1, నవంబర్ 2022, మంగళవారం

సమస్య - 4237

2-11-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏల భారతీయుఁడు బ్రిటన్ పాలకుఁడగు”
(లేదా...)
“తగునొకొ భారతీయుడు ప్రధానిగ నేలుట యాంగ్లదేశమున్”

35 కామెంట్‌లు:

  1. చంపకమాల
    తగవులు వెట్టి యైక్యమును దానవులై చెడగొట్టి వంచనన్
    వగపు మిగిల్చి భారతికి పాలకులైరల తెల్లవారలున్
    సుగుణము నెంచి యెన్నికల సొంతపు వానిగ నెన్నినంత విం
    తగునొకొ భారతీయుడు ప్రధానిగ నేలుట యాంగ్లదేశమున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి
      ద్రిమ్మరులగుచున్ భారత దేశమేల
      దొడ్డిదారిన వంచనన్ దోషమపుడు
      సొంతవానిగ నెన్న మెచ్చు కతన కల
      తగున భారతీయుఁడు బ్రిటన్ పాలకుఁడుగ?

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  2. భగభగ మండు గుండెగల భారత వైరి బ్రిటీషు వాడనెన్
    బగతురు తెల్లవారలని భారత భూమిమి వీడి పొమ్మటం
    చు గొడవ చేసినట్తి పర చోనపు వారలనాటి తొత్తులే
    తగునొకొ భారతీయుడు ప్రధానిగ నేలుట యాంగ్లదేశమున్.

    రిప్లయితొలగించండి
  3. మంచి యోగ్యత గల్గిన మాన్యు డగుచు
    మెప్పు నొందిన రిషి సునాక్ మేటి యయ్యె
    తగున భార తీయుడు బ్రిటన్ పాల కుడుగ
    ననెడు సందియమున్ విడ నాడ వలయు

    రిప్లయితొలగించండి
  4. తగునొకొ భారతీయుడు ప్రధానిగ నేలుట యాంగ్లదేశముం
    దగునని జెప్పగా వలయు ధార్మిక చింతన మెండు గల్గగాఁ
    నగణిత బుద్ధి కౌశలము నాగమ శాస్త్రపు నేర్పుఁ గల్గుటన్
    సుగమపు పాల నాగతిని సూక్ష్మము లన్నియు నేర్చియుండుటన్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. తగునొకొ భారతీయుడు ప్రధానిగ నేలుట యాంగ్లదేశమున్
      భగభగ మండెనాయెడద భాస్వర రీతిని వేదనాఝరిన్
      సుగుణములే స్వజాతికిట శోభను గూర్చుట విస్మరించుచున్
      తగునొకొ నీప్రకారము వితర్కపు సందియమున్రగల్చగన్

      తొలగించండి
    2. ఏల భారతీయుఁడు బ్రిటన్ పాలకుఁడగు
      ననెడి సందేహ మేలనొ యనవరతము
      కృషిని భారత సంతతి రిషి సునాకు
      సర్వ సమ్మత పదవిని సంతరింప

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  6. కరుడు కట్టిన యాంగ్లేయు డరచె నిటుల
    దొరల పాలన వలదంచు దొమ్మిజేసి
    పారద్రోలిన దేసపు వారసుండు
    తగున, భారతీయుఁడు బ్రిటన్ పాలకుఁడుగ.

    రిప్లయితొలగించండి
  7. ఆటవెలది
    అతల కుతలమయ్యె నార్థిక స్థితియట
    గట్టుఁజేర్చు నట్టి దిట్ట "రిషి"యె
    యౌర!వింత* యేల?భారతీయుఁడు బ్రిటన్
    పాలకుఁడగు* వారె యేలు కొనగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      జగతిని మేమె గొప్ప యని సారెకు సారెకు విఱ్ఱవీగుచున్
      పగతురు తెల్లవారు మును పాలనఁజేసిరి, నేడు వారలే
      తగును"సునాకు"మాకనుచు తద్దయు మెచ్చరె!యౌర!వింత వా
      ర్తగునొకొ?భారతీయుఁడు ప్రధానిగ నేలుట యాంగ్లదేశమున్.

      తొలగించండి
    2. సవరణ:ఆటవెలది 4వ పాదముల
      వారె యెన్ను కొనగ

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. చం.

    తెగువ మహమ్మదీయ మిడి తెక్కలి దేహర భాగధేయముల్
    మొగలులు విస్తరించిరిట మొత్తము దేశము నాక్రమించగన్
    పగ నిడి యాంగలేయ తెగ పంపెను సంపదలెల్ల రాణికై
    *తగునొకొ భారతీయుడు ప్రధానిగ నేలుట యాంగ్లదేశమున్.*

    రిప్లయితొలగించండి
  9. జనులు గోరిన దానిపై సంశయించ
    నేల, భారతీయుఁడు బ్రిటన్ పాలకుఁడగు
    ననుచు నచటి వారెంచిరి యాతని పని
    తీరు మెచ్చు కొనుచు,దాని దెలియ నగును

    రిప్లయితొలగించండి
  10. subbaraoమంగళవారం, నవంబర్ 01, 2022 10:30:00 PM

    దొడ్డి దారిని నేతెంచి దొరలె యపుఁడు
    కష్టముల దరిఁజేర్చి రకట కాన వారి
    నణఁగ ద్రొక్కంగ మనవాడు నర్హుఁడౌను
    నేల భారతీయుఁడు బ్రిటన్ పాలకుఁడుగ
    ననెడు సందేహ మువలదు హరిత! నీకు

    రిప్లయితొలగించండి
  11. తల్లి భారతి సిరులెల్ల కొల్లగొట్టి
    దోచుకొనిపోయిరా తెల్లదొరలు నాడు
    గడ్డుకాలము దాపించ గట్టుఁజేర్చ
    నేల భారతీయుఁడు బ్రిటన్ పాలకుఁడగు?

    రిప్లయితొలగించండి
  12. తగునొకొ భారతీయుడు ప్రధానిగ నేలుట యాంగ్ల దేశమున్?
    తగదని చెప్పలేను తగు తార్కిక బుద్ధి దలంచి చూడగన్
    తెగువకు ప్రాభవంబునకు ధిష్ణ్యకు దక్కిన గౌరవంబదే
    తగునది యాంగ్లదేశపు ప్రధానిగ భారతవాసి యేలగన్

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    తెగువ జూపి పట్టుదల గెదిగిన వాడు
    ఉన్నత జదువులు జదివి ఉన్నత శిఖ
    రముల కెక్కిన రిషిసునక్ రాయుని వలె
    నేల, భారతీయుడు బ్రిటన్ పాలకుడుగ.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  14. తగునె శంకింపఁగా భారత జన శక్తిఁ
    దగునె యిట్టు లాత్మ న్యూనతను వహింప
    దగునె నీ కిట్టి ప్రశ్న వింతగఁ దలంపఁ
    దగున భారతీయుఁడు బ్రిటన్ ధవుని గాను

    [మున్నిడిన సమస్యలో యతి భంగము నివారింపఁగా]

    అగణిత భార తావనిని నాంగ్ల జనేశ్వరు లేలఁ గాంచమే
    తగు నని యేండ్లు పెక్కు ఫలితమ్ముగ నేఁ డవకాశ మేర్పడెం
    దగదయ పల్క నివ్విధము తద్దయు సందియ మూని యాత్మలోఁ
    దగు నొకొ భారతీయుడు ప్రధానిగ నేలుట యాంగ్లదేశమున్

    రిప్లయితొలగించండి