23, మార్చి 2023, గురువారం

సమస్య - 4375

24-3-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తాను నిలుచున్న కొమ్మనుఁ దగును నరుక”
(లేదా...)
“తగును సుబుద్ధికిన్ నరుకఁ దా నిలుచుండెడి కొమ్మఁ దానుగా”

35 కామెంట్‌లు:

  1. సకలసంపదలనుగల సద్గుణుండు
    నీడనీయనివృక్షంబునిలచియున్న
    నిష్ప్రయోజనమౌనుగనిజమునిది.య
    తానునిలుచున్నకొమ్మనుతగునునరుక ు

    రిప్లయితొలగించండి
  2. బుద్దిమాంద్యమున్న మగడు భూర హమున
    దాను నిలుచున్న కొమ్మనుఁ దగును నరుక
    ననుకొని బరశు నెత్తగ నాపె నామె
    కలుగ బోవు ప్రమాదము గడచె నటుల

    రిప్లయితొలగించండి
  3. తాను నిలుచున్న కొమ్మనుఁ దగును నరుక
    వలసి వచ్చును గదనెపుడెలమితోడ
    తగని పనులెన్నొజేయగ తంపులరయు
    చెప్పవినగోర కుండని చీత్కరించ!

    ----యెనిశెట్టి గంగా ప్రసాద్.

    రిప్లయితొలగించండి
  4. రారాజు ధుర్యోధనునితో శకుని మామ:

    తేటగీతి
    వగపదేలకో? మయసభ భంగపడఁగ!
    కలిమి ధర్మజుండోడంగ వలనువైతు
    నెంచ జూద వ్యసన బలహీనుఁడనఁగ
    తాను నిలుచున్న కొమ్మనుఁ దగును నరుక!

    చంపకమాల
    వగపును వీడుమా! మయసభన్ దమకేర్పడ భంగపాటహో!
    దిగబడఁ బిల్చి జూదమున దీనత నా వ్యసనుండు ధర్మజున్
    బొగలగ నోడ సంపదలఁ బూనెద! తద్బలహీన చిత్తమై
    తగును సుబుద్ధికిన్ నరుకఁ దా నిలుచుండెడి కొమ్మఁ దానుగా!

    రిప్లయితొలగించండి


  5. కృష్ణనవమాన పరచెనా కీచకుడని
    యాగ్ర హించుటపాడియా? యదియె కదర
    గుట్టు రట్టుజే యునిక తేకువ వహింపు
    తాను నిలుచున్న కొమ్మను తగును నరక?



    ఆగమము పెల్లగింప తగదంటిని వంటరి యోర్పు జూపుమా
    పొగరును చూపుటయ్యదియె మూర్ఖుల లక్షణమంద్రు వీడగా
    దగును సుబుద్ధికిన్, నరుకఁ దా నిలుచుండెడి కొమ్మఁ దానుగా
    తగదనుచున్ వచించెనట ధర్మజు డప్పుడు కంకుభట్టుగన్ .

    రిప్లయితొలగించండి
  6. ప్రాతినిధ్యమిత్తుననుచు పదవినొంది
    శీఘ్రమే పురజనుల వంచింప వచ్చు
    హేయ మైనట్టి పాలన నీయ వచ్చు
    తాను నిలుచున్న కొమ్మనుఁ దగును నరుక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిగురులు నాశిరిల్లుగద చీడలుపట్టిన చెట్టు కొమ్మకున్
      చిగురులు చచ్చిమోడయిన శీఘ్రపు చర్యల కుద్యమించగా
      దగును సుబుద్ధికిన్, నరుకఁ దా నిలుచుండెడి కొమ్మఁ దానుగా
      తగదుకదా వివేకికి వితండపు వాదన సేయకుండినన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఆశిరిల్లు' ?

      తొలగించండి
    3. 'నాసిరిల్లు - నశించు' అనే భావముతో...

      తొలగించండి
  7. మంద మతి. యొక్క డెక్కియు మఱ్ఱి చెట్టు
    తాను నిలుచున్న కొమ్మను దగును నరుక
    ననుచు బూనిన. వాని. దా మడ్డు. కొనిరి
    హేయ. మైనట్టి పనియని హెచ్చ రించి

    రిప్లయితొలగించండి
  8. తనువునిచ్చిన తల్లిని, దారి జూపి
    బ్రతుకు నిచ్చిన తండ్రిని భారమనుచు
    సిగ్గుమాలి యాశ్రయములన్ జేర్చుకన్న
    తాను నిలుచున్న కొమ్మనుఁ దగును నరుక

    రిప్లయితొలగించండి
  9. తగులము బాధ్యతల్ మదిని దాలిచి సౌఖ్యములన్ త్యజించి యే
    వగపును గాననీక తన బాగును జూచెడి తల్లిదండ్రులన్
    మిగుల దయావిహీనుడయి మెల్గుచు నంకిలి పెట్టుచుండినన్
    తగును సుబుద్ధికిన్ నరుకఁ దా నిలుచుండెడి కొమ్మఁ దానుగా

    రిప్లయితొలగించండి
  10. చం.

    నృగుడను రాజు దానములు నిష్ఫలమయ్యెను గోవు క్రమ్మరన్
    సుగమము ధర్మపక్షులయి సోదన విప్రులు శంక దీర్చగన్
    దెగువను శుక్ర సూచనలు తిట్టు గొనెన్ బలి, పూర్వకర్మముల్
    *తగును సుబుద్ధికిన్, నరుకఁ దా నిలుచుండెడి కొమ్మఁ దానుగా.*

    రిప్లయితొలగించండి
  11. తనకు మాలిన ధర్మమ్ము తాను జేయు
    పగిది దిగి రాఁ దలంపక పాదపమ్ము
    కింది కుఱుకంగ నెంచినఁ గీ డరయక
    తాను నిలుచున్న కొమ్మనుఁ దగును నఱుక

    అగణిత రీతి గౌరవము నందెను దొల్తను మూర్ఖుఁ డైన విం
    తగ శివ యూని నట్లు పులిఁ దాఁ గని వాతలు లోకు లెల్ల న
    వ్వఁగఁ గవి కాళిదాసు వర పండితు భంగి నొనర్ప నెవ్విధిం
    దగును సుబుద్ధికిన్ నఱుకఁ దా నిలుచుండెడి కొమ్మఁ దానుగా

    రిప్లయితొలగించండి
  12. ద్రుపద పుత్రికఁగాంచిన దోర్బలుండు
    కీచ కుండంత మోహాన గేలు లాగ
    యముని లోకంబుఁజేరుట యర్ధ మయ్యెఁ
    దాను నిలుచున్న కొమ్మనుఁ దగును నరుక

    రిప్లయితొలగించండి


  13. జగమున ప్రేమ భావమున సద్గుణు సజ్జను
    డయ్యి బ్రత్కగా
    తగును సుబుద్ధికిన్, నరుక దా నిలుచుండిన
    కొమ్మదానుగా
    జరుగును హాని, మూఢులును సత్యము
    నెర్గుక చేయుచుంద్రిలన్
    సుగమమమైన జీవనపు సూత్రము తెల్పు
    వివేకమొక్కటే

    రిప్లయితొలగించండి
  14. తే॥ బుద్ధి మాంద్యము తోడను బురుషుడొకఁడు
    తాను నిలుచున్న కొమ్మను దగును నరుక
    ననుచుఁ జేయ ప్రయత్నము నతనిఁ గనిన
    మనుజులాపిరా యత్నము మందలించి

    చం॥ తెగబడి తాను కూర్చొనిన దిమ్మెను గూల్చుటఁ జూచి తెచ్చిరే
    మగఁడుగ రాజపుత్రికకు మాత కృపన్ దను వ్రాయఁ గావ్యముల్
    జగతిని కాళిదాసు కథఁ జక్కఁగ విన్నచొ యిట్లు తోచదా
    తగును సుబుద్ధికిన్ నరుకఁ దానిలుచుండెడి కొమ్మఁ దానుగా

    రిప్లయితొలగించండి
  15. తగును సుబుద్ధికిన్ నరుకఁ దా నిలుచుండెడి కొమ్మఁ దానుగాఁ
    దగునె? మహాను భావులిటు తక్కువఁజేసి మాటలాడగాఁ
    దగదు సుబుద్ధి కెయ్యెడలఁ దానిలుచుండెడు కొమ్మ నర్కుటన్
    విగత మనస్కుఁడట్లుగను వెఱ్ఱిగఁజేయును లోకమందునన్

    రిప్లయితొలగించండి