24, నవంబర్ 2022, గురువారం

సమస్య - 4259

25-11-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తండ్రి మరణింప సుతులు ముదంబుఁ గనిరి”
(లేదా...)
“తండ్రి గతింపఁగన్ గడు ముదంబును పొందిరి పుత్రు లత్తఱిన్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)

30 కామెంట్‌లు:

  1. గతము నెలకొన్న చరితల గమనముగన
    భూసుతులు పల్వురిలలోన బుట్టినారు
    రాజ్య పాలన కాంక్షతో రగిలి నారు
    తండ్రి మరణింప సుతులు ముదంబుఁ గనిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తీండ్రిలు శోకమున్ వగచి తీరని దుఃఖితు లైరిటన్ సుతుల్
      తండ్రి గతింపఁగన్, గడు ముదంబును పొందిరి పుత్రు లత్తఱిన్
      తండ్రి గుణంబులన్ బొగడతక్కొను వారలు లెక్కబెట్ట పె
      క్కండ్రు నుతించుచున్ తమను గాచిన వాడని వెల్లడించగన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. తేటగీతి
    వంద మందినిఁగని బాధపడిరి తల్లి
    తండ్రి ,మరణింప సుతులు;-ముదంబుఁగనిరి
    పాండు రాజకుమారులు మెండుగాను
    శ్రీ కురుక్షేత్ర సంగ్రామ సీమలోన.

    రిప్లయితొలగించండి
  3. ముద్దు మురిపాల నందించి మోద మిడిచు
    దోహద మొన ర్చె తానుంచు దుఃఖ పడిరి
    తండ్రి మరణింప సుతులు : ముదంబు గనిరి
    యట్టి తండ్రి నొసగె నని యజు న క ప్డు

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    పాము గదిలోన తిరుగాడ బాలలేడ్వ
    భయము వలదని ధైర్యంపు పలుకులాడి
    తుట్టతుదకట కర్రతో కొట్టినంత
    తండ్రి, మరణింప సుతులు ముదంబుఁ గనిరి

    కందం
    ఉరగమును గొట్టె మొనగా
    డుర 'తండ్రి! గతింపగన్ కడు ముదంబును పొం
    దిరి పుత్రులత్తరిన్' దమ
    వెరపునకదె కారణమను విసుగున గనుచున్

    రిప్లయితొలగించండి

  5. గుండెలవిసెడు విధమున కొమిరెలెల్ల
    రేడ్చుచుండిరి మిక్కిలి యెరివు తోడ
    తండ్రి మరణింప, సుతులు ముదంబుఁ గనిర
    తను గడించిన కోట్లాది ధనము దక్క.


    వేండ్రము హెచ్చుగానుగల వేసవి యందున చేరినట్టి య
    ళ్ళుండ్రును బొట్టెలెల్లరును రోదన చేయుచు నుండిరే యటన్
    దండ్రి గతింపఁగన్ , గడు ముదంబును పొందిరి పుత్రు లత్తఱిన్
    కొండ్రను దున్నువేళనట కోట్లధనంబు లభించి నందుకై.

    రిప్లయితొలగించండి
  6. పలురకముల తెవులతోడ బాధ బడుచు,
    వత్సరములాది మంచము బట్టి
    యున్న
    దండ్రి మరణింప , సుతులు ముదంబుఁ గనిరి
    తుదకిపుడతనికి విముక్తి దొరకె ననుచు

    రిప్లయితొలగించండి
  7. పెనుపు పాపపు కలికాల పేరలోన
    ఆస్తిపాస్తులు అలనాడె అపహరించి,
    అవసరమ్ములు దీరాక అరుగుకీడ్చి,
    తండ్రి మరణింప సుతులు ముదంబు గనిరి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తీరాక' అనడం వ్యావహారికం. "అవసరమ్ములు దీరగా నరుగు కీడ్చి" అనండి.

      తొలగించండి
  8. ఉత్పలమాల
    కండ్రిక గ్రామమున్ విడిచి కాసులు దెచ్చియు వేడ్కమీఱ,బి
    డ్డండ్రను సాక గోరియు హుటాహుటి నౌకరికై దుబాయికిన్
    తండ్రి గతింపగన్ , గడు ముదంబును పొందిరి పుత్రులత్తఱిన్
    పుండ్రము దాల్చియున్ నుదుట బూజలుసేసిరి కల్మిరాకకై.

    రిప్లయితొలగించండి
  9. ఈండ్రకులమ్మునన్ గలిగి యింపుగ సైనికుడై యరాతిపై
    తీండ్రపు రోషమొందుచును దేశము కోసము పోరుచేయుచున్
    తండ్రి గతింపఁగన్, గడు ముదంబును పొందిరి పుత్రు లత్తఱిన్
    కొండ్రనొసంగి గ్రామమున కూర్చెను నెమ్మి ప్రభుత్వ మిచ్ఛతో

    రిప్లయితొలగించండి
  10. దీనిలో పెద్ద సమస్య ఏముంది గురువు గారు?చాలా సహజమే కదా!
    (సబ్జెక్ట్ లో సమస్య లేదు.సంయుక్తాక్షరం ఉంటే చాలు లే!అదే సమస్య అని ఇచ్చి ఉంటారు పృచ్ఛకులు. Just for fun)

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:తండ్రి లేడని సుతులు బాధను మునింగి
    తేరుకొనిరి ,వృద్ధాప్యమ్ము తెచ్చు నట్టి
    తీవ్ర రోగమ్ములన్ మున్ గి తేల కుండ
    తండ్రి మరణింప సుతులు ముదమ్ము గనిరి
    (తండ్రి మరణం బాధే ఐనా ఎక్కువ రోగాల బారిన పడకుండా మరణించినందుకు సంతోషించారు.)

    రిప్లయితొలగించండి
  12. తీరెఁ గష్టము లెల్లను గోరిన విధి
    నుండ వచ్చు నంచు నెదల మెండు గాను,
    నరకమును జూపి బాధించిన పగ వాని
    తండ్రి మరణింప, సుతులు ముదంబుఁ గనిరి

    అం డ్రిటు లెల్లరుం బుడమి నాత్మ కృతాఘ ఫలమ్ము నెందు నొ
    క్కండ్రు కలండె దాఁటఁగను గాంచఁ బురాకృత దుష్ట కర్మముల్
    తీండ్రములౌ విధమ్ముగ విధించిన దుఃఖ పరంపరల్ వెసం
    దండ్రి! గతింపఁగన్ గడు ముదంబును బొందిరి పుత్రు లత్తఱిన్

    రిప్లయితొలగించండి
  13. ఉ:గుండ్రని చేతి వ్రాత దనకున్ గల యాస్తికి విల్లు వ్రాసి,పె
    క్కండ్రకు నప్పు దీర్చి,తన కాలపు లెక్కల వ్రాసి పెట్టి యా
    కండ్రిక లోన నే తగవు గల్గని యాస్తిని కూడ బెట్టి యే
    తండ్రి గతింపగన్ కడు ముదమ్మును బొందిరి పుత్రు లత్తరిన్

    రిప్లయితొలగించండి
  14. ఉ:తండ్రిని గారవించకయు,దల్లిని దాసిగ నెంచి ,యూర పె
    క్కండ్రకు వారు దుష్టులని కల్పితగాధల జెప్పి రోగి యై
    తండ్రి గతింపగన్ కడు ముదమ్మును బొందిరి పుత్రు , లత్తరిన్
    తండ్రి నెరుంగు సజ్జనులు తప్పని చెప్పిరి నీతివాక్యముల్
    ("తండ్రి గతింపగన్ కడు ముదమ్మును బొందిరి"అన్నప్పుడు ఆ సమయం లో అనే అర్థం ఎలాగూ వస్తుంది.కాబట్టి "అత్తరిన్" అనే పదం అవసరం కాదు.కాబట్టి ఇక్కడ వారి ప్రవర్తనని సమాపకక్రియ గా చెపోఅసి అత్తరిన్ ఏమి జరిగిందో చెప్పి ఇలా మరొక పూరణ చేశాను.)

    రిప్లయితొలగించండి
  15. దిక్కు లేనట్టి వారైరి దీను లగుచు
    తండ్రి మరణింప ,సుతులు ముదంబుఁ గనిరి
    కోట్ల కొలదిగ నాస్తిని గూడఁ బెట్టి
    యీయ, లోటులే దని తమ కింక యనుచు

    రిప్లయితొలగించండి
  16. అండ్రు జనావళుల్ గడున యాచిత సంపదఁగోరువాఁడుగా
    తండ్రి గతింపన్ , గడు ముదంబును పొందిరి పుత్రులత్తఱిన్
    దీండ్రిలు గారవంబున యతీంద్రుల వోలెను బిక్కటిల్లగాఁ
    దండ్రిని జుచి నత్తఱిని దక్కిన వారును జేతులెత్తిరే

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.

    పలు వ్యసనముల కలవాటు పడిన తండ్రి
    భార్యనే కొట్టి హింసించి ప్రతి దినంబు
    వదలివైచి సంసారపు బాధ్యతలను
    మత్తులో తూలి రోడ్డు ప్రమాదమందు
    తండ్రి మరణింప సుతులు ముదంబుఁ గనిరి.

    రిప్లయితొలగించండి
  18. ఉ.

    పుండ్రము జక్కగా నుదుట బూడిదచే ధరియింపగన్ శివున్
    గుండ్రపు లింగమున్ దలచి కూర్మిని వేడుచు వారణాసిలో
    తండ్రి సుబోధమే మునుక దైవము గంగను ముక్తి గోరుచున్
    *"తండ్రి గతింపఁగన్ గడు ముదంబును పొందిరి పుత్రు లత్తఱిన్”*

    రిప్లయితొలగించండి