10, నవంబర్ 2022, గురువారం

సమస్య - 4246

11-11-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీపతి నెలవంకఁ దాల్చె శీర్షముపైనన్”
(లేదా...)
“శ్రీపతి మెచ్చి తాల్చెనఁట శీర్షముపై నెలవంక నొప్పుగన్”

27 కామెంట్‌లు:

  1. కందం
    శాప వశునాదరించియు
    నాపై వరముగ శివుండు నాశ్రితు శూక
    మ్మేపార, భళా! యనఁగన్
    శ్రీపతి, నెలవంకఁ దాల్చె శీర్షము పైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      శాపవశంబునన్ గుములు చంద్రుని జేరగ దీసి భీతినిన్
      బాపి యొసంగియున్ వరము పన్నగ భూషణుడాదరంబునే
      జూపుచు పష్పమన్ బగిది సొంపగు రీతిగ భేషు భేషనన్
      శ్రీపతి మెచ్చి, తాల్చెనఁట శీర్షముపై నెలవంక నొప్పుగన్!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లక్ష్మిని' టైపాటు. "శాపవశుని నాదరించె" అనండి. మూడవ పాదంలో గణభంగం. అయినా మూడవ పాదంలోని ప్రశ్నకు సమాధానం అన్వయం కుదిరినట్లు లేదు.

      తొలగించండి
  3. చంద్రుని ధరించిన శివుని గురించి నారదుడు నారాయణునకు చెప్పుట
    కం.
    కోపము చెతన్ దక్షుడు
    శాపము నీయంగనట్టి, శశిబింబముకున్
    శాపము మాన్పగ హరుడిల
    శ్రీపతి! నెలవంకఁ దాల్చె శీర్షముపైనన్

    రిప్లయితొలగించండి
  4. కోపము తోడ దక్షుడటు క్రూరముగా శపియించి నంతటన్
    శాపవశుండు చంద్రుడిఁక శంకరునే శరణంబు వేడినన్,
    దాపము దీర్ప బూని యమృతాంశుని గావగ నెంచ, జూడ నా
    శ్రీపతి, మెచ్చి తాల్చెనఁట శీర్షముపై నెలవంక నొప్పుగన్.

    రిప్లయితొలగించండి
  5. కాపాడ జక్రము గొనెను
    శ్రీపతి ; నెలవంకఁ దాల్చె శీర్షముపైనన్
    తాపసియగు పరమశివుడు
    పాప హరులిరువురికివియె ప్రతిమగ నిలుచున్

    రిప్లయితొలగించండి

  6. *(శ్రీపతి తో మిత్రుడు చెబుతున్న మాటలు)*

    కోపముమ దక్షుడొసగెను
    శాపమనుచు వగచుచున్న స్మరసఖుని సం
    తాపము దీర్చి గిరీశుడు
    శ్రీపతి ! నెలవంకఁ దాల్చె శీర్షముపైనన్.


    ఆ పరమేష్టి నాభిజున కానన మయ్యెను శారదాంబయే
    పాపహరుండభీష్టమున వక్షము గౌస్తుభమున్ ధరించె నా
    శ్రీపతి, మెచ్చి తాల్చెనఁట శీర్షముపై నెలవంక నొప్పుగన్
    శాపమునంది కుళ్ళుకొన జాలిని జూపుచు నీలకంఠుడే.

    రిప్లయితొలగించండి
  7. తాపింఛముదాల్చుసతము
    *“శ్రీపతి నెలవంకఁ దాల్చె శీర్షముపైనన్”*
    ఆపగతోడనుముదమున
    నాపురహరుడౌపినాకియానందముతో

    రిప్లయితొలగించండి
  8. కందం
    శ్రీపాథోనిధి జాతన్
    జేపట్టెను హరి,హరికొనె శ్రీకల్పకమున్
    బాపురె!కైలాసగిరి
    శ్రీపతి నెలవంకఁదాల్చె శీర్షము పైనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      బాపురె!సూత్రధారియట!భాసుర శంకర పాత్రధారియౌ
      శ్రీపతి,మెచ్చి తాల్చెనట శీర్షముపై నెలవంకనొప్పుగన్
      పాఁపవిభూషణంబులును,భస్మవిలేపన శంఖఢక్కలున్
      జూపరులున్ బళీ!యనగ శోభిలె నాటకరంగమందునన్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. శాపగ్రస్తుడయి వగచు
    నా పక్షజునాదుకొనగ నయనాయుధుడే
    చూపుచు కృప వీక్షింపన్
    శ్రీపతి నెలవంకఁ దాల్చె శీర్షముపైనన్

    రిప్లయితొలగించండి
  10. మూపున శైలము మోసెన్
    శ్రీపతి, నెలవంకఁ దాల్చె శీర్షముపైనన్
    దీపుగ శంకరుఁ, డురమును
    మాపతి లక్ష్మికి, తనువుహిమకుశివుడొసగెన్

    ( మాపతి= విష్ణువు)

    రిప్లయితొలగించండి
  11. మూపున శైలమున్ హరియె మోసెను కూర్మముగా, సగంబిడెన్
    దీపుగశంకరుండుమకు దేహము నందు, శభాషటంచనన్
    శ్రీపతి మెచ్చి తాల్చెనఁట శీర్షముపై నెలవంక నొప్పుగన్,
    మాపతిదాల్చె సింధుజను మన్ననగా తన డెందమందునన్

    రిప్లయితొలగించండి
  12. కోపమున దక్షు డొ సగెను
    శాపము శశి వేడె శివుని జాలిగ వానిన్
    గాపాడ నిశ్చ యించియు
    శ్రీపతి నెలవంక దాల్చె శీర్షము పైనన్

    రిప్లయితొలగించండి
  13. ఆ పార్వతీ మనోహరుఁ
    డా పరమ శివుండు దీను నా శశిఁ బ్రీతిం
    గాపాడఁగఁ బ్రేత వన
    శ్రీ పతి నెలవంకఁ దాల్చె శీర్షము పైనన్

    శాప మొసంగ మామయె ప్రజాపతి దక్షుఁడు చంద్రుఁ డంతటం
    బ్రాపున కేఁగి యంజలినిఁ బ్రార్థన సేయ సభక్తి శంభు నా
    యాపద నుండి కావ నిటలాక్షుఁడు నీలగళుండు హర్షిత
    శ్రీపతి మెచ్చి తాల్చెనఁట శీర్షముపై నెలవంక నొప్పుగన్

    రిప్లయితొలగించండి