13-3-2023 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భర్త కిచ్చెను తన్వి పావన జననము”(లేదా...)“తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్”(ఆముదాల మురళి గారి శతావధానంలో చలంకోట బురుజు మునస్వామి గారి సమస్య)
పుత్రుమోమునుతనివితోపుణికెతల్లితండ్రిపోలికనుండినతనయునరసితోటివారలుహర్షముతోడుతనిరిభర్తకిచ్చెనుతన్విపావనజననము
బిడ్డ నొసగెదనని మాట ప్రేమ తోడభర్త కిచ్చెను తన్వి ; పావన జననముపొందె నా కూన , జనకుడు ముదము నొందిమగువకు కృతజ్ఞత దెలిపె మరువ కుండ
వేళకోళముగాదులేయిదివేల్పుసాక్షిగనందురావ్యాళమైగనసుబ్రమణ్యుడువ్యాఘ్రచర్ముడుశంభుడేకాళరాత్రిగపార్వతీసతికాంచెనాథునిపుత్రుగాతాళికట్టినభర్తకిచ్చెనుతన్విపావనజన్మమున్
వణుకు గుబ్బల పట్టి శాంభవి భవానిపాటలావతి పార్షతి భద్రకాళిధిషణ ముక్కంటి వాల్గంటి దేవసేనభర్త కిచ్చెను తన్వి పావన జననము. కాలి కౌశికి నందయంతియు కప్పుటైదువ గట్టురాచూలి చండిక పాటలావతి శూలిమానస రాణి యాశైల పుత్రిక మేనకాత్మజ శక్తి శాకిని, వల్లికిన్తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్.
అమిత యను రాగమును జూపు ప్రమదయగుచునన్ని భంగుల కోర్కెల. నాశ దీర్చుభార్య గా నడచు కొనుచు వారసు నిగభర్త కిచ్చె ను దన్వి పావన జననము
మ. కో.వేళమున్ సుమతిన్ వరించగ వెన్నడించెను నర్తకిన్బాళితో నడుగంగ నొప్పెను బాటలో ముని శాపమున్సోలె సూర్యుని నాపగా ననసూయ రక్షణ నొందగా*తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్.*
అప్పు వేగతీర్చమనుచు నాదరమునపలికిదీనినమ్ముమనుచు పసిడిగొలుసు*“భర్త కిచ్చెను తన్వి, పావన జననము”*నొసగె చక్కని పాపకు నొప్పుగానుమేలమా డుచునద్రిరాసు తమేన కాత్మజ నవ్వుచున్నీలకంఠుడునైనశూలినినెమ్మితోవరియించితా*“తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్”*తేలిపోవుచుసంతసమ్మునదేహమందరభాగమై
తేటగీతిపుడమి త్రేతాయుగమ్మున పులకరింపధర్మ రక్షణార్థమ్మవతారమందుకతన నయ్యయోధ్యాపుని సతిగ, లచ్చిభర్త కిచ్చెను తన్వి పావన జననముమత్తకోకిలకూళలెల్లరు ధాత్రి పైనను గూడి ధర్మము ద్రుంచఁగన్వేళఁజూచియు దాల్చనెంచగ విష్ణువే యవతారమున్చూలినంది నయోధ్యభూపతి సొంపు దారగ, లక్ష్మికిన్తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్
తేటగీతి మూడవ పాదంలో'నయ్యయోధ్యాధిపు' నని చదువుకొన మనవి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సత్యవంతుని ప్రాణముల్ మృత్యువుకబళించ సావిత్రి తిరిగిసాధించెనుగదతనదు యత్నమీడేరి సంతసమొసంగభర్త కిచ్చెను తన్వి పావన జననము
వైళమాయెను సత్యవంతుని ప్రాణముల్ గొనిపోయినన్తాళి కట్టిన భర్త కోసము దండయాముని వెంబడెన్మేళ వించిన యుక్తితో హరిమెప్పు పొందిన సాధ్వియైతాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావన జన్మమున్
తే.గీ.||నిండు చూలాలు సతిఁ వీడినివసనమునదేశమాతకు సంకెలల్ ద్రెళ్ళజేయపోరుసల్పుచు దివమును చేరుకొనినభర్త కిచ్చెను తన్వి పావన జననము
మత్తకోకిల:తాళజాలక తల్లి భారతి దాస్యమందున సొక్కగన్బాళిగా తన నిండుగర్భిణి భార్యనున్ విడనాడితావేళమేచని యుద్యమంబున వీడె ప్రాణము ధీరుడైతాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్
ఎంత కష్టము వచ్చిన నింతి సంతు కొఱకుఁ దపియించి నిలఁబడి కొండ వోలె దేవకీ దేవి కారలో ధృతిని విశ్వభర్త కిచ్చెను దన్వి పావన జననముకాలమే దొరలంగ నంత సుకాల మేర్పడఁ గోడలే మేలు వొందఁగ నత్తగా నగు మేదినీ తలమం దహోమేలుగా మును స్వీయ నాథుఁడు మెచ్చ దన్ను స్నుషార్యకుం దాళి గట్టిన భర్త కిచ్చెను దన్వి పావన జన్మమున్
పిన్నక నాగేశ్వరరావు.మూత్రపిండము చెడిపోయి పూర్తిగానుమగడు దగ్గరగుచునుండ మరణమునకుమూత్రపిండమున్ మార్చుట ముఖ్యమనుచువైద్య బృందమున్ దెలుపగ వడిగ తానుతన యవయవమునిడ సమ్మతిని తెలుపుచుభర్త కిచ్చెను తన్వి పావన జననము.
పుత్రుమోమునుతనివితోపుణికెతల్లి
రిప్లయితొలగించండితండ్రిపోలికనుండినతనయునరసి
తోటివారలుహర్షముతోడుతనిరి
భర్తకిచ్చెనుతన్విపావనజననము
బిడ్డ నొసగెదనని మాట ప్రేమ తోడ
రిప్లయితొలగించండిభర్త కిచ్చెను తన్వి ; పావన జననము
పొందె నా కూన , జనకుడు ముదము నొంది
మగువకు కృతజ్ఞత దెలిపె మరువ కుండ
వేళకోళముగాదులేయిదివేల్పుసాక్షిగనందురా
రిప్లయితొలగించండివ్యాళమైగనసుబ్రమణ్యుడువ్యాఘ్రచర్ముడుశంభుడే
కాళరాత్రిగపార్వతీసతికాంచెనాథునిపుత్రుగా
తాళికట్టినభర్తకిచ్చెనుతన్విపావనజన్మమున్
రిప్లయితొలగించండివణుకు గుబ్బల పట్టి శాంభవి భవాని
పాటలావతి పార్షతి భద్రకాళి
ధిషణ ముక్కంటి వాల్గంటి దేవసేన
భర్త కిచ్చెను తన్వి పావన జననము.
కాలి కౌశికి నందయంతియు కప్పుటైదువ గట్టురా
చూలి చండిక పాటలావతి శూలిమానస రాణి యా
శైల పుత్రిక మేనకాత్మజ శక్తి శాకిని, వల్లికిన్
తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్.
అమిత యను రాగమును జూపు ప్రమదయగుచు
రిప్లయితొలగించండినన్ని భంగుల కోర్కెల. నాశ దీర్చు
భార్య గా నడచు కొనుచు వారసు నిగ
భర్త కిచ్చె ను దన్వి పావన జననము
మ. కో.
రిప్లయితొలగించండివేళమున్ సుమతిన్ వరించగ వెన్నడించెను నర్తకిన్
బాళితో నడుగంగ నొప్పెను బాటలో ముని శాపమున్
సోలె సూర్యుని నాపగా ననసూయ రక్షణ నొందగా
*తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్.*
అప్పు వేగతీర్చమనుచు నాదరమున
రిప్లయితొలగించండిపలికిదీనినమ్ముమనుచు పసిడిగొలుసు
*“భర్త కిచ్చెను తన్వి, పావన జననము”*
నొసగె చక్కని పాపకు నొప్పుగాను
మేలమా డుచునద్రిరాసు తమేన కాత్మజ నవ్వుచున్
నీలకంఠుడునైనశూలినినెమ్మితోవరియించితా
*“తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్”*
తేలిపోవుచుసంతసమ్మునదేహమందరభాగమై
తేటగీతి
రిప్లయితొలగించండిపుడమి త్రేతాయుగమ్మున పులకరింప
ధర్మ రక్షణార్థమ్మవతారమందు
కతన నయ్యయోధ్యాపుని సతిగ, లచ్చి
భర్త కిచ్చెను తన్వి పావన జననము
మత్తకోకిల
కూళలెల్లరు ధాత్రి పైనను గూడి ధర్మము ద్రుంచఁగన్
వేళఁజూచియు దాల్చనెంచగ విష్ణువే యవతారమున్
చూలినంది నయోధ్యభూపతి సొంపు దారగ, లక్ష్మికిన్
తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్
తేటగీతి మూడవ పాదంలో
తొలగించండి'నయ్యయోధ్యాధిపు' నని చదువుకొన మనవి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసత్యవంతుని ప్రాణముల్ మృత్యువుకబ
తొలగించండిళించ సావిత్రి తిరిగిసాధించెనుగద
తనదు యత్నమీడేరి సంతసమొసంగ
భర్త కిచ్చెను తన్వి పావన జననము
వైళమాయెను సత్యవంతుని ప్రాణముల్ గొనిపోయినన్
తొలగించండితాళి కట్టిన భర్త కోసము దండయాముని వెంబడెన్
మేళ వించిన యుక్తితో హరిమెప్పు పొందిన సాధ్వియై
తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావన జన్మమున్
తే.గీ.||
రిప్లయితొలగించండినిండు చూలాలు సతిఁ వీడినివసనమున
దేశమాతకు సంకెలల్ ద్రెళ్ళజేయ
పోరుసల్పుచు దివమును చేరుకొనిన
భర్త కిచ్చెను తన్వి పావన జననము
మత్తకోకిల:
రిప్లయితొలగించండితాళజాలక తల్లి భారతి దాస్యమందున సొక్కగన్
బాళిగా తన నిండుగర్భిణి భార్యనున్ విడనాడితా
వేళమేచని యుద్యమంబున వీడె ప్రాణము ధీరుడై
తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్
ఎంత కష్టము వచ్చిన నింతి సంతు
రిప్లయితొలగించండికొఱకుఁ దపియించి నిలఁబడి కొండ వోలె
దేవకీ దేవి కారలో ధృతిని విశ్వ
భర్త కిచ్చెను దన్వి పావన జననము
కాలమే దొరలంగ నంత సుకాల మేర్పడఁ గోడలే
మేలు వొందఁగ నత్తగా నగు మేదినీ తలమం దహో
మేలుగా మును స్వీయ నాథుఁడు మెచ్చ దన్ను స్నుషార్యకుం
దాళి గట్టిన భర్త కిచ్చెను దన్వి పావన జన్మమున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
మూత్రపిండము చెడిపోయి పూర్తిగాను
మగడు దగ్గరగుచునుండ మరణమునకు
మూత్రపిండమున్ మార్చుట ముఖ్యమనుచు
వైద్య బృందమున్ దెలుపగ వడిగ తాను
తన యవయవమునిడ సమ్మతిని తెలుపుచు
భర్త కిచ్చెను తన్వి పావన జననము.