12, నవంబర్ 2022, శనివారం

సమస్య - 4248

13-11-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తరువులఁ గూల్చంగ మేలు దప్పక కల్గున్”
(లేదా...)
“తరువులఁ గూల్చినన్ హితము దప్పక గల్గును మానవాళికిన్”

37 కామెంట్‌లు:

  1. కందం
    సిరిఁ బడయుటె లక్ష్యమ్మై
    గురిజూచి ప్రచారమునకు కూడులులందే
    ర్పఱచెడు నశ్లీలపు చి
    త్తరువులఁ గూల్చంగ మేలు దప్పక కల్గున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      సిరిఁ బడయంగ బాలలకు చేటునొనర్చెడు రీతి స్వార్థమై
      గురినిడి మీరి క్రిక్కిరియు కూడలులందు ప్రచారమెంచి యే
      ర్పఱచ, నసభ్యమౌ సరళి భామల భంగిమలున్న పెద్ద చి
      త్తరువులఁ గూల్చినన్ హితము దప్పక గల్గును మానవాళికిన్

      తొలగించండి
    2. మరో ప్రయత్నము...

      విరాటరాజు కొలువులో కంకుడు వలలునితో...

      కందం
      నిరతము నీడఁ బ్రజలకిడు
      హరితపు వృక్షమ్ము వలల! యందితె గూల్చన్
      సరిగాదు, చీడ పట్టినఁ
      దరువులఁ గూల్చంగ మేలు దప్పక కల్గున్

      చంపకమాల
      నిరతము బాటసారులకు నీడనొసంగెడు వృక్షరాజమున్
      హరితమునై మనన్ వలల! యందితె గూల్చఁగ నొప్పరెల్లరున్
      బరిసర వృక్షముల్ జెడగఁ బట్టగఁ జీడ నవశ్యమంచనన్
      దరువులఁ గూల్చినన్ హితము దప్పక గల్గును మానవాళికిన్

      తొలగించండి
    3. మీ నాలుగు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. కందం
    విరివిగ వీధుల గనబడు
    నెఱవు కుఱుచ నైన వస్త్ర నెఱికొలుపు సినీ
    సరసీ రమణులు పెడ చి
    త్తరువుల గూల్చంగ మేలు దప్పక కల్గున్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  3. కందం
    అరెరే!పథికుల దృష్టియు
    స్థిరముగఁబడుగద ప్రచార చిత్రంబుల,చె
    చ్చెర కరమశ్లీలపు చి
    త్తరువులఁగూల్చంగ మేలు దప్పకఁగల్గున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      వరఘనదేవళంబులను,వ్యాధులఁబాపెడి యాసుపత్రులన్
      సురుచిర పాఠశాలలను,శోభిత న్యాయసభాంగణమ్ములన్
      గురుతర పాలనంబు సమకూర్చగ వేగ ధనాఢ్యహీన యం
      తరువులఁగూల్చినన్ హితము దప్పక గల్గును మానవాళికిన్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  4. విరిబోణుల నగ్నత్వపు
    పరిలేకములే వెలిసెను ప్రకటన లనుచున్
    పురవీధులలో, నా చి
    త్తరువులఁ గూల్చంగ మేలు దప్పక కల్గున్.

    రిప్లయితొలగించండి
  5. చెఱుపగు పర్యావరణము
    తరువులఁ గూల్చంగ, మేలు దప్పక కల్గున్
    హరితవనంబుల విరివిగ
    తరువులు నాటిన, హితమగు తద్దయు ప్రజకున్

    రిప్లయితొలగించండి
  6. విరివిగ వీథులందున విభిన్న విచిత్ర
    వికార చిత్రముల్
    తరుచుగ బెట్టుచుంద్రు గని దారిన బోయెడు
    వారలెల్లరున్
    సరగున గండ్లు మూసుకొని సాగుచు
    నుందురుగాన యట్టి చి
    త్తరువుల గూల్చినన్ హితము దప్పక గల్గును మానవాలికిన్

    రిప్లయితొలగించండి
  7. తరువులఁ గూల్చఁగఁ జూచినఁ
    దరువు తరువునకు నొకపది తరువుల లెక్కన్
    బరువుగ విత్తుల నాటుచుఁ
    దరువులఁ గూల్చంగ మేలు దప్పక కల్గున్”

    రిప్లయితొలగించండి
  8. వరముగ లభించి జనులకు
    కర ముప యోగ పడుచు తాము కలిమి బలిమికిన్
    నిరతము సహాయ పడునే
    తరువుల గూ ల్చంగమేలుదప్పకకల్గున్?

    రిప్లయితొలగించండి

  9. సిరులను రాల్చునంచు పలు చిత్రము లందున బూతు దృశ్యముల్
    విరివిగ గూర్చి పట్టణపు వీధులనిండుగ నిల్పు చుందురే
    సురతపు చిత్రమాలికల చూడగ రోతయె పుట్టు నట్టి చి
    త్తరువులఁ గూల్చినన్ హితము దప్పక గల్గును మానవాళికిన్.

    రిప్లయితొలగించండి
  10. హరితవనంబు లేలుగడయై దనరారు జనాళికీ భువిన్
    చెఱుపగు నట్టి పెన్నిధుల జిన్నదనంబొనరించు తీరుగన్
    తరువులఁ గూల్చినన్, హితము దప్పక గల్గును మానవాళికిన్
    విరివిగ వృక్షజాలములఁ బెంచిన పచ్చదనంబు నింపినన్

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. తరువులఁ బెంచిన నిక్కము
      చిరకాలము మనకు కలుగు చింతలు తొలగున్
      పురవీధులలోనొరగిన
      తరువులఁ గూల్చంగ మేలు దప్పక కల్గున్

      తొలగించండి
    2. తరువులు పెంచినన్ గలుగు తామరతంపరలౌ ప్రయుక్తులే
      నరులకు జీవరాశులకనంతముగా పలురీతులందునన్
      పురమున మార్గమద్యమున ముప్పుగ మారిన వృక్షశాఖలన్
      తరువులఁ గూల్చినన్ హితము దప్పక గల్గును మానవాళికిన్

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. ధరణిపయి వేడిమి పెరుగు
    తరువులఁ గూల్చంగ ; మేలు దప్పక కల్గున్
    విరివిగ బెంచగ, నిలుచును
    సరియగు వాతావరణము సాలు నెరవుగన్

    రిప్లయితొలగించండి
  13. చం.

    తరువులు నెన్నియో గలవు ధారుణి రావణ రాజ్యమందునన్
    తరువుల బెళ్లగించగల దాసులు వానర వీరులందరున్
    తరువుల నాయుధంబులుగ దాల్చిరి చంపిరి రాక్షసేంద్రులన్
    *తరువులఁ గూల్చినన్ హితము దప్పక గల్గును మానవాళికిన్.*

    రిప్లయితొలగించండి
  14. కం:చిరు మ్రొక్క లేవి పెరుగవు
    విరివిగ భూసారము వటవృక్షము గుంజన్
    చిరు మ్రొక్కల్ బతుకగ వట
    తరువుల గూల్చంగ మేలు తప్పక గల్గున్

    రిప్లయితొలగించండి
  15. చం:తరుణుల దేహ భాగముల దాహము బెంచెడు రీతి జూపుచున్,
    పురుషుల చిత్తముల్ తగని పోరున జిక్కెడు రీతి జేసి, పల్
    తెరగులు గా ప్రమాదముల దెచ్చు నసభ్యము లైన చిత్ర చి
    త్తరువుల గూల్చినన్ హితము తప్పక గల్గును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చిత్ర చిత్తరువు' దుష్టసమాసం. "పాడు చిత్తరువుల.." అనవచ్చు గదా.

      తొలగించండి
  16. నిరతము సంఘమందునను నిర్భయ రీతిని మద్యమానుచున్
    తరుణుల మానమున్ జెఱచి దర్పముఁ జూపుచు హీన బుద్ధితో
    తిరమగు భీతమున్ జొనుపు త్రిమ్మరులన్ గని రక్షనిచ్చు ను
    త్తరువులఁ గూల్చినన్ హితము దప్పక గల్గును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  17. పరలోకమ్మునఁ దప్పవు
    గురుతర శిక్షలు కృతము లగు నఘావళికిం
    దరుణుల యసభ్యపుం జి
    త్తరువులఁ గూల్పంగ మేలు తప్పక కల్గున్

    తరువులు పండ్లు పూవులును ద్వక్కులు నాకులు నౌషధమ్ములున్
    నరులకు నిల్వ నీడలు ఘనమ్ముగ నిత్య మొసంగుఁ గోరకే
    పురుగులు వట్టి యెండినవి పూర్తిగఁ గొత్తవి నాట నెంచి యా
    తరువులఁ గూల్చినన్ హితము తప్పక కల్గును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  18. అరకొర దుస్తులు గల చి
    త్తరువులఁ గూల్చంగ మేలు దప్పక కల్గున్
    జెరచును యువకుల మతులవి
    తరుణులు నేర్వంగ వలయు ధర్మపు బుద్ధిన్

    రిప్లయితొలగించండి
  19. పురుగుల బారి స్రుక్కుచును మోడుగ మారిన చిన్న పెద్ద యౌ
    తరువులఁ గూల్చినన్ హితము దప్పక గల్గును మానవాళికిన్
    సరసము లౌస పోటలును జామలు మామిడి యాది మొక్కలన్
    విరివిగఁ బాత వచ్చునట వేగమె పండ్లను బొందగ వీలుగా నగున్

    రిప్లయితొలగించండి
  20. ఎరువులువేసి పొలములన్‌
    సరియగు మొలకలను నాటి సాగును జేయన్‌
    తెరువరియైన కృషాణుడు
    “తరువులఁ గూల్చంగ మేలు దప్పక కల్గున్”

    రిప్లయితొలగించండి
  21. కరువునివారనార్థమయి కర్షకులందరు లాభసాటిగన్
    పరువుగజీవనమ్ము నిలపాటిగజేయనుపాయ చిత్తులై
    బరువుగ పంటపండుటకు బాధగ నడ్డమువచ్చునట్టియా
    “తరువులఁ గూల్చినన్ హితము దప్పక గల్గును మానవాళికిన్”

    రిప్లయితొలగించండి
  22. కరుణ వహించి పేదలకు కమ్మని జీవన యానమిచ్చుచున్
    పరిణత జూపి విద్యలను వారలు వృద్ధిని పొందు నట్లుగా
    నిరతము పెక్కుకార్యముల నేర్పు ఘటిల్లగ జేసి జాతు లం
    తరువులఁ గూల్చినన్ హితము దప్పక గల్గును మానవాళికిన్

    రిప్లయితొలగించండి

  23. పిన్నక నాగేశ్వరరావు.

    కఱవుల్ దప్పవు భువిలో
    తరువులఁ గూల్చంగ; మేలు దప్పక కల్గున్
    స్థిర సంకల్పము తోడను
    విరివిగ వృక్షముల తతిని పెంచగ సతమున్.

    రిప్లయితొలగించండి