మబ్బు

    రిప్లయితొలగించండి
  14. స్థిరమగు రాబడిన్ గొనగఁ జేయుచు నుంటివి పెక్కు కార్యముల్
    బెరిగిన నమ్మకమ్మునను బేరము బెంపగు నెల్లవేళలన్
    వరమగు పద్ధతిన్ జనుచు వర్తకమందునఁ జిత్తశుద్ధితోఁ
    బరువును బెంచుకొమ్ము కడు భాగ్యము లబ్బును నిశ్చయంబుగన్

    రిప్లయితొలగించండి
  15. నోరు మంచి దైన నూరు మంచి దగును
    సామెత నిల వినమె చక్క గాను
    మంచి వర్తనమున మనుచు లోకము నందుఁ
    బరువు పెంచు కొనిన భాగ్యమబ్బు

    [లోకము నందున్ + పరువు = లోకము నందుఁ బరువు]

    సురుచిర వాస్తు శాస్త్రమును జూచి చరించుమ నమ్మకమ్ముతో
    విరివిగఁ బ్రాగుదీచి దిశఁ బెట్టకు భారము నెన్నఁ డేనియుం
    బరు వది పెర్గు నష్టములు వాయును దప్పక విన్మ నైరుతిన్
    బరువును బెంచుకొమ్ము కడు భాగ్యము లబ్బును నిశ్చయంబుగన్

    [ఎన్నడేనియున్ + పరువు =ఎన్నడేనియుం బరువు]

    రిప్లయితొలగించండి
  16. చం.

    ఒరగెను వెండికొండయె మహోత్సవమున్ బ్రమథాధిపుండటన్
    గిరిజయు విస్మయంబునిడ, కీడు నగస్త్యుడె సాటివాడనెన్
    దరిమిరి దక్షిణాపథము ధన్యము మౌనికి బెండ్లి జూచెనే
    *"బరువును బెంచుకొమ్ము కడు భాగ్యము లబ్బును నిశ్చయంబుగన్”*

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. వ్యాధు లావ రించు బలహీన పడుదురు
    బరువు పెంచుకొనిన ,భాగ్యమబ్బు
    శివుని పూజఁజేయ శృత్యను సారము
    నుబ్బు లింగ డగుట భూతి నీయ

    రిప్లయితొలగించండి
  19. తరుణిరొ మానకెన్నడును దైవపు సేవను భక్తి నా యనే
    బరువును బెంచుకొమ్ము కడు భాగ్యము లబ్బును నిశ్చయంబుగన్
    బరమ శివుండె రక్షణను వారక యి చ్చును భక్త కోటికిన్
    నిరతము భక్త రక్షణను నీమము గాఁబచ రించు నాతఁడున్

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.

    ప్రజకు మేలు కలుగు పనులను చేయుచు
    పేద వారి పట్ల ప్రేమ చూపి
    కరుణయు దయ కల్గి ధరణిని కీర్తియున్
    బరువు పెంచుకొనిన భాగ్యమబ్బు!
    ( పరువు పెంచుకొనిన)

    రిప్లయితొలగించండి