14, మార్చి 2023, మంగళవారం

సమస్య - 4366

15-3-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మేఁక కావుకావనెను మేమే యనదఁట”
(లేదా...)
“మేఁకకు మేఁతఁ బెట్ట నది మే యనకుండఁగఁ గావుకావనెన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో బ్రాహ్మణపల్లి తారకరామ గారి సమస్య)

16 కామెంట్‌లు:


 1. శివుని మెప్పించి వరమంది చింబు తాను
  కటిక వానిని గాంచుచు గలత తోడ
  చంపబోకు మటంచును సర్వ భక్ష
  మేఁక కావుకావనెను, మేమే యనదఁట.

  రిప్లయితొలగించండి
 2. కలియుగమ్మున వింతలు గల్గు ననుట
  ప్రజలు గమనించి యొకచోట. నిజము గాగ
  మేక కావు కావనెను. మే మే యన దట
  యనుచు గుస గుస లాడి రి యబ్బురముగ

  రిప్లయితొలగించండి
 3. శాకము లారగింపవలె జంగలమేలర? మానుమంచదే
  మీకిల గూర్చు స్వాస్థ్యమని మేటి యధీతియె చూప చిత్రమున్
  లోకులు శ్రద్ధతోడ నవలోకము జేయుచు నందు గాంచిరే
  మేఁకకు మేఁతఁ బెట్ట నది మే యనకుండఁగఁ గావుకావనెన్.

  రిప్లయితొలగించండి
 4. మేఁక కావుకావనెను మేమే యనదఁట
  మాతృ భాషపయి వెగటు మనుజులందె
  గాక పశు పక్షులందున గానవచ్చె
  కాల మహిమయె మరి వేరుకాదు కనగ

  రిప్లయితొలగించండి
 5. కావు కావను కూతలు కాకులిడును
  మేయనుచు నరచునుగద మేక లెపుడు
  శాప వశమున కాకికి రూపుమారి
  మేఁక కావుకావనెను మేమే యనదఁట

  కాకుల కేకలే వినిన కావను శబ్దము శ్రవ్యమౌనుగా
  మేకల కేకలే వినిన మేయను ధ్వానము శ్రవ్యమౌనుగా
  భీకరమొప్పగా మునిశపించిగ కాకము మేకయైనచో
  మేఁకకు మేఁతఁ బెట్ట నది మే యనకుండఁగఁ గావుకావనెన్

  రిప్లయితొలగించండి
 6. తేటగీతి
  చోటు నెరుగుచు ననువైన మాటమార్చి
  మనఁగ వలయును లోకాన మనుజుఁడెపుడు
  కాకి వ్రాలిన వీపున కదలకున్న
  మేఁక, కావుకావనెను మేమే యనదట

  ఉత్పలమాల
  లోకము నందు మానవుడు రూఢిగ మాటను మార్చఁగావలెన్
  గాకను తప్పులేదు ఘటనాఘటనంపు సమర్థుఁడంచనన్
  ప్రాకృతికమ్మనన్ తరలి వచ్చిన కాకము సఖ్యమైనయున్
  మేఁకకు, మేఁతఁ బెట్ట నది మే యనకుండఁగఁ గావుకావనెన్

  రిప్లయితొలగించండి
 7. కాకికావను మేఁ యనిమేఁకయనును
  మేతఁగొని కావనదు తాను మేమెయనును
  మేఁక, కావుకావనెను మేమేయనదఁట
  కాకి మెసవదెన్నఁడు పచ్చగడ్డి గనుక

  రిప్లయితొలగించండి
 8. మేఁకల నైజమెద్దియన మేయని కూయుట గాని వింతగా
  కాకితెరంగు తాననునె గావని విస్మృతి నెన్నడేనియున్
  మేఁకకు మేఁతఁ బెట్ట నది మే యనకుండఁగఁ? గావుకావనెన్
  కాకులు తెల్లవారఁగనెఁ గావెవి శాశ్వతమంచునీ భువిన్

  రిప్లయితొలగించండి
 9. రంగుమార్చినప్రతిపక్షరజనికరుడు
  భానుడాయెనుదినమునభాసురముగ
  దాణమారినకతననుధైర్యమంది
  మేకకావుకావనెనుమేమేయనదట

  రిప్లయితొలగించండి
 10. పాకుడుబట్టినట్టిఘ బాంధవుడాయెనుపా కుండయో
  మూకనువెఱ్ఱిగాదలచిమోమునరంగునుబూసియాడుచున్
  నూకలుజల్లివారలకునోటునుజూచుచురంకెవేయుగా
  , ేకకుమేతబెట్టనదిమేయనకుండగకావుకావనెన్

  రిప్లయితొలగించండి
 11. నిలిచి మేఁక వీఁపునఁ గాకి యులికి పడక
  యఱచు చున్నది వీక్షింపు మయ్య సత్య
  మఱచి నట్టిది కాకి మహాత్మ కాదు
  మేఁక కావు కా వనెను మేమే యన దఁట

  సాఁకెడు వేళ తిండి నిడి చప్పుడు సేయవు విశ్మయాత్ములే
  కాకుఁడు మీరు వింత లివి కా వన నెక్కడి కేని తిండికై
  పోక నగమ్ముపై నిలిచి ముచ్చట గొల్పఁగ నొక్క కాకమే
  మేఁకకు మేఁతఁ బెట్ట నది మే యన కుండఁగఁ గావు కా వనెన్

  [అనక + ఉండఁగ = అన కుండఁగ]

  రిప్లయితొలగించండి

 12. పిన్నక నాగేశ్వరరావు.

  కావు కావని యనదట కచ్చితముగ
  మేక; కావు కావనెను మేమే యనదట
  కాకి; యెన్ని వర్షమ్ములు కలసియున్న
  గాని యెవరి యఱపు వారిదౌను గాని
  యొకరి దింకొకరి కెటుల నొదవునయ్య?

  రిప్లయితొలగించండి
 13. తే॥ తోఁకలేని మేఁకను కని దొంగ యొకఁడు
  తాను దొంగలించఁగఁ జేర దగ్గరకును
  గాకి కావుకావనుటను గనఁగ నటుల
  మేఁక కావు కావనెను మేమే యనదట!

  ఉ॥ మేఁకకు బాధ హెచ్చినను మిక్కిలి వేదన నోవు సైఁచెనే
  తోఁకను గత్తిరించఁగను దుంటరి పోరఁడు, గొంతు మారగన్
  మేఁకకు మేఁతఁబెట్ట యది మే యనకుండఁగఁ గావుకావనెన్
  కాకులుఁ జేరి మూఁగెనఁట కాంచఁగ వింతను గ్రొత్త మిత్రునిన్

  పోరడు నిందార్ఖముతో వాడదగునని నిఘంటువు తెలిపినదండి లేనిచో బాలుడని వ్రాసేవాడినండి

  రిప్లయితొలగించండి
 14. తినగనెంచికేసరి రాగ తీరుగాను,
  మేక కావు కావనెను మేమే యనదట
  ప్రాణ భీతిచేకోరిశరణము కోరి
  మోకరిల్లుచు పదములముందుతాను

  రిప్లయితొలగించండి
 15. ఉ.

  కాకుల లబ్ధి లేక గురికట్టుగ మేకకు దిండి పిండమే
  నాకము జేర్చగా పితరు నామము మంత్రముతో పఠించగా
  *మేఁకకు మేఁతఁ బెట్ట నది మే యనకుండఁగఁ గావుకావనెన్*
  కాకులు అంతరించు విధి కార్యము పిండములే వృథా యగున్.

  రిప్లయితొలగించండి