27, నవంబర్ 2022, ఆదివారం

సమస్య - 4262

28-11-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హిమవంతుఁడు హరికిఁ దన దుహిత నిచ్చెఁ గదా”
(లేదా...)
“నయమొప్పన్ హిమవంతుఁడా హరికిఁ గన్యాదానముం జేసెరా”

15 కామెంట్‌లు:

  1. కందము
    ఉమ నొసగెనుగా హరునకు
    హిమవంతుఁడు;హరికిఁదన దుహిత నిచ్చెగదా!
    విమలాంభోనిధి సాగరుఁ
    డమరాదులు వారిఁగాంచి యంజలులిడరే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభము
      ప్రియమారంగ మహేశుఁగొల్చు సుత గౌరిన్ వానికిచ్చెంగదా
      నయమొప్పన్ హిమవంతుఁ;డాహరికిఁగన్యాదానముంజేసెరా
      జయహో!సాగర!వారిధీ!యని సురల్ శ్లాఘింపనుత్సాహియై
      దయతో వాణిని రాణిఁజేసికొనె వేదాభ్యాసుఁడౌ బ్రహ్మయున్.

      తొలగించండి
  2. కందం
    సుమబాణుని త్యాగమ్మున
    నుమనెంచఁగఁ బెళ్లియాడ నుగ్రాక్షుఁడటన్.,
    బ్రమథాధిపునకు, మ్రొక్కుచు
    హిమవంతుడు హరికిఁ, దన దుహిత నిచ్చెఁ గదా!

    మత్తేభవిక్రీడితము
    ప్రియమారంగ నపర్ణ సేవలిడ, పూవిల్తుండు నుంకింపగన్
    దయజూపింపగ వేడినంత సురలున్ దాక్షిణ్యమేపారగన్
    నియతిన్ శంకరుఁడొప్ప గౌరిఁగొనగన్, నింపార మోదమ్మిడన్
    నయమొప్పన్ హిమవంతుఁడా హరికిఁ, గన్యాదానముం జేసెరా!

    రిప్లయితొలగించండి

  3. శమనరిపునకు సుతనొసగె
    హిమవంతుడు, హరికిఁ దన దుహితనిచ్చెఁ గదా
    సుమనస్సుతోడ నీటియె
    కిమీడనుచు తండ్రి తెలిపె క్షేత్రజుడడగన్.

    రిప్లయితొలగించండి
  4. ఉమ నొసగే ను గా శివునకు
    హిమవంతుడు :హరికి దుహిత నిచ్చె గదా
    ప్ర మదమున సాగరుడు దా
    మ మ కార ము నిండి నట్టి మమతలు పొంగన్

    రిప్లయితొలగించండి

  5. ప్రియురాలడ్గిన ప్రశ్నకుందెలిపెనా ప్రేయాంశు డీరీతిగన్
    ప్రియనందంతి వృషాకపాయ నపుడా భృంగీశు
    కిచ్చెన్ గదా
    నయమొప్పన్ హిమవంతుఁ, డా హరికిఁ గన్యాదానముం జేసెరా
    దయజూపించి మహాశయుండగు సరిద్వంతుండె తా బెండ్లిలో.

    రిప్లయితొలగించండి
  6. కొమరిత యుమనిడె హరునకు
    హిమవంతుఁడు ; హరికిఁ
    దన దుహిత నిచ్చెఁ గదా
    దమనుడు సత్రాజిత్తుడు,
    కమలాప్తుని మణి సహితము గానుక యంచున్

    రిప్లయితొలగించండి
  7. ఉమనొసగెకదాశివునకు
    హిమవంతుఁడు, హరికిఁ దన దుహిత నిచ్చెఁ గదా
    సుమనస్కుడగు సముద్రుడు
    సమకూరెను సతులిరువురు సముచిత రీతిన్

    రిప్లయితొలగించండి
  8. రమణీ మణి నా లక్ష్మినిఁ
    గమనీయమ్ముగ నెడంద గంభీరుఁడు సం
    ద్రము నిజ ఘన ధైర్యమ్మున
    హిమవంతుఁడు హరికిఁ దన దుహిత నిచ్చెఁ గదా

    నయగారమ్మున మించు నట్టి తనయన్ నాగేంద్ర హారుం దలం
    చి యెడందం దగి నట్టి నాథుఁ డనుచున్ శీఘ్రంబ డెందమ్మునం
    బుయిలోటమ్మును వీడి హైమవతినిన్ ముక్కంటికిం, మ్రొక్కి తా
    నయ మొప్పన్ హిమవంతుఁ డా హరికిఁ, గన్యాదానముం జేసెరా

    రిప్లయితొలగించండి
  9. డా. బల్లూరి ఉమాదేవి

    అమలిన మనమున నొప్పుచు
    హిమవంతుడు హరికి తన దుహితనిచ్చె గదా
    హిమగిరుల వసింపు మనుచు
    ప్రమదాధిపుడౌ హరునకు రాగము తోడన్




    రిప్లయితొలగించండి
  10. ఉమతో శివునిముడిగఱపె
    హిమవంతుఁడు, హరికిఁ దన దుహిత నిచ్చెఁ గదా
    ప్రమదము నొందిన జలనిధి
    యమరులు జేజేలుకొట్ట యానందముతోన్

    రిప్లయితొలగించండి
  11. దయితుం డీతడె యంచుమా నసము నందాభామతా నెంచగన్
    దయతోగైకొనుమో హరాయనుచుమోదమ్మొందుచున్ నిచ్చె తా
    “నయమొప్పన్ హిమవంతుఁ,డా హరికిఁ గన్యాదానముం జేసెరా”
    జయఘోషన్నటచేయగన్ సురవరుల్ సంద్రుండొసంగెన్ సిరిన్




    రిప్లయితొలగించండి
  12. ప్రియతో 'స్నేహము జేయుచున్ 'హరి' పడెన్ బ్రేమమ్ములో, నంతటన్
    దయతో మమ్ముల జేయుమొక్కటినియున్
    తండ్రిన్ సుతా గోరగన్
    నయమొప్పన్ హిమవంతుడున్ హరికి కన్యాదానముంజేసెరా
    నియమున్ దప్పక వారు జీవనమునున్
    నిక్కంబు సాగించ్రిగా

    రిప్లయితొలగించండి
  13. మరొక పూరణ

    ఉమకు హరుని చేసెపతిగ
    హిమవంతుడు, హరికి తనదుహితనిచ్చె కదా
    కమలాసనాదులు గనగ
    సుమమాలను దాల్చి రమయు చూచెను శ్రీశున్

    రిప్లయితొలగించండి