21, నవంబర్ 2022, సోమవారం

సమస్య - 4256

22-11-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శాంతి లుప్తమైన సౌఖ్యమబ్బు”
(లేదా...)
“శాంతి విలుప్తమైనపుడె సౌఖ్యము దక్కును మానవాళికిన్”

40 కామెంట్‌లు:

 1. సమత మమత తోడ సర్వ జనాళియు
  దేశ భక్తి గలిగి దివ్య ముగను
  గలసి మెలసి యుండ ఘనముగ వారిక
  శాంతి లుప్తమైన సౌఖ్య మబ్బు

  రిప్లయితొలగించండి
 2. ఎన్ని వెతలనైన నెదిరి పోరాడుచు
  జగతి నందు సకల జనులు మెచ్చు
  చెన్నుగ వసియించు జీవితమందు,న
  శాంతి లుప్తమైన సౌఖ్యమబ్బు

  రిప్లయితొలగించండి

 3. ఒండొకని సిరిగని యోర్వలేనట్టివా
  డిలను సుఖము నెఱుగ డిదియె నిజము
  సకల జనులమేలు సంస్మరించు ప్రజక
  క్షాంతి లుప్తమైన సౌఖ్యమబ్బు.

  ప్రజకు+ అక్షాంతి ( అక్షాంతి=ఈర్ష్య )

  రిప్లయితొలగించండి
 4. అక్షాంతి ష కారముందనుకుంటే  ఒండొకని సిరిగని యోర్వలేనట్టివా
  డిలను సుఖము నెఱుగ డిదియె నిజము
  సకల జనులమేలు సంస్మరించు ప్రజక
  శాంతి లుప్తమైన సౌఖ్యమబ్బు

  రిప్లయితొలగించండి
 5. ఆటవెలది
  ప్రాప్తమిదియె యంచు తృప్తిని జెందుచు
  సత్త్వ గుణము కరుణ శమము దమము
  కలిగి నిండు మదిని కామంబుఁగ్రోధమ
  శాంతి లుప్తమైన సౌఖ్యమబ్బు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   చింతలు,వంతలున్ విసుగు శీఘ్రమె కల్గుచునుండుగా మన
   శ్శాంతి విలుప్తమైనపుడె;సౌఖ్యము దక్కును మానవాళికిన్
   శాంతి దయా యహింస ఘనసత్త్వ వదాన్య సుబుద్ధియున్ సదా
   సంతత విష్ణుచింతనము సజ్జన మైత్రియు కల్గియున్నచో.

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   వృత్తంలో 'దయా + అహింస' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
  3. ధన్యవాదములు,నమస్సులు.
   సవరణము:దయార్ద్రదృష్టి

   తొలగించండి
 6. ఆటవెలది
  సోయగమ్ములిట్లు సొంతమౌదుమనఁగ
  పరుగు పెట్టనేల ప్రవర! నీవు
  కాంతనందలేని కట్టుబాట్లన్ లేదు
  శాంతి, లుప్తమైన సౌఖ్యమబ్బు

  ఉత్పలమాల
  ఇంతలు కన్నులుండి వగలింపుగఁ జూపు వరూధినిన్ గొనన్
  జెంతకుఁ జేరవే ప్రవర! చింతలఁ జిక్కిన నిత్యరోదనల్
  సాంతము కట్టుబాట్ల సరసమ్మును వీడిన లేదులేదొకో
  శాంతి, విలుప్తమైనపుడె సౌఖ్యము దక్కును మానవాళికిన్

  రిప్లయితొలగించండి
 7. మనసుమీదనదుపు మానవతాదృష్టి
  కోపతాపరహిత గుణము మదికి
  ముదము శాంతి నిడును, మద మత్సరంబుల
  శాంతి లుప్తమైన సౌఖ్యమబ్బు

  రిప్లయితొలగించండి

 8. శాంతిని గోరుచుండుటది సజ్జన లక్షణ మైన నీ సము
  ద్రాంతమునందు జంబుకులధర్మ పథమ్ముఁ జరించుచున్ సదా
  యింతులనాటబొమ్మలుగ నెంచు కిరాతకులుండు చోట నీ
  శాంతి విలుప్తమైనపుడె సౌఖ్యము దక్కును మానవాళికిన్.

  రిప్లయితొలగించండి
 9. హింస పెచ్చరిల్లు నెల్లెడ లోకాన
  శాంతి లుప్తమైన, సౌఖ్యమబ్బు
  శాంతిపాదుకొనగ సకల జగంబుల,
  సర్వజనులరక్ష శాంతి గూర్చు

  రిప్లయితొలగించండి
 10. ధ్వాంతమునందు వెల్లిగొను ధారుణి శాంతి విహీనమైన వి
  శ్రాంతము సుంతయేనిగనరాదు జనావళి మానసంబులన్
  “శాంతి విలుప్తమైనపుడె, సౌఖ్యము దక్కును మానవాళికిన్”
  శాంతికపోతముల్ దిశల క్షాంతిని నింపుచు సంచరింపగన్

  రిప్లయితొలగించండి
 11. సంతతమ్ము నాత్మ సంతోష ముప్పొంగఁ
  జేకురుఁ గుశలమ్ము శీఘ్ర గతిని
  నంతరంగ మందు నడరుచున్నట్టి య
  శాంతి లుప్త మైన సౌఖ్య మబ్బు

  చింతలు మీఱ డెందమునఁ జిక్కులు కల్గఁగ జీవితమ్మునన్
  వంతలు సంతరింపఁగడు వ్రక్కలగున్ మది శాంత మెల్లనున్
  శాంత మనస్కులై కరము సంతస మింపుగ నబ్బగా ని జా
  శాంతి విలుప్త మైనపుడె సౌఖ్యము దక్కును మానవాళికిన్

  [నిజ + అశాంతి = ని జాశాంతి]

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది
   అభినందనలు
   సగుణ మార్పు... దుష్టసమాసం
   ...బొంద ప్రశాంతి... అనండి

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువుగారు.
   ఆటవెలది
   సమసమాజ సౌఖ్య సాధనకై ప్రజా
   నాయక గణ మనము నందు మంచి
   మార్పు గల్గి మంచి కూర్పును బొంద ప్ర
   శాంతి లుప్తమైన సౌఖ్య మబ్బు.
   ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
   ఉండవల్లి సెంటరు.

   తొలగించండి
 13. ఆ.వె:శాంతి లేక యున్న సౌఖ్యమ్ము లేదను
  త్యాగరాయ కృతిని వీగ జేసి
  "శాంతి లుప్త మైన సౌఖ్య మబ్బు" నటంచు
  శంక దెచ్చి రేల శంకరార్య!

  రిప్లయితొలగించండి
 14. ఉ:ఎంతయు జ్ఞానమున్ గలిగి,యీ జగ మందున నే సమస్యతో
  సుంతయు నంటకుండి తన చూపులు స్వప్రభ యందె నిల్పి యా
  వంతయు సాంఘికస్పృహనె యందక యుండు స్మశానశాంతి యౌ
  శాంతి విలుప్త మైనపుడె సౌఖ్యము దక్కును మానవాళికిన్

  రిప్లయితొలగించండి
 15. కోపమతిశ యించి క్రూరుఁడు గనుమారు
  శాంతి లుప్తమైన, సౌఖ్యమబ్బు
  శివుని పూజఁ జేయ శ్రీలతోఁగూడిన
  శాంతి భూషణమ్ము సకల మునకు

  రిప్లయితొలగించండి
 16. అన్ని వెతలు తొలగి నంతరంగమున న
  *“శాంతి లుప్తమైన సౌఖ్యమబ్బు”*
  భావి జీవితమ్ము బంగారు మయ మౌను
  సాగునపుడె బ్రతుకు సవ్యముగను

  చింతలు హెచ్చు చుండగను చిత్తము నందున ధైర్య మూనుచున్
  ఆంతము చేయుమంచుసత మచ్యుతు నామము నెల్లవేళలన్
  సుంతయు జాగుచేయకను స్తోత్రము వీడక చేయగన్ మదిన్
  *"శాంతి విలుప్తమైనపుడె సౌఖ్యము దక్కును మానవాళికిన్”*
  రిప్లయితొలగించండి
 17. చింతలు లేని జీవితము చేరు సుఖమ్మును కమ్మనై నిజా
  శాంతి విలుప్తమైనపుడె సౌఖ్యము దక్కును మానవాళికిన్
  వంతల బారి నొందకను బ్రత్యహ మున్ హరునేఁద లంచు చో
  శాంతిని నుండ వీలగును శంకరు చల్లని చూపులుండు టన్

  రిప్లయితొలగించండి

 18. పిన్నక నాగేశ్వరరావు.

  బ్రతుకు నందెదురగు వెతల నన్నింటిని
  యధిక శ్రమలకోర్చి యధిగమించి
  శాంత చిత్తులున్న సంసారమందు న
  శాంతి లుప్తమైన సౌఖ్యమబ్బు.

  రిప్లయితొలగించండి
 19. ఉ.

  సుంతయు నెమ్మి లేని దనుజుల్ సురలన్ గెలువంగ స్వర్గమున్
  రంతిల, భీతిచే జనులు రక్షణఁ గోరగ దానవాళికిన్
  *శాంతి విలుప్తమైనపుడె సౌఖ్యము దక్కును మానవాళికిన్*
  సాంతము దుష్టశిక్షణను శార్ఙ్గియె సర్వ యుగాలలో నిడున్.

  రిప్లయితొలగించండి