3, మార్చి 2023, శుక్రవారం

సమస్య - 4355

4-3-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లడ్డుకొనఁగ నేర మవధాన సత్సభన్”
(లేదా...)
“లడ్డుకొనంగ నేరమగునందు వధానమునందు సత్కవీ”
(ఆముదాల మురళి గారి శతావధానంలో మరుమాముల దత్తాత్రేయ శర్మ గారి సమస్య)

31 కామెంట్‌లు:

 1. తలనుపండిఘనతతలవంచకుండంగ
  పండితుండునున్నపథముపెద్ద
  లడ్డుకొనగనేరమవథానసత్సభన్
  విజ్ఞుడింతదెలియవెలయుశోభ

  రిప్లయితొలగించండి
 2. అడ్డునుజెప్పినంతతనయానముతప్పడువిస్మరింపడున్
  చెడ్డనుమాటలాడడహచేదునుసైతమునింపుగొంతులో
  వడ్డనసేయుచున్తనదువాక్కుననిల్చుకవిత్వధీరునీ
  లడ్డుకొనంగనేరమగునందువథానమునందుసత్కవీ,

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. సత్కవనము జెప్పు నూతన అవధానితో సంచాలకులవారు....

   ఆటవెలది
   స్ఫూర్తివంతమగు ప్రచోదిత క్రీడను
   పృచ్ఛకాళి నొసఁగ వినుచు ప్రశ్న
   లడ్డుకొనఁగ నేర మవధాన సత్సభన్
   విదురత బదులీయవేడ్కయగును

   ఉత్పలమాల
   గడ్డు సమస్యలైనఁ గనుగానని దత్తపదంబు లైనఁ బెన్
   గ్రుడ్డిగ పిచ్చిరేపునవి కూర్చిన మీదట నన్యపృచ్ఛకుల్
   దొడ్డగుణాన విప్పవలె తోషము నింపఁగఁ, గాదటంచు కే
   లడ్డుకొనంగ నేరమగునందు వధానమునందు సత్కవీ!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 4. లడ్డు జిలేబి పానకములంటి విచిత్ర పదార్థజాలముల్
  వడ్డణ చేసి, వీనులకు పండుగ జేయ, సభాంతరమ్మునన్
  గడ్డుసమస్య చేకొనుచు గాసిలజేయ తలంచి, వే
  లడ్డుకొనంగ నేరమగునందు వధానమునందు సత్కవీ.

  రిప్లయితొలగించండి

 5. చదువరులిల మెచ్చు సాహితీ క్రీడను
  నచ్చలేదటంచు కుచ్చిత జను
  లడ్డుకొనఁగ నేర మవధాన సత్సభన్
  దెలుగు భాషకిదియె దీప్తి నొసగు.


  గ్రుడ్డితనంబు గాదె యిల కోవిదు లెల్లరు మెచ్చు నట్టి యా
  దొడ్డ ప్రహేళికా కిలము తోషము బెంచునటంచు ప్రాజ్ఞులా
  యెడ్డెపు గాండ్రతోడ వచియించిన నొప్పక వాటినా జనా
  లడ్డుకొనంగ నేరమగునందు వధానమునందు సత్కవీ.

  రిప్లయితొలగించండి
 6. తియ్య నైన పద్య తీరును గమనించి
  మోద మంది జనులు మురియు చుండ
  లడ్డు కొనగ నేర మవధాన తత్స భన్
  తనియు చుండి రనుట తప్పు గాదు

  రిప్లయితొలగించండి
 7. పృచ్చకులిడి నట్టి వివిధ రకములగు
  ప్రశ్నల కవధాని వగను సభికు
  లడ్డుకొనఁగ నేర మవధాన సత్సభన్
  పద్ధతి నెరుగకనె వచ్చు టేల

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. ఆడుగడుగున నచట నప్రస్తుతమనుచు
  పృచ్చకుండొకండు వేయు ప్రశ్న
  లడ్డుకొనఁగ నేర మవధాన సత్సభన్
  లెక్క సేయక బదులీయవలయు


  గడ్డుసమస్యలిచ్చి నిను గందరగోళము సేయనెంతురే
  గొడ్డెములన్ భరించవలె కూడని మాటల భోజనంబునే
  వడ్డనసేయనెంత్రుగద ప్రాశ్నికుడిచ్చిన క్లిష్టమౌ సవా
  లడ్డుకొనంగ నేరమగునందు వధానమునందు సత్కవీ

  రిప్లయితొలగించండి
 10. (శృతిమించిన అప్రస్తుత ప్రసంగముతో విసిగించే ప్రాశ్నికుని ధోరణిని నిరసిస్తూ...)

  అడ్డును నాపులేక నిసుమంతయు విజ్ఞతలేక మూఢుడై
  తెడ్డెమటంచు నెడ్డెమన తిప్పలువెట్టి వధాని ధారణిన్
  యెడ్డెతనమ్ముతో కుజనుఁ డిట్టుల భగ్నమొనర్చి పూరణా
  లడ్డుకొనంగ నేరమగునందు వధానమునందు సత్కవీ

  రిప్లయితొలగించండి
 11. అడ్డునాపులేని యప్రస్తుతములతో
  ప్రాశ్నికుఁడు వధాని పద్య ధార
  లడ్డుకొనఁగ నేర మవధాన సత్సభన్
  భగ్నపరుపఁ దనకు భావ్యమగునె?

  రిప్లయితొలగించండి

 12. పిన్నక నాగేశ్వరరావు.

  ఆస్వదించలేక నవధాన మాధురిన్
  విజ్ఞతను మరచిన ప్రేక్షక జను
  లడ్డుకొనగ నేర మవధాన సత్సభన్
  మేలు జరుగు నిష్క్రమించ వారు.

  రిప్లయితొలగించండి
 13. సత్సమస్య లొసఁగు సత్కవీంద్రులకు న
  ప్రస్తుతప్రసంగి వరున కన్యు
  లడ్డు కొనఁగ నేర మవధాన సత్సభన్
  హర్ష భంగ మగు సభాంతరమున

  ఒడ్డులు మారు మాట లన యుక్తము కాదు సభాంత రమ్మునన్
  దొడ్డ కవీంద్రు డెందమునఁ దోఁపఁగ ధారకు నడ్డు లేకయే
  పడ్డ పదమ్ము లర్థములఁ బద్యము లల్లఁగ నాలకింప మే
  లడ్డు కొనంగ నేర మగు నందు వధానము నందు సత్కవీ

  రిప్లయితొలగించండి


 14. ఉ.

  చెడ్డగు భావమున్ గలుగజేయుట స్రగ్ధర పూరణన్ సభన్
  బొడ్డున పుట్టు సారసమె పోటి నిషిద్ధము వర్ణ న్యస్తముల్
  వడ్డెన పృచ్ఛకుల్ కుడుచు వాక్పథ ఛందపు భాషణల్ భగా
  *లడ్డుకొనంగ నేరమగునందు వధానమునందు సత్కవీ*

  .. డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

  రిప్లయితొలగించండి
 15. రాజధాని యందు రహితోడ నవధాని
  యాశువు గను కవిత లల్ల జనము
  లడ్డు కొనగ నేర మవధాన సత్సభన్
  యనుచు నాగ్రహించి రార్యులెల్ల.

  రిప్లయితొలగించండి
 16. దొడ్డ మనస్కుడై చెలగి తోరము ప్రజ్ఞ వధాని చూపగా
  మడ్డి యొకండు శ్రోతగ నమానుషరీతిని ప్రశ్న లేయుచున్
  చెడ్డ తలంపునన్ జెరప చేయు వధానముఁ గాంచు నట్టి మే
  లడ్డు కొనంగ నేరమగునందు వధానమునందు సత్కవీ

  రిప్లయితొలగించండి