29, నవంబర్ 2022, మంగళవారం

సమస్య - 4264

30-11-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శోకమె భూషణంబగు విశుద్ధమనంబున నెంచి చూడఁగన్”
(లేదా...)
“శోకమె భూషణము గన విశుద్ధమనమునన్”

24 కామెంట్‌లు:

  1. కందము
    శ్రీకరమగు పాలనమున
    చీకాకులు లేనియట్టి జీవన వనిలో
    లోకులు సేయ విహారమ
    శోకము భూషణముగన విశుద్ధ మనమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      ఆ కమనీయమూర్తికి, మహాసుమ ధన్వికి,శంబరారికిన్
      శ్రీకర పంచబాణముల శ్రేష్ఠతమంబగు బాణమౌ నవా
      శోకమెభూషణంబగు ,విశుద్ధ మనంబున నెంచి చూడగన్
      లోకుల మానసంబులు విలోలము సేయును గాదె యద్దియే!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. శోకము తొలగుట కొరకు వి
    వేకులు యత్నింతురుగద విశ్వమునందున్
    చేకూరిన నిబ్బరము న
    శోకమె భూషణము గన విశుద్ధమనమునన్

    రిప్లయితొలగించండి
  3. కృష్ణపరమాత్మ సత్యభామతో...

    కందం
    తాకుచు మద్ఘన శిరమున్
    నీ కోమల పాదమెంతొ నెవ్వము సెందెన్
    వ్యాకులమేల సఖీ! ని
    శ్శోకమె భూషణము గన విశుద్ధమనమునన్

    ఉత్పలమాల
    చీకున పల్లవాంఘ్రి ఘన శీర్షము దాకుచు కందెనేమొకో!
    వ్యాకుల మేల స్వర్గమున పారిజవృక్షమె తెత్తు గాదొకో
    నీకు సఖీ! భవన్మదిని నెవ్వము దీర్చెద మోమునందు ని
    శ్శోకమె భూషణంబగు విశుద్ధమనంబున నెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  4. ఆకలి నెరుగని వారై
    లోక ము నందునను జనులు లోలత తోడన్
    ప్రాకట ముగ జీవింప న
    శోకము భూషణము గన విశుద్ధ మనము నన్

    రిప్లయితొలగించండి
  5. *(కైకేయి శోక మందిరమున నుండగా దశరథుడామెను లాలించు సందర్భము)*

    కోకలు భూషణమ్ములను గోరునెపమ్మున చేరనేలనే
    చీకటి మందిరమ్ములవి చింతలు బాపగ లేవు నమ్ముమా
    వ్యాకులమందనేల సఖియా! పరితాపము వీడుమంటి ని
    శ్శోకమె భూషణంబగు విశుద్ధమనంబున నెంచి చూడఁగన్.


    వ్యాకులమందుచు నిట్టుల
    చీకటి గృహమందు జేరి చింతింపగనే
    లా? కలికిరో వినుమ ని
    శ్శోకమె భూషణము గన విశుద్ధమనమునన్.

    రిప్లయితొలగించండి
  6. వ్యాకులమొందిన మనముకు
    శోకమె భూషణము ; గన విశుద్ధమనమునన్
    నేకారణమున నైనను
    రేకెత్తెడి విషయములను లెక్కగొ నదుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మనమునకు' అనడం సాధువు. "వ్యాకులమొందిన యెదకున్" అందామా?

      తొలగించండి
    2. కం:వాకిట కొలువుగ నింటి క
      శోకమె భూషణము, కన విశుద్ధమనమునన్
      నా కష్టమ్ముల మరతును
      నా కేమియు చింత లేదు నగలన్,సిరులన్

      తొలగించండి
    3. ఉ:శోక మదేల జానకి!యశోకవనమ్మున నుంటి వీవు తా
      రాకయె పోడు రాఘవుడు రావణనాశము తప్పదమ్మ నీ
      శోకము దీర్చు నీ శకునశోభ దలంచుము ,భావి సుందరా
      శోకమె భూషణ మ్మగు విశుద్ధమనమ్మున నెంచి చూడగన్
      (త్రిజట అశోకవనం లో ఉండటం నీకు శుభశకునమే అని చెప్పినట్లు.)

      తొలగించండి
  7. వీఁకను జూపించుచుఁ దగు
    సాకులు వొందఁగ ఫలమ్ము సాధింపంగా
    లోకమ్మునఁ బ్రాణేశుని
    శోకమె భూషణము గన విశుద్ధ మనమునన్

    వాకిటఁ బుష్ప భార నత పాదప పంక్తులు తోరణమ్ము లౌఁ
    బ్రాకట భూషణావళులు పన్నుగ నాతికి నిర్మలమ్మునౌ
    నాకము భంగి నా ముఖమునన్ దరహాస సమేత సంత తా
    శోకమె భూషణం బగు విశుద్ధ మనంబున నెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  8. ఆకులతనొందు నెడదకు
    శోకమె భూషణముగన, విశుద్ధమనమునన్
    సాంఖ్యునిఁ గొలువగ నిచ్చున
    నేకపు భాగ్యంబులవియ నిత్యము మనకున్

    రిప్లయితొలగించండి
  9. లోకపు పోకడన్ భువి విలోకన చేసిన స్త్రీలు సౌమ్యులున్
    శ్రీకరమున్ ఘటించనల చేయుచునుంద్రు కుటుంబ కార్యముల్
    చేకుర శాంతి వారలకు, చేయగ లేరు దుర మ్మనాదిగా
    శోకమె భూషణంబగు విశుద్ధమనంబున నెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  10. వ్యాకులమొందు మానసము హర్షము నొందగఁ జూడఁ గోరుచో
    శోకమె భూషణంబగు విశుద్ధమనంబున నెంచి చూడఁగన్
    గోకలు గావు భూషణము గూరిమి తోడను బల్కరింపులే
    శ్రీకర మౌను నెల్లరకు శ్రేయము ,సౌఖ్యము లబ్బు మాధవా!

    రిప్లయితొలగించండి
  11. డా బల్లూరి ఉమాదేవి

    చీకాకులు బాధింపగ
    శ్రీకాంతుని తలచిచేయసేవలనెపుడున్
    నేకాగ్రతచూపగని
    శ్శోకమె భూషణముగన విశుద్ధమనమునన్

    రిప్లయితొలగించండి