31, జనవరి 2023, మంగళవారం

సమస్య - 4224

 1-2-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామగర్వభంగ మొనర్చి రాముఁ డలరె”
(లేదా...)
“రాముని గర్వభంగమును రాముఁ డొనర్చెను దీమసమ్ముగన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ అష్టావధానంలో ఆదూరి ఫణీంద్ర రావు గారి సమస్య)

30, జనవరి 2023, సోమవారం

సమస్య - 4223

31-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కామమును గోపమే కదా కామ్యము లిడు"
(లేదా...)
"కామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో శ్రవణ్ కుమార్ గారి సమస్య)

29, జనవరి 2023, ఆదివారం

సమస్య - 4222

30-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రమ్ముఁ దెచ్చె హనుమ రామున కని"
(లేదా...)
"రమ్మునుఁ దెచ్చె మారుతియె రామునకై ముదమంద వానరుల్"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ముదిగలం బాబు గారి సమస్య)

28, జనవరి 2023, శనివారం

సమస్య - 4221

29-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాడ నేర్పుమనుచు పాము లడిగె"
(లేదా...)
"పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ఆర్. కళ్యాణి గారి సమస్య)

27, జనవరి 2023, శుక్రవారం

సమస్య - 4220

28-1-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్"
(లేదా...)
"కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో కలికిరి గురుదేవ్ గారి సమస్య)

26, జనవరి 2023, గురువారం

సమస్య - 4219

27-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాకొమరుఁడు బిచ్చమిమ్మురా యని వేడెన్"
(లేదా...)
"రాకొమరుండు బిచ్చమిడరా యని వేడెను పేద వాకిటన్"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో పి. జమున గారి సమస్య)

25, జనవరి 2023, బుధవారం

సమస్య - 4218

26-1-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నులున్నవంచుఁ గలఁత యేల”
(లేదా...)
“కన్నులు గల్గినం గలఁత గాంచుట యేలఁ గనంగఁ జాలవా”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో దాసరి చంద్రయ్య గారి సమస్య)

24, జనవరి 2023, మంగళవారం

సమస్య - 4217

25-1-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వంట లేని యింట బంధువు దినె”
(లేదా...)
“వంటయె లేని యింటఁ దిని బంధువు ద్రేన్చెను పొట్ట నిండఁగన్”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో గీతా శైలజ గారి సమస్య)

23, జనవరి 2023, సోమవారం

సమస్య - 4216

24-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్”
(లేదా...)
“చెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ప్రదీప్ గారి సమస్య)

22, జనవరి 2023, ఆదివారం

సమస్య - 4215

23-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పలుకన్ రానట్టి వాఁడు పాటలు పాడెన్”
(లేదా...)
“పలుకులు రానివాఁడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చఁగా”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో మల్లెల నాగరాజు గారి సమస్య)

21, జనవరి 2023, శనివారం

సమస్య - 4214

22-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆఁకలి యని కేక లిడఁగ రోఁకలి నిడె”
(లేదా...)
“ఆఁకలి యంచు కేకలిడ నమ్మ యొసంగెను రోఁకలిన్ కటా”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో రంగరాజు పద్మజ గారి సమస్య)

20, జనవరి 2023, శుక్రవారం

సమస్య - 4213


21-1-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుక్కను సహియింప ననుచు యుగ్మలి పలికెన్”
(లేదా...)
“కుక్కను సైపలేననుచు యుగ్మలి చేరెను పుట్టినింటికిన్”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

19, జనవరి 2023, గురువారం

సమస్య - 4212

20-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకా పట్టిననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్”
(లేదా...)
“కాకా పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్”
(గరికిపాటి వారికి ధన్యవాదాలతో...)

18, జనవరి 2023, బుధవారం

సమస్య - 4211

19-1-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామ పదధూళి తలవ్రాత లేమి మార్చు”
(లేదా...)
“రాముని పాదధూళి తలవ్రాతల మార్చునె నమ్ము టొప్పునే”

17, జనవరి 2023, మంగళవారం

సమస్య - 4310

18-1-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వారధినిం గట్టలేదు వానరు లెవరున్”
(లేదా...)
“వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో పిలకా శాంతమ్ము గారి సమస్య)

16, జనవరి 2023, సోమవారం

సమస్య - 4309

17-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దండధరుఁ డిచ్చు ముక్తిని దర్శనమున”
(లేదా...)
“దండధరుం డొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మాడుగుల నారాయణ మూర్తి గారి సమస్య)

15, జనవరి 2023, ఆదివారం

సమస్య - 4308

16-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాఁడు వేంకటేశుండు గాపాడువాఁడు”
(లేదా...)
“కాఁడఁట వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో బండకాడి అంజయ్య గౌడ్ గారి సమస్య)

14, జనవరి 2023, శనివారం

దత్తపది - 192

15-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
'కల - తల - వల- వెల'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
సంక్రాంతి సంబరాలపై
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

13, జనవరి 2023, శుక్రవారం

న్యస్తాక్షరి - 77

14-1-2023 (శనివారం)
కవిమిత్రులారా,
భోగిమంటను గురించి ఉత్పలమాల వ్రాయండి
1వ పాదం 1వ అక్షరం 'భో'
2వ పాదం 2వ అక్షరం 'గి'
3వ పాదం 10వ అక్షరం 'మం'
4వ పాదం 17వ అక్షరం 'ట'

12, జనవరి 2023, గురువారం

సమస్య - 4307

13-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో”
(లేదా...)
“కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో కన్నేపల్లి వరలక్ష్మి గారి సమస్య)

11, జనవరి 2023, బుధవారం

సమస్య - 4306

12-1-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శుంఠల వలన దేశమ్ము శోభఁ గనును”
(లేదా...)
“బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో వేదాల గాయత్రి గారి సమస్య)

10, జనవరి 2023, మంగళవారం

సమస్య - 4305

11-1-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె”
(లేదా...)
“కాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో ఉపాధ్యాయుల గౌరీశంకరరావు గారి సమస్య)

9, జనవరి 2023, సోమవారం

సమస్య - 4304

10-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సద్దు సేయదు పికము వసంతమందు”
(లేదా...)
“సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మాచవోలు శ్రీధరరావు గారి సమస్య)

8, జనవరి 2023, ఆదివారం

సమస్య - 4303

9-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కురుకులమున రాఘవుండు కోరి జనించెన్”
(లేదా...)
“కురువంశంబునఁ బుట్టి కీర్తిఁ బడసెన్ కోదండరాముం డహో”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో అ.స.నా.రె. గారి సమస్య)

7, జనవరి 2023, శనివారం

సమస్య - 4302

8-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్”
(లేదా...)
“అన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో ముద్దు రాజయ్య గారి సమస్య)

6, జనవరి 2023, శుక్రవారం

సమస్య - 4301

7-1-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సద్యఃస్ఫూర్తియె బుధులకు సంకటము లిడున్”
(లేదా...)
“సద్యఃస్ఫూర్తి యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో పోచిరాజు కామేశ్వర రావు గారి సమస్య)

5, జనవరి 2023, గురువారం

సమస్య - 4300

6-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చురచుర చూడ్కుల దినమణి సుధలం గురిసెన్”
(లేదా...)
“చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి గారి సమస్య)

4, జనవరి 2023, బుధవారం

సమస్య - 4299

5-1-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భరతునకున్ వేణుధరుఁడు పాదము నిచ్చెన్”
(లేదా...)
“భరతున కిచ్చెఁ బాదము శుభంబనుచున్ మురళీధరుం డహో”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మైలవరపు మురళీకృష్ణ గారి సమస్య)

3, జనవరి 2023, మంగళవారం

సమస్య - 4298

4-1-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్ణుఁడు భీరు వతిలోభి క్ష్మాపతులందున్”
(లేదా...)
“కర్ణుఁడు లోభియై మసలె క్ష్మాపతులందున భీరువాతఁడే”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో ఆకెళ్ళ బాలభాను గారి సమస్య)

2, జనవరి 2023, సోమవారం

సమస్య - 4297

3-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తనువు శాశ్వతము సుకీర్తి గన క్షణికము”
(లేదా...)
“కలకాలంబు శరీరముండును తటిత్కల్పంబు సత్కీర్తియే”

1, జనవరి 2023, ఆదివారం

సమస్య - 4296

2-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పార్వతికి రమాదేవి సపత్ని యగును”
(లేదా...)
“పార్వతికిన్ రమాసతి సపత్ని యటంచు వచింత్రు విజ్ఞులే”