7-3-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వంశీనాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్”(లేదా...)“వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా”(ఆముదాల మురళి గారి శతావధానంలో వైష్ణవ వేంకట రమణమూర్తి గారి సమస్య)
(శిశు పాలుడు ఈర్ష్యతో పలికిన మాటలు)హంసయటంచు దలంతురెకంసారిని గాంచుచు సుజఘన పూతననే హింసించెను గాదె యతనివంశీనాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వంశముసోదరిదయ్యునుకంసుడుదుర్మార్గరీతికరుణింపకయేవంశీకృష్ణునిజూడడువంశీనాదముచెవులకుపాపమ్మొసగున్
సంశయమేల సుఖమొసగువంశీనాదము చెవులకుఁ, బాపమ్మొసఁగున్వంశచరిత్రకు మచ్చనిసాంశయికుడు పరువుహత్య సల్పెడు ఘటనే
వంశోద్ధారకుడౌ యశోదసుతుడే వాద్యంబు మ్రోయించినన్సంశోభిల్లుగదా మనస్సు రయమున్ సంగీత మాధుర్యమౌవంశీనాదము విన్నచో శ్రుతులకున్, బాపమ్ము సంధిల్లుగావంశాచారమటంచు దైత్యవరులే పాపాత్ములై క్రుమ్మరన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
వంశీనాదము విన్నచాలు నదియే భాగ్యంబుగా నెంచుచున్ భ్రంశంబౌనిక పాపమంచు గదరా భామామణుల్ బ్రేమతో వంశీధారిని చేర వచ్చిరికదా! వాచింతువేరీతి గా వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కందంఅంశము శ్రీహరిది నపభ్రంశమ్ములనొందనీని రవములొలుక నగ్రాంశుడు, విననొప్పవనినవంశీనాదము, చెవులకుఁ బాపమ్మొసఁగున్శార్దూలవిక్రీడితముఅంశమ్మా హరిదైన కృష్ణుఁ గరమందానంద సందోహమైభ్రంశమ్ముల్ బ్రతుకందుఁ బొందుననుటల్ వారించు నిక్కమ్ము నగ్రాంశుండున్ రవమూదగా నితరమున్ గామించుచున్, వీడుచున్వంశీనాదము, విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా!
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
సంశ య మేల మధుర మౌవంశీ నాదము చెవులకు :: బాపమ్మొ సగున్భ్రంశ ము గూర్చెడు విధ ముగహింస ల నొన రించు నట్టి హీనున కెపు డున్
వింశతి తడవల వినబడువంశీనాదము చెవులకుఁ ; బాపమ్మొసఁగున్వంశమునకు రోతబడిన ,సంశయమేల నదివినగ జక్కగ నుండున్
వంశీకృష్ణుని వేణుగాన లహరిన్ వైళమ్ముగా గోపికల్భ్రంశంబైనను మేని పుట్టములనున్ పట్టించుకో నేరకన్వంశీనాద వినోద సక్తులగుటన్ వాంఛింత్రుదాసీనతన్వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా
వంశీనాద వినోదమువంశీకృష్ణుండు సలువ పరవశమగునావంశియపభ్రంశమయినవంశీనాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్
శా.అంశాంగమ్ము కరూశ దేశ నృపుడౌ నంశాంశి ద్వేషమ్ముచేభ్రంశీ పౌండ్రక వాసుదేవుడరిగెన్ భ్రాంతమ్ముతో సాత్యకిన్వంశోద్ధారకుడెక్కడో యడుగుచున్ వాదోపవాదమ్ములున్*వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా.*
సంశయ మెరుగని లాస్యమువంశీనాదము.... చెవులకు; బాపమ్మొసగున్వంశీధరు బోధ దెలిసిసంశయ మొందుచు నడవడి శ్రద్ధను వీడన్!
వంశీ! యేమని పలికెదు వంశీనాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్? వంశీనాదము చెవులకు హంసకపుం గాన మలరి హర్షముఁ గూర్చున్
భ్రంశంబేమియులేని సాధననునిర్భావంబుతోనాత్మలోఅంశంబంతయుదైవమేయనుచునాహారంబులేకన్తుదిన్వంశీకృష్ణునితాదలంచుఘనజీవాత్ముండుగాకన్వనిన్వంశీనాదమువిన్నచోశ్రుతులకున్పాపంబుసంధిల్లుగా
భ్రంశ మగుఁ బుణ్య మంతయు వంశీధరుఁ డాగ్రహించుఁ బాటను వినినన్ సంశయ మేల విరాగపు వంశీ నాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్వంశఘ్నుల్ ధర మానవక్షయము నాపాదింప నిత్యమ్ము సర్వాంశమ్ముల్ పరికించి క్షుణ్ణముగ నందం దుండు ఛిద్రమ్ములన్ సంశోధించి వచింపఁ గ్రూర తర భాషల్ విశ్వ విధ్వంస దుర్వంశీ! నాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా
కం॥ వంశీ నాదము విన్ననుసంశయమేల ముదమొసఁగు సంగీత ఝరుల్గంసాది దానవులకేవంశీనాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్శా॥ సంశోధించఁ జరిత్రనెన్ని సుతుఁడా సంగీత మోహంబునన్వంశీనాదపు మాధురీ మహిమలోఁ బ్రాణమ్ము నుంచంగ నావంశోద్ధారకుఁ దండ్రి దీనతను శాపంబిచ్చె నీరీతిగన్“వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా”(ఇక్కడ వంశీనాదము కాకున్నా ప్రతి తల్లిదండ్రులు పడే బాధ అండి, యుక్త వయసు వచ్చిన పిల్లలు గతి తప్పకుండా చూసుకోవడములో)
వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగావంశీ! యేమని పల్కు చుంటివి యహో పాపమ్ము సంధిల్లునా? యీశుండాయదు వంశ భూషితుఁడుఁదానేసాటిమ్రోగించగా వంశీనాదము విన్న సర్పము సతంబానంద మొందంగనౌ
సంశయమేలముదమొసగువంశీనాదము,చెవులకు బాపమ్మొసగున్భ్రంశమ్ములతోనిండుచపశబ్దములతోడవిన్నవారలకెల్లన్
రిప్లయితొలగించండి(శిశు పాలుడు ఈర్ష్యతో పలికిన మాటలు)
హంసయటంచు దలంతురె
కంసారిని గాంచుచు సుజఘన పూతననే
హింసించెను గాదె యతని
వంశీనాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివంశముసోదరిదయ్యును
రిప్లయితొలగించండికంసుడుదుర్మార్గరీతికరుణింపకయే
వంశీకృష్ణునిజూడడు
వంశీనాదముచెవులకుపాపమ్మొసగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంశయమేల సుఖమొసగు
రిప్లయితొలగించండివంశీనాదము చెవులకుఁ, బాపమ్మొసఁగున్
వంశచరిత్రకు మచ్చని
సాంశయికుడు పరువుహత్య సల్పెడు ఘటనే
వంశోద్ధారకుడౌ యశోదసుతుడే వాద్యంబు మ్రోయించినన్
తొలగించండిసంశోభిల్లుగదా మనస్సు రయమున్ సంగీత మాధుర్యమౌ
వంశీనాదము విన్నచో శ్రుతులకున్, బాపమ్ము సంధిల్లుగా
వంశాచారమటంచు దైత్యవరులే పాపాత్ములై క్రుమ్మరన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి
రిప్లయితొలగించండివంశీనాదము విన్నచాలు నదియే భాగ్యంబుగా నెంచుచున్
భ్రంశంబౌనిక పాపమంచు గదరా భామామణుల్ బ్రేమతో
వంశీధారిని చేర వచ్చిరికదా! వాచింతువేరీతి గా
వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఅంశము శ్రీహరిది నప
భ్రంశమ్ములనొందనీని రవములొలుక న
గ్రాంశుడు, విననొప్పవనిన
వంశీనాదము, చెవులకుఁ బాపమ్మొసఁగున్
శార్దూలవిక్రీడితము
అంశమ్మా హరిదైన కృష్ణుఁ గరమందానంద సందోహమై
భ్రంశమ్ముల్ బ్రతుకందుఁ బొందుననుటల్ వారించు నిక్కమ్ము న
గ్రాంశుండున్ రవమూదగా నితరమున్ గామించుచున్, వీడుచున్
వంశీనాదము, విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా!
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిసంశ య మేల మధుర మౌ
రిప్లయితొలగించండివంశీ నాదము చెవులకు :: బాపమ్మొ సగున్
భ్రంశ ము గూర్చెడు విధ ముగ
హింస ల నొన రించు నట్టి హీనున కెపు డున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివింశతి తడవల వినబడు
రిప్లయితొలగించండివంశీనాదము చెవులకుఁ ; బాపమ్మొసఁగున్
వంశమునకు రోతబడిన ,
సంశయమేల నదివినగ జక్కగ నుండున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివంశీకృష్ణుని వేణుగాన లహరిన్ వైళమ్ముగా గోపికల్
రిప్లయితొలగించండిభ్రంశంబైనను మేని పుట్టములనున్ పట్టించుకో నేరకన్
వంశీనాద వినోద సక్తులగుటన్ వాంఛింత్రుదాసీనతన్
వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివంశీనాద వినోదము
రిప్లయితొలగించండివంశీకృష్ణుండు సలువ పరవశమగునా
వంశియపభ్రంశమయిన
వంశీనాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్
శా.
రిప్లయితొలగించండిఅంశాంగమ్ము కరూశ దేశ నృపుడౌ నంశాంశి ద్వేషమ్ముచే
భ్రంశీ పౌండ్రక వాసుదేవుడరిగెన్ భ్రాంతమ్ముతో సాత్యకిన్
వంశోద్ధారకుడెక్కడో యడుగుచున్ వాదోపవాదమ్ములున్
*వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా.*
సంశయ మెరుగని లాస్యము
రిప్లయితొలగించండివంశీనాదము.... చెవులకు; బాపమ్మొసగున్
వంశీధరు బోధ దెలిసి
సంశయ మొందుచు నడవడి శ్రద్ధను వీడన్!
వంశీ! యేమని పలికెదు
రిప్లయితొలగించండివంశీనాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్?
వంశీనాదము చెవులకు
హంసకపుం గాన మలరి హర్షముఁ గూర్చున్
భ్రంశంబేమియులేని సాధననునిర్భావంబుతోనాత్మలో
రిప్లయితొలగించండిఅంశంబంతయుదైవమేయనుచునాహారంబులేకన్తుదిన్
వంశీకృష్ణునితాదలంచుఘనజీవాత్ముండుగాకన్వనిన్
వంశీనాదమువిన్నచోశ్రుతులకున్పాపంబుసంధిల్లుగా
భ్రంశ మగుఁ బుణ్య మంతయు
రిప్లయితొలగించండివంశీధరుఁ డాగ్రహించుఁ బాటను వినినన్
సంశయ మేల విరాగపు
వంశీ నాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్
వంశఘ్నుల్ ధర మానవక్షయము నాపాదింప నిత్యమ్ము స
ర్వాంశమ్ముల్ పరికించి క్షుణ్ణముగ నందం దుండు ఛిద్రమ్ములన్
సంశోధించి వచింపఁ గ్రూర తర భాషల్ విశ్వ విధ్వంస దు
ర్వంశీ! నాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా
కం॥ వంశీ నాదము విన్నను
రిప్లయితొలగించండిసంశయమేల ముదమొసఁగు సంగీత ఝరుల్
గంసాది దానవులకే
వంశీనాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్
శా॥ సంశోధించఁ జరిత్రనెన్ని సుతుఁడా సంగీత మోహంబునన్
వంశీనాదపు మాధురీ మహిమలోఁ బ్రాణమ్ము నుంచంగ నా
వంశోద్ధారకుఁ దండ్రి దీనతను శాపంబిచ్చె నీరీతిగన్
“వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా”
(ఇక్కడ వంశీనాదము కాకున్నా ప్రతి తల్లిదండ్రులు పడే బాధ అండి, యుక్త వయసు వచ్చిన పిల్లలు గతి తప్పకుండా చూసుకోవడములో)
వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా
రిప్లయితొలగించండివంశీ! యేమని పల్కు చుంటివి యహో పాపమ్ము సంధిల్లునా?
యీశుండాయదు వంశ భూషితు
ఁడుఁదానేసాటిమ్రోగించగా
వంశీనాదము విన్న సర్పము సతంబానంద మొందంగనౌ
సంశయమేలముదమొసగు
రిప్లయితొలగించండివంశీనాదము,చెవులకు బాపమ్మొసగున్
భ్రంశమ్ములతోనిండుచ
పశబ్దములతోడవిన్నవారలకెల్లన్