31, మార్చి 2023, శుక్రవారం

సమస్య - 4383

1-4-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రమ్ముకొనె వెల్గు లెద్దియుఁ గానఁబడదు”
(లేదా...)
“క్రమ్మెను వెల్గు లంతటను గన్నుల కెద్దియుఁ గానుపించదే”

19 కామెంట్‌లు:

 1. రాయబారిగకృష్ణుడు రంజితముగ
  హితవుగూర్చుచుపలికినహ్రీనివిడచి
  మూర్ఖుడయ్యెనురారాజుమొండికతన
  క్రమ్ముకొనెవెల్గులెద్దియుకానబడదు

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. తేటగీతి
   గీతఁ గర్తవ్య బోధనఁ గృష్ణమూర్తి
   విశ్వరూపానఁ గ్రీడికి వినఁగఁ జెప్ప
   దిగ్గురనఁ గౌరవాదుల దివ్యమౌచుఁ
   గ్రమ్ముకొనె వెల్గు! లెద్దియుఁ గానఁబడదు!!


   ఉత్పలమాల
   దమ్మును గల్గి మోహమునఁ దప్పుకొనంగ దలంచ యుద్ధమున్
   నెమ్మది గూర్చి బాధ్యతను నేర్పగ జెప్పియు విశ్వరూపుడై
   నమ్మిన క్రీడి మేల్కొన జనార్థను డెంచఁగఁ గౌరవాళిపై
   క్రమ్మెను వెల్గు లంతటను! గన్నుల కెద్దియుఁ గానుపించదే! !

   తొలగించండి
 3. ఉ.

  మమ్మరె ! కృష్ణునిన్ సభను మంతనమాడి సుయోధనాదులున్
  పిమ్మట కట్టివేయు మతి పృక్తము దుష్టులు మూర్ఛ బోవ, శా
  తమ్మె, విరాట్టు రూపమున దర్శనమిచ్చెను సత్తమాళికిన్,
  *గ్రమ్మెను వెల్గు లంతటను గన్నుల కెద్దియుఁ గానుపించదే.*

  రిప్లయితొలగించండి

 4. కడలి దాటగ నెంచుచున్ గపివరుండు
  భీమ రూపము దాల్చిన వేళయందు
  కనులు కురిపించె దివ్యమౌ కాంతులచట
  క్రమ్ముకొనె వెల్గు లెద్దియుఁ గానఁబడదు.


  ఇమ్మహిలోన వల్లభున కింతియె సర్వము కన్ను గీటుచున్
  గమ్మని నవ్వు రువ్వగనె కాంతులవెన్నియొ యత్తమిల్లుచున్
  క్రమ్మెను వెల్గు లంతటను గన్నుల కెద్దియుఁ గానుపించదే
  కొమ్మల మందహాసమది కోవిడు కన్న ప్రమాదమే సుమీ.


  ప్రేమలోన మునిగి నట్టి ప్రియుడు వాడు
  దాసు డయ్యెనా యందాల తరుణి తాను
  కన్ను గీటుచు నవ్వినన్ గాంతి విరిసి
  క్రమ్ముకొనె వెల్గు లెద్దియుఁ గానఁ బడదు.

  రిప్లయితొలగించండి
 5. శత్రు వొక్కడు గనుపింప క్షాత్రమునను
  కనులు మిక్కిలి యెర్రనై కాంతి నిండి
  క్రమ్ము కొనె వెల్గు లెద్దియు గాన బడదు
  కాన శాంతమ్ము వహియించ కమ్ర మండ్రు

  రిప్లయితొలగించండి
 6. చాంద్రమానము నందున చందు మొదటి
  వాసరము నందు నుండెడి వసతి జూడ
  నమవస కనుక నంబరమందు మబ్బు
  క్రమ్ముకొనె , వెల్గు లెద్దియుఁ గానఁబడదు

  రిప్లయితొలగించండి
 7. యుద్ధ భూమిలో లక్ష్మణు డొరిగిపోయె
  కౌసలేయునిమదినంధకారమలరెఁ
  క్రమ్ముకొనె వెల్గు లెద్దియుఁ గానఁబడదు
  హనుమ వేగమరిగిదెచ్చె నౌషధమ్ము


  తమ్ముడు లక్ష్మణుండు స్పృహతప్పగ జేసెను మేఘనాథుడే
  క్రమ్మెను వెల్గు లంతటను గన్నుల కెద్దియుఁ గానుపించదే
  నమ్మినబంటుగా హనుమ నాకపు మార్గము నందునేగి తా
  నిమ్ముగ దెచ్చెనౌషధిని నెమ్మది కూర్చెను రామభద్రుకున్

  రిప్లయితొలగించండి
 8. సొమ్ముల బంచి యివ్వ మనసొప్పని నాతడు ధార్తరాష్ట్రుడున్
  తమ్ముడు దుస్ససేనుడును తక్కిన వారటు కర్ణసౌబలుల్
  క్రమ్మగ వాసుదేవునట గానక నాతని శౌర్య విక్రమున్
  క్రమ్మెను వెల్గులంతటను గన్నుల కెద్దియుఁ గానుపించదే.
  ***
  (తేటగీతి)
  వాసుదేవుండు యెచ్చులు వల్కెనంచు
  కర్ణ సౌబలు తమ్ముని కలిసి యాడి
  కృష్ణు బంధింప జూచుచో కష్టు డతడు
  క్రమ్ముకొనె వెల్గు లెద్దియుఁ గానబడదు.
  కడయింటి కృష్ణమూర్తి..గోవా.. 01-04-23

  రిప్లయితొలగించండి
 9. ఇమ్మగు రూపుతోడ హరినేక్షణ చిక్క కళత్రమై, కడున్
  కమ్మని యూహలందునను కాముని కేళికి వేచియుండగా
  చిమ్ముచు నవ్వులన్ దరికి చేరగ, నాసతి దేహకాంతికిన్
  క్రమ్మెను వెల్గు లంతటను గన్నుల కెద్దియుఁ గానుపించదే

  రిప్లయితొలగించండి
 10. ఇమ్మెయి బంధుకోటిగనినెవ్విధిచేయుదునంచుపార్థుడున్
  నమ్మరొభీతియున్కలిగెనాహవమెవ్వధిచేయువాడనో
  కమ్మనివిశ్వరూపమునుకంసహరుండటచూపినంతనే
  క్రమ్మెను వెల్గులంతటనుకన్నులకెద్దియుకానిపించదే

  రిప్లయితొలగించండి
 11. అమ్మహ నీయ యుద్ధమున నర్జును డచ్చట
  నున్న సైన్యమున్
  గ్రమ్మర బందు మిత్రులను గాంచి రణంబును
  జేయనంచనెన్
  నమ్ముమి దెల్ల మిథ్యయని నందకిశోరుడు
  సూపెవిశ్వమున్
  క్రమ్మెను వెల్గులంతటను కన్నుల కెద్దియు గానపించదే .

  రిప్లయితొలగించండి
 12. ఇమ్మనె పాండునందనుల కిమ్ముగ గ్రామములైదునైన, పం
  తమ్మున రాజరాజు తన దర్పముఁజూపగ కృష్ణమూర్తి తా
  గమ్మున విశ్వరూపమును కౌరవరాట్సభయందు చూపగన్
  క్రమ్మెను వెల్గు లంతటను గన్నుల కెద్దియుఁ గానుపించదే

  రిప్లయితొలగించండి
 13. తే॥ రాత్రి పూఁట వాహనమును రమ్య గతిని
  నడుపు చుండఁగ నెదురుగా నడుచు చుండు
  వాహనముల కాంతులు మీదఁ బడఁగ నపుడు
  క్రమ్ము కొనె వెల్గు లెద్దియుఁ గానఁ బడదు

  ఉ॥ నెమ్మదిగాను వాహనము నిశ్చిత వేగము తోడ నాఁగకన్
  గమ్మున పోవు చుండగను గ్రమ్మగఁ జీకటి యంధకారమున్
  జిమ్మఁగ నన్య వాహనము చిక్కని కాంతుల నన్ని ప్రక్కలన్
  గ్రమ్మెను వెల్గులంతటను గన్నుల కెద్దియుఁ గానుపించదే!

  (వాస్తవ పరిస్థిలకనుగుణంగా వ్రాయ ప్రయత్నముండి)

  రిప్లయితొలగించండి
 14. రాయబారిని బంధించి రభసచేయు
  కౌరవేయుల ధైర్యము కరఁగుపడగ
  విశ్వరూపమ్ముఁ జూపింప వేణుధరుఁడు
  క్రమ్ముకొనె వెల్గు లెద్దియుఁ గానఁబడదు

  రిప్లయితొలగించండి