15-11-2022 (మంగళవారం)కవిమిత్రులారా,"మాత - పిత - తాత - దుహిత" ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూనీతిని బోధిస్తూస్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
ఏల కుపితత్వమంటి సయిపు వహించుమానుమా తలబిరుసగు మాటలనికనల్వురోప్పు నీదగు తాతనమ్ము లేనినాడు నీకుకాదు హితము నమ్ము మిదియె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విభీషణుఁడు రావణునికి నీతిని బోధిస్తూతేటగీతిశ్రీల'తాత'న్వి సుకుమారి సీత తోడప్రల్లదములా'పి,త'ప్పని రామమూర్తికప్పగించు'మా,త'రుణిని యఘము దొలగునా'దు,హితవాక్యములు విని సోదరుండ!
కం.ధనమా ? తపమా ? లపితము,జనతా తపమందు హితము జయమును భువిలోవినయముఁ జూపక మనుజులుమనమునఁ దలచుచు వరములు మండాడుదురే !
వినుము జామాత సమయము వింగడించుకుపిత మతులెల్ల తప్పక కుములు చుంద్రుచక్కని సమతా తత్వము నెక్కిరించివాదు లాడుట నీకిక కాదు హితము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఉత్పలమాల:కూడకు *మాత*తాయిలను కోరకుమన్యుల విత్త మెన్నడున్వీడకుదీ*పిత*మ్మయిన పిత్సలమెన్నడు జీవితమ్మునన్నీడగతోడుకమ్మెపుడు నీ*దుహిత*మ్మును కోరువారికిన్వేడకు *తాత*నమ్మెపుడు వీడి సహాయము పల్లటమ్ములన్
ఎంతయు జరుల తాతన మెరిగి పలుకనగును , కనుమా తమము విడి యాత్మ యందువిజ్ఞతను జూపి తరములందు భేద మెరుగ,నెవరయిన గోరెదరు నీదు హితము నెపుడు
(కాపురమునకు వెళ్ళు కూతురుతో తల్లి)అమ్మ ! జా *మాత* నయ మార్గమందు చనునుకు *పిత* వై జగడము బెట్టు కొనకు మెపుడుప్రియ సు *తా! త* గ్గని లలితో ప్రియవచనములాడు, నీ *దు హిత* ముఁ గోరి వేడు చుంటి
వినుమా తత్త్వపు బోధలుతనువుననలజడు ల నాపి తమమును విడుమామనవలె తా తపసి కరణిఘనతను బొందుఁ హిత కరిగగ్రాలెడు వేళన్
మాత-పిత-తాత-దుహితఉ:"లే దిపు డింత నీతి" యని లేచిన దాదిగ "మా తరమ్మునన్మేదిని ధర్మభూమి" యని మిక్కిలి గొప్పగ జెప్పి తయ్య యీవాదము లేల నయ్య గురువా!కవితాతప మిట్లె యాపినన్రాదు హితమ్ము భావి కొక రమ్యమహద్దిశ జూపు మింతటన్.
వినుమా తరుణీ హంస గమన ఘన కుపి తాత తానుమానము వలనం గన రాదు హితము సుంతయుమనుజులకున్ బ్రతుకు లందు మనము కృశించున్
విదుర నీతికందంమినుమా! తమరికితరులేమొనరింపఁగను విలపిత, మనుచితమ్మో మీరొనరింపకుండ మను తాతనమునఁ బెంపొందు హితము ధర్మజ! నయమై
మాత ! మాతల రాతలు మారు నెపుడు ?కుపిత మనుజుల మధ్యలో కుమ్ములాట !తాత వేల్పెట్లు వ్రాసెనా తలను వ్రాత !నిలువనుదుహితాత్ముల మధ్య నిలువలేను?
విను*మా త*లచిన పనులనుతను మనముల తోడ కం*పిత*మతియుగాకన్అనయమువిన మా*దుహిత*వచనమ్మ దియు*తాత*మమది జవముగ నణచున్మరొక పూరణచేయనెంచకు"మాత"ప్పు చిత్తమందుచేయకు"పిత"లాటకమును చెరుపునదియుపరహి"తాత" తత్పరడౌట వాసి యౌనునా"దుహిత"మునాలించుము నయముగాను
తరుచుగ గ్రూకర్మలను దానవు రీతిగ జేయు టాపియున్నిరతము గొప్ప కార్యములు నీవొనరించుచుసంఘమందునన్మరవక సాదు సజ్జనుల మాన్యులచేతసదా ప్రియత్వమున్ బరువును బెంచుకొమ్ము కడు భాగ్యములబ్బును నిశ్చయంబుగన్
రిప్లయితొలగించండిఏల కుపితత్వమంటి సయిపు వహించు
మానుమా తలబిరుసగు మాటలనిక
నల్వురోప్పు నీదగు తాతనమ్ము లేని
నాడు నీకుకాదు హితము నమ్ము మిదియె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిభీషణుఁడు రావణునికి నీతిని బోధిస్తూ
రిప్లయితొలగించండితేటగీతి
శ్రీల'తాత'న్వి సుకుమారి సీత తోడ
ప్రల్లదములా'పి,త'ప్పని రామమూర్తి
కప్పగించు'మా,త'రుణిని యఘము దొలగు
నా'దు,హితవాక్యములు విని సోదరుండ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండిధనమా ? తపమా ? లపితము,
జనతా తపమందు హితము జయమును భువిలో
వినయముఁ జూపక మనుజులు
మనమునఁ దలచుచు వరములు మండాడుదురే !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివినుము జామాత సమయము వింగడించు
రిప్లయితొలగించండికుపిత మతులెల్ల తప్పక కుములు చుంద్రు
చక్కని సమతా తత్వము నెక్కిరించి
వాదు లాడుట నీకిక కాదు హితము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండికూడకు *మాత*తాయిలను కోరకుమన్యుల విత్త మెన్నడున్
వీడకుదీ*పిత*మ్మయిన పిత్సలమెన్నడు జీవితమ్మునన్
నీడగతోడుకమ్మెపుడు నీ*దుహిత*మ్మును కోరువారికిన్
వేడకు *తాత*నమ్మెపుడు వీడి సహాయము పల్లటమ్ములన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎంతయు జరుల తాతన మెరిగి పలుక
రిప్లయితొలగించండినగును , కనుమా తమము విడి యాత్మ యందు
విజ్ఞతను జూపి తరములందు భేద మెరుగ,
నెవరయిన గోరెదరు నీదు హితము నెపుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(కాపురమునకు వెళ్ళు కూతురుతో తల్లి)
రిప్లయితొలగించండిఅమ్మ ! జా *మాత* నయ మార్గమందు చనును
కు *పిత* వై జగడము బెట్టు కొనకు మెపుడు
ప్రియ సు *తా! త* గ్గని లలితో ప్రియవచనము
లాడు, నీ *దు హిత* ముఁ గోరి వేడు చుంటి
వినుమా తత్త్వపు బోధలు
రిప్లయితొలగించండితనువుననలజడు ల నాపి తమమును విడుమా
మనవలె తా తపసి కరణి
ఘనతను బొందుఁ హిత కరిగగ్రాలెడు వేళన్
మాత-పిత-తాత-దుహిత
రిప్లయితొలగించండిఉ:"లే దిపు డింత నీతి" యని లేచిన దాదిగ "మా తరమ్మునన్
మేదిని ధర్మభూమి" యని మిక్కిలి గొప్పగ జెప్పి తయ్య యీ
వాదము లేల నయ్య గురువా!కవితాతప మిట్లె యాపినన్
రాదు హితమ్ము భావి కొక రమ్యమహద్దిశ జూపు మింతటన్.
రిప్లయితొలగించండివినుమా తరుణీ హంస గ
మన ఘన కుపి తాత తానుమానము వలనం
గన రాదు హితము సుంతయు
మనుజులకున్ బ్రతుకు లందు మనము కృశించున్
విదుర నీతి
రిప్లయితొలగించండికందం
మినుమా! తమరికితరులే
మొనరింపఁగను విలపిత, మనుచితమ్మో మీ
రొనరింపకుండ మను తా
తనమునఁ బెంపొందు హితము ధర్మజ! నయమై
మాత ! మాతల రాతలు మారు నెపుడు ?
రిప్లయితొలగించండికుపిత మనుజుల మధ్యలో కుమ్ములాట !
తాత వేల్పెట్లు వ్రాసెనా తలను వ్రాత !
నిలువనుదుహితాత్ముల మధ్య నిలువలేను?
విను*మా త*లచిన పనులను
రిప్లయితొలగించండితను మనముల తోడ కం*పిత*మతియుగాకన్
అనయమువిన మా*దుహిత*వ
చనమ్మ దియు*తాత*మమది జవముగ నణచున్
మరొక పూరణ
చేయనెంచకు"మాత"ప్పు చిత్తమందు
చేయకు"పిత"లాటకమును చెరుపునదియు
పరహి"తాత" తత్పరడౌట వాసి యౌను
నా"దుహిత"మునాలించుము నయముగాను
తరుచుగ గ్రూకర్మలను దానవు రీతిగ జేయు టాపియున్
రిప్లయితొలగించండినిరతము గొప్ప కార్యములు నీవొనరించుచు
సంఘమందునన్
మరవక సాదు సజ్జనుల మాన్యులచేత
సదా ప్రియత్వమున్
బరువును బెంచుకొమ్ము కడు భాగ్యము
లబ్బును నిశ్చయంబుగన్