17, మార్చి 2023, శుక్రవారం

సమస్య - 4369

18-3-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మామిడి నిలువెల్లఁ బూచి మారేడాయెన్”
(లేదా...)
“రేపున్ మాపునుఁ బూచి మామిడియె మారేడాయెఁ గన్విందుగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో డా॥ కృష్ణవేణి గారి సమస్య)

28 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      నే ముదుసలి నీ కోసము
      నా మారేడు నెటు దెత్తు నర్చనకనుచున్
      సోముని వేడఁగ పెరటిని
      మామిడి నిలువెల్లఁ బూచి మారేడాయెన్!

      శార్దూలవిక్రీడితము
      చూపున్ బాపియు విన్కిడిన్ గొనియు నన్ శోకమ్మునన్ ముంచితే
      నాపౌచున్ దరినేరు లేని ముదినే నాశించి బిల్వానికై
      వాపోవంగ శివా! సదార్చనకు లేవంచన్ననే ముంగిటన్
      రేపున్మాపును బూచి మామిడియె మారేడాయెఁ గన్విందుగన్!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. శా.

    ఆ పంచాననునిన్ శివాని పతిగా హార్దమ్ముతో గొల్వగా
    గోపంబౌ సహకార వృక్ష శరణున్ ఘోరంబుగా సంయతిన్
    కాపాడంగ శశిన్ మలిమ్లుచుని జక్కంజూడ దైత్యారిచే
    *రేపున్ మాపునుఁ బూచి మామిడియె మారేడాయెఁ గన్విందుగన్.*

    రిప్లయితొలగించండి

  3. వైమాలపు సంతానము
    క్షేమము కాదంచు సంకుచితుడైన నరుం
    డే మూర్ఖుండవగ గనగ
    మామిడి నిలువెల్లఁ బూచి మా రేడాయెన్.


    తాపంబౌనని హెచ్చుగా కనగ సంతానమ్ము నీ కాలమున్
    బాపంబంచు దలంపరైరి యధికుల్ భారంబుగా నెంచుచున్
    ద్రాపుండయ్యెను మానవుండు కన నీ ధాత్రేయిలో వృక్షమౌ
    రేపున్ మాపునుఁ బూచి మామిడియె మా రేడాయెఁ గన్విందుగన్.

    రిప్లయితొలగించండి
  4. ప్రేమగ మేమట నాటిన
    మామిడి నిలువెల్లఁ బూచి మా రేడాయెన్
    వామము లేనితరుణమున
    మామిడి యాదాయమొసగి మమ్మాదుకొనెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'కామాంగమ్ము + ఒసంగె' అన్నపుడు యడాగమం రాదు. "కామాంగమ్మె యొసంగె" అనవచ్చు.

      తొలగించండి
    3. ధన్యవాదాలు గురూజీ 🙏

      ఆమూలాగ్రము భాగ్యమే ధరణమై యాధార భూతంబుగా
      రూపున్ దిద్దుకొనంగ కామశరమే రూపించె నిక్కంబుగా
      కామాంగమ్మె యొసంగె మాకు రయమున్ గామ్యార్థ సిద్ధంబులన్
      రేపున్ మాపునుఁ బూచి మామిడియె మా రేడాయెఁ గన్విందుగన్

      తొలగించండి
  5. ఆమనికి తరువు నిం డెను
    మామిడి నిలువెల్ల బూచి :: మారేడాయెన్
    కోమలి పూజింప శివుని
    నీమముతో భక్తి మదిని నిండిన వేళ న్

    రిప్లయితొలగించండి
  6. ఆ మాలిని దుష్టిషబరచె
    మామిడి నిలువెల్లఁ బూచి ; మారేడాయెన్
    యామిని వేళన గలలో
    యా మొగ్గలు కాయలవగ నరుదగు రీతిన్

    రిప్లయితొలగించండి
  7. ప్రేమగ నుద్యానమ్మున
    రామయ భూజముల నాటె రహియొప్పారన్
    కోమల మృదు పల్లవముల
    మామిడి నిలువెల్లఁ బూచి మారేడాయెన్

    రిప్లయితొలగించండి
  8. కామునికాల్చుటనుగనుచు
    నామానినిచేయతపమునభవునిపతిగా
    తామదితలంచపూజకు
    *“మామిడి నిలువెల్లఁ బూచి మారేడాయెన్”*

    రిప్లయితొలగించండి
  9. ఆమనిరాకనుదెలుపుచు
    కామునిబాణముమురియుచుకమ్మనితలపున్
    రామునిపెండ్లికిమెఱయగ
    మామిడినిలువెల్లబూచిమారేడాయన్.

    రిప్లయితొలగించండి
  10. ఆపన్జాలనితన్మయత్వముననాయాసంబుజూపట్టగా
    భూపుండంతటభూరిసంపదలవైభోగంబువీడెన్మదిన్
    చూపున్సోకగనేకభావమునుతాసోద్యంబుగాజూచెనే

    రేపున్మాపునుబూచిమామిడియెమారేడాయెకన్విందుగన్

    రిప్లయితొలగించండి
  11. తాపోద్విగ్నత పెచ్చరిల్లి భువిలో దాపించునా తీవ్రమౌ
    తాపంబున్ దొలగించు సాధనమిలన్ తథ్యమ్ముగా భూజముల్
    కాపాడన్ సమతుల్యతన్ పెరటిలో కామాంగమున్ నాఁటగన్
    రేపున్ మాపునుఁ బూచి మామిడియె మా రేడాయెఁ గన్విందుగన్

    రిప్లయితొలగించండి
  12. ఏ మా నయినను నది మీ
    కే మని యుత్తర మొసంగి యిల నాటఁగ వా
    రా మొక్క, తనరఁ బ్రక్కన
    మామిడి నిలువెల్లఁ బూచి, మారే డాయెన్

    వ్యాపారమ్మున విత్తమే పెరుఁగ నూహాతీతమై సంతతం
    బాపాదింపఁగఁ బ్రాభవం బడరి రాజాతీతమే యేరి కే
    నోపన్ రాని విధమ్ముగా మిరియ మంతుండంగఁ జిత్రమ్ముగా
    రేపున్ మాపునుఁ బూచి మా మిడియె మారే డాయెఁ గన్విందుగన్

    [మిడి = గర్వము]

    రిప్లయితొలగించండి
  13. కం॥ ఆమని విరియఁగ నీశ్వరు
    భామిని పార్వతి పరిణయమాడఁగఁ గోరన్
    గోముగ దీవించఁ బ్రకృతి
    మామిడి నిలువెల్లఁ బూచి మారేడాయెన్

    శా॥ పాపాత్ముండని మన్మథున్ సుమ శరున్ బాలాక్షుఁ డారీతిగన్
    దాపంబొంది దహించగన్, రతి నితాంతాపారవాత్సల్య రూ
    పా పాలించవొ భక్త రక్షక యనిన్ బ్రార్థించి పూజించఁగన్
    రేపున్ మాపునుఁ బూచి మామిడియె మారేడాయెఁ గన్విందుగన్

    రిప్లయితొలగించండి