23-3-2023 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “పతి చచ్చుట మంగళంబు భామామణికిన్”(లేదా...)“పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్”(ఆముదాల మురళి గారి శతావధానంలో డా॥ పురంధేశ్వరి గారి సమస్య)
గతితప్పినవర్తనుడైమితిమీరినకావరమున మిన్నక ధరణీసుతనే దోచిన లంకాపతి చచ్చుట మంగళంబు భామామణికిన్
సతతము ధర్మరక్షణము సల్పెడు రామునిపైన కక్షతోనతులిత సుందరాంగియగు నాధరణీసుతపైన కాంక్షతోతతిగొని చూచి భూమిజను తక్కలిగొన్న వెడంగు లంక క్ష్మా పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంగతిఁదప్పిన లంకేయులహతమార్తుననఁ గుజ హనుమ నాపె, నయోధ్యాపతి బాణమ్మున లంకాపతి చచ్చుట మంగళంబు భామామణికిన్చంపకమాలఅతులితశౌర్య దర్పమున నాగడమెంచిన రావణాళివౌకుతుకల గిల్లివైతునని కోరిన మారుతి నాపె సీతయేపతి రఘురాముడే తగిన వాడనె, వారలచేత దీవికిన్పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్
🙏 ధన్యోస్మి గురుదేవా!🙏
అతివకునైదవతనమునుపతికడబొందగశుభమదిభావ్యమునగుగాపతనముగాగనునదియునుపతిజచ్చుటమంగళంబుభార్యామణికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పతులేవురి సన్నిధిఁ కులసతి చీరలనూడ్చి నిండు సభలో దుర్మార్గతఁ జూపిన హస్తిన పురపతి చచ్చుట మంగళంబు భామామణికిన్
సతిజాడ హనుమ తెలుపగపతి రా ముడు చేసినట్టి భండనమున దుర్మతియౌ యా మండోదరిపతి చచ్చుట మంగళంబు భామామణికిన్. అతివను బంధిసేసెనని యాగ్రహమందున వార్ధి దాటి దుర్మతి పరకాంతఁ గోరెడు ప్రమత్తుని ద్రుంచగ నెంచి మైథిలీ పతి భరతాగ్రజుండచట భండన మందున రేగ లంక స్వర్పతి మరణింప, మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్
అతివకు కడుకష్టములిడు పతి చచ్చుట ; మంగళంబు భామామణికిన్బతుకంతయు మనువాడినయతని పరాయణము నందె నంతము నొందన్
అతులిత గర్వాంధుండైగతి తప్పిన వర్తనమున కామాతురు డైమితి మీరిన నా లంకాపతి చచ్చు ట మంగళంబు భామా మణి కిన్
పతులసమాన ధీమతులు పాండు కుమారు లవక్ర విక్రముల్మతకపు ద్యూతమందు నవమానమొనర్చిననాటి యానలన్పతులొనగూర్చుచుండఁనురు భండనమందున కౌరవేయ క్ష్మాపతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. 'కౌరవేయ క్ష్మా..' అన్నపుడు 'య' గురువై గణభంగం. సవరించండి.
ధన్యవాదములు గురువుగారూ! క్ష్మా పతి బదులు భూపతి అని సవరించుకుంటాను. _/|\_
మతిచెడి రావణాసురుడు మానినిసీతను దస్కరించగానతి బలశాలి వానిని సమంచితరాముడుయుద్ధమందునన్హతమొనరించ సీతవిని హర్షము సెందెనులంక దీవికిన్పతి మరణింప మంగళము భామకుకల్గెను సుస్థిరంబుగాన్
చం.పతియగు సుందుడంతమున బాగరి తాటకకై యగస్త్యుడేపతనము నిచ్చె, రూపములు పైకొని రక్కసిగా తనూజులున్*పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్*రతనము వంటి చావు గొనె రాముని చేతిని ముక్తిగల్గెడిన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
అతిహేయంబుగ సభలో సతికోకను లాగ కనలి సమరమునందున్ ప్రతిగా పతిచంపగ కురు పతి చచ్చుటమంగళంబు భామామణికిన్
సతతం బిద్ధర ధర్మచ్యుతి కారణ మైన యట్టి జూదము నందున్రతియే, దేనికి లొంగెనొపతి, చచ్చుట మంగళంబు భామా మణికిన్సతి చెఱ వోయె భర్త మది శాంతము నందెను నంద నానుకూలత లభియించె హర్షదము రా మృగ రాజవరేణ్య లోచ నాగత మద కుంజ రాభ మయి కన్నని చెంతకుఁ గంసుఁ డా ధరా పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
పిన్నక నాగేశ్వరరావు.సతి సీతను బలవంతము న తస్కరించి గొన రావణాసురుడు, యనిన్పతి రామునిచే లంకాపతి చచ్చుటె మంగళంబు భామామణికిన్.
గతితప్పినవర్తనుడై
రిప్లయితొలగించండిమితిమీరినకావరమున మిన్నక ధరణీ
సుతనే దోచిన లంకా
పతి చచ్చుట మంగళంబు భామామణికిన్
సతతము ధర్మరక్షణము సల్పెడు రామునిపైన కక్షతో
తొలగించండినతులిత సుందరాంగియగు నాధరణీసుతపైన కాంక్షతో
తతిగొని చూచి భూమిజను తక్కలిగొన్న వెడంగు లంక క్ష్మా
పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిగతిఁదప్పిన లంకేయుల
హతమార్తుననఁ గుజ హనుమ నాపె, నయోధ్యా
పతి బాణమ్మున లంకా
పతి చచ్చుట మంగళంబు భామామణికిన్
చంపకమాల
అతులితశౌర్య దర్పమున నాగడమెంచిన రావణాళివౌ
కుతుకల గిల్లివైతునని కోరిన మారుతి నాపె సీతయే
పతి రఘురాముడే తగిన వాడనె, వారలచేత దీవికిన్
పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏 ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఅతివకునైదవతనమును
రిప్లయితొలగించండిపతికడబొందగశుభమదిభావ్యమునగుగా
పతనముగాగనునదియును
పతిజచ్చుటమంగళంబుభార్యామణికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపతులేవురి సన్నిధిఁ కుల
రిప్లయితొలగించండిసతి చీరలనూడ్చి నిండు సభలో దుర్మా
ర్గతఁ జూపిన హస్తిన పుర
పతి చచ్చుట మంగళంబు భామామణికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసతిజాడ హనుమ తెలుపగ
పతి రా ముడు చేసినట్టి భండనమున దు
ర్మతియౌ యా మండోదరి
పతి చచ్చుట మంగళంబు భామామణికిన్.
అతివను బంధిసేసెనని యాగ్రహమందున వార్ధి దాటి దు
ర్మతి పరకాంతఁ గోరెడు ప్రమత్తుని ద్రుంచగ నెంచి మైథిలీ
పతి భరతాగ్రజుండచట భండన మందున రేగ లంక స్వ
ర్పతి మరణింప, మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్
అతివకు కడుకష్టములిడు
రిప్లయితొలగించండిపతి చచ్చుట ; మంగళంబు భామామణికిన్
బతుకంతయు మనువాడిన
యతని పరాయణము నందె నంతము నొందన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅతులిత గర్వాంధుండై
రిప్లయితొలగించండిగతి తప్పిన వర్తనమున కామాతురు డై
మితి మీరిన నా లంకా
పతి చచ్చు ట మంగళంబు భామా మణి కిన్
పతులసమాన ధీమతులు పాండు కుమారు లవక్ర విక్రముల్
రిప్లయితొలగించండిమతకపు ద్యూతమందు నవమానమొనర్చిననాటి యానలన్
పతులొనగూర్చుచుండఁనురు భండనమందున కౌరవేయ క్ష్మా
పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'కౌరవేయ క్ష్మా..' అన్నపుడు 'య' గురువై గణభంగం. సవరించండి.
ధన్యవాదములు గురువుగారూ! క్ష్మా పతి బదులు భూపతి అని సవరించుకుంటాను. _/|\_
తొలగించండిమతిచెడి రావణాసురుడు మానిని
రిప్లయితొలగించండిసీతను దస్కరించగా
నతి బలశాలి వానిని సమంచితరాముడు
యుద్ధమందునన్
హతమొనరించ సీతవిని హర్షము సెందెను
లంక దీవికిన్
పతి మరణింప మంగళము భామకు
కల్గెను సుస్థిరంబుగాన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం.
రిప్లయితొలగించండిపతియగు సుందుడంతమున బాగరి తాటకకై యగస్త్యుడే
పతనము నిచ్చె, రూపములు పైకొని రక్కసిగా తనూజులున్
*పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్*
రతనము వంటి చావు గొనె రాముని చేతిని ముక్తిగల్గెడిన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅతిహేయంబుగ సభలో
రిప్లయితొలగించండిసతికోకను లాగ కనలి సమరమునందున్
ప్రతిగా పతిచంపగ కురు
పతి చచ్చుటమంగళంబు భామామణికిన్
సతతం బిద్ధర ధర్మ
రిప్లయితొలగించండిచ్యుతి కారణ మైన యట్టి జూదము నందున్
రతియే, దేనికి లొంగెనొ
పతి, చచ్చుట మంగళంబు భామా మణికిన్
సతి చెఱ వోయె భర్త మది శాంతము నందెను నంద నానుకూ
లత లభియించె హర్షదము రా మృగ రాజవరేణ్య లోచ నా
గత మద కుంజ రాభ మయి కన్నని చెంతకుఁ గంసుఁ డా ధరా
పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
సతి సీతను బలవంతము
న తస్కరించి గొన రావణాసురుడు, యనిన్
పతి రామునిచే లంకా
పతి చచ్చుటె మంగళంబు భామామణికిన్.