5, మార్చి 2023, ఆదివారం

సమస్య - 4357

6-3-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ములుకులైనట్టి పలుకులు చెలిమిఁ బెంచు”
(లేదా...)
“ములుకులు పల్కులైనఁ గడుఁ బొల్పు వహింపవె స్నేహబంధముల్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో కాశిరాజు లక్ష్మినారాయణ గారి సమస్య)

31 కామెంట్‌లు:


  1. ఆలు మగలలోన గన నాప్యాయతలను
    బెంచునేమని యడుగగా పేర్మి తోడ
    మదిని సున్నితముగ త్రాకు మదనుని విరి
    ములుకులైనట్టి పలుకులు చెలిమిఁ బెంచు.

    రిప్లయితొలగించండి
  2. మేథజూపట్టుసభలనుమేరువనగ
    కవితలల్లునుతనదైనఘనతతోడ
    అభ్యుదయమునశ్రీశ్రీయయంచునుండు
    ములుకులైనట్టిపలుకులుచెలిమిబెంచు

    రిప్లయితొలగించండి

  3. పలుకులలో కఠోరమది వాసిగ నున్న ఖలీభవింపదే
    చెలిమిది వాస్తవమ్ము దరి జేరిన వారిని యాదరించుచున్
    దలపుల దట్టురీతిని సుధారసమున్ గురిపించునట్టి పూ
    ములుకులు పల్కులైనఁ గడుఁ బొల్పు వహింపవె స్నేహబంధముల్.

    రిప్లయితొలగించండి
  4. విలవిలలాడెప్రేముడినివింతగనాయమనుండెగానుండెగాగనన్
    కలవరమాయెకాంతకుననఘాటుననాథువియోగమందునన్
    సలసలక్రాగెమానసముసైచనిబాధలవాక్కులందునన్
    ములుకులుపల్కులైనఁగడుఁబొల్పువహింపవెస్నేహు
    బంధముల్

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    మధురభాషణ భూషగ మహిని వెలుగు
    తేనియుల్ జిందువాక్కుల తీరులెరిగి
    వేడ్క సౌమ్యుడన్ బేరున వీడినంత
    ములుకు లైనట్టి పలుకులు, చెలిమిఁ బెంచు

    చంపకమాల
    అలరుల వీవనన్ పరిమళాన్వయమన్నది మానసమ్మునన్
    బులకలు రేపినట్లొలుక భూషణమౌగద వాగ్విలాసముల్
    దొలగుననర్థముల్, భువిని దొన్నెలఁ దేనెలు, వీడనెంచుచున్
    ములుకులు, పల్కులైనఁ గడుఁ బొల్పు వహింపవె స్నేహబంధముల్

    రిప్లయితొలగించండి
  6. వలపు తే నియ లొల్కెడు వాక్కు తోడ
    వర్త నంబును మార్చెడు వాంఛ కలిగి
    ములుకు లైనట్టి పలుకులు చెలిమి పెంచు
    ననుట నిజమౌచు నిల్చు నీ యవని యందు

    రిప్లయితొలగించండి
  7. ఆలుమగలలో ననురాగమతిశయింప
    తేనెలొలుకంగ పలికెడి తీరు మేలు
    విషమసాయకుని ధనువు వెలువరించు
    ములుకులైనట్టి పలుకులు చెలిమిఁ బెంచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొలుపున మాటలన్ బలుక పొందిక పెంపగు లోకమందునన్
      బలుకులు ముల్కులైన యెడ పంతము రేగునవాంఛితమ్ముగా
      తలపులనింపుగా తెలుపు తత్వముతోడ చరించు, ఱువ్వకన్
      ములుకులు, పల్కులైనఁ గడుఁ బొల్పు వహింపవె స్నేహబంధముల్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. చం.

    విలసిత పార్వతీ తపము వీక్షణ జేయగ నీశ్వరుండటన్
    గలుపుచు మాటలన్ వటుని కైపుగ దెప్పుచు వేషధారియై
    నిలిపె నపర్ణ నెయ్యరియె నిగ్రహమివ్వగ దోచె శూలియై
    *ములుకులు పల్కులైనఁ గడుఁ బొల్పు వహింపవె స్నేహబంధముల్.*

    రిప్లయితొలగించండి
  9. ఎన్నినాళ్ళ బంధమునైన
    నెడవుజేయు
    ములుకులైనట్టి పలుకులు ;చెలిమిఁ బెంచు
    నెవరితోనైన తీయని యిళల పలుకె ,
    మాటతీరె ముఖ్యము పొత్తు మనుటకెపుడు

    రిప్లయితొలగించండి
  10. పలువురు మెచ్చు చందమునఁ బాయక నిల్పుచు స్నేహ ధర్మమున్
    పలుకులలోనఁ దాలిమి నవశ్యము జూపుచు మేలుఁ గోరుచున్
    దలపక భేదభావము హితమ్మునుదెల్ప నవారితమ్ములౌ
    ములుకులు పల్కులైనఁ గడుఁ బొల్పు వహింపవె స్నేహబంధముల్

    రిప్లయితొలగించండి
  11. తలచి మిత్రుని హితమును తగినరీతి
    మార్గదర్శనమ్మునుజేసి మంచిగోరి
    యవసరమ్మైన సన్మార్గమందు నడుప
    ములుకులైనట్టి పలుకులు చెలిమిఁ బెంచు

    రిప్లయితొలగించండి
  12. మందు చేదైన రోగమ్ము మాన్పు వేగ
    మాట తీపైనఁ జేతలఁ జేటు నొసఁగుఁ
    గాలము గడవ నింపుగ మే లొసంగు
    ములికు లైనట్టి పలుకులు చెలిమిఁ బెంచు

    కలవరపాటు సెందినను గ్రన్నన మే లది యింపుగాఁ దుదిం
    గలుగు నటంచు నెంచి మది గారవ మొప్పఁ దలంచి స్నేహముం
    దలఁపక కోప మూను నని తప్పక చెప్పిన మేలుఁ గూర్చెడిన్
    ములికులు పల్కు లైనఁ గడుఁ బొల్పు వహింపవె స్నేహ బంధముల్

    [ములికి బహువచనము ములికులు, భామినులు వలె; ముల్కి కి ముల్కులు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. చం॥ మలచిన మాట కృత్రిమము మన్నననొందఁగఁ బోదు దెల్పఁగన్
      గలవరమేలఁ బల్కఁగను గష్టమునొందఁగ రాదు సత్యమున్
      విలువలఁ బెంచు మాటలకు ప్రేమయు వాడియునుండు నప్పుడే
      ములుకులు పల్కులైనఁగడుఁ బొల్పు వహింపవె స్నేహబంధముల్

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  13. అలుకలన్ బూని కోపము లావహించ
    పరుషమయ్యెడి పలుకుల వాడియందు
    కలుషవర్జిత మానస కాంక్షలందు
    ములుకులైనట్టి పలుకులు....చెలిమిబెంచు!

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.

    కాయమును కాదు మనసును గాయపరచు
    ములుకులైనట్టి పలుకులు; చెలిమిఁ బెంచు
    ప్రేమ,నాప్యాయతలఁ రంగరించి,సౌమ్య
    భావమున్ తొణికిసలాడు పలుకు లెపుడు.

    రిప్లయితొలగించండి
  15. చిలుకల కొల్కి పల్కులను శ్రీధవుడత్తరి నాల కించుచున్
    నలుకనుమానమో సఖియనంచును మచ్చికతోడజెప్పగన్
    ఛలమున సత్యభామయును స్వాంతమునందునగుచ్చమారుపూ
    *ములుకులు పల్కులైనఁ గడుఁ బొల్పు వహింపవె స్నేహబంధముల్”*

    రిప్లయితొలగించండి