29, మార్చి 2023, బుధవారం

సమస్య - 4381

30-3-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మనుజున కవసరము లేని దాహారమ్మే”
(లేదా...)
“ఆహారమ్ముఁ గొనంగ మానవునకున్ వ్యర్థంబె ముమ్మాటికిన్”

18 కామెంట్‌లు:

 1. కందం
  వనముల కేగెను రాముని
  తన ప్రాణ సమముగనెంచి తమ్ముడనెడు ల
  క్ష్మణు, డన్న యుండ కారణ
  మనుజున కవసరము లేని దాహారమ్మే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శార్దూలవిక్రీడితము
   దాహంబైనను 'మంచి' నీటిఁగొనెడున్ దత్వమ్మె యారోగ్యమౌ
   బేహారుల్ సిరిమూటగట్టుకొనెడున్ విజ్ఞానమేపారగన్
   ద్రోహమ్మైనవిషమ్ము లూరెడువనన్ రుచ్యంబుగానమ్మ న
   య్యాహారమ్ముఁ గొనంగ మానవునకున్ వ్యర్థంబె ముమ్మాటికిన్!

   తొలగించండి
 2. అనుదినమును హరిగొలుచుచు
  ననుభాషల గరళకంఠు ననుదిన చర్చల్
  కొనసాగు భక్త వరుడగు
  మనుజున కవసరము లేని దాహా! రమ్మే.
  కడయింటి కృష్ణమూర్తి..గోవా.. 29-3-23

  రిప్లయితొలగించండి

 3. వనమున రాముని సేవయె
  తనకర్తవ్యమని దలచి తమ్ముడు సౌమి
  త్రినడిచె వాని యెలమి ఘన
  మనుజున కవసరము లేని దాహారమ్మే.

  (వాని యెలమి ఘనము అనుజున..)


  బాహాటమ్మగు సంపదల్ గనుచు గర్వంబెందుకో మానవా
  యే హారమ్మొసగంగలేని కడు సౌహిత్యమ్ము చేకూర్చెడిన్
  సాహాయ్యమ్మును చేయుటొక్కటదే సంసిద్ధికిన్ మూలమౌ
  యా హారమ్ముఁ గొనంగ మానవునకున్ వ్యర్థంబె ముమ్మాటికిన్.

  రిప్లయితొలగించండి
 4. జనులందరు శుఖశాంతుల
  మనగలిగిన చాలునుకద మహిపై నెపుడున్
  పెనగుట వినాశ హేతువు
  మనుజున కవసరము లేనిదా హారమ్మే

  [హారము = యుద్ధము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఊహాతీతముగా నయాచితముగా నొక్కొక్క చోటన్ జనుల్
   హాహాకారము సల్పురీతిని విషాహారమ్ము సంప్రాప్తమౌ!
   ఆహా! లెస్స లభించెనంచు సరియౌ నాలోచ నేలేక న
   య్యాహారమ్ముఁ గొనంగ మానవునకున్ వ్యర్థంబె ముమ్మాటికిన్

   తొలగించండి
 5. ఘనమగు సౌహార్దమ్మును
  అనయమువినయమ్ము లివియె హారములు గనన్
  తనయన్న యెడల ననుశయ
  మనుజున కవసరము లేనిదా హారమ్మే
  (అనుశయము అనుజున...)

  రిప్లయితొలగించండి
 6. మనలోననె కడ వాడే
  తనివిగ భగవా నుని పయి దలపుల తోడన్
  మనసును నింపు కొన ; నిరత
  మనుజున కవసరము లేని దాహారమ్

  రిప్లయితొలగించండి
 7. ఘనమగు సేవా భావము
  ననయము సౌమిత్రి చూపి యన్నకు తోడై
  వనమున జరించు నపుడా
  మనుజున కవ సరము లేని దా హా ర మ్మే!

  రిప్లయితొలగించండి
 8. దేహభ్రాంతిని వీడి దీనజనులందే దైవముం గాంచుచున్
  సౌహార్దమ్మునుఁ జూపు మానవుఁడు సత్సంగుండు తా దైవమే!
  సాహాయ్యం బొనరింప కెవ్వరికినిన్ స్వార్థంబు వాంఛించుచో
  నాహారమ్ముఁ గొనంగ మానవునకున్ వ్యర్థంబె ముమ్మాటికిన్.

  రిప్లయితొలగించండి
 9. కనగనుసెల్లునపరమును
  తినగనుపెద్దలుమరచిరిపరవశమందన్
  అనయముఋషులకువలెనుగ
  మనుజులకవసరములేనిదాహారమ్మే

  రిప్లయితొలగించండి
 10. సోహమ్మంచునుసెల్లుదాస్యమునయాశోభస్గనన్ప్రేమతో
  దాహంబేమియులేనిభౌతికమునాధారన్దమిన్గ్రోలుచున్
  ఓహోయంచునుపారవశ్యముననాలోకంబువీక్షింపగా
  ఆహారమ్ముగొనంగమానవునకున్వ్యర్థంబెముమమ్మాటికిన్

  రిప్లయితొలగించండి
 11. అనవసర మైన దిచ్చినఁ
  గన మెట్టి ప్రయోజనమ్ము గారవమునఁ గా
  వున నడిగిన విత్తము ని
  మ్మనుజున కవసరము లేని దాహారమ్మే

  కన వలె నాహారమ్మును
  గొన వలె హారవ్రజమ్ము కోర నగును వా
  హనములు వ్యయించి విత్తం
  బనవసర మగును మనుజున కాహారమ్మే

  [ఆహారము = తిండి; అపహరణము]

  ఊహాతీతము గాని సంధి ధరలో నొక్కండ మార్గం బగుం
  బాహాటమ్ముగ నెంచ భూవలయ విధ్వంసమ్ము వారింపఁగా
  నే హారమ్ములు శాంతి నీయ వినమే యెన్నండు విశ్వమ్ములో
  నా హారమ్ముఁ గొనంగ మానవునకున్ వ్యర్థంబె ముమ్మాటికిన్

  [హారము = యుద్ధము]

  రిప్లయితొలగించండి
 12. కం॥ మనిషి తినక నాహారముఁ
  గనఁగ బ్రదుక లేడు కడుచిత్రమగున్
  వినఁగఁ గనఁగ నీపలుకుల్
  మనుజుని కవసరము లేని దాహారమ్మే

  శా॥ ఊహాతీతముగాను నేఁడిటుల నూరూరా యనారోగ్యమౌ
  యాహారాదుల నందమౌ తెరఁగుతో నమ్మంగ నింటింటికిన్
  సాహాయ్యమ్మగునా! హితంబుఁ బలుకన్ స్వాస్థ్యంబుఁ దగ్గించు యా
  ఆహారమ్ముఁ గొనంగ మానవునకున్ వ్యర్థంబె ముమ్మాటికిన్

  అనారోగ్యమౌ ఆహారము junk food, నిఘంటువులో వేరేపదము కనపడలేదండి

  రిప్లయితొలగించండి
 13. శా.

  ఏ హానిన్ మదిలో దలంపక హరిన్ ధ్యేయంబు రాముండగున్
  మోహావేశములన్ విదిల్చి నిరతిన్ మోదంబుతో మెచ్చుచున్
  జోహార్లన్ బలుకంగ భక్తిని మెయిన్ శోభిల్ల, మాంసమ్ముతో
  *నాహారమ్ముఁ గొనంగ మానవునకున్ వ్యర్థంబె ముమ్మాటికిన్.*

  రిప్లయితొలగించండి