25, నవంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4260

26-11-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వైణికుండయ్యె రాముఁడు భామినులకు”
(లేదా...)
“వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)

21 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ఔర!'మహతి'నిగైకొని నారదుండు
    మూడు లోకాలు తిరుగుచు పాడునట్టి
    వైణికుండయ్యె ;రాముఁడు భామినులకు
    ధర్మమే రూపుగొన్నట్టి దైవమయ్యె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      ఆణిమెఱుంగు ముత్తెపుటొయారపు గద్దియపైన సీత,వి
      న్నాణము మీఱ పాడగ ఘనంబుగ మెచ్చియు వచ్చి చెచ్చెరన్
      వైణికుఁడయ్యె రాఘవుఁడు;వల్లవ కాంతల తృష్ణ దీర్చగన్
      వేణువు నూదె గృష్ణుఁడును వీనులవిందుగ గోకులంబునన్.

      తొలగించండి
    2. వైణకుడు👍
      వైణికుడు X ఈ సమస్య ఆ అవధానంలో నేనే ఇచ్చాను

      తొలగించండి
  2. సీత తీయగ గానము జేయు చుండ
    వైణికుండయ్యె రాముఁడు ; భామినులకు
    వాంఛ జనియంచె నటువంటి వరుడు దొరక,
    యెవరి భాగ్యమెటులగునో యెవరికెరుక

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. తేటగీతి
      సీతవలె రాము సేవించు చింతగలిగి
      గోపికలరూపము ఋషులు గూర్మినొంద
      వరము దీర్పఁ గృష్ణుడుగ ద్వాపరమునందు
      వైణికుండయ్యె రాముఁడు భామినులకు

      ఉత్పలమాల
      ప్రాణసమమ్ముగన్ గొలువ రాముని, సీతవలెన్ ఋషీశ్వరుల్
      దీనత వేడినన్ వరము దీర్చెద ద్వాపర మందునన్న నా
      పూనిక గోపకాంతలుగ పుట్టిరి వారలు కృష్ణమూర్తియై
      వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్

      తొలగించండి

  4. సుందరాకారుని గనగ చోద్య మదియె
    బోటి సీత మానసవీణ మీటినట్టి
    వైణికుండయ్యె రాముఁడు, భామినులకు
    ప్రేమపాత్రుడే సతతమ్ము వెన్నదొంగ.


    తూణము నందు బాణములు దోని ధరించిన యస్త్రవిద్యలో
    జాణయతండు వానిఁగన జానకి డెందపు వీణ మీటెడిన్
    వైణికుఁ డయ్యె రాఘవుఁడు, వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్
    వేణువు దాల్చినట్టికరి వేల్పుని లీలలనంతమే సుమీ.

    రిప్లయితొలగించండి
  5. వీణ వాద్యము నందున బ్రీతి గల్గి
    సాధన ము జేసి యొక్కడు శక్తి కొలది
    వైణికుండయ్యె : రాముడు భామినులకు
    మార్గ దర్శ కుం డయ్యె ను మహిని కాదె!

    రిప్లయితొలగించండి
  6. సీత నెచ్చెలుల్ పరికింప శివుని విల్లు
    విరిచి కన్నె సీత హృదయవీణ మీటి
    వైణికుండయ్యె రాముఁడు భామినుల కు
    తూహ లముదీరి వారు సంతోషపడగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షోణిజ సీతకున్ గలిగె సోయగమొప్పెడు పాణిబంధమే
      జాణ మనోహరాబ్జముఖి జానకి మానసవీణమీటి తా
      వైణికుఁ డయ్యె రాఘవుఁడు, వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్
      వేణువు చేతబూని నును వెచ్చని కౌగిలి నిచ్చెకృష్ణుడే

      తొలగించండి
  7. జలక మాడుచును యమునా జలము లందు
    వల్లవీ మణులం గూడి ద్వాపరమున
    వింతగ బలభద్రుం డట వీణ లేని
    వైణికుం డయ్యె రాముఁడు భామినులకు

    ప్రాణము సీత రామునకు భామకు రాముఁడె దేవుఁడెన్న నె
    క్కోణము నుండి చూచినను గోమలి కెన్నఁడు వింతగాదు తా
    ర్కాణము లేల కృష్ణునిగ రామఁడు ద్వాపర మందుఁ బుట్టి తా
    వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్పఁగన్

    రిప్లయితొలగించండి
  8. జనకుని సభలో నెల్లరు. సన్నుతింప
    మానినీమణి జానకి మదిని మీటు
    వైణికుండయ్యెరాముడు. భామినులకు
    ముదము గూర్చెద్వాపరమున మురహరుండు

    రిప్లయితొలగించండి

  9. ప్రాణసమమ్ముగా గనుచు పార్థివి పావనుడై చరించి వి
    న్నాణముఁ జూపి దారుణ రణమ్మున రక్కసి మూక దున్మి తాన్
    త్రాణము నిచ్చి మిత్రులకు ద్వాపర మందు, మనోవిహారి యై
    వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్

    రిప్లయితొలగించండి
  10. మరొక పూరణ


    బాణముతోడవిల్విరిచి పాణిని పట్టుచు సంతసమ్ముతో
    ప్రాణసముండునయ్యెనట రాజసమొప్పగ సీతకున్ మనో
    *వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్”
    వేణువునూదుచున్ నిలిచె వెన్నుడు తానటమోహనమ్ముగా

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:ధర్మ విగ్రహు డను పేర ధరణి నెల్ల
    ప్రేమరాగవైణికుడౌచు వినుతి కెక్కి ,
    సతిని వీడుట జేసి విషాదరాగ
    వైణికుం డయ్యె రాముడు భామినులకు

    (రాగాలలో కొన్ని ఆనందాన్ని,ప్రేమభావాన్నీ కల్గిస్తాయి.కొన్ని విషాదభావాన్ని కలిగిస్తాయి.ధర్మ విగ్రహు డని పేరు పొంది ప్రేమరాగాన్ని పలికించిన వైణికుడైన రాముడు సీతని పరిత్యాగం చేసి స్త్రీల మనస్సులలో విషాదరాగాలు పలికించే వైణికు డయ్యాడు.సీతాపరిత్యాగం ఫెమినిస్టులని బాధ పెడుతూనే ఉంది కదా!)

    రిప్లయితొలగించండి
  12. సీత యుల్లమున్ వేడుకజేయ నెంచి
    వైణికుండయ్యె రాము(డు, భామినులకు
    వలువలంకించి వలపుల వాసినీయ
    వైణుకుండయ్యె గోపికా వల్లభుండు.

    రిప్లయితొలగించండి
  13. ఉ:పూనగ దృష్ణ తాపసులు మోహనరాగసుధాప్రదాతయౌ
    వైణికు డయ్యె రాఘవుడు వల్లవ కాంతల తృష్ణ దీర్చగా
    వేణువు నూదె కృష్ణు డయి,విజ్ఞులు మౌనులె ద్వాపరమ్మునన్
    ప్రాణసమానుడౌ హరికి రాగము పంచిరి గొల్ల భామలై.
    (రాముడు ఋషుల పాలిట మోహనరాగ వైణుకు డయ్యాడు.ద్వాపరం లో గొల్లభామల రూపం లో ఉన్న వారికి వేణు గానం వినిపించాడు.)

    రిప్లయితొలగించండి
  14. బాణము చేతబూని వనవాసమునన్ మునివర్యయాగమున్
    త్రాణన జేసి నట్టి రఘురాముని మౌనులు కోర కౌగిలిన్
    వేణువు దాల్చి దాశరథి, వేడక దీర్చగ ద్వాపరమ్మునన్
    వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్

    రిప్లయితొలగించండి
  15. వీణ వోలెను నారించి వింటి నపుఁడు
    వైణికుండయ్యె రాముఁడు, భామినులకు
    ధర్మ రక్షణఁ గావించు దైవ మగుచుఁ
    బాల నంబును జేసెను బ్రజల నతడు

    రిప్లయితొలగించండి
  16. బాణము సూటిగా వదలి భామగు సీతను బెండ్లి యాడి దా
    వైణికుఁ డయ్యె రాఘవుఁడు, వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్
    వేణువు ధారిగా నిలను బ్రీతిని జన్మము నొంది భక్తు లన్
    ద్రాణముఁ జేయుచుం డెగద రాణులు మెచ్చగ నెల్లవేళలన్

    రిప్లయితొలగించండి