11, నవంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4247

12-11-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సత్సాంగత్యము వలదను సాహిత్యమ్మే”
(లేదా...)
“సత్సాంగత్యము వీడుమంచుఁ దెలుపున్ సాహిత్య మెల్లప్పుడున్”

20 కామెంట్‌లు:


 1. వత్సా! చేయగ వలయును
  సత్సాంగత్యము, వలదను సాహిత్యమ్మే
  కుత్సితులతోడ నెయ్యము,
  తత్సంబంధములెమనకు తనకల దెచ్చున్.

  రిప్లయితొలగించండి
 2. కుత్సితమునుబెంచునెపుడు
  సత్సాంగత్యము వలదను సాహిత్యమ్మే
  సత్సాంగత్యము నెరపగ
  నుత్సాహమ్ము పొదలాడు నొకపరి వినుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్సాహంబున నీవిధిన్ రచనలే యుక్తంబులౌనాకవీ
   సత్సాంగత్యము వీడుమంచుఁ దెలుపున్ సాహిత్య మెల్లప్పుడున్
   ప్రోత్సాహం బిడునా వినోద మిడునా పుంఖానుపుంఖాలుగా
   తత్సాహిత్యము వెల్వరించ దగునా తామీవిధానంబునన్

   తొలగించండి
 3. కందం
  ఉత్సాహము జూపకుమా!
  మాత్సర్యము రేపువారి మార్గమునందున్
  వత్సా! వీడగనెంతువె
  సత్సాంగత్యము, వలదను సాహిత్యమ్మే!

  శార్దూలవిక్రీడితము
  ఉత్సాహమ్మున దుష్టసంగతిని నీవొప్పంగ సంఘమ్మునన్
  మాత్సర్యమ్మున ముంచివైచు నడతన్ మానంగ లేవెప్పుడున్
  వత్సా! నీకది నష్టదాయకమనన్, వర్ధిల్లగా నొప్పుచున్
  సత్సాంగత్యము, వీడుమంచుఁ దెలుపున్ సాహిత్య మెల్లప్పుడున్

  రిప్లయితొలగించండి
 4. కుత్సితమతియొక్కండును
  మత్సరమున పల్కుచుండె మతిమంతునితో
  సత్సంగమువీడగనిల
  “సత్సాంగత్యము వలదను సాహిత్యమ్మే”

  రిప్లయితొలగించండి

 5. వత్సా! దూరకు సజ్జనాళినెపుడున్ భావమ్ముతో మెల్గుచున్
  సత్సంబంధము నిల్పుకొన్ననదియే సత్కీర్తినే దెచ్చు నా
  సత్సాంగత్యము, వీడుమంచుఁ దెలుపున్ సాహిత్య మెల్లప్పుడున్
  మాత్సర్యమ్మును క్రోధ లోభములనే మర్త్యుండటంచున్ గదా.

  రిప్లయితొలగించండి
 6. కందం
  సత్సాంగత్యమువలనన్
  ఉత్సాహము దైవభక్తి యురవడి యగుగా
  మాత్సర్యంబును బెంచు,న
  సత్సాంగత్యము వలదను సాహిత్యమ్మే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మత్తేభము
   సత్సాంగత్యముఁజేసినంతఁగలుగున్ శాంత్యాది సద్భావముల్
   మాత్సర్యంబును కామ మోహ మదముల్ మాయంబగున్ నెమ్మదిన్
   వత్సా!భక్తినిఁజేయగావలయు దైవారాధనంబుల్ సదా
   సత్సాంగత్యము వీడుమంచుఁదెలుపున్ సాహిత్యమెల్లప్పుడున్.
   సదా+అసత్ =సదాసత్

   తొలగించండి

 7. కుత్సితులతోడ మైత్రిని
  యుత్సాహముతో నెఱపుచు యోగ్యుల పట్లన్
  మత్సరము జూపి వీడకు
  సత్సాంగత్యము, వలదను సాహిత్యమ్మే.

  రిప్లయితొలగించండి
 8. ఉత్సాహము బెంచు ను గద
  సత్సాంగత్యము :వలదను సాహిత్యమ్మే
  మత్సరము పెంచి జగతిన్
  కుత్సితము కు పాదు యగును గొప్పగసుకవీ!

  రిప్లయితొలగించండి
 9. వాత్సల్యంబును జూపు దేశికులిలన్ వాక్రుచ్చు వాక్యాళి, సం
  విత్సంపన్నత నిచ్చు గాదె చదువన్ వేదంబులున్, శాస్త్రముల్,
  సత్సాంగత్యము; వీడుమంచుఁ దెలుపున్ సాహిత్య మెల్లప్పుడున్
  వత్సా! కుత్సిత బుద్ధి, మత్సరములన్ వారింపు మెల్లప్పుడున్.

  యజ్ఞభగవాన్ గంగాపురం

  రిప్లయితొలగించండి
 10. ఉత్సాహ బరచు గవులను
  సత్సాంగత్యము ; వలదను సాహిత్యమ్మే
  కుత్స పదము లేలనిన, ని
  రుత్సాహ బరచు బఠకుల లోకము నందున్

  రిప్లయితొలగించండి


 11. ఉత్సాహముతోచేయుము
  కుత్సితులనుచేరివారికూరిమినెపుడున్
  మత్సరములనిలబాపును.
  సత్సాంగత్యము,వలదను,సాహిత్యమ్మే

  రిప్లయితొలగించండి
 12. మాత్సర్యము విడుము, విడకు
  సత్సాంగత్యము, వలదను సాహిత్యమ్మే
  మత్సరభూయిష్టమయిన,
  వాత్సల్యము నెనరుగూర్చు వరువడి గనుమా!

  రిప్లయితొలగించండి
 13. వాత్సల్యంబును సత్స్వభావమును నవ్యాజంబుగా దెల్పుతన్
  సత్సాంగత్యము, వీడుమంచుఁ దెలుపున్ సాహిత్య మెల్లప్పుడున్
  మాత్సర్యంబును దుష్టభావనములున్ మౌఢ్యంబు దుష్కృత్యముల్
  ప్రోత్సాహంబొనరించు సాధనములౌ పొత్తంబులన్ చెచ్చెరన్

  రిప్లయితొలగించండి
 14. కందం
  కుత్సిత బుద్ధిని జెప్పెడు
  మత్సరపు పలుకులవియగు మాట వరుసకున్
  తాత్సారము లేక విడుము
  సత్సాంగత్యము వలదను సాహిత్యమ్మే.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 15. ప్రోత్సాహము లభియించును
  గుత్సితపుఁ బనులకు భృశము ఘోరమ్ముగ బీ
  భత్స మగు వీడ వలయు న
  సత్సాంగత్యము వల దను సాహిత్యమ్మే

  వత్సా నిక్కము నాలకింపు తగ నీ వాక్యమ్ములన్ శ్రద్ధగా
  సత్సంబంధము లిచ్చు సత్ఫలములం జక్కంగ నిద్ధాత్రి న
  త్యుత్సాహమ్మునఁ జేర రాదు జనులన్ దుష్టాలిఁ బాపివ్ర జా
  సత్సాంగత్యము వీడుమంచుఁ దెలుపున్ సాహిత్య మెల్లప్పుడున్

  [వ్రజ+ అసత్సాంగత్యము= వ్ర జాసత్సాంగత్యము ]

  రిప్లయితొలగించండి
 16. సత్సాంగత్యము మేలది
  సత్సాంగత్యమ్ము వలన సత్కీర్తుండౌ
  కుత్సితుల పలుకు లీయది
  సత్సాంగత్యము వలదను సాహిత్యమ్మే

  రిప్లయితొలగించండి
 17. సత్సాంగత్యము వీడుమంచుఁ దెలుపున్ సాహిత్య మెల్లప్పుడున్
  వత్సా! మద్యపు మాట లేయవి వినన్ భావ్యమ్ము గాఁదోచునే?
  సత్సాంగత్యము మేలుఁ జేయును గదా సాహిత్య లోకమ్ము నన్
  సత్సాంగత్యముఁ జేయు మా నిర తమున్ సత్కీర్తి నొందంగ గా

  రిప్లయితొలగించండి

 18. పిన్నక నాగేశ్వరరావు.

  హృత్సంబంధిత మైనది
  సత్సాంగత్యము; వలదను సాహిత్యమ్మే
  కుత్సితుని తోడ స్నేహము
  మత్సరమున్ జూప సాటి మనుజుల
  యెడలన్.

  రిప్లయితొలగించండి