18, మార్చి 2023, శనివారం

సమస్య - 4370

19-3-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“త్రాగిన మానవుని బ్రతుకు ధన్యంబగురా”
(లేదా...)
“త్రాగినవాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో డా॥ జయమ్మ గారి సమస్య)

44 కామెంట్‌లు:

  1. సాగుచుసాధనయందున
    మాగినపండుగమనసునమాధురినిండన్
    వేగమరామరసంబును
    త్రాగినమానవునిబ్రదుకుధన్యంబగురా

    రిప్లయితొలగించండి
  2. కందం
    సాగుచు రామ జపమ్మున
    కాగల కార్యమ్ము సేయ కపివరుఁడందెన్
    గౌగిటఁ రాముని, తత్సుధ
    త్రాగిన మానవుని బ్రతుకు ధన్యంబగురా!


    ఉత్పలమాల
    కాగల కార్యభారమును కమ్మనిరాముని నామకీర్తనన్
    సాగుచు లంకలో జనని జానకి సేమము హన్మగాంచియున్
    తాఁగొనె రాముఁ గౌగిటను దారక నామసుధామృతమ్మునే
    త్రాగినవాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  3. ఆగకసాధనంబుగొనిహంగు లవీడుచులోకమందునన్
    తాగనపారమార్థికముతత్వమునాత్మనునింపుజీవుడై
    సాగుచుబాటసారిగనుసౌమ్యతరామరసాయనంబునే
    త్రాగిన ాానిజీవనముధన్యమగున్ధరలోనజూడగన్

    రిప్లయితొలగించండి
  4. భోగము లెన్నియున్న నవి మోదము గూర్చునె మానవాళికిన్?
    ధీగుణ శాలియై మనమధీనము నందున నుంచు కొంచు, దా
    శ్రీ గురు బోధనామృతము చిత్ర విచిత్ర కథాను రక్తుడై
    త్రాగినవాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్.

    రిప్లయితొలగించండి

  5. ఆ గూఢోత్మునిపై యను
    రాగమ్మును కలిగి యనవరతమా దాసుల్
    భాగవతులు నుడువు సుధల
    త్రాగిన మానవుని బ్రతుకు ధన్యంబగురా.


    భోగవిలాస చిత్తులన మూర్ఖులె గాదె సమాజమందునన్
    చేగలవారలై ప్రజల క్షేమముగోరుచు సంతతమ్మిలన్
    భాగవతోత్తముల్ నుడువు భక్తిసుబోధల తత్వసారమున్
    త్రాగినవాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'గూఢోత్ముని/గూఢాత్ముని' ?

      తొలగించండి
  6. మూగిన యిడుములు దొ లగగ
    రాగము తో శివుని భజన రాత్రిం బ వ లున్
    సాగించి భక్తి రసమును
    త్రాగిన. మానవుని బ్రతుకు ధన్యం బ గురా!

    రిప్లయితొలగించండి
  7. ఆగమములసారమ్మిది
    భాగవతోత్తముల కొంగు బంగరు, మనసా
    రా గీతామృతముఁ దమిన్
    ద్రాగిన మానవుని బ్రతుకు ధన్యంబగురా

    రిప్లయితొలగించండి
  8. భోగము గోరి మానవుడు బూనను జేయగ
    పాప కార్యముల్ ,
    త్యాగము సెడ్డ కోర్కులను దప్పక
    జేసియు సద్విచారియై
    రాగముతోడ భక్తి మెయి రాముని మంగళ
    నామసారమున్
    తాగిన వాని జీవితము ధన్యమగున్
    ధరలోన జూడగన్ .

    రిప్లయితొలగించండి
  9. ఉ.

    వాగుచు రాక్షసుల్ కచుని వధ్యునిగా తలపోసి చంపగా
    భోగ విలాసి శుక్రునకు బూడిద ద్రావకమందు నివ్వగా
    వేగముతోడ మిశ్రమము వేయుచు లీనముచేసి మద్యమున్
    *త్రాగినవాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్.*

    రిప్లయితొలగించండి
  10. రాగముతోననుదినమును
    భాగవతమ్మునువిడువకపఠియింపంగన్
    యాగానసుధారసమును
    *“త్రాగిన మానవుని బ్రతుకు ధన్యంబగురా”*

    రిప్లయితొలగించండి
  11. బాగవునా యెల్లప్పుడు
    త్రాగిన మానవుని బ్రతుకు? ధన్యంబగురా
    త్రాగుడు వ్యసనమ్ము విడిచి
    సాగించినచో మనుగడ సన్మార్గమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆగములైన కార్యముల నాపక సాగగ సంకటమ్ములే
      వేగమె సంక్రమించి కడు వేదనలేమిగులున్ యధార్థమై
      బాగగు వర్తనంబలరి భక్తిరసామృత ధారలన్ సదా
      త్రాగినవాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. బాగుగ గని జేపట్టిన
    బాగరి దాపునకు జేర వాంఛ కలుగగన్
    నా గృహిణి పెదవుల సుధను
    త్రాగిన మానవుని బ్రతుకు ధన్యంబగురా

    రిప్లయితొలగించండి
  13. భోగపు శ్రీనివాసునినిమూర్తిగనిల్పుచు మాడవీధులన్
    స్వాగతసుందరోజ్వలవిశాలయలంకృత శేషశయ్యపై
    రాగములందినన్నమయరమ్యపుధారల గానమాధురుల్
    ద్రాగినవాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'విశాల + అలంకృత = విశాలాలంకృత' అవుతుంది. యడాగమం రాదు. "రాగములంది యన్నమయ" అని ఉండాలి.

      తొలగించండి
  14. ఆగమసంహితంబనుచు నార్యులు బల్కెడు భారతంబునన్
    యోగవిశోధనాత్మకము, నుత్తమమై దనరారు నట్టిదౌ
    భాగవతోత్తముల్ సతము భక్తిగ గ్రోలెడు గీత మాధురిన్
    త్రాగినవాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  15. సాగుచు కల్లు విక్రయపు శాలకు, గ్రోలుచు మద్యమిచ్ఛతో
    వాగుచు, దైవ దూషణము వారక చేసిన మంచి కల్గునే
    భోగము నిల్లు టాలుకడఁ బొందుచు, రాముని నామ గీతముల్
    త్రాగినవాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  16. భోగాసక్తులు గాకయె
    బాగుగ నధ్వర్యు నాఖ్య భాసిలు చుండన్
    యాగార్థ సోమ రసముం
    ద్రాగిన మానవుని బ్రతుకు ధన్యం బగురా

    రాగ యుతమ్ము రామ రఘు రామ సురార్చిత రామ యంచు భ
    క్తాగమ నాభిలాష నిర తార్తి స భక్తి నిరంతరమ్ము ని
    ద్రా గతి జాగ్ర దన్యముల రామ సునామ సుధా రసమ్మునుం
    ద్రాగిన వాని జీవనము ధన్య మగున్ ధరలోనఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  17. కం॥త్రాగఁగ మద్యముఁ దప్పని
    బాగుగఁ దెలుపిరొక నాఁడు బ్రదుకున విలువల్
    సాగిన నీతి తిరగబడ
    త్రాగిన మానవుని బ్రదుకు ధన్యంబగురా

    ఉ॥ త్రాగఁగ మద్యమున్ దెగడి తామస రీతియటంచుఁ దెల్పుచున్
    ద్రాగుట మానవో యని హింతంబును బల్కిరి నాఁడు విజ్ఞులున్
    ద్రాగుట మోదమే నిపుడు త్రాగని వారలు మూర్ఖులైనచో
    త్రాగిన వాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  18. భోగమని దలంపక నిఁక
    యాగమునుంజే యుచుండి యనవరతంబున్
    యాగము నంసోమ రసముఁ

    ద్రాగిన మానవుని బ్రతుకు ధన్యంబగురా

    రిప్లయితొలగించండి
  19. త్రాగుట నేరమౌనుగద త్రాగకు సోదర! మద్య మెప్పుఁడుం
    ద్రాగిన మత్తులోఁబలుక రానివి పల్కుచు సాటివారలన్
    మూగనిఁ జేయ మేలెయన మూర్ఖుని వోలెను బల్కె నిట్లుగా
    త్రాగినవాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.

    ఏగుచు రాముని గుడికిన్
    సాగించుచు రామభజన సంకీర్తనలన్
    ఆ గానామృత రసమును
    త్రాగిన మానవుని బ్రతుకు ధన్యంబగురా!

    రిప్లయితొలగించండి
  21. జాగును చేయకను దినము
    రాగముతో విడువక నతి రమ్యం బౌనా
    భాగవత తత్వసారము
    త్రాగిన మానవుని బ్రతుకు ధన్యంబగురా

    రిప్లయితొలగించండి