18, నవంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4253

19-11-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆహ్వానము శాప సదృశమై ముద మిడునా”
(లేదా...)
“ఆహ్వానమ్మది శాప సన్నిభము లయ్యయ్యో ముదంబిచ్చునా”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య - కొద్దిగా మార్చాను)

19 కామెంట్‌లు:


 1. వహ్వా! యర్జునుడంత స
  మాహ్వయమున తోడ్పడగ మాన్యుడు మలదా
  యాహ్వానింపగ జనె నా
  ఆహ్వానము శాప సదృశమై ముద మిడునా.

  రిప్లయితొలగించండి
 2. మయసభలో దుర్యోధనుని వేదన...

  కందం
  విహ్వలతఁ జెందఁ గనుచున్
  బహ్వార్యుల సతి మయసభఁ పరిహాసముగన్
  వహ్వారే! నవ్వెననగ
  నాహ్వానము శాప సదృశమై ముద మిడునా?

  శార్దూలవిక్రీడితము
  జిహ్వల్జాచిన సంపదే యురగమై జృంభించి రారమ్మనెన్
  బహ్వార్యాలికి పత్నిగా మయసభన్ బాంచాలి మన్నింపకే
  వహ్వారే! తడబాటుకున్ జెలఁగుచున్ బాధింపగన్ నవ్వెనే!
  యాహ్వానమ్మది శాప సన్నిభము లయ్యయ్యో ముదంబిచ్చునా?

  రిప్లయితొలగించండి
 3. సింహయాజి అంతర్మథనం.

  ఆహ్వానించిరి పూజ సేయ నను బ్రాహ్మండౌట, నా నాయకుల్
  జిహ్వానందము గూర్పగన్ మిగుల బజ్జీలెన్నియో బెట్టిరే
  యొహ్వో! నేనెఱుగంగనైతిగద నన్నూఱించి వంచింపగా
  నాహ్వానమ్మది శాప సన్నిభము లయ్యయ్యో ముదంబిచ్చునా?

  వహ్వా! యవకాశంబని
  గహ్వరమున గట్టివేయ ఖాకీలు దుదన్,
  విహ్వలమయె నా మదియే,
  ఆహ్వానము శాప సదృశమై ముద మిడునా?

  రిప్లయితొలగించండి
 4. గహ్వరమందున విందుకు
  నాహ్వానమ్ముగ్రహించినాడను వడిగా
  విహ్వలమైనదినామది
  ఆహ్వానము శాప సదృశమై ముద మిడునా

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. కందము
   వహ్వా!జూదంబాడిన
   బహ్వాపదలంబడుదురు పాండవులనుచున్
   ఆహ్వానించె సుయోధనుఁ
   డాహ్వానము శాపసదృశమై ముదమిడునా?

   తొలగించండి

 6. వహ్వా! సాయము జేయమంచు ననిలో పాకారి పార్థుండనే
  యాహ్వానించెనటంచు తావెడలెనే యాజానమా వజ్రిదౌ
  ఆహ్వానమ్మది శాప సన్నిభము లయ్యయ్యో, ముదంబిచ్చు నా
  యాహ్వానంబు పృథా సుతుండకదియే యజ్ఞాత వాసమ్ములో.

  రిప్లయితొలగించండి
 7. వాహ్వా ! యేమంటివిపుడు!
  యాహ్వానము శాప సదృశమై ముద మిడునా !
  యాహ్వానంబది హితులకె ,
  యాహ్వానించ నది శాపమని యన దగునే !

  రిప్లయితొలగించండి
 8. ఆహ్వానంబందుకొనగ
  వహ్వాయని సింహబలుడు పడతిని గలువన్
  విహ్వలుఁడై తుదకు మడిసె
  ఆహ్వానము శాప సదృశమై ముద మిడునా

  రిప్లయితొలగించండి
 9. ఆహ్వానింపగ కీచకున్ సుదతి సంహారమ్మె లక్ష్యమ్ముగా
  వహ్వాయంచు జనెన్ నటస్థలికి నాహ్వానంబు మన్నించి యా
  యాహ్వానంబెకదా వృకోదరునిచే నంతమ్మొనర్చెన్ ఖలున్
  ఆహ్వానమ్మది శాప సన్నిభము లయ్యయ్యో ముదంబిచ్చునా

  రిప్లయితొలగించండి
 10. ఆహ్వానింతు ము రావయ
  జిహ్వకు కల్పింప వెగటు చిత్ర గతులతో
  వహ్వా యను కరిణిగనన
  నాహ్వానము శాప సదృశ మై ముద మిడునా?

  రిప్లయితొలగించండి
 11. కందం
  వహ్వా యని మయసభకున్
  నాహ్వానమున జని పల్చనయ్యెన్నంతన్
  విహ్వలమది రారాజుకు
  ఆహ్వానము శాపసదృశమై ముదమిడునా.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 12. ఆహ్వాన ము నం దుకొనుచు
  వహ్వాయని సింహబలుఁడు భామను గలువన్
  విహ్వలతఁ దాఁజావగ
  నాహ్వానము శాప సదృశమై ముద మిడునా

  రిప్లయితొలగించండి
 13. శా.

  *ఆహ్వానమ్మది శాప సన్నిభము లయ్యయ్యో ముదంబిచ్చు నా*
  జిహ్వాపేక్షనుఁ దీర్చు పాత్ర నినుడే చేకూర్చగన్ పాండవుల్
  వహ్వా !స్నానముకై నదిన్ జను వడిన్ వార్ష్ణేయ తృప్తిన్ హితం
  బాహ్వానంబుగఁ గోపి యత్రిసుతుడే యత్యంతవాసుల్ సహా.

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. వహ్వా యేమని చెప్ప నోపుదును నాభామామ ణింజూఁడగా
  జిహ్వం జాచిన పాము వోలెను వడిన్ జృంభించి చేరంగ నౌ
  నాహ్వానమ్మును ద్రోసి రాజనుచుఁదా నాలింగ నంబౌటతో
  నాహ్వానమ్మది శాప సన్నిభము లయ్యయ్యో ముదంబిచ్చునా”

  రిప్లయితొలగించండి

 16. పిన్నక నాగేశ్వరరావు.

  ఆహ్వానించగ విందుకు
  వహ్వా!యని తీపివన్ని వదలక తినగన్
  విహ్వలుడైతి రుజ పెరుగ
  నాహ్వానము శాప సదృశమై ముదమిడునా?

  రిప్లయితొలగించండి
 17. ఆహ్వీకర ణోత్సవముల
  కాహ్వానమ్ములు కడింది యర్థఘ్నమ్ముల్
  విహ్వల కారకములు గా
  నాహ్వానము శాప సదృశమై ముద మిడునా

  జిహ్వాగ్రమ్మునఁ దీపి నుంచి కప టాశేషంపుఁ బ్రేమమ్ముతో
  నాహ్వానింపఁగ నుత్సవమ్ములకు నయ్యా యేఁగ నచ్చోట దు
  ష్ప్రహ్వోపేత వచో నికాయమున సంత్రాసమ్ము సంధిల్లఁగా
  నాహ్వానమ్ములు శాప సన్నిభము లయ్యయ్యో ముదం బిచ్చునా

  రిప్లయితొలగించండి
 18. ఆహ్వానించగకురుపతి
  వహ్వాయనుచేగితాను భ్రాతలతోడన్
  విహ్వలుడైవనికేగెను
  అహ్వానముశాపసదృశమై ముదమిడునా

  రిప్లయితొలగించండి