6, నవంబర్ 2022, ఆదివారం

సమస్య - 4242

7-11-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మావి కొమ్మకుఁ బూచెను మల్లెపూలు”
(లేదా...)
“మల్లెలు పూచె ముచ్చటగ మామిడి కొమ్మకు మాఘమందునన్”

14 కామెంట్‌లు:

  1. తేటగీతి
    పెళ్లిమూర్తాలు మాఘాన వెల్లువయ్యె
    ప్రీతి పెళ్ళి వేది నలంకరింపనెంచి
    తీర్చ సృజనాత్మకమ్ముగ దివ్యమౌచు
    మావి కొమ్మకుఁ బూచెను మల్లెపూలు

    ఉత్పలమాల
    తల్లియు తండ్రియున్ మురిసి ధాత వరమ్మున నిశ్చయమ్మనన్
    గళ్లకు విందుఁజేయ సృజనాత్మకమంచనఁ దీర్చిదిద్దగన్
    బిల్లల పెళ్ళి పందిరికి వేడ్కనలంకరణమ్ములెల్లయున్
    మల్లెలు పూచె ముచ్చటగ మామిడి కొమ్మకు మాఘమందునన్

    రిప్లయితొలగించండి
  2. శాస్త్రవేత్తల కృషి వల్ల సంత రించె
    యద్భు తంబులు పెక్కులీ యవని యందు
    మావి కొమ్మకు బూచె ను మల్లె పూలు
    గాంచి రబ్బురo బుజనులు కన్నులార

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    నవ వసంతుని రాకతో నలుదెసలను
    గుత్తులుగఁగాచెఁగాయలు క్రొత్త గున్న
    మావి కొమ్మకుఁ;బూచెనుమల్లెపూలు
    సన్నజాజి,గులాబీలు మిన్నగాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      అల్లదె చూడుమా!కడు ప్రియంబున నల్లుకు పోయి తీగలున్
      మల్లెలు పూచె ముచ్చటగ మామిడి కొమ్మకు; మాఘమందునన్
      పెళ్ళిని చేసి రెండిటికి విందులు సల్పుదమంచు నెచ్చెలుల్
      గొల్లున నవ్వుచుంజనిరి కూర్మిని కుంజ నికుంజ సీమలన్.

      తొలగించండి
  4. మండువేసవియందున మల్లెపూలు
    చూతఫలములు మనసుకు సుఖమునిచ్చు
    విరఁగబూసెను చూతముల్ విరివిగాను
    మావి కొమ్మకుఁ, బూచెను మల్లెపూలు

    రిప్లయితొలగించండి
  5. పల్లెల నుండు పామరుల, పౌరుల నెల్లర మోసగించుచున్
    చిల్లర నాశ జూపి తమ చిత్తము రంజిలు భాషణమ్ములన్
    కల్లరి నాయకాధముల కౌగిలులందున నెన్నికందునన్
    మల్లెలు పూచె ముచ్చటగ మామిడి కొమ్మకు మాఘమందునన్.

    రిప్లయితొలగించండి

  6. ముచ్చటపడి ముదితయె తా పోరుపెట్టి
    మల్లె మొలకను నాటెనా మ్రాను చెంత
    వృక్షమాలంబనగ తీగ పెరిగి పూయ
    మావి కొమ్మకుఁ బూచెను మల్లెపూలు,


    చల్లనితల్లి బ్రహ్మసతి జన్మదీనమ్ము వసంత పంచమిన్
    తెల్లని మల్లెలన్ జడను ధీటుగ దాల్చికుఠారమెక్కగా
    పిల్లయె దాల్చినట్టి నన వృక్షముపైఁ బడ గాంచి పల్కిరే
    మల్లెలు పూచె ముచ్చటగ మామిడి కొమ్మకు మాఘమందునన్.

    రిప్లయితొలగించండి
  7. పుష్పమాసమరుగుదెంచె పుడమిపైకి
    కనుల కింపైన కాయలు గాచె గున్న
    మావి కొమ్మకుఁ; బూచెను మల్లెపూలు
    మల్లె తోటనిండుగ పరిమళము నింపి

    రిప్లయితొలగించండి
  8. పాయెను వసంత కాలము, పల్లవించె
    మావి కొమ్మకుఁ : బూచెను మల్లెపూలు
    వాటి కనువగు కాలము వచ్చినంత
    మధుర సొరముతో తావియు మదముగూర్చె

    రిప్లయితొలగించండి
  9. ఎల్లెడలన్ నితాంతమగు నెండలు కాయుచునుండ వేడిమిన్
    తల్లడమొందు జీవులకుఁ దాలిమిఁగూర్చ హృదంతరంబులన్
    మల్లెలు పూచె ముచ్చటగ, మామిడి కొమ్మకు మాఘమందునన్
    జిల్లన జిహ్వ కాచినవి చిత్తము రంజిలజేయ చూతముల్

    రిప్లయితొలగించండి
  10. తెల్ల వాఱు జామునఁ గుర్యఁ దెల్లని వగు
    మంచు బిందువు లాకుల యంచు లందుఁ
    దోఁచె నప్పట్టు నందిట్లు వేచి చూడ
    మావి కొమ్మకుఁ బూచెను మల్లెపూలు

    నల్లని వాఁడు పద్మ నయనమ్ముల వాఁ డటఁ గాఁగ మాయమే
    వల్లవు లెల్ల నుల్లములు వ్రక్కలు కా విర హానలమ్ముతో
    నెల్లరు వేఁగి చేరఁగ నగేంద్రములం బరికింప వెన్నునిన్
    మల్లెలు పూచె ముచ్చటగ మామిడి కొమ్మకు మాఘ మందునన్

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.

    మామిడి తరువు ప్రక్కన మల్లెమొక్కఁ
    పెరటి యందున నొక్కటి పెంచగాను
    మల్లె తీగలు ప్రాకి యా మావి పైకి
    సుమములున్ బూయ ననిరిట్లు
    చూపఱులును
    మావి కొమ్మకుఁ బూచెను మల్లె పూలు.

    రిప్లయితొలగించండి
  12. మావిచిగురుబూసెను చైత్రమాసమందు
    *“మావి కొమ్మకుఁ ,బూచెను మల్లెపూలు”*
    మల్లెతీగకునతిపరిమళముతోడ
    పరవశించుచు కోయిల పాటపాడె

    రిప్లయితొలగించండి