30, నవంబర్ 2022, బుధవారం

సమస్య - 4265

1-12-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాలు మేలు గూర్చె గ్రామమునకు”
(లేదా...)
“కాలే మేలొనఁగూర్చ విల్లసిలె నా గ్రామంబునన్ సౌఖ్యముల్”

31 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    కలుషితమొనర యమున కాళీయుఁడెగయుచు
    హానిగూర్చె జీవులలమటింప
    ఫణుల నటనమాడి బాలగోపాలుని
    కాలు మేలు గూర్చె గ్రామమునకు

    శార్దూలవిక్రీడితము
    కాళీయుండట క్ష్వేళమున్ యమునలోఁ గ్రమ్మంగ జృంభింపగన్
    వాలాయమ్ముగఁ గావ జీవులనహో 'ఫాలాక్షుఁ' డన్ రీతిగన్
    గూలన్ద్రొక్కెను 'నాట్యమా' డి ఫణులన్, గోపాలకృష్ణయ్యదౌ
    కాలే మేలొనఁగూర్చ విల్లసిలె నా గ్రామంబునన్ సౌఖ్యముల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏

      సవరించిన ఆటవెలది..

      ఆటవెలది
      కలుషమొనర యమున కాళీయుఁడెగయుచు
      హానిగూర్చె జీవులలమటింప
      ఫణుల నటనమాడి బాలగోపాలుని
      కాలు మేలు గూర్చె గ్రామమునకు

      తొలగించండి
  2. పల్లెలోని జనులు పలువురు వ్యాధి దం
    ష్ట్రములజిక్కి దుర్మరణమునొంద
    తక్షణంబు నటకు తరలింపబడిన టీ
    కాలు మేలు గూర్చె గ్రామమునకు

    రిప్లయితొలగించండి

  3. పల్లె సీమ లవియె పట్టుగొమ్మలు దేశ
    మునకని దలచుచు ప్రభుత్వమది ప్ర
    వేశ పెట్టి నట్టి వాసియౌ పలు పథ
    కాలు మేలు గూర్చె గ్రామమునకు.

    రిప్లయితొలగించండి
  4. బాధకు గురి యయ్యె భారతము కరోన
    వ్యాధి దేశ మంత వ్యాప్తి చెంద
    శాస్త్ర వేత్త ల కృషి సఫల మై వేయ టీ
    కాలు మేలు గూర్చె గ్రామ మునకు

    రిప్లయితొలగించండి
  5. పల్లె సీమలెపుడు పచ్చదనము తోడ
    నిండ వలయు నన్న నేతలెల్ల
    చిత్త శుద్ధి తోడ చేయనెంచెడు
    పథ
    “కాలు మేలు గూర్చె గ్రామమునకు”

    రిప్లయితొలగించండి
  6. ఆటవెలది
    ఘోరమౌ "కరోన"యూరూర బ్రాకగా
    వ్యాధి బారి బడియు బ్రజలు వగవ
    వేగ వెళ్ళివైద్య బృందంబు వేయు,టీ
    కాలు మేలు గూర్చె గ్రామమునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలము
      ఆలోకించగ గుండియల్ కరుగుగా యౌరా!'కరోనా'యె,దు
      ర్లీలన్ కాటును వేసి మానవులనే క్లేశంబులన్ ముంచె,ని
      ర్మూలింపంగను వేయ వైద్యతతులాలోచించియున్ వేగ ,టీ
      కాలే మేలొనగూర్చ విల్లసిలె నా గ్రామంబునన్ సౌఖ్యముల్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. కాలుష్యంబది ప్రజ్వరిల్లు గదరా క్ష్మాజమ్ములన్ ద్రుంచినన్
    మూలంబౌనది పెక్కురోగములకున్ మూర్ఖత్వ మున్ వీడుచున్
    నేలన్ నాటెదమింక మొక్కలననే నేమమ్ముతో నన్న చి
    ట్కాలే మేలొనఁగూర్చ, విల్లసిలె నా గ్రామంబునన్ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  8. వీడునగల చొఱల విద్యపెంపొం దించు
    లక్ష్యమొంది యా పురజనులచట
    కలసి యేర్పరచిన గ్రంధాలయపు పుస్త
    కాలు మేలు గూర్చె గ్రామమునకు

    రిప్లయితొలగించండి
  9. పల్లెటూరియొక్క ప్రగతినిఁ గోరుచు
    ప్రభుత యోజనలను బరగనీయ
    ఫలమునొంది జనుల బలిమిఁ బెంచిన పథ
    కాలు మేలు గూర్చె గ్రామమునకు

    రిప్లయితొలగించండి
  10. లేలేబ్రాయపు పిల్లలందుఁగనగా రేచీకటిన్ ధాతులో
    పాలే కారణమంచు వైద్య నిపుణుల్ వాక్రుచ్చ గత్యంతరం
    బాలోచించియు యోజనల్నెరపగా నాగ్రామమందట్టి చి
    ట్కాలే మేలొనఁగూర్చ విల్లసిలె నా గ్రామంబునన్ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  11. వాదములకు నింక భేదములకుఁ దావు
    లేక యుండు నట్టి రీతి యచట
    మూర మేలుగ నధికారంపు టా పంప
    కాలు మేలు గూర్చె గ్రామమునకు

    కాలాతీతము కాక మున్న సిరి భూకాంతుల్ స్వదేశమ్మునన్
    లోలత్వమ్ముల నెల్ల వీడి తగ నాలోచించి వేగమ్ముగా
    మేలౌ రీతి వ్యయమ్ము సేయఁగను సంప్రీతిం బరీక్షించి సుం
    కాలే మే లొనఁగూర్ప విల్లసిలె నా గ్రామంబునన్ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      ఆటవెలదిలో "రీతి నచట" అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
    2. అవునండి. మార్చితిని.
      పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  12. ఆటవెలది
    పల్లెటూరి వాడు పరుగు పందెములన
    పోటి యందు ప్రతిభ తోటి ముందు
    పరుగు పెట్టి గెలిచె బహుమతి గా పత
    కాలు ,మేలు గూర్చె గ్రామమునకు
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  13. అన్నదాతలార్తి నరయుచు వారల
    కూతమొసగనెంచి కూర్మితోడ
    నాచరించుచున్న నభ్యుదయపు పథ
    కాదు మేలు గూర్చె గ్రామమునకు

    రిప్లయితొలగించండి
  14. పేదరికము తోడ విద్యనేర్వగలేని
    బాధపడుచునుండ బాలలఛట
    వారి కొరకు నొసగ ప్రభుత యుచిత పుస్త
    కాలు మేలు చేసె గ్రామమునకు

    రిప్లయితొలగించండి
  15. చేలన్ బంటలు పండ మిక్కుటముగా సేద్యమ్ములోనన్, పశుల్
    పాలన్ దండిగనీయ కర్షకులకున్ బ్రాప్తించ నాదాయముల్
    లీలామానుష రూపుడైన హరికై, బ్రీతిన్ గుడిన్ మ్రోగు బా
    కాలే మేలొనఁగూర్చ విల్లసిలె నా గ్రామంబునన్ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి